Showing posts with label Chiranjeevi. Show all posts
Showing posts with label Chiranjeevi. Show all posts

22/09/2016

ఎన్టీఆర్.. చిరు.. మహేష్.. అంటున్న నాని

తెలుగులో ‘స్టార్’ అనే పదానికి అర్థం మారుతోందంటున్నాడు నాని. భవిష్యత్తులో అసలే హీరో కూడా స్టార్ కాదని నాని చెప్పాడు. ‘‘గత కొన్ని దశాబ్దాల్లో స్టార్ అనే పదానికి అర్థం మారింది. మొదట్లో ఎన్టీఆర్ గారు భారీ పాత్రలు చేసేవాళ్లు. ఆయన పెద్ద స్టార్ అయ్యారు. తర్వాత చిరంజీవిగారు డ్యాన్సులు.. ఫైట్లతో తన ప్రత్యేకత చాటుకున్నారు. పెద్ద స్టార్ అయ్యారు. ఆ తర్వాత మహేష్ బాబు తన లుక్స్.. సటిల్ యాక్టింగ్ స్టైల్ తో స్టార్ అయ్యారు. నా దృష్టిలో ఇకపై స్టార్ అనే పదానికి అర్థం మారుతుంది. రాబోయే రోజుల్లో కంటెంటే బిగ్గెస్ట్ స్టార్ అవుతుందని నా అభిప్రాయం’’ అని నాని విశ్లేషించాడు.

ఇక తన వరకు తాను స్టార్ కాదని నాని స్పష్టం చేశాడు. ‘‘నేను ఏ స్టార్ లీగ్ కూ చెందను. నెంబర్ రేసులో ఉండను. నా సినిమాలు.. నా నటన అంతా డిఫరెంట్. నేనెప్పుడూ నటుడిగానే ఉంటాను. స్టార్ కాదు. ఒకవేళ స్టార్ ఇమేజ్ ఉందనిపించినా.. అది నా సినిమాలు హిట్టయ్యే వరకే. నా సినిమాల వసూళ్ల గురించి.. బిజినెస్ గురించి కూడా నేను పెద్దగా పట్టించుకోను. ఓ కథ ఎంచుకునేటపుడు ప్రేక్షకులకు నచ్చుతుందా లేదా అని చూస్తా. విడుదల తర్వాత రెస్పాన్స్ ఎలా ఉందో చూస్తా. వీటి మీదే ప్రధానంగా నా దృష్టి ఉంటుంది. అందుకే నా ప్రతి సినిమానూ నేను థియేటరుకు వెళ్లి ప్రేక్షకులతో కలిసి చూస్తా. నేను కథ విషయంలో.. సన్నివేశాల విషయంలో ఎలా ఫీలయ్యానో అలాగే ప్రేక్షకులు కూడా ఫీలవుతున్నారో లేదో చూస్తాను. దాన్ని బట్టే సినిమాలు ఎంచుకుంటాను’’ అని నాని చెప్పాడు. 

19/09/2016

చిరు సినిమాలో విజయ్ మాల్యా

విజయ్ మాల్యా పోలీసులకే దొరక్కుండా ఉంటే.. ఇక చిరంజీవి సినిమాలో నటించడమేంటి అంటారా? చిరు సినిమాలో మాల్యా ఉండడు. ఆయనను పోలిన క్యారెక్టర్ ఉంటుందట. మెగాస్టార్ రీఎంట్రీ మూవీ 'ఖైదీ నెంబర్ 150'లో విలన్ పాత్రను మాల్యా తరహాలో డిజైన్ చేశారట. ఈ విషయాన్ని ఆ పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ నటుడు తరుణ్ అరోరానే వెల్లడించాడు. తమిళ 'కత్తి'లో నీల్ నితిన్ ముకేశ్ చేసిన పాత్రనే తెలుగులో తరుణ్ చేస్తున్నాడు.

ఈ పాత్ర గురించి అతను చెబుతూ.. ''తమిళ వెర్షన్‌లోని పాత్రలో బేసిగ్గా ఎలాంటి మార్పులు చేయలేదు. ఐతే దాన్ని మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. ఆ పాత్ర గురించి వినాయక్ గారు నాకు వివరించారు. ఆయన చెప్పినపుడు నాకు విజయ్ మాల్యా గుర్తుకొచ్చారు. ఆయన్ని ఉద్దేశించే ఆ పాత్రను రాశారా అనిపించింది'' అని తరుణ్ చెప్పాడు.  

