Showing posts with label PawanKalyan. Show all posts
Showing posts with label PawanKalyan. Show all posts

06/08/2016

పవన్ ఈరాత్రే మొదలెట్టాడు

పవన్ కళ్యాణ్ చిత్రం ఎట్టకేలకి షురూ అయింది. శనివారం రాత్రి హైదరాబాద్ లోని ఓ ఇంట్లో దర్శకుడు డాలీ షూటింగ్ని మొదలుపెట్టాడు. తొలి రోజే పవన్ కళ్యాణ్ షూటింగ్ లో పాల్గొన్నాడు. రెండు మూడు రోజుల్లో శ్రుతిహాసన్ కూడా యూనిట్ తో జాయిన్ అవుతుందట. పక్కాగా నాలుగు నెలల్లో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని పవన్  నిర్ణయించుకొన్నట్టు తెలుస్తుంది. 

రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈచిత్రం కోసం డాలీ ప్రత్యేకంగా స్క్రిప్టు వర్క్ చేసుకొన్నాడు. అది పవన్ కళ్యాణ్కి బాగా నచ్చిందట. మొదట ఈ సినిమాకి ఎస్.జె.సూర్య దర్శకుడు. కానీ ఆయన కొన్ని కారణాలవల్ల పక్కకు తప్పుకొన్నాడు. దీంతో ప్రాజెక్టు డాలీ చేతిలోకి వచ్చింది. అప్పటికే స్క్రిప్టు పక్కాగా పూర్తయినప్పటికీ డాలీ మాత్రం తనదైన శైలిలో మళ్లీ స్క్రిప్టుపై రీ వర్క్ చేశాడు. ఆ విషయంలో పవన్ సంతృప్తిగా ఉన్నట్టు తెలిసింది. ఈ చిత్రాన్ని పవన్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్నారు. 

20/07/2016

మాల్డీవుల్లో పవన్ పిల్లల హంగామా!!

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్.. సోషల్ మీడియాతో టచ్ లోనే ఉంటుంది. అభిమానులతో తన భావాలను పంచుకుంటూ ఉండడం రేణుకు బాగా అలవాటు. అలాగే అవసరమైన సందర్భాల్లో వెంటనే స్పందిస్తూ.. నెటిజన్లను ఆకట్టుకోవడం రేణూ దేశాయ్ స్పెషాలిటీ. ప్రస్తుతం తన ఇద్దరు పిల్లలతో కలిసి రేణూ దేశాయ్ మాల్దీవ్స్ లో విహరిస్తోంది. 

మాల్దీవ్స్ బీచ్ లలో కొడుకు అకీరా నందన్- కూతురు ఆద్యలతో కలిసి చక్కర్లు కొడుతోంది ఆద్య. ' అందరూ స్కూల్స్ కి వెళ్లిపోవడం మొదలుపెట్టాక.. చివరకు మేము మా సమ్మర్ హాలిడేస్ ని ఎంజాయ్ చేయడం ప్రారంభించాం' అంటూ ట్వీట్ చేసిన పవన్ మాజీ వైఫ్.. కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసింది.  పిల్లలిద్దరూ కెమేరాకు పోజులిస్తున్న ఫోటో ఒకటి.. వాళ్లిద్దరితో కలిసి బీచ్ లో తాను నిలబడి ఉన్న ఫోటో మరొకటి.. బీచ్ అందాలను చూపిస్తూ.. ఎంత నీలంగా ఎప్పుడూ చూడలేదంటూ మరొక ఫోటోను ట్వీట్ చేసింది రేణు.

ఈ ఫోటోల్లో మాల్దీవ్స్ అందాల కంటే.. పవన్ కుమారుడు అకీరా స్పెషల్ అట్రాక్షన్ గా కనిపిస్తున్నాడు. తల్లితో సమానమైన హైట్ ఉండి.. అప్పుడు ఎంత పెద్దోడయ్యాడు అనిపించేలా ఉన్నాడు అకీరా నందన్. చిన్నారి ఆద్య అయితే ముద్దులొలికే నవ్వులతో ఆకట్టుకుంటోంది. 

