04/09/2016

పవన్ వల్లే బ్రతికాను అంటున్న చిన్నారి

చావు బ్రతుకుల మద్య కొట్టుమిట్టాడుతున్న సమయంలో తనని పరామర్శించడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ వల్లే నేను బ్రతికానని ,అందుకు ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటానని అంటోంది చిన్నారి శ్రీజ . ఖమ్మం కు చెందిన శ్రీజ గత ఏడాది ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చావు బ్రతుకుల మద్య పోరాటం చేస్తున్న సమయంలో పవన్ ని చూడాలని ఉందని ఆ చిన్నారి కోరడంతో అది పవన్ కు తెలిసి ఆ చిన్నారి ని చూడటానికి ఖమ్మం కు వెళ్ళిన విషయం తెలిసిందే . దైవ నిర్ణయమో లేక పవన్ ఇచ్చిన స్పూర్తో మొత్తానికి చిన్నారి ఆరోగ్యం కుదుటపడింది . దాంతో ఇటీవల జరిగిన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలలో ఆ చిన్నారి పాల్గొంది . పవన్ ఇచ్చిన స్పూర్తి వల్లే బ్రతికనని అందుకే ఆజన్మాంతం అతడికి రుణపడి ఉంటానని అంటోంది . 

No comments:

Post a Comment