22/06/2016

చరణ్-సుక్కు..దసరాకు మొదలు వేసవికి రిలీజ్

రామ్ చరణ్ కొత్త సినిమా ‘ధ్రువ’ స్టార్టింగ్ హర్డిల్స్ అన్నీ దాటుకుని.. ఎట్టకేలకు స్పీడందుకుంది. గత నెల రోజుల నుంచి గ్యాప్ ఇవ్వకుండా షూటింగ్ చేస్తున్నాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. ఈ సినిమా ఇంకో రెండు నెలల్లో పూర్తయిపోయి.. సెప్టెంబరు 30న విడుదలకు సిద్ధమవడం ఖాయం. ఆ సినిమా అలా విడుదల కావడం.. ఇలా చరణ్ తర్వాతి సినిమా మొదలవడం.. చకచకా జరిగిపోనున్నాయి. విలక్షణ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో చరణ్ తన తర్వాతి సినిమాను దసరా పర్వదినాన మొదలుపెట్టబోతుున్నట్లు సమాచారం. ఆ సినిమాను ఐదు నెలల్లో పూర్తి చేసి వేసవి కానుకగా విడుదల చేయబోతున్నారట.

రామ్ చరణ్ కెరీర్లోనే ఇది అత్యంత విలక్షణమైన సినిమా అవుతుందని భావిస్తున్నారు. ‘మగధీర’ను మినహాయిస్తే రామ్ చరణ్ ఇప్పటిదాకా ఎక్కువగా రొటీన్ సినిమాలే చేశాడు. ప్రస్తుతం చేస్తున్న ‘ధ్రువ’ కూడా కొంచెం భిన్నమైందే. సుకుమార్ తో చేయబోయే సినిమా అతడికి ఒక మేకోవర్ అవుతుందని అంచనా. ఇది సుకుమార్ స్టయిల్లో సాగే విలక్షణమైన థ్రిల్లర్ అట. కొంచెం సైఫై టచ్ కూడా ఉంటుందట. దీనికి ‘ఫార్ములా ఎక్స్’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు సమాచారం. ‘1 నేనొక్కడినే’తో చేదు అనుభవం ఎదుర్కొన్న సుకుమార్.. ‘నాన్నకు ప్రేమతో’తో తప్పుల్ని దిద్దుకున్నాడు. సినిమాను జనాలకు అర్థమయ్యేట్లు తీయడమే కాక.. వేగంగా పూర్తి చేశాడు. చరణ్ సినిమా కూడా ఆ తరహాలోనే ఉంటుందట.

No comments:

Post a Comment