04/07/2016

పవన్-డాలీ సినిమాపై ప్రొడ్యూసర్ క్లారిటీ

పవన్ కళ్యాణ్ ప్రకటించిన కొత్త సినిమా ఆగిపోయిందంటూ కొన్ని రోజులుగా టాలీవుడ్ లో చాలానే వార్తలు వస్తున్నాయ్. దర్శకత్వ బాధ్యతల నుంచి ఎస్ జె సూర్యని తప్పించి.. డాలీకి అప్పగించడం తెలిసిందే. స్క్రిప్ట్ విషయంలో డాలీ సంతృప్తిగా లేకపోవడంతో.. అసలీ ప్రాజెక్టునే పక్కన పెట్టేసిన పవన్.. త్రివిక్రమ్ తో సినిమాను మొదలుపెడుతున్నాడనే రూమర్స్ వినిపించాయి. దీనిపై నిర్మాత శరత్ మరార్ నుంచి క్లారిటీ వచ్చేసింది. 

'పవన్ కళ్యాణ్-డాలీ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రానికి అన్నీ సిద్ధమయ్యాయి. స్క్రిప్క్ కూడా పర్ఫెక్ట్ గా రెడీ అయింది. త్వరలో ఫస్ట్ షెడ్యూల్ కి వెళ్లబోతున్నాం' అంటూ చెప్పేశాడు శరత్ మరార్. పవన్ కి సన్నిహితుడైన ఈ నిర్మాత ఇచ్చిన క్లారిటీతో.. పవన్ మొదలుపెట్టిన ప్రాజెక్టు ఆగిపోలేదనే విషయం అర్ధమవుతోంది. ఈ నెలాఖర్లో తొలి షెడ్యూల్ ని స్టార్ట్ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. హీరోయిన్ తో పాటు మరికొందరి డేట్స్ ఫైనల్ చేసుకుని.. షూటింగ్ ప్లాన్ చేసుకోనున్నారు. 

పవర్ స్టార్ కొత్త సినిమాలో శృతిహాసన్ ని హీరోయిన్ గా ఫైనల్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈమెతో అగ్రిమెంట్ సహా పూర్తయిపోగా.. మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ 2 సాంగ్స్ ను కూడా కంపోజ్ చేసి దర్శకుడికి వినిపించాడట. తెర వెనక అన్ని పనులు ఇంత స్పీడ్ గా జరుగుతుంటే.. అసలు ప్రాజెక్ట్ ఆగిపోయిందని రూమర్స్ ఎలా వస్తాయో కదా!

02/07/2016

పవన్ అలా నిర్ణయించుకొన్నాడా?

పవన్ కళ్యాణ్ ఒకటి తలిస్తే వాస్తవంలో మరొకటి జరుగుతున్నట్టుంది. ఎస్.జె.సూర్యతో సినిమా చేసి ఫ్యాన్స్ కి  మళ్లీ ఖుషీ రోజుల్ని గుర్తుకు తెప్పించాలనుకొన్నాడు. కానీ ఊహించని రీతిలో ఎస్.జె.సూర్య ప్రాజెక్టు నుంచి బయటికెళ్లిపోయాడు. దీంతో పవన్ చేసేదేమీ లేక మరో దర్శకుడు డాలీని ఎంపిక చేసుకొన్నాడు. అయితే ఆకుల శివ రాసిన ఆ కథ డాలీకి సెట్టవ్వడం లేదట. స్క్రిప్టు తనదైన స్టైల్ లో రాసుకోవడానికి కాస్త సమయం కావాలని అడుగుతున్నాడట. దాంతో ఆ ప్రాజెక్టు మొత్తాన్ని పక్కనపెట్టేసి త్రివిక్రమ్ తో సినిమా చేయాలని పవన్ నిర్ణయించుకొన్నట్టు తెలిసింది. 

ప్రస్తుతం త్రివిక్రమ్ పవన్ కోసమే కథని సిద్ధం చేస్తున్నాడు. సెప్టెంబరులోపు ఆయన స్క్రిప్టుని సిద్ధం చేస్తాడట. అక్టోబరులో షూటింగ్ ని  మొదలుపెట్టి సమ్మర్ లో సినిమాని రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకొన్నట్టు తెలిసింది. అయితే ఆ ప్రాజెక్టుకి  నిర్మాత ఎవరన్నదే తెలియడం లేదు. ఒకపక్క దిల్ రాజు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. తన సంస్థలో పవన్ తో ఒక్క సినిమా అయినా చేయాలనేది దిల్రాజు ఆశ. ఎలాగో త్రివిక్రమ్-పవన్ ల  క్రేజీ కాంబినేషన్ కాబట్టి ఇంతకంటే మంచి ఛాన్స్ మరొకటి ఉండదని ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. 