ఇక తెలుగులో తొలి సినిమానే మెగాస్టార్ చిరంజీవితో చేస్తుండటం గురించి తరుణ్ చెబుతూ.. ''నాకు ఇంత కంటే గొప్ప అరంగేట్రం ఏముంటుంది? ఇది నా అదృష్టం. ఐతే మా ఇద్దరి కాంబినేషన్లో ఎక్కువ సన్నివేశాలేమీ తీయలేదు. ఒకట్రెండు సీన్స్ తీశారంతే. ఈ లోపు వర్షం వల్ల షెడ్యూల్ క్యాన్సిల్ అయింది. చిరంజీవి గారితో పెద్దగా మాట్లాడే అవకాశం రాలేదు. ఆయనతో చాలా మాట్లాడాలనుంది. తర్వాతి షెడ్యూల్లో ఆయనతో ముచ్చటిస్తా. చిరంజీవి గారితో కలిసి నటించడం కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా'' అన్నాడు.

18/09/2016

బన్నీ సినిమాలో చిరు గెస్ట్ రోల్?

శాండల్ వుడ్ లో ఉన్న రెబెల్ స్టార్.. పవర్ స్టార్ ల సంగతి ఇప్పుడు చెప్పుకుందాం. రెబెల్ స్టార్ అంబరీష్.. పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ లు కలిసి ఓ సినిమా చేశారు. 'దొడ్డమానే హడ్గ' పేరుతో ఓ చిత్రం రూపొందింది. సెప్టెంబర్ 30న ఈ చిత్రం విడుదల కానుండగా.. ఇప్పటికే ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. 

పునీత్ రాజ్ కుమార్ పాత్రలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అయితే.. సరిగ్గా సరిపోతాడని భావిస్తున్నారట. ఇప్పటికే బన్నీకి ఆఫర్ పంపగా.. పరిశీలనలో ఉందని టాక్. అయితే.. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. కన్నడలో అంబరీష్ చేసిన పాత్రను.. తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో చేయించాలని చూస్తున్నారట. ఇది సాధ్యమో కాదో ఇప్పుడే చెప్పలేం కానీ.. ఒక వేళ సాధ్యమయితే మాత్రం.. తెలుగు మల్టీ స్టారర్  హిస్టరీలో కొత్త శకం స్టార్ట్ అయినట్లే. 

కాన్సెప్ట్.. ప్రాజెక్ట్ బాగానే ఉన్నా.. రిజల్ట్ కోసం టాలీవుడ్ ఎదురుచూస్తోంది. ఒకవేళ సినిమా సక్సెస్ అయితే.. టాలీవుడ్ నుంచి భారీ ఆఫర్స్ వెళ్లే ఛాన్సులు పుష్కలంగా ఉన్నాయి. మరి రెబెల్ స్టార్ రోల్ లో మెగాస్టార్.. పవర్ స్టార్ పాత్రలో స్టైలిష్ స్టార్ ని చూసే అవకాశం ఇస్తారో లేదో !

17/09/2016

మోహన్ బాబు చేతులమీదుగా చిరు MB40

విశాఖలో టి.సుబ్బిరామిరెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా జరిగిన మోహన్ బాబు 40వసంతాల సినీ జీవిత కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. సినిమా రంగానికి చెందినవారే కాకుండా - రాజకీయాలకు చెందిన వారితో పాటు పలు రంగాలకు చెందిన అతిరథమహారధుల సమక్షంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. అత్యంత ఒక గొప్ప నటుడు మాత్రమే కాదు.. ఒక పొలిటీషియన్.. ఒక ఎడ్యుకేషనిస్ట్.. అంతకంటే మించి అందరి మంచీ కోరుకునే ఒక మంచి స్నేహితుడు.. ఆయన ఒక గొప్ప వ్యక్తి.. రేపటి తరాలకు ఒక మంచి ఇనిస్పిరేషన్.. అని సినిమా ఇండస్ట్రీ మొత్తం ఏక కంఠంతో మోహన్ బాబుని కొనియాడింది. ఈ సందర్భంగా ప్రసంగించిన మోహన్ బాబు - సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి 40 వసంతాల కార్యక్రమం గురించి ప్రస్థావించారు. 

