23/11/2016

ధృవ ట్రైలర్ గురించి చెప్పేసిన గీత

రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ధృవ.. రిలీజ్ కి రెడీ అయిపోయిన విషయం తెలిసిందే. ఇప్పటికే సెన్సార్ కూడా కంప్లీట్ చేసేసుకుని యూ/ఏ సర్టిఫికేట్ సంపాదించేసింది ధృవ. డిసెంబర్ 9న విడుదల అంటూ సోషల్ మీడియా సాక్షిగా మెగా పవర్ స్టార్ చెప్పేశాడు కూడా. 

అయితే.. నవంబర్ ప్రారంభంలోనే సాంగ్ ప్రోమోస్ ను వరుసగా ఇస్తూ హంగామా చేసిన ధృవ.. ఆ తర్వాత స్లో అయిపోయాడు. ఈ లోగా దేశవ్యాప్తంగా పెద్ద నోట్ల రద్దు వ్యవహారం సీరియస్ అవడం.. ధృవ రిలీజ్ డేట్ పై సందిగ్ధత నెలకొనడంతో.. ప్రమోషన్స్ విషయంలో గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు మూవీ రిలీజ్ డేట్ కన్ఫాం కావడంతో.. థియేట్రికల్ ట్రైలర్ విడుదలకు ముహూర్తం పెట్టేశాడు రామ్ చరణ్. ఈ నెల 25న సాయంత్రం 7 గంటలకు.. ధృవ థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేయనున్నట్లు.. కన్ఫామ్ చేశారు గీతా ఆర్ట్స్ వారు. అదే విషయాన్ని చెర్రీ కూడా చెప్పాడులే.

ధృవ ట్రైలర్ లాంఛ్ తర్వాత.. ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మూవీకి సంబంధించిన మొత్తం యూనిట్ పాల్గొననుండగా.. అక్కడి నుంచి ప్రచార కార్యక్రమాలను ప్రారంభించి.. రిలీజ్ వరకూ పీక్ స్టేజ్ లో కొనసాగించనున్నారు. చెర్రీతో పాటు.. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. విలన్ అరవింద్ స్వామి.. దర్శకుడు సురేందర్ రెడ్డి.. సంగీత దర్శకుడు హిప్ హాప్ తమీజాలు కూడా ప్రమోషనల్ యాక్టివిటీస్ లో పాల్గొనేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

22/11/2016

అల్లు అర్జున్ కు కూతురు పుట్టింది

ఈ సంవత్సరం జూలై నెలలో స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ భలే ప్రకటన ఒకటి చేశాడు. కడుపుతో ఉన్న తన భార్య స్నేహా రెడ్డి ఫోటో ఒకటి నెట్లో పెట్టాడు. పైగా స్నేహ కడుపును తన కొడుకు అయాన్ కిస్ చేస్తున్నప్పుడు తీసిన ఆ ఫోటో అసలు అభిమానుల్లో భలే గమ్మత్తయిన ఫీలింగ్ తీసుకొచ్చింది. ఇక అందరూ బన్నీ ఎప్పుడు ఎక్సయిటింగ్ న్యూస్ చెబుతాడా అంటూ ఎదురు చూస్తున్నారు. 

ఆ సమయం రానే వచ్చింది. అల్లు అర్జున్ కు ఈ సోమవారం సాయత్రం పండంటి కూతురు పుట్టినట్లు తెలుస్తోంది. ''నాకు కూతురు పుట్టింది. చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఒక కొడుకు.. ఒక కూతురు.. ఇంతకంటే ఏమీ అడుగను. మీ అందరూ నాకు విషెస్ చెప్పినందుకు థ్యాంక్స్. నేను చాలా అదృష్టవంతుడిని'' అంటూ ట్వీటేసి తన ఆనందాన్ని పంచుకున్నాడు అల్లు అర్జున్. 

కంగ్రాట్స్ బన్నీ అండ్ స్నేహ. అలాగే అల్లూ ఫ్యామిలీకి కూడా విషెస్ చెబుదాం!!