28/06/2016

పవన్ కి ఎంత క్రేజ్ ఉందంటే.. ఆ మారుమూల గ్రామంలో పవన్ రెండు రోజుల పాటు కాలు కదపలేకపోయారు

మీరా చోప్రా.. ‘బంగారం’ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌ తో ఆమె నటించింది. ఇటీవలే ఆమె నటించిన రెండో బాలీవుడ్ చిత్రం ‘1920 లండన్’ విడుదలైంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌లో.. పవన్ కల్యాణ్‌తో వర్క్ ఎక్స్‌పీరియన్స్ గురించి ఓ బాలీవుడ్‌ జర్నలిస్ట్‌ అడిగిన ప్రశ్నకు ఆమె ఆసక్తికరమైన సమాధానం చెప్పింది. ఆ ఆసక్తికర సమాధానాన్ని ఆమె మాటల్లోనే చెప్పాలంటే.. ”నేను బాలీవుడ్ టాప్‌ హీరోలైన సల్మాన్ ఖాన్‌, షారుఖ్‌ ఖాన్‌లతో ఇప్పటి దాకా పని చేయలేదు.. కాబట్టి వారికున్న క్రేజ్‌ పై నాకు ప్రత్యక్షంగా అవగాహన లేదు. కానీ, తెలుగులో పవన్ కల్యాణ్ లాంటి పెద్ద స్టార్ తో పని చేశాను కాబట్టి ఆయనకున్న సూపర్‌ క్రేజ్ గురించి నేను కచ్చితంగా చెప్పగలను. దక్షిణాదిన హీరోలను అభిమానులు దేవుళ్లలా ఎలా ఆరాధిస్తారో పవన్ కల్యాణ్ క్రేజ్ ను చూసిన తర్వాత నాకు అర్థమైంది. పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్‌ ను ఆంధ్రప్రదేశ్‌ లో జరిపితే, తొక్కిసలాటలు జరగడం ఖాయమనే ఉద్దేశంతో దర్శకుడు ధరణి ఈ సినిమా షూటింగ్ ను తమిళనాడులోని ఓ మారుమూల పల్లెటూళ్లో పెట్టారు. ఆ ఊళ్లో ఎలాంటి స్టార్‌ హోటల్స్ లేకపోవడంతో ఓ చిన్న ఇంట్లో మాకు వసతి ఏర్పాటు చేయబడింది. అయితే, ఎలా లీకయిందో తెలియదు కానీ.. పవన్ కల్యాణ్ అక్కడ ఉన్నట్టు చాలా మందికి తెలిసిపోయింది. దీంతో.. మేం ఉన్న ఇంటి చుట్టూ సడెన్‌గా సుమారు పదివేల మంది చేరిపోయారు. పవన్ కల్యాణ్ ను చూడటం కోసం అదే పనిగా వెయిట్ చేయడం ప్రారంభించారు పరిస్థితి ఎంత దారుణంగా తయారయిందంటే.. పవన్ కల్యాణ్ రెండు రోజుల పాటు ఆ ఇంటి నుంచి బయటకు రాలేకపోయారు. అభిమానుల తాకిడి కారణంగా అప్పట్లో ‘బంగారం’ షూటింగ్‌ అనేక మార్లు క్యానిల్స్ అయ్యింది. న్యూయార్క్‌లో పెరిగిన నాకు దక్షిణాది హీరోలను దేవుళ్లుగా కొలుస్తారని తెలుసు! అయితే పవన్‌ కల్యాణ్ తో నటించడం ద్వారా ఆ క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూడగలిగా” అని మీరా చోప్రా వ్యాఖ్యానించింది

27/06/2016

పవన్ మళ్లీ యూరోప్ వెళ్తున్నాడు తెలుసా!

