12/06/2016

హోరెత్తనున్న మెగా డ్యాన్స్

మెగా స్టార్ చిరంజీవి చిందేస్తే.. థియేటర్లు దద్దరిల్లిపోతాయ్. అలాంటిది ఆయన ఓ టీవీ షో కోసం స్పెషల్ గా డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుంది.. ఇప్పటివరకూ మెగాస్టార్ సినిమాల్లో తప్ప ఫంక్షన్లలో డ్యాన్సులు చేసిన సందర్భం లేదు. ఇక టీవీ షోస్ లో అయితే.. తన డ్యాన్సులు వేరేవాళ్లు చేస్తే చూసి ఎంజాయ్ చేయడమే తప్ప.. చిరు కాలు కదిపిన సందర్భం కనిపించదు. అయితే.. జూన్ 12న జరగనున్న సిని మా  అవార్డ్స్ ఫంక్షన్ కోసం మెగాస్టార్ మెడ్లే ప్లాన్ చేయడం ముందు నుంచి ఆసక్తి కలిగించింది. 

మొదట ఈ మెడ్లేని ఈవెంట్ లో భాగం చేయాలని అనుకున్నపుడు.. చిరంజీవి పాటలకు సాయిధరం తేజ్ వరుణ్ తేజ్ లతో డ్యాన్సులు వేయించాలని అనుకున్నారు. అయితే.. తర్వాత ఈ మెగా హీరోలకు మెగాస్టార్ కూడా తోడై పోయారు. తన సూపర్ హిట్ సాంగ్స్ కు తనే డ్యాన్స్ చేయనున్నారు చిరంజీవి. మెగాస్టార్ స్టేజ్ పై డ్యాన్స్ వేయనుండడంతో.. ఈ ఈవెంట్ కు అమితమైన ప్రాధాన్యం వచ్చేసింది. 

మేము సైతం ఈవెంట్ లో ఓ సారి కాలు కదపడం తప్ప.. చిరు ఇప్పటివరకూ ఎక్కడా డ్యాన్స్ చేయలేదు. అందుకే ఫ్యాన్స్ లో కూడా మా అవార్డుల కార్యక్రమంపై ఆసక్తి పెరిగిపోయింది. ఇప్పటికే స్టేజ్ పెర్ఫామెన్స్ కి సంబంధించిన రిహార్సెల్స్ కూడా కంప్లీట్ చేసిన మెగాస్టార్.. లైవ్ పెర్ఫామెన్స్ ఇచ్చేందుకు కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. అయితే.. మెగాస్టార్ డ్యాన్స్ కి సంబంధించిన ఒక్క ఫోటో కూడా లీక్ కాకుండా ఉండేందుకు మాటీవీ స్టార్ నెట్వర్క్ యాజమాన్యాలు పటిష్టమైన చర్యలు తీసుకున్నాయి. 

No comments:

Post a Comment