Showing posts with label Allu Arjun. Show all posts
Showing posts with label Allu Arjun. Show all posts

22/11/2016

అల్లు అర్జున్ కు కూతురు పుట్టింది

ఈ సంవత్సరం జూలై నెలలో స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ భలే ప్రకటన ఒకటి చేశాడు. కడుపుతో ఉన్న తన భార్య స్నేహా రెడ్డి ఫోటో ఒకటి నెట్లో పెట్టాడు. పైగా స్నేహ కడుపును తన కొడుకు అయాన్ కిస్ చేస్తున్నప్పుడు తీసిన ఆ ఫోటో అసలు అభిమానుల్లో భలే గమ్మత్తయిన ఫీలింగ్ తీసుకొచ్చింది. ఇక అందరూ బన్నీ ఎప్పుడు ఎక్సయిటింగ్ న్యూస్ చెబుతాడా అంటూ ఎదురు చూస్తున్నారు. 

ఆ సమయం రానే వచ్చింది. అల్లు అర్జున్ కు ఈ సోమవారం సాయత్రం పండంటి కూతురు పుట్టినట్లు తెలుస్తోంది. ''నాకు కూతురు పుట్టింది. చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఒక కొడుకు.. ఒక కూతురు.. ఇంతకంటే ఏమీ అడుగను. మీ అందరూ నాకు విషెస్ చెప్పినందుకు థ్యాంక్స్. నేను చాలా అదృష్టవంతుడిని'' అంటూ ట్వీటేసి తన ఆనందాన్ని పంచుకున్నాడు అల్లు అర్జున్. 

కంగ్రాట్స్ బన్నీ అండ్ స్నేహ. అలాగే అల్లూ ఫ్యామిలీకి కూడా విషెస్ చెబుదాం!!

22/09/2016

టాప్5లో బన్నీకి చోటు లేదనే లెక్కలు కరెక్ట్ కాదు

బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన సరైనోడు మూవీతో.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇండస్ట్రీ టాప్-5 లోకి ఎంటర్ అయిన సంగతి తెలిసిందే. కానీ రీసెంట్ గా జనతా గ్యారేజ్ తో జూనియర్ ఎన్టీఆర్ భారీ బ్లాక్ బస్టర్ కొట్టడంతో.. ఈ లిస్ట్ లో బన్నీ సినిమాకి ప్లేస్ పోయిందనే టాక్ వినిపిస్తోంది. కానీ.. ఇందులో వాస్తవం లేదు. 

బాలీవుడ్.. కోలీవుడ్ మాదిరిగా గ్రాస్ కలెక్షన్స్ తో కాకుండా.. తెలుగు సినిమాల లెక్కలన్నీ షేర్ చుట్టూనే సాగుతాయి. డబ్బింగ్ వెర్షన్స్ తో కలిపి వరల్డ్ వైడ్ గా అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల లెక్కలు చూస్తూ.. మొదట బాహుబలి (302.3 కోట్లు) ఉంటుంది. ఆ తర్వాతి స్థానాల్లో శ్రీమంతుడు (85.2 కోట్లు).. మగధీర (83 కోట్లు).. జనతా గ్యారేజ్ (77.56 కోట్లు).. సరైనోడు (76 కోట్లు)ను వసూలు చేశాయి. అంటే.. బన్నీ సినిమా ఈ లిస్ట్ లో టాప్ 5లో ఉందన్నమాట. ఇక్కడ అత్తారింటికి దారేదికి టాప్5 లో చోటు దక్కలేదు. అంతే కాదు.. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక షేర్ వసూలు చేసిన సినిమాల్లో అయితే.. బన్నీ ప్లేస్ ఇంకా మెరుగ్గానే ఉంది. 