ఈ సందర్భంగా ప్రసంగించిన మోహన్ బాబు... తన 40 సంవత్సరాల కేరీర్ సందర్భంగా జరిగిన కార్యక్రమం ఇంత ఘనంగా జరగడానికి కారకులైన ప్రతిఒక్కరికీ పేరుపేరున ధన్యవాదాలు తెలియచేశారు. అనంతరం చిరంజీవి 40 వసంతాల కార్యక్రమం జరుగుతుందని ఆ కార్యక్రమాన్ని తిరుపతి వేడుకగా తానే చేస్తానని ప్రకటించారు. చిరంజీవి తర్వాత వెంకటేష్ సినీ కెరీర్ కి సంబందించిన సన్మాన కార్యక్రమం కూడా తానే చేస్తానని మోహన్ బాబు ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత చిరంజీవి - వెంకటేష్ లిద్దరూ చిరునవ్వులు చిందించారు. అనంతరం సభాప్రాంగణం మొత్తం హర్షధ్వానాలతో మారుమ్రోగిపోయింది.

MB40: చిరంజీవి నాకు కలలో కూడా చెడు చేయలేదు

ఇకపోతే ఎంబి40 ఈవెంట్లో చిట్టచివర మోహన్ బాబు ఇచ్చిన స్పీచ్ అంతా ఒకెత్తయితే.. అందులో మోగాస్టార్ చిరంజీవి గురించి ఆయన చెప్పిన మాటలు ప్రత్యేకం. 

''చిరంజీవి నాకు కలలో కూడా చెడు చేయలేదు. నేను కూడా ఆయనకు ఎప్పుడు చెడు చేయలేదు. మేం గ్రేట్ ఫ్రెండ్స్ అంతే.  నేను చిరంజీవితో చేసినన్ని సినిమాలు ఎవ్వరితోనూ చేయలేదు. ఇక చిరంజీవి తన తండ్రిని ఎంతో ప్రేమించేవారు.. అలాంటి ప్రేమ తన పెద్దకూతురుకు వచ్చింది. ఎక్కడ కనిపించినా అంకుల్ అని పిలుస్తుంది. అలాగే నాకు అల్లూ రామలింగయ్య గారంటే చాలా కష్టం. ఆయనంటే నాకు ఎంత ప్రేమో అరవింద్ మథర్ కు తెలుసు. ఇక అరవింద్ కూడా నాకు మంచి స్నేహితుడే. నాకు నాగబాబు అంటూ చాలా ఇష్టం. అది బయటకు తెలియదు. నా పేరు భక్తవత్సలం నాయుడు.. నేను పెద్దకాపును అన్నాను. అన్నా నువ్వా అంటూ నాగబాబు షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని ఇక్కడకు వచ్చేశాడు. చాలా మంచోడు తను'' అంటూ 'మెగా' పొగడ్తలతో ముంచెత్తారు మోహన్ బాబు.  

''షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని వచ్చావ్ చిరంజీవి. మళ్లీ అదే కాంబినేషన్ డేట్లు దొరకాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు. హోల్ హార్డెడ్ థ్యాంక్స్ చిరంజీవి'' అంటూ కృతజ్ఞతలు చెప్పారు. అలాగే చిరంజీవి మథర్ కు నమస్కారాలు అంటూ చెప్పిన మోహన్ బాబు.. ''చిరంజీవి మర్చిపోతాడు నువ్వు మర్చిపోవు. అమ్మకు నా నమస్కారాలు. నువ్వు ఆవిడకు తెలియజేయి'' అని సెలవిచ్చారు.

''తదుపరి 40 ఏళ్ల సన్మానం జరిగేది చిరంజీవికే. ఆ సభను నా చేతిలో పెట్టు చిరంజీవి.. నేనే ముందుండి అంతా నడిపిస్తాను. చూడు అప్పుడు. ఆ తరువాత 40 ఏళ్ల పండుగ వెంకటేష్ దే'' అంటూ ముగించారు మోహన్ బాబు. 

MB40: ఇదే మెగా స్పీచ్

ఇక ఎంబి 40 కార్యక్రమానికి చీఫ్ గెస్టుగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఏమని చెబుతారా అనే అందరూ ఎదురు చూశారు. ఇదిగో ఆ మెగా మాటలను వినండి మరి. 

