22/09/2016

టాప్5లో బన్నీకి చోటు లేదనే లెక్కలు కరెక్ట్ కాదు

బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన సరైనోడు మూవీతో.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇండస్ట్రీ టాప్-5 లోకి ఎంటర్ అయిన సంగతి తెలిసిందే. కానీ రీసెంట్ గా జనతా గ్యారేజ్ తో జూనియర్ ఎన్టీఆర్ భారీ బ్లాక్ బస్టర్ కొట్టడంతో.. ఈ లిస్ట్ లో బన్నీ సినిమాకి ప్లేస్ పోయిందనే టాక్ వినిపిస్తోంది. కానీ.. ఇందులో వాస్తవం లేదు. 

బాలీవుడ్.. కోలీవుడ్ మాదిరిగా గ్రాస్ కలెక్షన్స్ తో కాకుండా.. తెలుగు సినిమాల లెక్కలన్నీ షేర్ చుట్టూనే సాగుతాయి. డబ్బింగ్ వెర్షన్స్ తో కలిపి వరల్డ్ వైడ్ గా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల లెక్కలు చూస్తూ.. మొదట బాహుబలి (302.3 కోట్లు) ఉంటుంది. ఆ తర్వాతి స్థానాల్లో శ్రీమంతుడు (85.2 కోట్లు).. మగధీర (83 కోట్లు).. జనతా గ్యారేజ్ (77.56 కోట్లు).. సరైనోడు (76 కోట్లు)ను వసూలు చేశాయి. అంటే.. బన్నీ సినిమా ఈ లిస్ట్ లో టాప్ 5లో ఉందన్నమాట. ఇక్కడ అత్తారింటికి దారేదికి టాప్5 లో చోటు దక్కలేదు. అంతే కాదు.. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక షేర్ వసూలు చేసిన సినిమాల్లో అయితే.. బన్నీ ప్లేస్ ఇంకా మెరుగ్గానే ఉంది. 

ఏపీ-తెలంగాణల వరకు అత్యధిక షేర్ ను సాధించిన లిస్ట్ లో బాహుబలి (113.75 కోట్లు) ఫస్ట్ ప్లేస్ లో ఉండగా.. సరైనోడు (60.80 కోట్లు) రెండో స్థానంలో ఉండడం విశేషం. ఇక మగధీర (61.60 కోట్లు).. శ్రీమంతుడు(60.17 కోట్లు).. అత్తారింటికి దారేది (58.87 కోట్లు)  టాప్5లో మిగిలిన స్థానాల్లో ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో బన్నీ క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో ఈ వసూళ్లు చూస్తే అర్ధమవుతుంది. ఈ లిస్ట్ లో అయితే.. జనతా గ్యారేజ్ (57.46 కోట్లు) టాప్5లో చోటు దక్కలేదు. ఈ లెక్కన టాప్5లో బన్నీకి చోటు లేదనే లెక్కలు కరెక్ట్ కాదు కదా.

No comments:

Post a Comment