ఏపీ-తెలంగాణల వరకు అత్యధిక షేర్ ను సాధించిన లిస్ట్ లో బాహుబలి (113.75 కోట్లు) ఫస్ట్ ప్లేస్ లో ఉండగా.. సరైనోడు (60.80 కోట్లు) రెండో స్థానంలో ఉండడం విశేషం. ఇక మగధీర (61.60 కోట్లు).. శ్రీమంతుడు(60.17 కోట్లు).. అత్తారింటికి దారేది (58.87 కోట్లు)  టాప్5లో మిగిలిన స్థానాల్లో ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో బన్నీ క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో ఈ వసూళ్లు చూస్తే అర్ధమవుతుంది. ఈ లిస్ట్ లో అయితే.. జనతా గ్యారేజ్ (57.46 కోట్లు) టాప్5లో చోటు దక్కలేదు. ఈ లెక్కన టాప్5లో బన్నీకి చోటు లేదనే లెక్కలు కరెక్ట్ కాదు కదా.

18/09/2016

బన్నీ సినిమాలో చిరు గెస్ట్ రోల్?

శాండల్ వుడ్ లో ఉన్న రెబెల్ స్టార్.. పవర్ స్టార్ ల సంగతి ఇప్పుడు చెప్పుకుందాం. రెబెల్ స్టార్ అంబరీష్.. పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ లు కలిసి ఓ సినిమా చేశారు. 'దొడ్డమానే హడ్గ' పేరుతో ఓ చిత్రం రూపొందింది. సెప్టెంబర్ 30న ఈ చిత్రం విడుదల కానుండగా.. ఇప్పటికే ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. 

పునీత్ రాజ్ కుమార్ పాత్రలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అయితే.. సరిగ్గా సరిపోతాడని భావిస్తున్నారట. ఇప్పటికే బన్నీకి ఆఫర్ పంపగా.. పరిశీలనలో ఉందని టాక్. అయితే.. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. కన్నడలో అంబరీష్ చేసిన పాత్రను.. తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో చేయించాలని చూస్తున్నారట. ఇది సాధ్యమో కాదో ఇప్పుడే చెప్పలేం కానీ.. ఒక వేళ సాధ్యమయితే మాత్రం.. తెలుగు మల్టీ స్టారర్  హిస్టరీలో కొత్త శకం స్టార్ట్ అయినట్లే. 

కాన్సెప్ట్.. ప్రాజెక్ట్ బాగానే ఉన్నా.. రిజల్ట్ కోసం టాలీవుడ్ ఎదురుచూస్తోంది. ఒకవేళ సినిమా సక్సెస్ అయితే.. టాలీవుడ్ నుంచి భారీ ఆఫర్స్ వెళ్లే ఛాన్సులు పుష్కలంగా ఉన్నాయి. మరి రెబెల్ స్టార్ రోల్ లో మెగాస్టార్.. పవర్ స్టార్ పాత్రలో స్టైలిష్ స్టార్ ని చూసే అవకాశం ఇస్తారో లేదో !

08/09/2016

బన్నీ కోసం పూజ తప్పేలా లేదు

కొత్త హీరోయిన్ను రంగంలోకి దించాలనే స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కోరిక. కాని తాను రాసుకున్న దువ్వాడ జగన్నాథమ్ క్యారెక్టర్ పలానా హీరోయిన్నుతో రొమాన్స్ చేస్తేనే సీను బాగా పండుతుందని దర్శకుడు హరీశ్ శంకర్ ఎప్పుడో రాసి పెట్టుకున్నాడట. ఇప్పుడు ఫిలిం నగర్లో వినిపిస్తున్న ఈ కొత్త రూమర్ ఓసారి వినుకుందాం లగెత్తండి.

నిజానికి ఏ హీరోయిన్ కూడా ఫైనల్ కాలేదని ఆల్రెడీ ప్రొడక్షన్ హౌస్ క్లారిటీ ఇచ్చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు తొలుత మాత్రం వరుణ్ తేజ్ సరసన ముకుంద సినిమాలో నటించిన పూజా హెగ్డే హీరోయిన్ అనుకున్నారులే. కాని తరువాత ఆమె పేరు వినిపించలేదు. పైగా మొహంజొదారో సినిమా ఊపులో ఉన్న పూజ కూడా బాగానే కథలు చెప్పిందట. కాని ఇప్పుడు ఆమె కూడా ఈ ఆఫర్ వస్తే బాగుండని ఎదరు చూస్తుండటంతో.. ఆమెతోనే చేద్దామని హరీశ్ శంకర్ కాస్త గాట్టిగానే పూజ చేస్తున్నాడట. 