''నిజంగా.. మనస్ఫూర్తిగా.. సభా మర్యాద కాకపోయినా కూడా.. వేదిక మీద ఉన్న పెద్దలకు ఆ తరువాత ప్రేక్షకులకు మలి నమస్కారం తెలియజేసుకుంటాం కాని.. చాలా పెద్ద హృదయంతో చాలా ఓపికగా ఇంతసేపు ఇక్కడకు వచ్చిన పెద్దల మాటలను ఓర్పుగా  వింటూ కూర్చున్నారు.. అందుకు విశాఖ ప్రజలకు మొట్టమొదటిగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా'' అంటూ అత్యంత ఎక్సయిట్మెంట్ తో తన స్పీచ్ మొదలుపెట్టారు మెగాస్టార్ చిరంజీవి. 

ముందుగా టి.సుబ్బిరామి రెడ్డి కళా హృదయాన్ని అభినందించిన చిరంజీవి.. అత్యంత ఆప్తుడు మిత్రుడు అయిన మోహన్ బాబు గురించి మట్లాడారు చిరు. ''సుబ్బిరామి రెడ్డి గారి ఫంక్షన్లకు ఎన్నోసార్లు వచ్చాను కాని.. ఇప్పుడు మాత్రం కేవలం మోహన్ బాబు గురించే వచ్చాను'' అని సెలవిచ్చారు చిరు. ''ఏమయ్యా చిరంజీవి.. నేనయ్యా మోహన్ బాబును.. విశాఖలో ఎంబి 40. నువ్వు రావాలి అని చెప్పాడు'' అంటూ చిరంజీవి స్వయంగా మోహన్ బాబు వాయిస్ లో మిమిక్రీ చేసి మరీ వినిపించారు.

పొరపాటను సినిమా షూటింగ్ పెట్టాను.. కాకపోతే లాస్ట్ మినిట్ లో తెలుసుకుని ఈ రాక్షసుడు ఇక్కడకు రాకపోతే చంపేస్తాడని చెబుతూ క్యాన్సిల్ చేసుకున్నాను అని వివరించారు. ''బయట మనిద్దరినీ టామ్ అండ్ జెర్రీ అనుకుంటున్నారు. మనం సరదాగా మాట్లాడుకోవడం ఇలా సోషల్ మీడియాలో గొడవగా మారడం ఏంటి అని మోహన్ బాబును అడిగితే.. అనుకోనివ్వవయ్యా ఏమైందిలే.. అంటూ తీసిపాడేస్తాడు. నాది కూడా అదే మనస్థత్వం. మా మధ్య మా రిలేషన్ ఎలా ఉందనేదే ముఖ్యం'' అంటూ తమ రిలేషన్ గురించి చెప్పారు చిరంజీవి.

''ఇది ఒక కష్టానికి జరుగుతున్న సన్మానం.. ఒక మనస్థత్వానికి.. ఒక పట్టుదలకు.. జరుగుతున్న సన్మానం. ఆయన 40 ఏళ్ళు పూర్తి చేసుకుంటే నేను 37 ఏళ్లు పూర్తి చేసుకున్నా. 1975లో కెరియర్ మొదలెట్టినప్పటినుండి ఇప్పటివరకు ఈ సుదీర్ఘ జర్నీలో అలుపెరగకుండా కష్టపడ్డాడు మోహన్ బాబు. సినిమా కెరియర్ పూల పాన్పుకాదు ముళ్ల బాట. అలాంటి ఈ ఇండస్ర్టీలో నటనలో కీర్తి శిఖరాలను అందుకుని ముందుకెళ్ళడం అనేది మామూలు విషయం కాదు. ఆయన ఒక వింధ్య పర్వతం'' అంటూ కొనియాడరు మెగాస్టార్. 

మోహన్ బాబు డైలాగులను పొందుపరిచి ఒక బుక్ గా లండన్ పార్లమెంటులో దానిని ఆవిష్కరించడం అనేది కళాకారులుగా మా అందరికీ ఎంతో గర్వకరాణం అంటూ మోహన్ బాబును అభినందించారు చిరు. ఆయన చిత్రాలను కూరుస్తూ అచ్చేసిన ఆ పుస్తకానికి నన్ను 'ముందుమాట' రాయమనడం అనేదే నాకు గర్వకారణం అంటూ ముగించారు మెగాస్టార్ చిరంజీవి. 

