12/09/2016

పవన్ ని చూసి వర్మ కుళ్లుకుంటున్నాడట

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. నిన్నటి నుంచి ఓ డిస్కషన్ స్టార్ట్ చేశాడు. పవన్ మంచి సింగరా.. తను మంచి గాయకుడా అన్నదే దీని ఉద్దేశ్యం. తానే బాగా పాడతానని కావాలంటే సాక్ష్యం ఇదుగో అని.. వంగవీటిలో తను పాడిన పాటని పోస్ట్ చేసి.. కాకినాడ సభలో పవన్ పాటను పోల్చుకోమని జనాలకు చెప్పాడు. చివరకు దీనిపై ట్విట్టర్ సాక్షిగా ఓటింగ్ కూడా పెట్టేశాడు. 

ఈ ఓటింగ్ లో మొత్తం 13609మంది పాల్గొంటే.. 54శాతం పవన్ కి.. 46 శాతం వర్మకి ఓటేశారు. అయితే.. తాను కేవలం 8శాతం తేడాతో ఓడిపోయానని చెప్పిన వర్మ.. ఈ పోలింగ్ లో ఇంత తక్కువ మంది పాల్గొనడంతో.. పవన్ ఫ్యాన్స్ పై విరుచుకుపడ్డాడు. 'మా అమ్మ.. సోదరుడు.. అమ్మమ్మ.. ఆంటీ కూతురు.. చుట్టుపక్కలవాళ్లు అందరూ పవన్ కళ్యాణ్ సింగింగ్ కే ఓటేశారు. నాకు విపరీతమైన కుళ్లుగా ఉంది' అంటూ ట్వీట్ చేస్తూనే.. పవన్ కళ్యాణ్ అభిమానులను నిరక్షరాస్యులు అనేశాడు

'ఇంత తక్కువ మంది ఓటేశారంటే.. కచ్చితంగా ఫ్యాన్స్ నిరక్షరాస్యులే.. ఇలాంటి వాళ్లకంటే కాస్త చదువుకున్న తెలివైన ఫ్యాన్స్ ని పవన్ కాన్సంట్రేట్ చేస్తే బెటర్' అంటూ పవన్ ఓ ఉచిత సలహా కూడా ఇచ్చాడు. ఒకవైపు ఓడిపోయానని ఒప్పుకుంటూనే.. అందుకు కారణం పవన్ ఫ్యాన్స్ పైనే తోసేశాడు వర్మ. 

No comments:

Post a Comment