పవన్ కళ్యాణ్ రీసెంట్ గానే ఫ్యామిలీతో కలిసి రష్యా టూర్ ఫినిష్ చేశాడు. ప్రస్తుతం డాలీతో చేస్తున్న తన మరుసటి సినిమా కోసం చర్చలు జరపుతున్న పవన్.. త్వరలో మరోసారి యూరోప్ వెళ్లనున్నాడు. ఈ సారి లండన్ టూర్ పెట్టుకున్న అక్కడ ఓ నృత్య కార్యక్రమానికి సంబంధించిన ఈవెంట్ లో పాల్గొననున్నాడు.

సహజంగా డ్యాన్స్ అంటే ఆమడ దూరం ఉండే పవన్.. డ్యాన్స్ కి సంబంధించిన ఈవెంట్ లో పాల్గొనడం కాస్త ఆశ్చర్యమే. అయితే పవన్ కి సాంప్రదాయ నృత్యాలంటే అమితమైన ఆసక్తి గౌరవం ఉన్నాయి. అందుకే జయతే కూచిపూడి ఉత్సవంలో పాల్గొనేందుకు లండన్ వెళ్తున్నాడు పవన్ కళ్యాణ్. యునైటెడ్ కింగ్ డం తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో జూన్ 12 నుంచి జూలై 13వరకూ ఈ కూచిపూడి ఉత్సవాలు లండన్ లో జరుగుతున్నాయి. 

హిందూ సాంప్రదాయాలు పద్ధతులపై అమితమైన గౌరవం ఉన్న పవన్.. ఇలాంటి సాంప్రదాయ నృత్యాలను ప్రోత్సహించడం ద్వారా ఐకమత్యాన్ని చాటిచెప్పచ్చనే భావనతోనే ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు తెలుస్తోంది. జూలై 9న యుక్తా ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో పవన్ భాగమవుతాడు. ఇదిలా ఉంటే పవన్ చేయనున్న మరుసటి సినిమా.. యూరోప్ నుంచి పవర్ స్టార్ తిరిగొచ్చాక ప్రారంభం కానుందని తెలుస్తోంది. 

26/06/2016

సాయం చేయడంలో పవన్ కి సాటి లేరంతే

రూపాయి దానమిచ్చినట్లుగా పోజులిచ్చి.. లక్ష ఇచ్చినట్లుగా ప్రచారం చేసి.. తర్వాత ఆ రూపాయిని కూడా జేబులో వేసుకుని పోయే రకం చాలామందే కనిపిస్తారు. కానీ పవన్ ఎన్నో సహాయాలు చేసి కూడా ఎప్పుడూ చెప్పుకున్న పాపాన పోడు. ప్రస్తుతం మంచు లక్ష్మి నిర్వహిస్తున్న మేముసైతం కార్యక్రమంలో.. అప్పుడెప్పుడో పవన్ కళ్యాణ్ చేసిన సాయం గురించి ఓ వృద్ధురాలు చెప్పుకొచ్చింది. 

ఖమ్మంలో వృత్తి రీత్యా టీచర్ అయిన ఈమె వృద్ధాశ్రమం నడుపుతుండేది. రిటైర్ అయ్యాక భయం దాన్ని నడిపేందుకు భయం వేసిందట. అయితే పవన్ కళ్యాణ్ సాయం చేస్తాడని ఎవరో చెప్పడంతో ఇంటికి వెళ్లిందట. గేట్ దగ్గర నిలబడి అటూ ఇటూ తిరుగుతుంటే.. ఎవరో వచ్చారని పైనుంచి భార్య చెప్పడంటే.. మెట్లు దిగి వచ్చిన పవన్.. చేయి పట్టుకుని తీస్కెళ్లి కార్లో కూర్చుబెట్టుకుని ఆఫీస్ తీసుకెళ్లాడట. ఎంతమంది ఉన్నారు లాంటి ప్రశ్నలు అడిగిన తర్వాత తనే కాఫీ కలిపి ఇచ్చి.. ఫిష్ తెప్పించి వడ్డించి తినమన్నారట. 

