08/09/2016

కామెంట్: అసలు 'మెగా' ఎంట్రీ ఎందుకంటే

ఇప్పుడు అందరూ ఆసక్తిగా డిస్కస్ చేస్తున్న విషయం ఏంటంటే.. కింగ్ నాగార్జున స్థానంలో అసలు మెగాస్టార్ చిరంజీవి ఎందుకు ''మీలో ఎవరు కోటీశ్వరుడు'' షోకు హోస్టుగా వస్తున్నారనే పాయింటే. అయితే ఇందులో స్టార్ మేనేజ్మెంట్ తాలూకు హస్తం ఉందని తెలుస్తోంది. కేవలం ఇదొక క్రియేటివ్ అండ్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ డెసిషన్ క్రిందే చూడమంటున్నారు విశ్లేషకులు. 

కౌన్ బనేగా కరోడ్ పతి అనే ప్రోగ్రామ్ అసలు హిందీలో హిట్టయినట్లు ఇతర భాషల్లో క్లిక్కవ్వలేదు. కాని తెలుగులో మాత్రం ఇరగదీసింది. దానికి కారణంగా నాగార్జున హోస్ట్ చేయడమే. ఇప్పటికే ఆయన సక్సెస్ఫుల్ గా మూడు సీజన్లను హోస్ట్ చేశారు. అయితే ఇప్పుడు కొత్తగా మాటివిని హస్తగతం చేసుకున్న స్టార్ మేనేజ్మెంట్ వారు.. ఈసారి 4వ సీజన్ కు మరింత ఆసక్తిని పెంచాలనే భావనతో.. హోస్టును మార్చుదామా అనే దిశలో ఆలోచించడం.. అలాగే నాగార్జున కూడా కొన్నాళ్లపాటు ఈ షో నుండి బ్రేక్ తీసుకోవాలని అనుకోవడంతో.. కొత్త హోస్టు కోసం వెతకడం జరిగింది. ఆ టైములో నాగార్జున స్వయంగా మెగాస్టార్ పేరును సూచించినట్లు తెలుస్తోంది. 

ఇకపోతే మెగాస్టార్ కూడా ఈ షో పట్ల తాను ఎంతో ఎట్రాక్ట్ అయిపోయానని ఒక ఎపిసోడ్ లో గెస్టుగా వచ్చి నాగార్జునకు వివరించిన సంగతి తెలిసిందే. అందుకే ఆయన కూడా అడిగిన వెంటనే నో అనలేకపోయారు. పైగా ఈ ప్రోగ్రామ్ చేయడం వలన ఒక ప్లస్ ఏంటంటే.. ఈ హాట్ సీట్లో కూర్చుంటే దాదాపు ప్రతీ ఇంట్లోవారికి క్లోజ్ అయిపోవచ్చు. తద్వారా ఆడియన్స్ కూడా సదరు హీరోల సినిమాలను ఎక్కువగా చూసే ఛాన్సుంది. ఈ ప్రోగ్రామ్ చేసిన తరువాత నాగ్ తీసిన ''సోగ్గాడే చిన్నినాయన'' కలక్షన్లు అద్భుతంగా పెరగడం మనం గమనించాం. బహుశా ఇప్పుడు చిరంజీవి కూడా అదే దిశలో ఆలోచించి.. ఈ విధంగా 'మెగా' ఎంట్రీ ఇస్తున్నారనమాట. 

No comments:

Post a Comment