ఇకపోతే గతంలో స్కిన్ షో వంటి అంశాలలో తెగ ఆంక్షలు విధించిన పూజా హెగ్డే.. ఇప్పుడు డిజాష్టర్ మూవీ మొహంజొదారో సినిమాలో ఆ రేంజులో రెచ్చిపోయి అందాలు ఆరబోసిన తరువాత.. మరి తెలుగులో ఆంక్షలు పెడతానంటే మనోళ్ళు ఒప్పుకుంటారా? లెటజ్ సీ. 

07/09/2016

దువ్వాడ వెళ్లే హీరోయిన్ తేలలేదింకా

సరైనోడు అంటూ తన రేంజ్ కి సరైన సక్సెస్ సాధించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త మూవీ మొదలుపెట్టేస్తున్నాడు. డైరెక్టర్ పేరు అనౌన్స్ చేయడం ఆలస్యం అయింది కానీ.. అక్కడి నుంచి వరుసగా అప్ డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఒక్కసారిగా టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేసి దర్శకుడు హరీష్ శంకర్ చిన్నపాటి షాక్ నే ఇచ్చినా.. ఓ విషయం దగ్గర మాత్రం ఈ స్పీడ్ ఆగిపోయింది. 

బన్నీ పక్కన నటించబోయే హీరోయిన్ ఎవరా అన్న పాయింట్ మాత్రం తేలడం లేదు. ఇప్పటికే పలువురి పేర్లు వినిపించాయి కూడా. మొదట టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ అని.. ఆ తర్వాత కృష్ణగాడి హీరోయిన్ మెహ్రీన్ కౌర్ పీర్జాడాని ఓకే చేశారని వార్తలొచ్చాయి. అయితే.. హీరోయిన్ ని మాత్రం దువ్వాడ జగన్నాథం యూనిట్ ఇంకా ఫైనలైజ్ చేయలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఓ హీరోయిన్ తో హరీష్ శంకర్ చర్చలు జరుపుతున్నాడని తెలుస్తోంది. తను అడిగినన్ని డేట్స్ ఇచ్చే హీరోయిన్ కావాలన్నది దర్శకుడి కండిషన్ అనుకుంటున్నారు. 

దిల్ రాజు బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా.. దువ్వాడ జగన్నాథం కోసం భారీ బడ్జెట్ నే కేటాయించారని అంటున్నారు. బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ అయాంకా బోస్ ఈ మూవీకి పని చేయనుండగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించే దువ్వాడ జగన్నాథం.. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఆ సమయాని కల్లా హీరోయిన్ ని ఫైనలైజ్ చేస్తారట. 

05/09/2016

హాంకాంగ్ టు హైద్రాబాద్.. బన్నీ ఫోకస్

డీజే.. దువ్వాడ జగన్నాథం అంటూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా స్టార్ట్ చేసేస్తున్నాడు. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రం కోసం ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపు పూర్తయిపోయాయి. అనౌన్స్ మెంట్ అయితే తాజాగానే వచ్చింది కానీ.. నిర్మాత దిల్ రాజు- దర్శకుడు హరీష్ శంకర్ ల దగ్గర కన్ఫర్మేషన్ ముందు నుంచే ఉందిట. 

డీజేకు సంబంధించిన మెజారిటీ షూటింగ్ పార్ట్ అంతా హైద్రాబాద్- హాంకాంగ్ లలోనే జరుగనుందని అంటున్నారు. సినిమాలో హాంగ్ కాంగ్ కి సంబంధించిన సీన్స్ కాస్త తక్కువగా ఉన్నా.. స్టోరీ బేస్ అంతా అక్కడి నుంచే ఉంటుందని.. అక్కడ తీయబోయే సీన్స్ మూవీకి చాలా ఇంపార్టెంట్ అని తెలుస్తోంది. ఇక హైద్రాబాద్ లో ఎక్కువ భాగం షూట్ చేసి.. పాటల కోసం విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేయబోతున్నారట. 