రోషన్ నాకు రామ్ చరణ్ లాంటోడు

ఒక్కసారి మెగాస్టార్ చిరంజీవి ఆశీర్వాదం పొందాలని సినిమా వాళ్లంతా ఎందుకు కోరుకుంటారో.. చెప్పకనే చెప్పేశారు చిరు. హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ నటించిన నిర్మలా కాన్వెంట్ రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శనకు హాజరైన చిరు.. రోషన్ ను.. హీరోయిన్ శ్రియా శర్మను ఆకాశానికి ఎత్తేశారు చిరంజీవి. ముఖ్యంగా రోషన్ గురించి చెప్పిన తీరు చూస్తే ఎవరైనా ఔరా అనాల్సిందే. 

'రోషన్... నా తమ్ముడు శ్రీకాంత్ ముద్దుల కొడుకు. నాకు చిన్నప్పటి నుంచి తెలిసిన బిడ్డ. ఇంకా చెప్పాలంటే.. నాకు రామ్ చరణ్ ఎలాగో.. మిగిలిన మేనల్లుళ్లు ఎలాగో.. వారిలాగే మరొక బిడ్డ రోషన్. రోషన్ పుట్టిన దగ్గర నుంచి అర్ధమైంది ఏంటంటే ఈ కుర్రాడు బోర్న్ టు బి ఏ హీరో. హీరో మెటీరియల్ అని ముందే తెలుసు. ఈ సినిమా బాగా రోషన్ కు బాగా హెల్ప్  అవుతుంది. భవిష్యత్తులో ఓ మంచి హీరోగా రూపొందడానిక ఈ సినిమా ఉపయోగపడుతుంది' అని చెప్పిన చిరు అంతటితో ఆగలేదు. 

'ఈ సినిమా విజయం అంతా హీరో హీరోయిన్ల కళ్లలోనే ఉంది. ఇలాంటి సినిమా ఆడాలి. ప్రేక్షకుల మన్నన ఆదరణ పొందాలి. అప్పుడే ఇలాంటి ఫ్రెష్ సబ్జెక్ట్స్ మరిన్ని వస్తాయి. ఆల్ ది బెస్ట్' అంటూ నిర్మలా కాన్వెంట్ టీమ్ కి శుభాకాంక్షలు తెలిపారు చిరంజీవి. 

చెర్రీపై ప్రేమను చేతిలోనే దాచుకున్న చిరు

ఆడియన్స్ ను మెస్మరైజ్ చేయడంలో మెగాస్టార్ చిరంజీవి ట్యాలెంట్ ఎలాందిదో ప్రత్యేకంగా చెబితే మహా కామెడీగా ఉంటుంది. ఇలాంటివి సిల్వర్ స్క్రీన్ మీద చూసేయబట్టే.. ఇన్ని కోట్ల మంది అభిమానులను సంపాదించుకోగలిగారు. అలాగే ఏదైనా ఫంక్షన్ లోనో.. ఎవరి గురించి అయినా చెప్పాలంటేనో.. చిరు మాటలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. చెడును పూర్తిగా వదిలేసి.. మంచి మాత్రమే పైకి చెబుతూ మనస్ఫూర్తిగా ప్రశంసించగలగడం అనే విద్య అందరికీ అబ్బేది కాదు. అది చిరంజీవికి మాత్రమే సొంతం. అందుకే ఆయన ఆ స్థాయిలో ఉంటారు. 

మరి ఆయన పర్సనల్ గా చిరంజీవి ఇష్టాలు ఎలా ఉంటాయి? ఇది కాసింత టిపికల్ క్వశ్చన్ అయినా.. ఆన్సర్ దొరికే ఛాన్స్ చిరునే ఇచ్చారు. రీసెంట్ గా శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించిన నిర్మలా కాన్వెంట్ మూవీ ప్రత్యేక ప్రదర్శనకు చిరంజీవి హాజరయ్యారు. శ్రీకాంత్ తన తమ్ముడు అని చెప్పే చిరు ఇక్కడ కనిపించడంలో వింత లేదు కానీ.. ఆయన చేతిలో ఉన్న మొబైల్ లోనే అసలు కథంతా ఉంది. చిరంజీవి చేతిలో పట్టుకున్న ఫోన్ కి బ్యాక్ కవర్ లో.. చరణ్ ని చిరంజీవి ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని పట్టుకుని ఉన్న ఫోటో ప్రింట్ చేసి ఉంది.

