12/06/2016

మెగాస్టార్ ని చూసైనా వీళ్లు మారతారా?

మెగాస్టార్ చిరంజీవి ఓ స్టేజ్ పై డ్యాన్స్ చేయనున్నారనే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్. ఇప్పటివరకూ ఇలాంటి ఫీట్ ను చేయని మెగాస్టార్.. తొలిసారిగా ఓ అవార్డ్ ఫంక్షన్ లో డ్యాన్స్ వేసి అభిమానులను అలరించనున్నారు. నిజానికి మనం ఒక స్టార్ హీరో డ్యాన్స్ చేస్తుంటే వింతగా చెప్పుకోవాల్సి వస్తోంది. ఇందుకు కారణం మనోళ్ల ప్రవర్తనే.  మహేష్ బాబు - రామ్ చరణ్ - అల్లు అర్జున్ - ప్రభాస్.. ఇలా అందరూ ఒక విషయంలో మాత్రం కామన్ గా ఉంటారు. 

సినిమాల్లో మినహాయిస్తే.. మిగిలిన సమయాల్లో ఎక్కడినుంచో దిగొచ్చిన టైపులో ఉంటుంది మన స్టార్ హీరోల బిహేవియర్. ఇక ఫంక్షన్లలో యాంకర్ల మాటలయితే.. వీళ్లని పొగడ్డానికి పుట్టారనే రకంగా ఉంటాయి. చుట్టూ ఉండే భజన బ్యాచ్ సంగతి అయితే మరి చెప్పాల్సిన పనే లేదు. వీటిన్నిటి మధ్య బతుకుతున్న మన  హీరోలు.. స్టేజ్ పై పెర్ఫామెన్స్ అంటే అది తమకు సంబంధించనది అనే టైపులో ఉంటారు. అదే బాలీవుడ్ కార్యక్రమాలను చూస్తే.. హీరోయిన్సే కాదు హీరోలు కూడా స్టేజ్ పెర్ఫామెన్సులు ఇస్తూ ఉంటారు. షారూక్ ఖాన్ లాంటి బడా హీరోలు కూడా ఈవెంట్స్ ను హోస్ట్ చేసేస్తూ ఉంటారు. 

మన దగ్గర స్టేజ్ పై డ్యాన్సులంటే హీరోయిన్లకే పరిమితం. తొలిసారిగా మెగాస్టార్ లాంటి సీనియర్ హీరో ఇప్పుడు స్టేజ్ పెర్ఫామెన్స్ కు సిద్ధమయ్యాక అయినా.. మిగిలిన హీరోలు మారతారేమో చూడాలి. 

No comments:

Post a Comment