11/09/2016

పవన్-మోడీ మధ్య చిచ్చు: ట్విస్ట్.. జనసేన దెబ్బకి వెంకయ్య రివర్స్!

ఏపీకి ప్రత్యేక హోదా అంశం జనసేన, బీజేపీల మధ్య చిచ్చు రాజేసింది. 2014 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతుతోనే ఏపీలో టిడిపి - బిజెపి కూటమి అధికారంలోకి వచ్చిందనే వాదన ఉంది. దీనిని ఆ పార్టీలు కూడా అంగీకరించాయి.

ముఖ్యంగా, బిజెపిని చూసే ఆ కూటమికి పవన్ మద్దతు పలికారనే వాదన ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ అన్నా, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నా గౌరవం అని పవన్ చెప్పారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక మోడీ తన ప్రమాణ స్వీకారానికి పవన్‌ను ఆహ్వానించారు. ఈయన హాజరయ్యారు.

ఓ ప్రశ్న వేస్తా, ప్రతిదీ హైదరాబాద్ కాదు: కేవీపీకి వెంకయ్య ప్రశంస, పవన్‌కు కౌంటర్

ప్రధాని మోడీకి, పవన్ కళ్యాణ్‌కు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఇదే విషయాన్ని విపక్షాలు పలుమార్లు ప్రశ్నించాయి. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పవన్.. తనకు సన్నిహితంగా ఉండే మోడీ వద్దకు వెళ్లి అడగవచ్చు కదా అని ప్రశ్నించాయి. దానికి పవన్ కూడా సమాధానం చెప్పడం వేరే విషయం.

మొత్తానికి బీజేపీతో, ముఖ్యంగా ప్రధాని మోడీతో పవన్‌కు మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే, ఇప్పుడు ప్రత్యేక హోదా అంశం వారి మధ్య చిచ్చు రాజేసింది.

నాడు హోదా ఇస్తామని చెప్పిన బీజేపీ ఇప్పుడు దాని పైన మాట మార్చడం, పవన్ కళ్యాణ్ హోదా ఇవ్వాలని ఉద్యమించడం వీరిద్దరి మధ్య గ్యాప్‌కు కారణమైంది.

నిన్నటిదాకా మద్దతు పలికి..

పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా పైన ప్రశ్నించడాన్ని ఏపీ బీజేపీ నేతలు కూడా తొలుత స్వాగతించారు. తిరుపతి సభలో హోదా పైన పవన్ ప్రశ్నించడంలో తప్పులేదని వ్యాఖ్యానించారు. అయితే, కాకినాడ సభ తర్వాత అంతా మారిపోయింది.

చావడానికి సిద్ధం: చంద్రబాబు-వెంకయ్యకు పవన్ కళ్యాణ్ కౌంటర్

పవన్ ఒకింత ఘాటుగా బీజేపీని విమర్శించడం వారికి రుచించలేదని చెప్పవచ్చు. దీంతో పవన్ కళ్యాణ్ పైన బీజేపీ నేతలు ఎదురు దాడికి దిగుతున్నారు. వెంకయ్య నాయుడిని విమర్శించేంత సీన్ పవన్‌కు లేదని దుమ్మెత్తి పోస్తున్నారు.

పవన్ కళ్యాణ్ దెబ్బకి వెంకయ్య రివర్స్!

పవన్ కళ్యాణ్ గట్టిగా నిలదీయడంతో బీజేపీ, వెంకయ్య నాయుడు లైన్లోకి వచ్చారని అంటున్నారు. నిన్నటి దాకా హోదా పైన పూర్తిగా స్పష్టత ఇవ్వలేదు. అంతేకాదు, హోదాతో లాభం ఏమిటని నిలదీశారు. ఇప్పుడు వెంకయ్య మాటలో తేడా కనిపించిందని అంటున్నారు.

హోదాతో కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని ఆయన ఆదివారం నాడు అన్నారు. అయితే, హోదాతో కొన్ని ప్రయోజనాలు నిజమే కానీ, ప్రతి ఊరి హైదరాబాద్ కాదని చెప్పారు. హోదాతో అద్భుతాలు జరగవని చెప్పారు. ఏపీకి కావాల్సింది హోదా కాదని, ప్రత్యేక శ్రద్ధ అన్నారు.

వెంకయ్యని పవన్ టార్గెట్ చేయడ వెనుక: లడ్డూలకూ కథ

అలాగే, ఏపీ కోసం తీవ్రంగా కృషి చేస్తున్న తనను ప్రశ్నించడంలో అర్థం లేదని వెంకయ్య నాయుడు.. పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కొందరు అతిగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పవన్ వర్సెస్ వెంకయ్య

ఇప్పుడు ఏపీలో ప్రత్యేక హోదా విషయంలో పవన్ కళ్యాణ్ వర్సెస్ వెంకయ్యగా కనిపిస్తోందని అంటున్నారు. పవన్ హోదా పైన గట్టిగా నిలదీయడంతో.. వెంకయ్య అంతే ఘాటుగా కౌంటర్ ఇస్తున్నారు. రెండు పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని, అవి ఎవరికి కావాలని కాకినాడ సభలో పవన్ అన్నారు.

దీనిపై వెంకయ్య మాట్లాడుతూ... తాము రెండు లక్షల కోట్ల ప్రాజెక్టులు ఇచ్చామని, దానిని ఎగతాళి చేస్తున్నారని, డబ్బు పాచిపోదని కౌంటర్ ఇచ్చారు. వేరే రకంగా డబ్బు పెడితే ప్రమాదమని, మేం ఇచ్చిన డబ్బు మాత్రం పాచిపోదన్నారు. ఇంత తక్కువ సమయంలో ఏ రాష్ట్రానికి ఏ కేంద్రం ఇంత సాయం చేయలేదన్నారు.

No comments:

Post a Comment