16/11/2016

ఈ సంగతి తెలిస్తే పవన్ కు ఫ్యాన్ అయిపోవాల్సిందే

సినిమావాళ్లు చాలా కమర్షియల్ గా ఉంటారని చెబుతుంటారు. పని ఉందా పూసుకుంటారని.. పని పూర్తి అయ్యాక ఎవరో తెలీదన్నట్లుగా వ్యవహరిస్తారని.. అది వారి తప్పు కాదని.. వారున్న ఇండస్ట్రీ అలాంటిదని చెబుతుంటారు. ఇక్కడ తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే అన్నట్లుగా వ్యవహరిస్తారని.. పైకి ఎంత పూసుకున్నా.. లెక్కల దగ్గరికి వచ్చేసరికి మాత్రం చాలా మొండిగా ఉంటారని ఏ మాత్రం తగ్గరన్నట్లు చెబుతుంటారు. అయితే.. ఇలాంటి మాటలకు పూర్తి భిన్నంగా కనిపిస్తారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్.

మిగిలిన హీరోలకు చాలా భిన్నమని కొందరు.. మంచితనానికి నిలువెత్తు రూపంగా మరికొందరు వర్ణిస్తే.. ఎప్పుడేం చేస్తాడో తెలీదని.. టెంపర్ మెంట్ చాలా ఎక్కువని.. మెంటలోడని మరికొందరు ఆయనపై ఘాటు విమర్శలు చేస్తుంటారు. మరింత మాట అంటున్నారు కదా.. దానికేమైనా ఆధారం ఉందా? అంటే.. మళ్లీ మాట్లాడని పరిస్థితి.

ఇదంతా ఒక కోణమైతే.. సాయం ఎవరికి వచ్చినా సరే.. సహాయం చేసేందుకు పెద్ద మనసుతో పవన్ ముందుంటారని ఆయన్ను అభిమానించని వారుసైతం ఒప్పుకునే మాట. రాజకీయంగా.. సినిమాల పరంగా ఆయన్ను వ్యతిరేకించే వారు మాత్రం వ్యక్తిగతంగా పవన్ ను విమర్శించేందుకు ఇష్టపడరు. ఆయన చేసే గుప్త దానాల గురించి కొందరు అనుకోని రీతిలో ఓపెన్ అయిపోవటం.. పవన్ లో ఇలాంటి మనిషి దాగి ఉన్నాడా? అనిపించక మానదు. కష్టంలో ఉన్న వారికి సాయం చేసే గుణం పవన్ లో చిన్నతనం నుంచి ఉందని.. ఆ మాటకు వస్తే.. సినిమాల్లోకి రాక ముందే ఆయనలో ఆ లక్షణం ఉందని తెలిసినప్పుడు మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే.

తాజాగా.. సినిమా ఇండస్ట్రీలో హీరోలకు ఓనమాలు నేర్పించే స్టార్ మేకర్ సత్యానంద్ ఓ టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన పలు హీరోల గురించి చెప్పుకొచ్చారు. దాదాపు 95 మంది హీరోల్ని సినిమా ఇండస్ట్రీకి ఇచ్చిన ఆయన.. పవన్ కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పుకొచ్చారు. తన దగ్గర యాక్టింగ్ లో శిక్షణ పొందిన పవన్.. తర్వాత కూడా టచ్ లో ఉండేవాడని.. చాలా స్నేహంగా ఉండేవాడని.. హైదరాబాద్ రావాలని కోరేవాడని చెప్పారు.

‘‘ఓ రోజు ముంబయి నుంచి వైజాగ్ వెళుతున్నప్పుడు హైదరాబాద్ రమ్మన్నాడు. చెల్లెలి పెళ్లి ఉందని కుదరదని చెప్పా. అంతే.. నా ఆర్థిక పరిస్థితి గురించి ఆరా తీశాడు. సికింద్రాబాద్ స్టేషన్ కు వచ్చి కలిశాడు. ఓ చిన్న బాక్స్ చేతిలో పెట్టాడు. ఇంటికెళ్లి చూస్తే.. అందులో రూ.50వేలు ఉన్నాయి. ఆ తర్వాత పెళ్లికి వచ్చి మరో రూ.50వేలు ఇచ్చాడు. అడగకుండానే ఇంత సాయం చేశాడు. ఇదంతా 1993లో జరిగింది. అప్పటికి పవన్ ఇంకా సినిమాల్లో యాక్ట్ చేయలేదు. అయినా.. అప్పట్లోనే అంత పెద్ద సాయం చేశాడు. సేవాగుణం పవన్ సహజ లక్షణం’’ అంటూ పవన్ గురించి చెప్పుకొచ్చారు. సినిమా ఇండస్ట్రీలో మనుషులు చాలా కమర్షియల్ గా ఉంటారని చెప్పే ఉదంతాలకు పవన్ కల్యాణ్ మినహాయింపుగా చెప్పక తప్పదు.