ఇప్పటికే పలువురు హీరోయిన్లను పరిశీలించిన దువ్వాడ జగన్నాథం అండ్ టీం.. ఇప్పుడు కృష్ణగాడి వీరప్రేమగాధ హీరోయిన్ మెహ్రీన్ కౌర్ ని ఫైనల్ చేశారనే టాక్ ఉంది. దిల్ రాజు ఈ సినిమాకి నిర్మాత కాగా.. బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ అయానకా బోస్ ను టాలీవుడ్ కి తీసుకొస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ అందించనున్న ట్యూన్స్.. బన్నీ సినిమాలకు ఎప్పుడూ ప్రత్యేకమే.

04/09/2016

అల్లు అర్జున్ అతడికి చాన్స్ ఇస్తున్నాడు

రచయిత వక్కంతం వంశీ కి దర్శకుడిగా చాన్స్ ఇస్తానని ఎన్టీఆర్ ఎప్పటి నుండో అంటున్నాడు కానీ ఆ చాన్స్ అయితే ఇవ్వడం లేదు , ఇటీవలే చాన్స్ ఇస్తానని చెప్పడమే కాకుండా అన్న బ్యానర్ అయిన ఎన్టీఆర్ ఆర్ట్స్ లో ఆ సినిమా చేయనున్నాడు అని వినిపించింది కట్ చేస్తే ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్ కి వెళ్ళింది . దాంతో తన దగ్గర ఉన్న మరో కథతో అల్లు అర్జున్ దగ్గరకు వెళ్ళాడట వక్కంతం ఇంకేముంది కథ విన్న వెంటనే మనం సినిమా చేస్తున్నాం అని చెప్పడమే కాకుండా సొంత బ్యానర్ లో చేయడానికి కూడా రెడీ అయ్యాడట అల్లు అర్జున్ . ఎన్టీఆర్ ఇస్తాడనుకున్న చాన్స్ అల్లు అర్జున్ ఇవ్వడంతో చాలా సంతోషంగా ఉన్నాడట వక్కంతం . ఈ సంవత్సరం లోనే ఆ సినిమా సెట్స్ మీదకు వెల్లనుందట.

Allu Arjun's Wife turns Businesswoman

The name of Sneha Reddy, the wife of stylish star Allu Arjun has been added in the list of entrepreneur. There are number of star wives who help  in their husband’s work. The best example of this is Namrata, the wife of Superstar Mahesh Babu, who helps Mahesh during the promotion of his movies. Now  Sneha Reddy has also joined the the business bandwagon.  Allu Arjun posted on the wall of twitter,” PICABOO! A Start up by my wife Allu Sneha Reddy, a photo studio creating great pictures & memories for everyone.” Currently the couple are waiting for the arrival of their baby as Sneha is pregnant. Studio Pic A Boo is a Hyderabad based photo studio specializing in Maternity, Newborn & Kids Photography. Most of the photo shoot of Allu Ayaan , the son of Allu Arjun and Sheha were shot by Sneha Reddy’s Pic A Boo Studio.

29/08/2016

"Pockets should fill without hard work" -Bunny

"World should flourish. Our pockets should get filled without doing hard work. Everyone should be happy", said Allu Arjun today, at the launch of his new film. Did he really mean it??

Of course, Allu Arjun is said to have uttered the lines from his new film that is being directed by Harish Shankar. Titled "DJ- Duvvada Jagannadham", the film got launched today by VV Vinayak and Allu Arvind. Seems like these lines uttered by Bunny actually reveal the characterisation of the hero. 

Writing smart lines and exaggerated characterisations for heroes is one benchmark Harish Shankar is following from a while. Seems like the bill fitted Bunny very well. 

28/08/2016

Allu Arjun’s next gets a title

123telugu had already reported that Harish Shankar has teamed with Allu Arjun. The film is going to be produced by DIl Raju and the title has been officially announced today.