ఇదంతా చూసి భయపడుతుంటే.. 'అమ్మా ఎందుకు భయపడుతున్నారు. నేను మీ కొడుకుని..మీరు నా అమ్మ' అంటూ పవన్ చెప్పడంతో ఆశ్చర్యపోయిందట ఈ మహిళ. చివరకు వెళ్లేటపుడు లక్ష రూపాయలు ఆమె అకౌంట్లో వేయమని చెప్పి.. మరో పదివేల రూపాయల ఖర్చులకోసం బ్యాగ్ లో వేశాడట పవన్. 3-4 ఏళ్ల క్రితం ఓ రూమర్ మాదిరిగా ఈ వార్త వచ్చినా.. ఇప్పుడు ఓ సెలబ్రిటీ షోలో పవన్ గురించి.. ఈమె చెప్పిన తీరు అందరినీ కట్టిపడేసింది. పవన్ కళ్యాణ్ మంచితనం గురించి ప్రపంచానికి చాటి చెప్పిందీమె. పవన్ ఇలాంటి గుప్తదానాలు చాలానే చేస్తుంటాడని ఇండస్ట్రీ జనాలు చెబుతుంటారు. 

25/06/2016

పవన్ కోసం మరో అత్తారిల్లు?

స్వచ్ఛమైన వినోదం అందించడమే లక్ష్యమని మొన్న అఆ పాటల విడుదల వేడుకలో చెప్పుకొచ్చాడు త్రివిక్రమ్. అలాంటి వినోదం కోసమే చాలా కష్టపడుతుంటానని అందుకే నా సినిమాలు కాస్త ఆలస్యమవుతుంటాయని చెప్పాడు. తదుపరి కూడా ఆయన రక్తపాతం - హింసలు లేకుండా అత్తారింటికి దారేది - అఆ తరహాలో  చిత్రం తెరకెక్కించబోతున్నాడని సమాచారం. నిజానికి త్రివిక్రమ్ లో చాలా కోణాలున్నాయి. ఆయన  అత్తారింటికి దారేది - అఆలాంటి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్లని తీయగలరు. అతడు - ఖలేజాలాంటి యాక్షన్ ఎంటర్ టైనర్లనీ తీయగలడు. అతడు - ఖలేజా సినిమాలు కూడా మంచి టాకే తెచ్చుకొన్నాయి కానీ... వసూళ్లు మాత్రం దక్కలేదు. అలాంటి చిత్రాలని  కుటుంబ ప్రేక్షకులు చూడరన్న విషయం అర్థమైంది. అందుకే ఇటీవల త్రివిక్రమ్  దృష్టంతా క్లీన్ ఫ్యామిలీ కథలపైనే పెట్టినట్టు తెలుస్తోంది. కుటుంబం నేపథ్యంలో  స్వచ్ఛమైన కథల్ని తీస్తే ఎన్ని  లాభాలుంటాయో ఆయనకి చివరిగా తీసిన మూడు సినిమాలతో బాగా అర్థమైంది. సన్నాఫ్ సత్యమూర్తి యావరేజ్ సినిమా అనే టాక్ వచ్చినా వసూళ్లు మాత్రం అదిరిపోయాయి. చివరిలోపు సినిమా హిట్ట్ అన్న టాక్ వచ్చేసింది.  

అందుకే మరోసారి అత్తారింటికి దారేది - అఆ తరహా కథనే సిద్ధం చేయడానికి పూనుకొన్నట్టు తెలుస్తోంది. తదుపరి త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ తోనే సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. ఈ కాంబినేషన్ లో ఇదివరకు కోబలిలాంటి మూవీ వస్తుందని ప్రచారం సాగింది. కానీ త్రివిక్రమ్ మాత్రం మరోసారి అత్తారింటికి దారేది తరహా సినిమానే తీయాలని అనుకొంటున్నాడట. ఇప్పటికే ఓ లైన్ కూడా ఫిక్స్ చేసుకొని దాన్ని వర్కవుట్ చేసేందుకు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది.