22/09/2016

ఎన్టీఆర్.. చిరు.. మహేష్.. అంటున్న నాని

తెలుగులో ‘స్టార్’ అనే పదానికి అర్థం మారుతోందంటున్నాడు నాని. భవిష్యత్తులో అసలే హీరో కూడా స్టార్ కాదని నాని చెప్పాడు. ‘‘గత కొన్ని దశాబ్దాల్లో స్టార్ అనే పదానికి అర్థం మారింది. మొదట్లో ఎన్టీఆర్ గారు భారీ పాత్రలు చేసేవాళ్లు. ఆయన పెద్ద స్టార్ అయ్యారు. తర్వాత చిరంజీవిగారు డ్యాన్సులు.. ఫైట్లతో తన ప్రత్యేకత చాటుకున్నారు. పెద్ద స్టార్ అయ్యారు. ఆ తర్వాత మహేష్ బాబు తన లుక్స్.. సటిల్ యాక్టింగ్ స్టైల్ తో స్టార్ అయ్యారు. నా దృష్టిలో ఇకపై స్టార్ అనే పదానికి అర్థం మారుతుంది. రాబోయే రోజుల్లో కంటెంటే బిగ్గెస్ట్ స్టార్ అవుతుందని నా అభిప్రాయం’’ అని నాని విశ్లేషించాడు.

ఇక తన వరకు తాను స్టార్ కాదని నాని స్పష్టం చేశాడు. ‘‘నేను ఏ స్టార్ లీగ్ కూ చెందను. నెంబర్ రేసులో ఉండను. నా సినిమాలు.. నా నటన అంతా డిఫరెంట్. నేనెప్పుడూ నటుడిగానే ఉంటాను. స్టార్ కాదు. ఒకవేళ స్టార్ ఇమేజ్ ఉందనిపించినా.. అది నా సినిమాలు హిట్టయ్యే వరకే. నా సినిమాల వసూళ్ల గురించి.. బిజినెస్ గురించి కూడా నేను పెద్దగా పట్టించుకోను. ఓ కథ ఎంచుకునేటపుడు ప్రేక్షకులకు నచ్చుతుందా లేదా అని చూస్తా. విడుదల తర్వాత రెస్పాన్స్ ఎలా ఉందో చూస్తా. వీటి మీదే ప్రధానంగా నా దృష్టి ఉంటుంది. అందుకే నా ప్రతి సినిమానూ నేను థియేటరుకు వెళ్లి ప్రేక్షకులతో కలిసి చూస్తా. నేను కథ విషయంలో.. సన్నివేశాల విషయంలో ఎలా ఫీలయ్యానో అలాగే ప్రేక్షకులు కూడా ఫీలవుతున్నారో లేదో చూస్తాను. దాన్ని బట్టే సినిమాలు ఎంచుకుంటాను’’ అని నాని చెప్పాడు. 

టాప్5లో బన్నీకి చోటు లేదనే లెక్కలు కరెక్ట్ కాదు

బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన సరైనోడు మూవీతో.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇండస్ట్రీ టాప్-5 లోకి ఎంటర్ అయిన సంగతి తెలిసిందే. కానీ రీసెంట్ గా జనతా గ్యారేజ్ తో జూనియర్ ఎన్టీఆర్ భారీ బ్లాక్ బస్టర్ కొట్టడంతో.. ఈ లిస్ట్ లో బన్నీ సినిమాకి ప్లేస్ పోయిందనే టాక్ వినిపిస్తోంది. కానీ.. ఇందులో వాస్తవం లేదు. 

బాలీవుడ్.. కోలీవుడ్ మాదిరిగా గ్రాస్ కలెక్షన్స్ తో కాకుండా.. తెలుగు సినిమాల లెక్కలన్నీ షేర్ చుట్టూనే సాగుతాయి. డబ్బింగ్ వెర్షన్స్ తో కలిపి వరల్డ్ వైడ్ గా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల లెక్కలు చూస్తూ.. మొదట బాహుబలి (302.3 కోట్లు) ఉంటుంది. ఆ తర్వాతి స్థానాల్లో శ్రీమంతుడు (85.2 కోట్లు).. మగధీర (83 కోట్లు).. జనతా గ్యారేజ్ (77.56 కోట్లు).. సరైనోడు (76 కోట్లు)ను వసూలు చేశాయి. అంటే.. బన్నీ సినిమా ఈ లిస్ట్ లో టాప్ 5లో ఉందన్నమాట. ఇక్కడ అత్తారింటికి దారేదికి టాప్5 లో చోటు దక్కలేదు. అంతే కాదు.. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక షేర్ వసూలు చేసిన సినిమాల్లో అయితే.. బన్నీ ప్లేస్ ఇంకా మెరుగ్గానే ఉంది. 

