11/09/2016

పవన్ కళ్యాణ్ కోసం కథ రాస్తున్న కొరటాల శివ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం తన దగ్గర ఉన్న కథల్లో స్వల్ప మార్పులు చేసి మానవీయ కోణం ని జత చేయడానికి సమాయత్తం అవుతున్నాడు హ్యాట్రిక్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ . ప్రభాస్ తో మిర్చి , మహేష్ తో శ్రీమంతుడు , ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ చిత్రాలు చేసి , ఆ చిత్రాలతో సందేశాన్ని ఇచ్చి కూడా మెప్పించిన దర్శకులు శివ . ఇప్పటివరకు చేసిన మూడు చిత్రాలు సూపర్ హిట్ కావడం , అవన్నీ కూడా అగ్ర హీరోలతో చేయడంతో కొరటాల శివ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి . మళ్ళీ మహేష్ బాబు , ప్రభాస్ లతో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్న కొరటాల పవన్ కళ్యాణ్ తో కూడా సినిమా చేయాలనీ ఆరాట పడుతున్నాడు . అయితే పవన్ అనగానే ఇంకా అంచనాలు పెరుగుతాయి కాబట్టి ఆ అంచనాలకు తగ్గట్లుగా మానవీయ కోణంలో బ్రహ్మాండమైన కథ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు కొరటాల . ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే ఇక బాక్సాఫీస్ బద్దలవడం ఖాయం. 

No comments:

Post a Comment