22/06/2016

పవన్ వేరు.. మేం వేరు కాదు-నిహారిక

మెగా ఫ్యామిలీ అంటే అందులో పవన్ కళ్యాణ్ కూడా భాగమేనని.. ఆయన వేరు తాము వేరు కాదని అంటోంది కొణిదెల నిహారిక. తాను కథానాయికగా పరిచయమవుతున్న ‘ఒక మనసు’ సినిమాను పవన్ చూస్తాడని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది. తమ ఫ్యామిలీ కోసం ‘ఒక మనసు’ ప్రివ్యూ షో వేయబోతున్నట్లు ఆమె వెల్లడించింది. ‘‘మా ఫ్యామిలీలో అందరి కోసం నా సినిమాను ప్రివ్యూ వేయాలనుకుంటున్నాం. పెదనాన్న చిరంజీవి తప్పకుండా ఆ షోకు హాజరవుతారు. ఫ్యామిలీ అంటే అందులో పవన్ బాబాయి కూడా ఉంటారు. ఆయన వేరు.. మేం వేరు కాదు. ఆయన కూడా నా సినిమా చూస్తారని ఆశిస్తున్నా. అందరూ నా పెర్ఫామెన్స్ గురించే ఏమంటారో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అని నిహారిక చెప్పింది.

ఇక సినిమాల్లోకి రావాలనుకున్నపుడు తమ కుటుంబ సభ్యులు ఎలా స్పందించారో చెబుతూ.. ‘‘నేను సినిమాల్లోకి వెళ్లాలని స్థిరమైన నిర్ణయం తీసుకున్నాక ఇంట్లో వాళ్ళను సంప్రదించా. అందరూ ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో.. హీరోయిన్లను కొందరు ఎలా చూస్తారో చెప్పారు. అయితే నా విషయంలో యాక్టింగ్ పరంగా నా కమిట్మెంట్ ఏంటో చెప్పా. అప్పుడు చిరంజీవి పెదనాన్న - కళ్యాణ్ బాబాయ్ కన్విన్స్ అయ్యారు. ఇష్టంగా చేస్తే ఎందులోనైనా విజయం సాధించవచ్చని.. నెగెటివిటీని పక్కనపెట్టి జాగ్రత్తగా సినిమాలు పాత్రలు ఎంపిక చేసుకోమని సలహా ఇచ్చారు. వాళ్ళిచ్చిన సపోర్టును ఎప్పటికీ నిలుపుకుంటూ. మంచి సినిమాలు చేస్తా” అని నిహారిక చెప్పింది.

19/06/2016

పవన్ సినిమా నుండి సూర్య ఔట్

అవును. నిజమే. పవన్ కళ్యాణ్ సినిమాను డైరక్ట్ చేయడానికి ఇప్పుడు ఎస్.జె.సూర్య కు అస్సలు టైమ్ లేదు. అందుకే స్వయంగా పవన్ మనోడిని తప్పుకోమని చెప్పేశాడు. అసలు ఇలా జరగడానికి కారణమేంటి అనేగా మీ సందేహం. 

నిజానికి ఆకుల శివ రాసిన ఒక కతను.. ఎస్.జె.సూర్య డైరక్షన్ లో.. శరత్ మరార్ ప్రొడక్షన్ లో.. ''కడప కింగ్'' (టెంటేటివ్ టైటిల్) అంటూ తెరమీదకు తీసుకురావల్సి ఉంది. అయితే ఈ మధ్యన ఎస్.జె.సూర్య ఒక క్యారెక్టర్ లో నటించిన ''ఇరైవి'' సినిమా  విడుదలైంది. ఈ సినిమాలో మనోడి నటన ఒక రేంజులో వర్కవుట్ కావడంతో.. వెంటనే తమిళంలో పెద్ద పెద్ద హీరోల సరసన యాక్టింగ్ ఛాన్సులు వచ్చేశాయి. ఇక తెలుగులో మహేష్ బాబు సరసన ఏ.ఆర్.మురుగుదాస్ సినిమాలో విలన్ గా కూడా నటిస్తున్నాడు కుర్రాడు. దానితో డైరక్షన్ చేయడానికి మనోడికి తీరిక దొరకదేమో అనే సందేహం వెల్లిబూర్చడంతో..స్వయంగా పవన్ ఇతన్ని తప్పించి.. ఆ ప్లేసులో మరొక డైరక్టర్ ను పెట్టాడు. 