ఏపీ-తెలంగాణల వరకు అత్యధిక షేర్ ను సాధించిన లిస్ట్ లో బాహుబలి (113.75 కోట్లు) ఫస్ట్ ప్లేస్ లో ఉండగా.. సరైనోడు (60.80 కోట్లు) రెండో స్థానంలో ఉండడం విశేషం. ఇక మగధీర (61.60 కోట్లు).. శ్రీమంతుడు(60.17 కోట్లు).. అత్తారింటికి దారేది (58.87 కోట్లు)  టాప్5లో మిగిలిన స్థానాల్లో ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో బన్నీ క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో ఈ వసూళ్లు చూస్తే అర్ధమవుతుంది. ఈ లిస్ట్ లో అయితే.. జనతా గ్యారేజ్ (57.46 కోట్లు) టాప్5లో చోటు దక్కలేదు. ఈ లెక్కన టాప్5లో బన్నీకి చోటు లేదనే లెక్కలు కరెక్ట్ కాదు కదా.

21/09/2016

కాటమరాయుడితో కొత్తమ్మాయి

మామూలుగా ఓ స్టార్ హీరో సినిమా అంటే.. ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురు చూస్తారు అభిమానులు. ఐతే పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం ఆయన సినిమా ఎప్పుడు మొదలవుతుంది.. ఎప్పుడు రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు ప్రారంభిస్తారు అని చూస్తారు ఫ్యాన్స్. పవన్ లాస్ట్ మూవీ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ విషయంలో ఎంత జాప్యం జరిగిందో తెలిసిందే. లేటెస్ట్ మూవీ ‘కాటమరాయుడు’ ముహూర్తం జరుపుకుని మూడు నెలలు దాటింది. ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ విషయంలో అనుకున్న డేట్లు రెండు మూడు దాటిపోయాయి. ఎట్టకేలకు ఈ నెల 24 నుంచి సినిమా నిజంగానే సెట్స్ మీదికి వెళ్లిపోతుందని అంటున్నారు.

ఈ నేపథ్యంలో ‘కాటమరాయుడు’ గురించి ఓ కొత్త అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాలో యామినీ భాస్కర్ అనే కొత్తమ్మాయి కీలక పాత్ర పోషిస్తోందట. ఈ సినిమాలో శ్రుతి హాసన్ ఓ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి యామిని పాత్ర ఏంటో చూడాలి. యామిని ఇంతకముందు ‘కీచక’ అనే సినిమాలో హీరోయిన్ పాత్ర చేసింది. అలాగే ‘రభస’లో ఓ చిన్న క్యారెక్టర్ చేసింది. పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ స్టార్ సినిమాలో ఛాన్స్ అనగానే ఉబ్బితబ్బిబ్బయిపోతోంది యామిని. పవన్ తో ఇంతకుముందు ‘గోపాల గోపాల’ తీసిన కిషోర్ పార్థసాని (డాలీ) దర్శకత్వం వహించబోయే సినిమా ఇది. పవన్ మిత్రుడు శరత్ మరారే నిర్మిస్తున్నాడు. అనూప్ రూబెన్స్ దర్శకత్వం వహిస్తాడు

19/09/2016

చిరు సినిమాలో విజయ్ మాల్యా

విజయ్ మాల్యా పోలీసులకే దొరక్కుండా ఉంటే.. ఇక చిరంజీవి సినిమాలో నటించడమేంటి అంటారా? చిరు సినిమాలో మాల్యా ఉండడు. ఆయనను పోలిన క్యారెక్టర్ ఉంటుందట. మెగాస్టార్ రీఎంట్రీ మూవీ 'ఖైదీ నెంబర్ 150'లో విలన్ పాత్రను మాల్యా తరహాలో డిజైన్ చేశారట. ఈ విషయాన్ని ఆ పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ నటుడు తరుణ్ అరోరానే వెల్లడించాడు. తమిళ 'కత్తి'లో నీల్ నితిన్ ముకేశ్ చేసిన పాత్రనే తెలుగులో తరుణ్ చేస్తున్నాడు.

