05/09/2016

చిరు సినిమాలో కేథరిన్?

మెగా కాంపౌండ్ నుంచి కేథరిన్కి ఫుల్లు సపోర్టు లభిస్తున్నట్టుంది. `సరైనోడు`లో అల్లు అర్జున్ సరసన నటించి ఓ ఊపు ఊపేసిన ఆమె తెలుగు చిత్ర పరిశ్రమ దృష్టిని ప్రముఖంగా ఆకర్షించింది. దాంతో ఆమెకి తెలుగు నుంచి అవకాశాలు వెల్లువెత్తడం మొదలైంది. అయితే  ఇటీవల మరోసారి  మెగా కాంపౌండ్ నుంచే ఆమెకి అదిరిపోయే ఆఫర్ లభించినట్టు ప్రచారం సాగుతోంది. అందులో నిజమెంతో తెలియదు కానీ... కేథరిన్ చిరు సినిమాలో ఐటెమ్ పాట చేయబోతోందట. కేథరిన్ పై ప్రేమతో ఆమెని ఐటెమ్ కే పరిమితం చేయకుండా కొన్ని సన్నివేశాల్ని కూడా సృష్టించారని పరిశ్రమ వర్గాలు మాట్లాడుకొంటున్నాయి. మొదట చిరుతో కలిసి  స్పెషల్ సాంగ్ లో ఆడిపాడే ముద్దుగుమ్మ తమన్నానే అని ప్రచారం సాగింది. చిత్ర బృందం కూడా ఆమెని సంప్రదించినట్టు  వార్తలొచ్చాయి. 

అయితే ఏమైందో తెలియదు కానీ.. ఆ ఆఫర్ ఇప్పుడు కేథరిన్ చేతికి చిక్కినట్టు తెలుస్తోంది. తమన్నా ఐటెమ్ చేయకపోవడానికి కారణం తనపై అదే ముద్ర పడే ప్రమాదం ఉందనే భయంతోనే ఆమె  ఒప్పుకోలేదని చెప్పుకొంటున్నారు. ఇప్పటికే జాగ్వార్లో తమన్నా ఐటెమ్ చేస్తోంది. భారీ పారితోషికం ఇవ్వడంతోనే ఆ సినిమాలో పాట చేయడానికి ఒప్పుకొందట. అయితే రామ్చరణ్ మాత్రం  చిరు 150 కోసం అంత ఇవ్వడానికి ఆసక్తి చూపలేదట. దీంతో ఆ ఆఫర్ కేథరిన్ కి వెళ్లినట్టు తెలిసింది. పైగా కేథరిన్ ఐటెమ్ పాటల్లో ఎప్పుడూ కనిపించలేదు. ఆమె గ్లామర్  పాట కొత్తగా ఉంటుందనే ఎంపిక చేసినట్టు తెలిసింది. 

No comments:

Post a Comment