''గోపాల గోపాల'' సినిమా చేసేటప్పుడు.. మనం ఒక ప్రాజెక్టు చేద్దాం అంటూ దర్శకుడు కిషోర్ పార్దసాని (డాలి) కి పవన్ మాటిచ్చాడు. ఆ మాట నిలబెట్టుకుంటూ ఇప్పుడు ఈ సినిమాను అతని చేతుల్లో పెట్టాడు. అది సంగతి. 

17/06/2016

`కడప కింగ్` పవన్ కోసమేనా?

పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించనున్న కొత్త చిత్రానికి హుషారు అనే పేరు పరిశీలనలో ఉందని ఆమధ్య ప్రచారం జరిగింది. కానీ చిత్రబృందం మాత్రం ఆ ప్రచారాన్ని తోసిపుచ్చింది. ఆ పేరు మా ఆలోచనలోనే లేదని చెప్పుకొచ్చారు. ఎస్.జె.సూర్య తెరకెక్కించే ఆ కథ రీత్యా చూసినా...  ఆ టైటిల్ సరిపడదన్న విషయం ఆ తర్వాత తెలిసింది. అయితే ఇప్పుడు మరో కొత్త పేరు వెలుగులోకి వచ్చింది. కడప కింగ్ పేరుతో పవన్ చిత్రం తెరకెక్కబోతోందని ఫిల్మ్ నగర్ వర్గాలు మాట్లాడుకొంటున్నాయి. 

మరి నిజంగా  అలాంటి టైటిల్ తో పవన్ సినిమా చేస్తాడా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆ పేరు వెలుగులోకి రావడానికి కూడా బలమైన కారణమే ఉంది. పవన్ కళ్యాణ్ స్నేహితుడు - చిత్ర నిర్మాతైన శరత్ మరారే స్వయంగా ఫిల్మ్ ఛాంబర్ కి వెళ్లి కడప కింగ్ పేరును రిజిస్టర్ చేయించారట. అప్పట్నుంచి పవన్ కొత్త చిత్రం పేరు కడప కింగ్ అని ప్రచారం మొదలైంది.  ఫ్యాక్షనిజంతో ముడిపడి వున్న కథ కాబట్టి ఆ పేరుతోనే తెరకెక్కొచ్చన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. ఆ చిత్రం కోసం  త్వరలోనే రంగంలోకి దిగబోతున్నారు పవన్ కళ్యాణ్. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా ఎంపికైనట్టు సమాచారం. మొదట శ్రుతిహాసన్ని అనుకొన్నా ఆమె డేట్లు సర్దుబాటు కాకపోవడంతో రకుల్ని ఎంపిక చేసుకొన్నారు. 

15/06/2016

బాలయ్య అభిమాని పవన్ అభిమాని అయ్యాడు

టాలీవుడ్లో గతేడాది నుంచి వరుస సక్సెస్లతో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో నాని. ఎవడే సుబ్రహ్మణ్యం - జెండా పైకపిరాజు - భలే భలే మగాడివోయ్ - కృష్ణగాడి వీరప్రేమగాథ సినిమాల తర్వాత నాని మార్కెట్ డబుల్ అయ్యింది. ఇక ఈ యేడాది ఇప్పటికే కృష్ణగాడి సినిమాతో హిట్ కొట్టి ఈ శుక్రవారం ఒకప్పటి బ్లాక్ బస్టర్ టైటిల్ జెంటిల్ మేన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. 

 మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. కృష్ణగాడి సినిమాలో బాలయ్య అభిమానిగా కనిపించి మెప్పించిన నాని ఇప్పుడు పవర్ స్టార్ అభిమానిగా కనిపించనున్నాడు. కృష్ణగాడి సినిమాలో చేతి మీద జై బాలయ్య టాటూతో కనిపించిన నాని నందమూరి అభిమానులను కూడా ఎట్రాక్ట్ చేశాడు. నందమూరి అభిమానులందరూ నాని సినిమాకు మంచి సపోర్ట్ ఇచ్చారు.

 ఇక జెంటిల్ మేన్ తర్వాత నాని ఉయ్యాల జంపాల ఫేం విరించి వర్మ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే షూటింగ్ జరుపుకోనుంది. ఈ సినిమాలో నాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానిగా కనిపించనున్నాడు. ఇప్పటికే యంగ్ హీరో నితిన్ రియల్ లైఫ్ లో పవన్ వీరాభిమానిగా పాపులర్ అయ్యి పవన్ ఫ్యాన్స్ ను బాగానే వాడుకుంటున్నాడు. ఇక ఇప్పుడు నాని రీల్ లైఫ్ లో పవన్ అభిమాని అవతారం ఎత్తనున్నాడు. మరి నాని సినిమాకు పవన్ సెంటిమెంట్ ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.