తండ్రీ కొడుకుల అనుబంధం చెప్పేందుకు ఇంతకంటే పెద్ద ఎగ్జాంపుల్ అవసరం లేదు. చేతిలో ఎప్పుడూ ఉండే ఫోన్ లోనే కొడుకుతో అనుబంధాన్ని దాచుకున్నారంటే.. ఆ తండ్రి మనసులో మరెంత ఉంటుందో ఊహించడం కష్టమే!

16/09/2016

మోహన్ బాబు కోసం మెగాస్టార్ సెలవ్

మెగాస్టార్ చిరంజీవి- మోహన్ బాబుల మధ్య వైరం ఉందో లేదో చెప్పడం కష్టం కానీ.. వీరిద్దరి మధ్య పెద్దగా సఖ్యత అయితే లేదన్న మాట వాస్తవం. మాటకు మాట అన్నట్లుగా మాట్లాడుకునే సందర్భాలు పబ్లిక్ గానే కనిపిస్తూనే ఉంటాయి. నవ్వుతూనే మాటల తూటాలు విసురుకునే వీళ్లని టామ్ అండ్ జెర్రీ టైపులో అభివర్ణిస్తూ ఉంటారు సినీ జనాలు. ఇదంతా గతం అనిపిస్తోందిపుడు. మెల్లగా ఇద్దరూ దగ్గరవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఎంబీ40 పేరుతో మోహన్ బాబు ఇండస్ట్రీలోకి వచ్చి 40 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని సెలబ్రేట్ చేస్తున్నారు.

సెప్టెంబర్ 17న వైజాగ్ లో జరగనున్న ఈ కార్యక్రమం కోసం మెగాస్టార్ చిరంజీవి తన సినిమా షూటింగ్ కూడా క్యాన్సిల్ చేసేసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. ఖైదీ నెంబర్ 150 మూవీని గ్యాప్ లేకుండా షూట్ చేస్తున్న చిరు.. తన పాత మిత్రుడు కం ఎక్సెట్రా అయిన మోహన్ బాబు కోసం బ్రేక్ ఇచ్చేశారు. విశాఖపట్నంలో సుబ్బిరామిరెడ్డి నిర్వహిస్తున్న సత్కారం కార్యక్రమానికి చిరు హాజరు కానుండడం ప్రత్యేకత సంతరించుకుంది. ఇలా చిరు- మోహన్ బాబు కలవడానికి ప్రధాన కారణం దర్శక దిగ్గజం దాసరి నారాయణ రావు సఖ్యత కుదర్చడమే అంటున్నారు.

మరోవైపు మోహన్ బాబు సన్మాన కార్యక్రమానికి చిరు-దాసరితో పాటు ఇండస్ట్రీ ప్రముఖులు అనేకం హాజరు కానున్నారు. 

15/09/2016

చిరు కోసం చిరుత త్యాగం

రామ్ చరణ్.. ఈ సారి దసరా సీజన్ మిస్ అయిపోతున్నాడు. దసరా పండక్కి రిలీజ్ అనుకున్న ధృవ.. రావడం లేదని తేలిపోయింది. మరి ధృవ రిలీజ్ ఎప్పుడంటే.. ఇప్పుడు డిసెంబర్ 17 అనే డేట్ వినిపిస్తోంది. కానీ టాప్ లీగ్ లో ఉన్న స్టార్స్ సినిమాలు మన దగ్గర క్రిస్మస్ కి రావడం చాలా అరుదు. ఆ వెంటనే వచ్చే సంక్రాంతి పండుగకే ఎక్కువగా ప్లాన్ చేసుకుంటారు. 

రామ్ చరణ్ కి కూడా సంక్రాంతి బాగానే అచ్చొచ్చింది. టఫ్ కాంపిటీషన్ లో కూడా రెండు సార్లు హిట్ కొట్టాడు. కానీ ధృవను పొంగల్ కి షెడ్యూల్ చేసే ఛాన్స్ హీరో చరణ్ కి లేకపోయింది. ఇందుకు కారణం.. చెర్రీలోని ప్రొడ్యూసర్ కి ఉన్న కమిట్ మెంట్. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి రీలాంఛ్ మూవీ ఖైదీ నెంబర్ 150ని నిర్మిస్తున్న చరణ్.. పొంగల్ ని ఆ సినిమాకి ఇచ్చేశాడు. ఇప్పుడు తన చిత్రాన్ని అక్కడ పెట్టి.. చిరు సినిమాని డిస్టర్బ్ చేసే ఉద్దేశ్యంలో ప్రొడ్యూసర్ చరణ్ లేడు. అలా మెగా పవర్ స్టార్ పై.. ప్రొడ్యూసర్ రామ్ చరణ్ నెగ్గేశాడు. 

