10/09/2016

అది వర్కవుటైతే 150 కలక్షన్లు పేల్తాయ్

చాలా రోజుల నుండి ఇదిగో కమ్ బ్యాక్ అదిగో కమ్ బ్యాక్ అంటూ నాన్చుతూ వచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. మొత్తానికి 2016లో 'కత్తి' సినిమా రీమేక్ ''ఖైదీ నెం 150''తో ఇక తన మెగా రీ-ఎంట్రీకి నాంది పలికారు. అయితే 9 ఏళ్ళ గ్యాప్ తరువాత మెగాస్టార్ ఒక ఫుల్ ప్లెడ్జడ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు కాబట్టి సాధారణంగా హైప్ బాగానే ఉంటుంది. కాకపోతే యూత్ కు కనక్ట్ అవ్వకపోతే ఏంటి సంగతి? అనే ఒక చిన్న సందేహం కూడా ఉండనే ఉంది. 

నిజానికి ఇప్పుడు ఇంటర్మీడియట్ - డిగ్రీ చదువుతున్న స్టూడెంట్స్ అందరూ.. 2007లో చిరంజీవి శంకర్ దాదా జిందాబాద్ (హీరోగా ఆయన గత సినిమా) రిలీజ్ అయ్యేనాటికి ఐదు ఆరు తరగతుల్లో ఉండుంటారు. వారు ఇప్పుడు మెగాస్టార్ కు కనక్ట్ అవ్వడం అంటే మాత్రం కాస్త గట్టిగా చూడాల్సిన విషయమే. సరిగ్గా ఇదే సమయంలో చిరంజీవి ''మీలో ఎవరు కోటీశ్వరుడు'' అనే ప్రోగ్రామ్ తో వస్తున్నారు. డిసెంబర్ లో ఈ ప్రోగ్రామ్ టెలీకాస్ట్ అవుతుంది. 6వ తరగతి చదివే వారి నుండి.. కాలేజీ పిల్లల వరకు.. బిజినెస్ పీపుల్ నుండి.. ఇంట్లో ఉండే పెద్దలు వరకు.. అందరూ ఈ ప్రోగ్రామ్ పై మాంచి ఆసక్తి కనబరచిన విషయం తెలిసిందే. ఇప్పుడు చిరంజీవి హోస్ట్ అనేసరికి ఆ ఆసక్తి ఇంకా పెరుగుతుంది. కాబట్టి వారందరూ మెగాస్టార్ కు కనక్టైపోతారు. అప్పుడు ఖచ్చితంగా ధియేటర్లకు వచ్చే ప్రేక్షకుల శాతం మ్యాసివ్ గా పెరుగుతుంది. ఇంకేముంది.. ''ఖైదీ నెం 150'' కలక్షన్లు పేలతాయ్. 

ఆ విధంగా చిరంజీవి ఇప్పటికే హైప్ తెచ్చేసిన ఖైదీ నెం 150 కోసం మీలో ఎవరు కోటీశ్వరుడు ద్వారా ఇంకాస్త హైప్ ను క్రియేట్ చేస్తారనమాట. చూస్తుంటే ఆ ప్రోగ్రామ్ ను చిరంజీవి కొత్త రేంజుకు తీసుకెళ్లడం ఏమో కాని.. ఆ ప్రోగ్రామ్ చిరు రీ-ఎంట్రీ మూవీని ప్రమోట్ చేయడానికి బాగా ఉపయోగపడేలా ఉంది కదూ. రెండింటికీ లాభదాయకం అనమాట. 

No comments:

Post a Comment