ఈ పాత్ర గురించి అతను చెబుతూ.. ''తమిళ వెర్షన్‌లోని పాత్రలో బేసిగ్గా ఎలాంటి మార్పులు చేయలేదు. ఐతే దాన్ని మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. ఆ పాత్ర గురించి వినాయక్ గారు నాకు వివరించారు. ఆయన చెప్పినపుడు నాకు విజయ్ మాల్యా గుర్తుకొచ్చారు. ఆయన్ని ఉద్దేశించే ఆ పాత్రను రాశారా అనిపించింది'' అని తరుణ్ చెప్పాడు.  

ఇక తెలుగులో తొలి సినిమానే మెగాస్టార్ చిరంజీవితో చేస్తుండటం గురించి తరుణ్ చెబుతూ.. ''నాకు ఇంత కంటే గొప్ప అరంగేట్రం ఏముంటుంది? ఇది నా అదృష్టం. ఐతే మా ఇద్దరి కాంబినేషన్లో ఎక్కువ సన్నివేశాలేమీ తీయలేదు. ఒకట్రెండు సీన్స్ తీశారంతే. ఈ లోపు వర్షం వల్ల షెడ్యూల్ క్యాన్సిల్ అయింది. చిరంజీవి గారితో పెద్దగా మాట్లాడే అవకాశం రాలేదు. ఆయనతో చాలా మాట్లాడాలనుంది. తర్వాతి షెడ్యూల్లో ఆయనతో ముచ్చటిస్తా. చిరంజీవి గారితో కలిసి నటించడం కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా'' అన్నాడు.

18/09/2016

బన్నీ సినిమాలో చిరు గెస్ట్ రోల్?

శాండల్ వుడ్ లో ఉన్న రెబెల్ స్టార్.. పవర్ స్టార్ ల సంగతి ఇప్పుడు చెప్పుకుందాం. రెబెల్ స్టార్ అంబరీష్.. పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ లు కలిసి ఓ సినిమా చేశారు. 'దొడ్డమానే హడ్గ' పేరుతో ఓ చిత్రం రూపొందింది. సెప్టెంబర్ 30న ఈ చిత్రం విడుదల కానుండగా.. ఇప్పటికే ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. 

పునీత్ రాజ్ కుమార్ పాత్రలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అయితే.. సరిగ్గా సరిపోతాడని భావిస్తున్నారట. ఇప్పటికే బన్నీకి ఆఫర్ పంపగా.. పరిశీలనలో ఉందని టాక్. అయితే.. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. కన్నడలో అంబరీష్ చేసిన పాత్రను.. తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో చేయించాలని చూస్తున్నారట. ఇది సాధ్యమో కాదో ఇప్పుడే చెప్పలేం కానీ.. ఒక వేళ సాధ్యమయితే మాత్రం.. తెలుగు మల్టీ స్టారర్  హిస్టరీలో కొత్త శకం స్టార్ట్ అయినట్లే. 

కాన్సెప్ట్.. ప్రాజెక్ట్ బాగానే ఉన్నా.. రిజల్ట్ కోసం టాలీవుడ్ ఎదురుచూస్తోంది. ఒకవేళ సినిమా సక్సెస్ అయితే.. టాలీవుడ్ నుంచి భారీ ఆఫర్స్ వెళ్లే ఛాన్సులు పుష్కలంగా ఉన్నాయి. మరి రెబెల్ స్టార్ రోల్ లో మెగాస్టార్.. పవర్ స్టార్ పాత్రలో స్టైలిష్ స్టార్ ని చూసే అవకాశం ఇస్తారో లేదో !

17/09/2016

మోహన్ బాబు చేతులమీదుగా చిరు MB40

విశాఖలో టి.సుబ్బిరామిరెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా జరిగిన మోహన్ బాబు 40వసంతాల సినీ జీవిత కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. సినిమా రంగానికి చెందినవారే కాకుండా - రాజకీయాలకు చెందిన వారితో పాటు పలు రంగాలకు చెందిన అతిరథమహారధుల సమక్షంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. అత్యంత ఒక గొప్ప నటుడు మాత్రమే కాదు.. ఒక పొలిటీషియన్.. ఒక ఎడ్యుకేషనిస్ట్.. అంతకంటే మించి అందరి మంచీ కోరుకునే ఒక మంచి స్నేహితుడు.. ఆయన ఒక గొప్ప వ్యక్తి.. రేపటి తరాలకు ఒక మంచి ఇనిస్పిరేషన్.. అని సినిమా ఇండస్ట్రీ మొత్తం ఏక కంఠంతో మోహన్ బాబుని కొనియాడింది. ఈ సందర్భంగా ప్రసంగించిన మోహన్ బాబు - సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి 40 వసంతాల కార్యక్రమం గురించి ప్రస్థావించారు. 