This out-and-out mass entertainer has been titled DJ – Duvvada Jagannadham. The film is going to showcase the Stylish Star in a completely new light and the dialogues written by Harish Shankar are going to be one of the highlights of this flick.

Meanwhile, the film will be launched formally tomorrow. Pooja Hedge is expected to be the leading lady.

Allu Arjun and Harish film to roll tomorrow

After scoring a blockbuster hit of 76 crores share with "Sarrainodu", hero Allu Arjun hasn't taken a call yet on his next film. But here comes the major announcement. 

Finally director Harish Shankar of Gabbar Singh fame has come up with another interesting story after delivering a film like Subramanyam For Sale recently. He has carved out interesting story and then wrote fantastic dialogues for it. 

Tomorrow at 7.45am, muhurat event of Bunny and Harish's film will be held. None other than Dil Raju is the producer of the film, while a heroine is yet to be finalised and announced. 

22/08/2016

Bunny rocks with Mutamestri dialogue

On this ocassion, Bunny's speech is just limited to couple of lines, but he created impact. "Star star Megastar, Boss is back" is what the stylish hero said, adding, "Many heroes on this earth don't get to celebrate their birthday with such amazing fan presence. Chiranjeevi garu is lucky in that aspect and I thank you on his behalf". 

Later he has said a dialogue from Chiranjeevi's Mutamestri "Bottu pettukoni Hinduvuni.. Topi pettani Muslim ni.. Siluva veyyani Christian ni.. Total ga.. ee petaku neney Mestrini.. Muta Mestrini", kicking crowds into jubilation. 

20/08/2016

Allu Arjun thanks Dubai people

There is no limit for the joy of Stylish Star Allu Arjun whose extended Malayalam fanbase has honoured him last night. Actually he is being awards Pravasi Ratna Puraskaram by a popular entertainment channel, which we revealed already. 

"Thank you Malayali's of Dubai for honouring me " PRAVASI RATNA PURASKARAM " Truly Honoured" said Bunny, after receiving the award at the city of Emirates last night. Actually Malayalam based Asianet Middle-East entertainment channel has awarded this to Bunny for his contribution towards Mallu films with his dubbed Telugu movies. 

Definitely this is a great going for Bunny as this is one such first award for a Telugu star to receive. 

19/08/2016

 Allu Arjun cameo in Charan’s Dhruva

If ongoing buzz in media and film industry  is to be believed, Stylish star Allu Arjun has been roped  for the upcoming drama “Dhruva”, in which  Mega actor Ram Charan and Rakul Preet Singh are playing the lead role. The movie is being directed by Surender Reddy. It is an official remake of Tamil hit movie “Thani Oruvan” starring Jayam Ravi. 

 

Bunny will play the role of special cameo. Ram Charan and Bunny are very close and shares good rapport. Earlier both have worked together for the movie “Yevadu", directed by vamsi Paidipally and now once again both are teaming up for this upcoming drama.

The movie is produced by Allu Arvind  under the banner of Geetha Arts and the music is scored by Hip Hop Tamizha .It is set to hit the theaters on 7th October 2016.

'Pravasi Ratna Puraskaram' for Allu Arjun

In what could be seen as a stunner, stylish hero Allu Arjun will be taking home a 'Pravasi Ratna Puraskaram' soon. 

Malayalam TV Channel Asianet is so smitten by Bunny that they want to praise him for entertaining them with his Telugu films which are dubbed into Malayalam all the time. And this time, their Middle East channel will be awarding 'Pravasi Ratna Puraskaram' to Allu Arjun. He will honored with this title on August 19th if reports are to be believed. 

Actually Bunny is also overwhelmed with this honour as for a first time a Telugu actor went all the way to Malayalam and rocked there. Congrats Allu Arjun. 

18/08/2016

బన్నీకి 'ప్రవసి రత్న' అనే బిరుదు

ఏసియానెట్ అనే మలయాళం ఛానల్ వారు ఇప్పడు అల్లు అర్జున్ అంటే తమకు ఎంత ప్రేమో చూపించనున్నారు. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ దేశాల్లో అవార్డుల ఫంక్షన్లతో సందడి చేసే ఈ ఛానల్ వారి మిడిల్ ఈస్ట్ వింగ్.. ఇప్పుడు బన్నీ కోసం ఒక పురస్కారం అందిస్తున్నారు. 