డిసెంబర్ మధ్యలో రావడం.. లోకల్ మార్కెట్లో ఎలాగున్నా.. ఓవర్సీస్ మార్కెట్లో అయితే సంచలనాలకు స్కోప్ లేని సీజన్ అది. అందుకే చిరు కోసం చరణ్ పెద్ద త్యాగమే చేశాడని ఇండస్ట్రీ జనాలు అంటున్నారు. 

12/09/2016

బ్లాక్ బస్టర్ సీక్వెల్ లో చెర్రీ చేస్తాడా?

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో బ్లాక్ బస్టర్స్ చాలానే ఉంటాయి. ఖైదీ తర్వాత అన్నింటిలోకి స్పెషల్ గా చెప్పుకునే మూవీస్ లో జగదేకవీరుడు-అతిలోక సుందరి ఫస్ట్ ఉంటుంది. చిరంజీవి రేంజ్ ని కాంపిటీటివ్ హీరోలు అందుకోలేనంత హైట్స్ కి తీసుకెళ్లిన మూవీ ఇది. నిర్మాత అశ్వనీదత్ ఎంతో నమ్మకంతో ఈ సినిమాని తీశాడు. అంతకు మించి లాభాలను కూడా అందుకున్నాడు. 

ఈ జగదేకవీరుడు చిత్రానికి సీక్వెల్ తీయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాడు అశ్వనీదత్. అయితే.. ఇందులో రామ్ చరణ్ మాత్రమే నటించాలన్నది ఆయన కోరిక. ఇప్పటికే పలుమార్లు చరణ్ తో మాట్లాడ్డమే కాదు.. చాలామంది దర్శకులు.. స్టోరీ రైటర్లతో మాట్లాడేశాడు కూడా. ఇటు స్టోరీ దొరకలేదు.. అటు చరణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు కానీ.. ఈయన ఇప్పటికే 'జగదేకవీరుడు' టైటిల్ ని రిజిస్టర్ కూడా చేయించేశాడు. ఇప్పటికీ ఈ సీక్వెల్ ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి.

అయితే.. అటు స్టోరీ ఫైనల్ కాకుండా.. ఇటు డైరెక్టర్ ఎవరో తేలకుండా.. తండ్రి నటించిన బ్లాక్ బస్టర్ సీక్వెల్ లో నటించేందుకు రామ్ చరణ్ ఎలా గ్రీన్ సిగ్నల్ ఇస్తాడన్నదే అసలు పాయింట్. ముందు ఇవి ఫైనల్ అయితే.. అప్పుడు చెర్రీ కూడా ఒక అడుగు ముందుకేసి ధైర్యం చేయచ్చు లేకపోతే ఇలా మాటల దగ్గరే ఏళ్లు గడిచిపోతాయ్.  

అవకాశమిస్తే చిరుతో 151వ సినిమా చేస్తా

రామ్ లీలా - జీనియస్ లాంటి సినిమాలను నిర్మించిన దాసరి కిరణ్... ఇప్పుడు వర్మతో కలిసి ‘వంగవీటి’ని పట్టాలెక్కిస్తున్నాడు. అలానే బుల్లితెర నటుడు ఆర్కే నాయుడు అలియాస్ సాగర్ తో ‘సిద్ధార్థ’ మూవీని కంప్లీట్ చేసేసి... ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాడు. సుమారు 300 స్క్రీన్లలో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మూవీ విడుదల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘గతంలో షారూఖ్ ఖాన్ కూడా బుల్లి తెర నుంచే వెండితెరకు పరిచయమై.. బాలీవుడ్లో నెంబర్ వన్ హీరో అయ్యాడు. అలా సాగర్ కూడా బుల్లితెర నుంచి వెండితెరకు వస్తున్నాడు. అతని నటన చూస్తుంటే తప్పకుండా వెండితెరపైనా క్లిక్ అవుతాడు. ఇప్పటికే సీరియల్స్ తో మహిళా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఈ సినిమాతో మరింత చేరువ అవుతాడు’ అన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఈ సినిమాకు యు/ఎ సర్టిఫికెట్ ఇవ్వాలని సెన్సార్ వాళ్లను అడిగాం. కానీ కొన్ని యాక్షన్ సీన్స్.. రొమాంటిక్ సీన్స్ వల్ల కుదరదని ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారు. అయితే ఇందులోని కంటెంట్ ఓ స్టార్ హీరో సినిమాకు ఉండాల్సింది వుందని సెన్సార్ సభ్యులు అభినందించారు. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మలేషియాలో 28 రోజుల పాటు చిత్రీకరించిన యాక్షన్ సీన్స్ మాస్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటాయి. తప్పకుండా సాగర్ ఓ మంచి హీరో అవుతాడని’ తెలిపాడు.