ఈ సందర్భంగా ప్రసంగించిన మోహన్ బాబు... తన 40 సంవత్సరాల కేరీర్ సందర్భంగా జరిగిన కార్యక్రమం ఇంత ఘనంగా జరగడానికి కారకులైన ప్రతిఒక్కరికీ పేరుపేరున ధన్యవాదాలు తెలియచేశారు. అనంతరం చిరంజీవి 40 వసంతాల కార్యక్రమం జరుగుతుందని ఆ కార్యక్రమాన్ని తిరుపతి వేడుకగా తానే చేస్తానని ప్రకటించారు. చిరంజీవి తర్వాత వెంకటేష్ సినీ కెరీర్ కి సంబందించిన సన్మాన కార్యక్రమం కూడా తానే చేస్తానని మోహన్ బాబు ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత చిరంజీవి - వెంకటేష్ లిద్దరూ చిరునవ్వులు చిందించారు. అనంతరం సభాప్రాంగణం మొత్తం హర్షధ్వానాలతో మారుమ్రోగిపోయింది.

MB40: చిరంజీవి నాకు కలలో కూడా చెడు చేయలేదు

ఇకపోతే ఎంబి40 ఈవెంట్లో చిట్టచివర మోహన్ బాబు ఇచ్చిన స్పీచ్ అంతా ఒకెత్తయితే.. అందులో మోగాస్టార్ చిరంజీవి గురించి ఆయన చెప్పిన మాటలు ప్రత్యేకం. 

''చిరంజీవి నాకు కలలో కూడా చెడు చేయలేదు. నేను కూడా ఆయనకు ఎప్పుడు చెడు చేయలేదు. మేం గ్రేట్ ఫ్రెండ్స్ అంతే.  నేను చిరంజీవితో చేసినన్ని సినిమాలు ఎవ్వరితోనూ చేయలేదు. ఇక చిరంజీవి తన తండ్రిని ఎంతో ప్రేమించేవారు.. అలాంటి ప్రేమ తన పెద్దకూతురుకు వచ్చింది. ఎక్కడ కనిపించినా అంకుల్ అని పిలుస్తుంది. అలాగే నాకు అల్లూ రామలింగయ్య గారంటే చాలా కష్టం. ఆయనంటే నాకు ఎంత ప్రేమో అరవింద్ మథర్ కు తెలుసు. ఇక అరవింద్ కూడా నాకు మంచి స్నేహితుడే. నాకు నాగబాబు అంటూ చాలా ఇష్టం. అది బయటకు తెలియదు. నా పేరు భక్తవత్సలం నాయుడు.. నేను పెద్దకాపును అన్నాను. అన్నా నువ్వా అంటూ నాగబాబు షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని ఇక్కడకు వచ్చేశాడు. చాలా మంచోడు తను'' అంటూ 'మెగా' పొగడ్తలతో ముంచెత్తారు మోహన్ బాబు.  

''షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని వచ్చావ్ చిరంజీవి. మళ్లీ అదే కాంబినేషన్ డేట్లు దొరకాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు. హోల్ హార్డెడ్ థ్యాంక్స్ చిరంజీవి'' అంటూ కృతజ్ఞతలు చెప్పారు. అలాగే చిరంజీవి మథర్ కు నమస్కారాలు అంటూ చెప్పిన మోహన్ బాబు.. ''చిరంజీవి మర్చిపోతాడు నువ్వు మర్చిపోవు. అమ్మకు నా నమస్కారాలు. నువ్వు ఆవిడకు తెలియజేయి'' అని సెలవిచ్చారు.

''తదుపరి 40 ఏళ్ల సన్మానం జరిగేది చిరంజీవికే. ఆ సభను నా చేతిలో పెట్టు చిరంజీవి.. నేనే ముందుండి అంతా నడిపిస్తాను. చూడు అప్పుడు. ఆ తరువాత 40 ఏళ్ల పండుగ వెంకటేష్ దే'' అంటూ ముగించారు మోహన్ బాబు. 

MB40: ఇదే మెగా స్పీచ్

ఇక ఎంబి 40 కార్యక్రమానికి చీఫ్ గెస్టుగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఏమని చెబుతారా అనే అందరూ ఎదురు చూశారు. ఇదిగో ఆ మెగా మాటలను వినండి మరి. 

