17/09/2016

MB40: ఇదే మెగా స్పీచ్

ఇక ఎంబి 40 కార్యక్రమానికి చీఫ్ గెస్టుగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఏమని చెబుతారా అనే అందరూ ఎదురు చూశారు. ఇదిగో ఆ మెగా మాటలను వినండి మరి. 

''నిజంగా.. మనస్ఫూర్తిగా.. సభా మర్యాద కాకపోయినా కూడా.. వేదిక మీద ఉన్న పెద్దలకు ఆ తరువాత ప్రేక్షకులకు మలి నమస్కారం తెలియజేసుకుంటాం కాని.. చాలా పెద్ద హృదయంతో చాలా ఓపికగా ఇంతసేపు ఇక్కడకు వచ్చిన పెద్దల మాటలను ఓర్పుగా  వింటూ కూర్చున్నారు.. అందుకు విశాఖ ప్రజలకు మొట్టమొదటిగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా'' అంటూ అత్యంత ఎక్సయిట్మెంట్ తో తన స్పీచ్ మొదలుపెట్టారు మెగాస్టార్ చిరంజీవి. 

ముందుగా టి.సుబ్బిరామి రెడ్డి కళా హృదయాన్ని అభినందించిన చిరంజీవి.. అత్యంత ఆప్తుడు మిత్రుడు అయిన మోహన్ బాబు గురించి మట్లాడారు చిరు. ''సుబ్బిరామి రెడ్డి గారి ఫంక్షన్లకు ఎన్నోసార్లు వచ్చాను కాని.. ఇప్పుడు మాత్రం కేవలం మోహన్ బాబు గురించే వచ్చాను'' అని సెలవిచ్చారు చిరు. ''ఏమయ్యా చిరంజీవి.. నేనయ్యా మోహన్ బాబును.. విశాఖలో ఎంబి 40. నువ్వు రావాలి అని చెప్పాడు'' అంటూ చిరంజీవి స్వయంగా మోహన్ బాబు వాయిస్ లో మిమిక్రీ చేసి మరీ వినిపించారు.

పొరపాటను సినిమా షూటింగ్ పెట్టాను.. కాకపోతే లాస్ట్ మినిట్ లో తెలుసుకుని ఈ రాక్షసుడు ఇక్కడకు రాకపోతే చంపేస్తాడని చెబుతూ క్యాన్సిల్ చేసుకున్నాను అని వివరించారు. ''బయట మనిద్దరినీ టామ్ అండ్ జెర్రీ అనుకుంటున్నారు. మనం సరదాగా మాట్లాడుకోవడం ఇలా సోషల్ మీడియాలో గొడవగా మారడం ఏంటి అని మోహన్ బాబును అడిగితే.. అనుకోనివ్వవయ్యా ఏమైందిలే.. అంటూ తీసిపాడేస్తాడు. నాది కూడా అదే మనస్థత్వం. మా మధ్య మా రిలేషన్ ఎలా ఉందనేదే ముఖ్యం'' అంటూ తమ రిలేషన్ గురించి చెప్పారు చిరంజీవి.

''ఇది ఒక కష్టానికి జరుగుతున్న సన్మానం.. ఒక మనస్థత్వానికి.. ఒక పట్టుదలకు.. జరుగుతున్న సన్మానం. ఆయన 40 ఏళ్ళు పూర్తి చేసుకుంటే నేను 37 ఏళ్లు పూర్తి చేసుకున్నా. 1975లో కెరియర్ మొదలెట్టినప్పటినుండి ఇప్పటివరకు ఈ సుదీర్ఘ జర్నీలో అలుపెరగకుండా కష్టపడ్డాడు మోహన్ బాబు. సినిమా కెరియర్ పూల పాన్పుకాదు ముళ్ల బాట. అలాంటి ఈ ఇండస్ర్టీలో నటనలో కీర్తి శిఖరాలను అందుకుని ముందుకెళ్ళడం అనేది మామూలు విషయం కాదు. ఆయన ఒక వింధ్య పర్వతం'' అంటూ కొనియాడరు మెగాస్టార్. 

మోహన్ బాబు డైలాగులను పొందుపరిచి ఒక బుక్ గా లండన్ పార్లమెంటులో దానిని ఆవిష్కరించడం అనేది కళాకారులుగా మా అందరికీ ఎంతో గర్వకరాణం అంటూ మోహన్ బాబును అభినందించారు చిరు. ఆయన చిత్రాలను కూరుస్తూ అచ్చేసిన ఆ పుస్తకానికి నన్ను 'ముందుమాట' రాయమనడం అనేదే నాకు గర్వకారణం అంటూ ముగించారు మెగాస్టార్ చిరంజీవి. 

No comments:

Post a Comment