06/06/2016

SJ Surya and Pawan Kalyan Movie story sittings

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ప్రారంభానికి రెడీ అయిపోతున్నాడు. గెటప్ మేకోవర్ తో సహా ఈ సహా ఫ్యాన్స్ ని థ్రిల్ చేయడం గ్యారంటీ అంటున్నాడు దర్శకుడు ఎస్ జే సూర్య. సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో.. అభిమానులు ఏ స్థాయిలో ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకుంటారో తెలుసని.. వాటిని అందుకుంటానని అంటున్నాడు దర్శకుడు. 

పవన్ కళ్యాణ్ - ఎస్ జే సూర్య డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ చిత్రం.. జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనుండగా.. శృతి హాసన్ ను హీరోయిన్ గా ఫైనలైజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే.. పవన్ శక్తి సామర్ధ్యాలు ఏంటో తనకు పూర్తిగా తెలుసని.. అందుకు తగినట్లుగానే స్టోరీ - నెరేషన్ ఉంటాయంటున్నాడు దర్శకుడు. రాయలసీయ ఫ్యాక్షనిస్ట్ గా పవన్ తొలిసారి పవన్ కనిపించనున్నాడని.. అటు యాక్షన్ - ఇటు ఫ్యాక్షనిస్ట్ లవ్ స్టోరీ రెండూ సమపాళ్లలో మిక్స్ అయి - ఆడియన్స్ ను ఎంటర్టెయిన్ చేస్తాయని ధీమాగా చెప్పాడు దర్శకుడు. 

పవన్-సూర్య కాంబినేషన్ లో వచ్చిన ఖుషీ బ్లాక్ బస్టర్ కాగా.. పులి డిజాస్టర్ అయింది. ఇప్పుడు మూడోసారి వీళ్లిద్దరూ కలిసి చేస్తున్న చిత్రానికి హుషారు అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. ఈ సినిమాతో పవన్ కి బ్లాక్ బస్టర్ ఇస్తానని చెబుతున్నాడు ఎస్ జే సూర్య. 

No comments:

Post a Comment