ప్రస్తుతం తాను నిర్మిస్తున్న వంగవీటి.. చిరు అభిమానిగా తన కోరిక ఏంటో వెల్లడిస్తూ... ‘తన ఆరాధ్య నటుడు చిరంజీవి అవకాశం ఇస్తే.. తన 151వ సినిమాగా చాలా కాలం నుంచి ఊరిస్తున్న ‘ఉయ్యలవాడ నరసింహారెడ్డి’ మూవీని ఎంత ఖర్చైనా తెరకెక్కిస్తా. పరుచూరి బ్రదర్స్ ఎప్పుడో స్క్రిప్ట్ రెడీ చేసేశారు. కొన్ని మార్పులు... చేర్పులు చేసి.. దాన్ని పట్టాలెక్కించడానికి రెడీ. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నా. చూడాలి.. ఏం అవుతుందో. ప్రస్తుతం వర్మ ‘వంగవీటి’ సినిమా తీస్తున్నారు. దాని మీదే నా దృష్టి అంతా. ఇది ఏ ఒక్క వర్గానికి అనుకూలంగా గానీ.. వ్యతిరేకంగా గానీ వుండదు. చాలా బ్యాలెన్స్ డ్ గా వుంటుంది. నాకు రెండు వర్గాలతోనూ మంచి సన్నిహిత సంబంధాలే వున్నాయి. కాబట్టి... ఈ సినిమా రిలీజ్ అయితే విజయవాడ మళ్లీ హాట్ గా మారుతందనే ప్రచారంలో నిజం లేదు’ అన్నారు. ఈ చిత్రంలో వర్మ పాడిన పాటకు మంచి రెస్పాన్స్ వస్తోందని ముగించారు.

ఫొటోస్టోరీ: ఖైదీ కోసం సోకులు సిద్ధం

ఒకొక్కరిని కాదు షేర్ ఖాన్... ఒకేసారి వందమందిని పంపించు అన్నాడు రామ్ చరణ్.  అక్కడ మిత్రవింద అవతారంలో  కాజల్ లాంటి అందగత్తె ఉంది కాబట్టే అంతగా రెచ్చిపోయాడు చెర్రీ. అలాంటి ముద్దుగుమ్మ ఉంటే వందమందితో ఏంటి?  రెండొందల మందితో కూడా ఫైట్ చేస్తాడు హీరో. ఇప్పుడు రామ్ చరణ్ లాగే ఆయన తండ్రి చిరు కూడా ఎంతమందితో నైనా ఫైట్ చేయడానికి రెడీ అంటున్నాడు. ఎందుకంటే ఆయన పక్కన ఉన్నది కూడా కాజలే మరి.  ఇక్కడ మిత్రవిందని మించిపోయే అందంతో ముస్తాబైంది కాజల్. కావాలంటే మీరే చూడండి. 

ఎక్కడ ఏ అందాన్ని ఎలా ప్రదర్శించాలో అలానే చేస్తోంది. లెక్క మాత్రం తప్పడం లేదు. అన్నట్టు కాజల్ ని అంతా ఓ ముదురు భామ కింద పరిగణిస్తుంటారు కానీ... ఆమె సోయగాలు చూస్తే మాత్రం  కొత్త భామలకి ధీటుగా ఉందన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. లేలేత సోకులతో ఎంత సుకుమారంగా - సున్నితంగా కనిపిస్తుందో మీరే చూడండి.  ఖైదీ నెంబర్ 150 సెట్లో కాజల్ చేస్తున్న సందడే ఇదంతా. ఈ సినిమాలో ఆమె మరింత అదిరిపోయే అందంతో కనిపించబోతోందని ఆ  యూనిట్టే చెబుతోంది.