తన తెలుగు సినిమాలను మలయాళంలో డబ్బింగ్ చేస్తూ.. అక్కడ కూడా అపారమైన క్రేజ్ సంపాదిస్తూ.. అల్లు అర్జున్ కాదు మల్లూ అర్జున్ అనే రేంజులో పేరు సంపాదించుకున్న ఈ యువ హీరోకు.. ఇప్పుడు ''ప్రవసి రత్న పురస్కారం'' అనే బిరుదును సదరు ఛానల్ వారు ప్రధానం చేయనున్నారు. మలయాళంలో ఇతగాడి సినిమాలు ఆడుతున్నతీరు.. దానిక ప్రేక్షకుల నుండి వస్తున్న ఆదరణ.. అవన్నీ కలిపి ఈ అవార్డు రావడానికి కారణం అయ్యాయట. మొత్తానికి ఒక తెలుగు హీరో అక్కడికి వెళ్ళి ఇలాంటి పురస్కారం కూడా పొందుతున్నాడంటే.. అది టాలీవుడ్ కు కూడా గర్వకారణమే.

అయితే ఆ మధ్యన సరైనోడు మలయాళీ వర్షెన్ ను ప్రమోట్ చేస్తూ.. త్వరలోనే ఒక తెలుగు-మలయాళం బైలింగువల్ చేస్తానని చెప్పాడు బన్నీ. ఇలాంటి పురస్కారం అందుకున్న తరువాత అయినా అలాంటి సినిమా చేయకపోతే బాగోదు మరి. అందుకే వెంటనే మనోడు స్ర్టయిట్ మలయాళీ ఫిలిం ఒకటి చేయాలని కోరుకుందాం. 

29/07/2016

బన్నీకి ఇష్టమైన ఇతర హీరోలు..

అల్లు అర్జున్ అంటే స్టయిలిష్ స్టార్ అని తెలిసిందే. తెలుగులోనే కాకుండా మలయాళం కూడా మనోడు హిట్టయ్యాడు. ఇప్పుడు సరైనోడు సినిమా కూడా మలయాళంలో బాగా ఆడేసింది. ఈ సందర్భంగా అక్కడి మీడియాతో మాట్లాడిన బన్నీ.. కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేశాడు. తనకు మిలియన్స్ ఆఫ్ ఫ్యాన్స్ ఉన్నారు సరే.. ఇంతకీ మనోడు ఎవరి ఫ్యాన్? అయితే బన్నీ మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని అని ఊరందరికీ తెలుసు.. మరి ఆయన కాకుండా ఇంకెవరి ఫ్యానో తెలుసా? 

నిజానికి బన్నీ ఆల్ టైమ్ ఫేవరేట్ ఎవరంటే.. స్టయిల్ ఐకాన్.. మైఖేల్ జాక్సన్. అందుకే ఫిలిం నగర్లోని తన డ్యాన్సు ప్రాక్టీసింగ్ హాల్లో మనోడు జాక్సన్ ఫోటో మరియు చిరంజీవి ఫోటోలను పెట్టుకున్నాడు. ఇక హాలీవుడ్ లో తనకు ఇష్టమైన నటుడు లియోనార్డో డికాప్రియో అని.. అలాగే హిందిలో ఎప్పటికీ అమిత్ బచ్చన్ సాబ్.. అమీర్ జి.. ఈ మధ్య కాలంలో సల్మాన్ ఖాన్ నచ్చుతున్నాడని తెలియజేశాడు. తమిళంలో అయితే ధనుష్.. విజయ్ సేతుపతి.. బాగా నచ్చేశారట. ఈ మధ్యన విజయ్ కూడా నచ్చుతున్నాడటలే. ఇక తెలుగులో ఫేవరేట్ ఎవరు అని అక్కడి మీడియావారు ఎవ్వరూ అడగలేదు. మరి చిరంజీవి కాకుండా వేరే పేర్లు చెప్పాల్సి వస్తే.. బన్నీ ఏం చెప్పేవాడో. 