10/06/2016

ఒక్క ఫ్యామిలీ.. 16 సినిమాలు.. మెగా లెక్క

మెగా కాంపౌండ్.. నిజంగానే కాంపౌండ్ అనే పదం మెగా కుటుంబానికి సరిగ్గా సరిపోతుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు.. అరడజనుకు పైగా హీరోలు వరుసపెట్టి సినిమాలు చేసేస్తుంటే.. ఇండస్ట్రీ కళకళ్లాడిపోతూ ఉంటుంది. ఆ ఫ్యామిలీ ఇంకా వెలిగిపోతూ ఉంటుంది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్నవి.. ఇప్పటికే ఓకే అనిపించేసుకుని త్వరలో ప్రారంభించుకోనున్నవి.. మొత్తం మెగా సినిమాల లెక్క చూస్తే ఔరా అనిపించక మానదు. ఈ కౌంట్ ఏకంగా 16 అంటే ప్రత్యర్ధి హీరోలకు గుండె గుభేల్ మనిపించడం ఖాయం. 

మెగాస్టార్ చిరంజీవి: చిరంజీవి 150వ చిత్రంగా కత్తిలాంటోడు ప్రారంభమైంది. వివి వినాయక్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారు. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్: పవన్ కళ్యాణ్ హీరోగా ఎస్ జే సూర్య డైరెక్షన్ లో ఓ మూవీ తెరకెక్కనుంది. దీని తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో మూవీ చేయనున్నాడు పవన్. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పనులు మొదలయ్యాయి. 

రామ్ చరణ్: చెర్రీ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ధృవ చిత్రాన్ని చేస్తున్నాడు. ఆ వెంటనే సుకుమార్ తో సినిమా స్టార్ట్ చేయనున్నాడు. ఇప్పటికే దీనికి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైపోయాయి. 

అల్లు అర్జున్: వరుసగా 4 సినిమాలను 50 కోట్లు దాటించిన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు బన్నీ. ఇప్పుడు లింగుస్వామితో కొత్త మూవీ స్టార్ట్ చేయనుండగా.. దీని తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడని ఇప్పటికే స్టోరీ ఓకే అయిపోయిందని తెలుస్తోంది. 

వరుణ్ తేజ్: మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్.. శ్రీను వైట్ల డైరెక్షన్ లో మిస్టర్ టైటిల్ పై ఓ సినిమా చేయనున్నాడు. దీంతో పాటే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కూడా మరో సినిమాని ఒకేసారి షూటింగ్ నిర్వహించనున్నాడు. గతంలో క్రిష్ డైరెక్షన్ లో ఆగిపోయిన రాయబారిని.. మళ్లీ పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పాడు వరుణ్ తేజ్. 

సాయిధరం తేజ్: సునీల్ రెడ్డి దర్శకత్వంలో తిక్క చిత్రాన్ని ఫినిషింగ్ దశకు తెచ్చిన సాయిధరమ్ తేజ్.. గోపీచంద్ మలినేనితో ఓ మూవీని బీవీఎస్ రవి డైరెక్షన్ లో జవాన్ టైటిల్ పై మరో సినిమాని లైన్ లో పెట్టాడు. 

అల్లు శిరీష్: పరశురామ్ దర్శకత్వంలో చేసిన శ్రీరస్తు.. శుభమస్తు ఆఖరి షెడ్యూల్ ప్రారంభిస్తున్నాడు అల్లు శిరీష్. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుండగా.. మల్లిడి వేణు డైరెక్షన్ లో ఓ చిత్రానికి ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. 

నీహారిక: నాగబాబు కూతురు నీహారిక ఒక మనసుతో హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఈ నెల 24న ఈ మూవీ విడుదలైన తర్వాత రిజల్ట్ చూసి.. కొత్త చిత్రాలను యాక్సెప్ట్ చేయనుంది.