06/09/2016

పవన్ 40 కోట్లు తీసుకొని ఏం చేసినట్లు

సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో నటించినందుకు పవన్ కళ్యాణ్ నలభై కోట్లు తీసుకున్నాడట ! అయితే అది రెమ్యునరేషన్ మాత్రం కాదు కానీ తన ఆర్ధిక అవసరాల కోసం మాత్రమే తీసుకున్నాడట పైగా ఆ చిత్ర నిర్మాత శరత్ మరార్ పవన్ కళ్యాణ్ సన్నిహితుడు కావడంతో తన అవసరాల కోసం ఏకంగా 40 కోట్లు తీసుకున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి . సర్దార్ గబ్బర్ సింగ్ రిజల్ట్ పవన్ తో పాటు ఫ్యాన్స్ ని కూడా షాక్ కి గురి చేసిన విషయం తెలిసిందే . దాంతో మళ్ళీ శరత్ మరార్ కే మరో సినిమా చేస్తున్నాడు పవన్ . డాలీ దర్శకత్వంలో ''కాటమ రాయుడు '' గా రానున్నాడు పవన్ . నా దగ్గర డబ్బుల్లేవబ్బా ! ఈసారి గట్టిగా చూడండి సినిమా అప్పుడే డబ్బులు వస్తాయి అని ఇటీవల తిరుపతి లో పవన్ ప్రకటించిన విషయం తెలిసిందే . పవన్ కు రెమ్యునరేషన్ ఎక్కువే కానీ అదే స్థాయిలో ఖర్చులు ఉండటంతో వస్తున్న సొమ్ములు సరిపోవడం లేదనుకుంటా 

No comments:

Post a Comment