ఇదంతా సరే.. ఇంతకీ కొత్త సినిమా ఎప్పుడు ఎవరితో మొదలెడుతున్నావ్ బన్నీ? హరీశ్ శంకర్ తో చేస్తున్నావా లేదంటే విక్రమ్ తో చేస్తున్నావా.. ముందు ఆ విషయం చెప్పు. 

19/07/2016

బన్నీ మళ్లీ మార్చేస్తున్నాడు

ఒకే రకమైన క్యారెక్టర్లు.. ఒకే రకమైన లుక్ తో కనిపిస్తే ఈ రోజుల్లో కష్టం. కథలు మారుతున్నాయి. క్యారెక్టర్లు మారుతున్నాయి. లుక్స్ కూడా మార్చాల్సిందే. అల్లు అర్జున్ గత మూణ్నలుగు సినిమాల్లో ఒక్కోదాంట్లో ఒక్కో రకంగా కనిపించాడు. ‘సన్నాఫ్ సత్యమూర్తి’లో కి.. ‘రుద్రమదేవి’కి.. ‘సరైనోడు’కు.. ఒకదాంతో ఒకదానికి పోలిక ఉండదు. ఇప్పుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయబోయే కొత్త సినిమాలో కూడా లుక్ మార్చేస్తున్నాడట బన్నీ. ‘సరైనోడు’ విడుదలనప్పటి నుంచి బన్నీ గడ్డం పెంచుతున్న సంగతి తెలిసిందే. ‘రుద్రమదేవి’లో గోన గన్నారెడ్డి పాత్ర కోసం పెంచినప్పటి కంటే ఇప్పుడు ఎక్కువ గడ్డంతో కనిపిస్తున్నాడు. 

బహుశా తన కొత్త సినిమాలో బన్నీ గడ్డంతోనే కనిపించవచ్చని అంటున్నారు. ‘రుద్రమదేవి’లో బన్నీ చేసింది ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ కాదు. హరీష్ దర్శకత్వంలో పూర్తిగా సినిమా అంతా గడ్డంతో కనిపించే అవకాశముంది. ఈ గడ్డంతో ప్రయోగాలు చేసి.. స్టైలింగ్ తర్వాత ఓ లుక్ ఫైనలైజ్ చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా కోసం ప్రి ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయట. స్క్రిప్టు ఆల్రెడీ ఫైనల్ స్టేజ్ కు వచ్చేసినట్లు సమాచారం. సెప్టెంబర్లో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్తుంది. ఇంకా హీరోయిన్ సంగతి తేలాల్సి ఉంది. ఇంతకుముందు బన్నీతో ఆర్య.. పరుగు సినిమాలు తీసిన దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్న సంగతి తెలిసిందే.

07/07/2016

మళ్లీ పాలసీని బ్రేక్ చేస్తున్న బన్నీ

తన కెరియర్ లో కేవలం మాజీ వైఫ్ రేణు దేశాయ్ తో మాత్రమే రెండోసారి నటించాడు పవన్ కళ్యాణ్. ఇన్నేళ్ళ కెరియర్ లో ఏ హీరోయిన్ ను కూడా ఆయన రెండోసారి రిపీట్ చేయలేదు. ఇక అదే పద్దతిలో దంచేస్తున్నాడు మరో మెగా హీరో అల్లు అర్జున్. కాని మొన్ననే బోయపాటి శ్రీను ఫోర్సు చేయడం కారణంగానే సరైనోడు సినిమాలో క్యాథరీన్ త్రెసాను తీసుకున్నాడట. అప్పటికే రుద్రమదేవి లో ఓసారి ఆమెతో కలసి నటించేశాడు కూడా. అయితే క్యాథరీన్ కోసమే బ్రేక్ చేసిన ఈ నో-రిపీట్ పాలసీని ఇప్పుడు మళ్ళీ బ్రేక్ చేస్తున్నాడా? అంటే అవుననే అంటున్నారు. 