''నిజంగా.. మనస్ఫూర్తిగా.. సభా మర్యాద కాకపోయినా కూడా.. వేదిక మీద ఉన్న పెద్దలకు ఆ తరువాత ప్రేక్షకులకు మలి నమస్కారం తెలియజేసుకుంటాం కాని.. చాలా పెద్ద హృదయంతో చాలా ఓపికగా ఇంతసేపు ఇక్కడకు వచ్చిన పెద్దల మాటలను ఓర్పుగా  వింటూ కూర్చున్నారు.. అందుకు విశాఖ ప్రజలకు మొట్టమొదటిగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా'' అంటూ అత్యంత ఎక్సయిట్మెంట్ తో తన స్పీచ్ మొదలుపెట్టారు మెగాస్టార్ చిరంజీవి. 

ముందుగా టి.సుబ్బిరామి రెడ్డి కళా హృదయాన్ని అభినందించిన చిరంజీవి.. అత్యంత ఆప్తుడు మిత్రుడు అయిన మోహన్ బాబు గురించి మట్లాడారు చిరు. ''సుబ్బిరామి రెడ్డి గారి ఫంక్షన్లకు ఎన్నోసార్లు వచ్చాను కాని.. ఇప్పుడు మాత్రం కేవలం మోహన్ బాబు గురించే వచ్చాను'' అని సెలవిచ్చారు చిరు. ''ఏమయ్యా చిరంజీవి.. నేనయ్యా మోహన్ బాబును.. విశాఖలో ఎంబి 40. నువ్వు రావాలి అని చెప్పాడు'' అంటూ చిరంజీవి స్వయంగా మోహన్ బాబు వాయిస్ లో మిమిక్రీ చేసి మరీ వినిపించారు.

పొరపాటను సినిమా షూటింగ్ పెట్టాను.. కాకపోతే లాస్ట్ మినిట్ లో తెలుసుకుని ఈ రాక్షసుడు ఇక్కడకు రాకపోతే చంపేస్తాడని చెబుతూ క్యాన్సిల్ చేసుకున్నాను అని వివరించారు. ''బయట మనిద్దరినీ టామ్ అండ్ జెర్రీ అనుకుంటున్నారు. మనం సరదాగా మాట్లాడుకోవడం ఇలా సోషల్ మీడియాలో గొడవగా మారడం ఏంటి అని మోహన్ బాబును అడిగితే.. అనుకోనివ్వవయ్యా ఏమైందిలే.. అంటూ తీసిపాడేస్తాడు. నాది కూడా అదే మనస్థత్వం. మా మధ్య మా రిలేషన్ ఎలా ఉందనేదే ముఖ్యం'' అంటూ తమ రిలేషన్ గురించి చెప్పారు చిరంజీవి.

''ఇది ఒక కష్టానికి జరుగుతున్న సన్మానం.. ఒక మనస్థత్వానికి.. ఒక పట్టుదలకు.. జరుగుతున్న సన్మానం. ఆయన 40 ఏళ్ళు పూర్తి చేసుకుంటే నేను 37 ఏళ్లు పూర్తి చేసుకున్నా. 1975లో కెరియర్ మొదలెట్టినప్పటినుండి ఇప్పటివరకు ఈ సుదీర్ఘ జర్నీలో అలుపెరగకుండా కష్టపడ్డాడు మోహన్ బాబు. సినిమా కెరియర్ పూల పాన్పుకాదు ముళ్ల బాట. అలాంటి ఈ ఇండస్ర్టీలో నటనలో కీర్తి శిఖరాలను అందుకుని ముందుకెళ్ళడం అనేది మామూలు విషయం కాదు. ఆయన ఒక వింధ్య పర్వతం'' అంటూ కొనియాడరు మెగాస్టార్. 

మోహన్ బాబు డైలాగులను పొందుపరిచి ఒక బుక్ గా లండన్ పార్లమెంటులో దానిని ఆవిష్కరించడం అనేది కళాకారులుగా మా అందరికీ ఎంతో గర్వకరాణం అంటూ మోహన్ బాబును అభినందించారు చిరు. ఆయన చిత్రాలను కూరుస్తూ అచ్చేసిన ఆ పుస్తకానికి నన్ను 'ముందుమాట' రాయమనడం అనేదే నాకు గర్వకారణం అంటూ ముగించారు మెగాస్టార్ చిరంజీవి. 

