13/06/2016

చిరు డ్యాన్స్.. ఆడిటోరియం అదుర్స్!!

సినీ మా అవార్డ్స్ ఫంక్షన్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అన్నిటికంటే స్పెషల్ ఏంటో.. గతంలోనే మనం ఓ మాట అనుకున్నాం. అదే మెగాస్టార్ చిరంజీవి స్టేజ్ పై లైవ్ పెర్ఫామెన్స్ ఇవ్వడం. అనుకున్నట్లుగానే అదిరిపోయే రేంజ్ లో ఈ ఈవెంట్ జరిగింది. 

ముందుగా మెగాస్టార్ కి సంబంధించిన ఓ మెడ్లే. వాటికి మెగా ఫ్యామిలీ హీరోల పెర్ఫామెన్స్.. ఇవి పూర్తయ్యాక అసలు సందడి మొదలైంది. వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ తో మెగాస్టార్ చిరంజీవి స్టేజ్ పైకి వచ్చారు. రెండు మూడు మాటలు అందరితో పంచుకుని.. తన డ్యాన్స్ పెర్ఫామెన్స్ స్టార్ట్ చేశారు. సిక్ట్సీ ఇయర్స్ ఏజ్ లో చిరు బాడీ బెండ్ అవుతున్న తీరు చూసి.. అందరూ అవాక్కైపోయారు. గ్యాంగ్ లీడర్ మూవీలో టైటిల్ సాంగ్ - ముఠామేస్త్రిలో టైటిల్ సాంగ్ తో పాటు.. తన పాటలతో కూర్చిన ఓ మెడ్లేకు కూడా చిరు చిందులేశారు. 

15 నిమిషాల పాటు జరిగిన మెగాస్టార్ డ్యాన్స్.. అందరినీ థ్రిల్ చేసేసింది. ముఖ్యంగా ఎదురుగా కూర్చుకుని చూస్తున్న రామ్ చరణ్ - అల్లు అర్జున్ లు అయితే.. విపరీతంగా ఎగ్జైట్ అయ్యారు. కోడలు ఉపాసన కూడా మామగారి డ్యాన్స్ ను ఎంజాయ్ చేసింది. మెగాస్టార్ డ్యాన్స్ చేస్తున్నంత సేపు.. ఆడిటోరియం అంతా ఈలలు కేకలతో దద్దరిల్లిపోయింది

No comments:

Post a Comment