ఇప్పటికే తనతో గబ్బర్ సింగ్ సినిమాలో నటించిన శృతి హాసన్ తో రెండోసారి పనిచేద్దాం అని ఫిక్సయిన పవన్.. ఆమెను ఎస్.జె.సూర్య సినిమాలోకి హీరోయిన్ గా తీసుకున్నాడు. మరి డైరక్టర్ ను మార్చాడు కాబట్టి హీరోయిన్ ను కూడా మారుస్తాడేమో తెలియదు కాని.. ఇదంతా చూసి బన్నీ కూడా ఇన్ స్పయిర్ అయినట్లు అనిపిస్తోంది. రేసుగుర్రం సినిమాలో తనతో హిట్ జోడీగా నటించిన శృతి హాసన్ తో రెండోసారి పని చేద్దాం అని ఫిక్సయ్యాడటలే. త్వరలో హరీశ్ శంకర్ డైరక్షన్ లో చేయబోయే సినిమా కోసం.. శృతిని శృతిచేస్తున్నట్లు టాక్.

ఇప్పటికే శృతి హాసన్.. హరీశ్ శంకర్ తో గబ్బర్ సింగ్ - బన్నీతో రేసుగుర్రం వంటి సాలిడ్ హిట్లు కొట్టింది కాబట్టి.. ఇప్పుడు తన పాలసీని బ్రేక్ చేస్తున్న తరుణంలో ఈ మెగా హీరోకు మరింత పెద్ద హిట్టిస్తుంది అని ఫీలవుతున్నారు ఫ్యాన్స్. అది సంగతి. 

02/07/2016

అల్లు అర్జున్ స్టేజీ మీద స్టెప్పేస్తే..

చాలాసార్లు ఇక్కడ టాలీవుడ్ లో స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ స్టేజీ మీద స్టెప్పులు వేశాడులే. అసలే మనోడు టాప్ డ్యాన్సర్లలో ఒకడు కాబట్టి.. ఖచ్చితంగా ఉర్రూతలూగించేస్తాడు. అయితే సడన్ గా ఎవరైనా పిలిచి ఓ నాలుగు స్టెప్పులు వేయి నాయనా అంటే మనోడు కనక్ట్ అవుతాడా? అయిపోయాడంతే. 

గత రాత్రి జరిగిన సైమా 2016 అవార్డుల 2వ రోజు వేడుకలో.. తమిళ మరియు మలయాళ పరిశ్రమలకు అవార్డులు అందించారు. తొలిరోజున ఎలాగైతే సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ రచ్చ లేపేశాడో.. రెండో రోజు అదే జోష్ తో అనిరుథ్ కూడా చంపేశాడు. ఒక్కసారిగా మనోడి మెలోడీలకూ.. బీభత్సమైన స్ర్టింగ్ మ్యూజిక్ కు ఆడిటోరియమ్ ఉర్రూతలూగిపోయింది. సరిగ్గా అదే సమయంలో ఇలాంటి బెస్టు పాటలకు బెస్టు డ్యాన్సర్ తోడవ్వాలి అనుకున్నాడేమో తెలియదు కాని.. క్రిందకు వెళ్ళి బన్నీ ను పైకి లాక్కొచ్చేశాడు కొలవెరి కుర్రాడు. వెంటనే ఓ రెండు పాటలకు స్టెప్పులు వేయించాడు. 

బన్నీ ఏమన్నా తగ్గుతాడా.. మనోడు కూడా అనిరుద్ ఊహించిన రేంజులోనే చంపేశాడు. తను అలా మూమెంట్లు చేస్తూ ఉంటే.. క్రింద కూర్చున్న సెల్రబిటీలందరూ ఉర్రూతలూగిపోయారు అనుకోండి. ఏదేమైనా బన్నీ లాంటి ఎనర్జెటిక్ డ్యాన్సర్లు స్టేజీ మీద సినిమా చూపిస్తుంటే ఆ కిక్కేవేరబ్బా!!