రోషన్ నాకు రామ్ చరణ్ లాంటోడు

ఒక్కసారి మెగాస్టార్ చిరంజీవి ఆశీర్వాదం పొందాలని సినిమా వాళ్లంతా ఎందుకు కోరుకుంటారో.. చెప్పకనే చెప్పేశారు చిరు. హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ నటించిన నిర్మలా కాన్వెంట్ రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శనకు హాజరైన చిరు.. రోషన్ ను.. హీరోయిన్ శ్రియా శర్మను ఆకాశానికి ఎత్తేశారు చిరంజీవి. ముఖ్యంగా రోషన్ గురించి చెప్పిన తీరు చూస్తే ఎవరైనా ఔరా అనాల్సిందే. 

'రోషన్... నా తమ్ముడు శ్రీకాంత్ ముద్దుల కొడుకు. నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన బిడ్డ. ఇంకా చెప్పాలంటే.. నాకు రామ్ చరణ్ ఎలాగో.. మిగిలిన మేనల్లుళ్లు ఎలాగో.. వారిలాగే మరొక బిడ్డ రోషన్. రోషన్ పుట్టిన దగ్గర నుంచి అర్ధమైంది ఏంటంటే ఈ కుర్రాడు బోర్న్ టు బి ఏ హీరో. హీరో మెటీరియల్ అని ముందే తెలుసు. ఈ సినిమా బాగా రోషన్ కు బాగా హెల్ప్  అవుతుంది. భవిష్యత్తులో ఓ మంచి హీరోగా రూపొందడానిక ఈ సినిమా ఉపయోగపడుతుంది' అని చెప్పిన చిరు అంతటితో ఆగలేదు. 

'ఈ సినిమా విజయం అంతా హీరో హీరోయిన్ల కళ్లలోనే ఉంది. ఇలాంటి సినిమా ఆడాలి. ప్రేక్షకుల మన్నన ఆదరణ పొందాలి. అప్పుడే ఇలాంటి ఫ్రెష్ సబ్జెక్ట్స్ మరిన్ని వస్తాయి. ఆల్ ది బెస్ట్' అంటూ నిర్మలా కాన్వెంట్ టీమ్ కి శుభాకాంక్షలు తెలిపారు చిరంజీవి. 

చెర్రీపై ప్రేమను చేతిలోనే దాచుకున్న చిరు

ఆడియన్స్ ను మెస్మరైజ్ చేయడంలో మెగాస్టార్ చిరంజీవి ట్యాలెంట్ ఎలాందిదో ప్రత్యేకంగా చెబితే మహా కామెడీగా ఉంటుంది. ఇలాంటివి సిల్వర్ స్క్రీన్ మీద చూసేయబట్టే.. ఇన్ని కోట్ల మంది అభిమానులను సంపాదించుకోగలిగారు. అలాగే ఏదైనా ఫంక్షన్ లోనో.. ఎవరి గురించి అయినా చెప్పాలంటేనో.. చిరు మాటలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. చెడును పూర్తిగా వదిలేసి.. మంచి మాత్రమే పైకి చెబుతూ మనస్ఫూర్తిగా ప్రశంసించగలగడం అనే విద్య అందరికీ అబ్బేది కాదు. అది చిరంజీవికి మాత్రమే సొంతం. అందుకే ఆయన ఆ స్థాయిలో ఉంటారు. 

మరి ఆయన పర్సనల్ గా చిరంజీవి ఇష్టాలు ఎలా ఉంటాయి? ఇది కాసింత టిపికల్ క్వశ్చన్ అయినా.. ఆన్సర్ దొరికే ఛాన్స్ చిరునే ఇచ్చారు. రీసెంట్ గా శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించిన నిర్మలా కాన్వెంట్ మూవీ ప్రత్యేక ప్రదర్శనకు చిరంజీవి హాజరయ్యారు. శ్రీకాంత్ తన తమ్ముడు అని చెప్పే చిరు ఇక్కడ కనిపించడంలో వింత లేదు కానీ.. ఆయన చేతిలో ఉన్న మొబైల్ లోనే అసలు కథంతా ఉంది. చిరంజీవి చేతిలో పట్టుకున్న ఫోన్ కి బ్యాక్ కవర్ లో.. చరణ్ ని చిరంజీవి ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని పట్టుకుని ఉన్న ఫోటో ప్రింట్ చేసి ఉంది.

తండ్రీ కొడుకుల అనుబంధం చెప్పేందుకు ఇంతకంటే పెద్ద ఎగ్జాంపుల్ అవసరం లేదు. చేతిలో ఎప్పుడూ ఉండే ఫోన్ లోనే కొడుకుతో అనుబంధాన్ని దాచుకున్నారంటే.. ఆ తండ్రి మనసులో మరెంత ఉంటుందో ఊహించడం కష్టమే!