Showing posts with label Ram Charan. Show all posts
Showing posts with label Ram Charan. Show all posts

23/11/2016

ధృవ ట్రైలర్ గురించి చెప్పేసిన గీత

రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ధృవ.. రిలీజ్ కి రెడీ అయిపోయిన విషయం తెలిసిందే. ఇప్పటికే సెన్సార్ కూడా కంప్లీట్ చేసేసుకుని యూ/ఏ సర్టిఫికేట్ సంపాదించేసింది ధృవ. డిసెంబర్ 9న విడుదల అంటూ సోషల్ మీడియా సాక్షిగా మెగా పవర్ స్టార్ చెప్పేశాడు కూడా. 

అయితే.. నవంబర్ ప్రారంభంలోనే సాంగ్ ప్రోమోస్ ను వరుసగా ఇస్తూ హంగామా చేసిన ధృవ.. ఆ తర్వాత స్లో అయిపోయాడు. ఈ లోగా దేశవ్యాప్తంగా పెద్ద నోట్ల రద్దు వ్యవహారం సీరియస్ అవడం.. ధృవ రిలీజ్ డేట్ పై సందిగ్ధత నెలకొనడంతో.. ప్రమోషన్స్ విషయంలో గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు మూవీ రిలీజ్ డేట్ కన్ఫాం కావడంతో.. థియేట్రికల్ ట్రైలర్ విడుదలకు ముహూర్తం పెట్టేశాడు రామ్ చరణ్. ఈ నెల 25న సాయంత్రం 7 గంటలకు.. ధృవ థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేయనున్నట్లు.. కన్ఫామ్ చేశారు గీతా ఆర్ట్స్ వారు. అదే విషయాన్ని చెర్రీ కూడా చెప్పాడులే.

ధృవ ట్రైలర్ లాంఛ్ తర్వాత.. ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మూవీకి సంబంధించిన మొత్తం యూనిట్ పాల్గొననుండగా.. అక్కడి నుంచి ప్రచార కార్యక్రమాలను ప్రారంభించి.. రిలీజ్ వరకూ పీక్ స్టేజ్ లో కొనసాగించనున్నారు. చెర్రీతో పాటు.. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. విలన్ అరవింద్ స్వామి.. దర్శకుడు సురేందర్ రెడ్డి.. సంగీత దర్శకుడు హిప్ హాప్ తమీజాలు కూడా ప్రమోషనల్ యాక్టివిటీస్ లో పాల్గొనేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

17/09/2016

చెర్రీపై ప్రేమను చేతిలోనే దాచుకున్న చిరు

ఆడియన్స్ ను మెస్మరైజ్ చేయడంలో మెగాస్టార్ చిరంజీవి ట్యాలెంట్ ఎలాందిదో ప్రత్యేకంగా చెబితే మహా కామెడీగా ఉంటుంది. ఇలాంటివి సిల్వర్ స్క్రీన్ మీద చూసేయబట్టే.. ఇన్ని కోట్ల మంది అభిమానులను సంపాదించుకోగలిగారు. అలాగే ఏదైనా ఫంక్షన్ లోనో.. ఎవరి గురించి అయినా చెప్పాలంటేనో.. చిరు మాటలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. చెడును పూర్తిగా వదిలేసి.. మంచి మాత్రమే పైకి చెబుతూ మనస్ఫూర్తిగా ప్రశంసించగలగడం అనే విద్య అందరికీ అబ్బేది కాదు. అది చిరంజీవికి మాత్రమే సొంతం. అందుకే ఆయన ఆ స్థాయిలో ఉంటారు. 

మరి ఆయన పర్సనల్ గా చిరంజీవి ఇష్టాలు ఎలా ఉంటాయి? ఇది కాసింత టిపికల్ క్వశ్చన్ అయినా.. ఆన్సర్ దొరికే ఛాన్స్ చిరునే ఇచ్చారు. రీసెంట్ గా శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించిన నిర్మలా కాన్వెంట్ మూవీ ప్రత్యేక ప్రదర్శనకు చిరంజీవి హాజరయ్యారు. శ్రీకాంత్ తన తమ్ముడు అని చెప్పే చిరు ఇక్కడ కనిపించడంలో వింత లేదు కానీ.. ఆయన చేతిలో ఉన్న మొబైల్ లోనే అసలు కథంతా ఉంది. చిరంజీవి చేతిలో పట్టుకున్న ఫోన్ కి బ్యాక్ కవర్ లో.. చరణ్ ని చిరంజీవి ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని పట్టుకుని ఉన్న ఫోటో ప్రింట్ చేసి ఉంది.

తండ్రీ కొడుకుల అనుబంధం చెప్పేందుకు ఇంతకంటే పెద్ద ఎగ్జాంపుల్ అవసరం లేదు. చేతిలో ఎప్పుడూ ఉండే ఫోన్ లోనే కొడుకుతో అనుబంధాన్ని దాచుకున్నారంటే.. ఆ తండ్రి మనసులో మరెంత ఉంటుందో ఊహించడం కష్టమే!

15/09/2016

చిరు కోసం చిరుత త్యాగం

రామ్ చరణ్.. ఈ సారి దసరా సీజన్ మిస్ అయిపోతున్నాడు. దసరా పండక్కి రిలీజ్ అనుకున్న ధృవ.. రావడం లేదని తేలిపోయింది. మరి ధృవ రిలీజ్ ఎప్పుడంటే.. ఇప్పుడు డిసెంబర్ 17 అనే డేట్ వినిపిస్తోంది. కానీ టాప్ లీగ్ లో ఉన్న స్టార్స్ సినిమాలు మన దగ్గర క్రిస్మస్ కి రావడం చాలా అరుదు. ఆ వెంటనే వచ్చే సంక్రాంతి పండుగకే ఎక్కువగా ప్లాన్ చేసుకుంటారు. 

రామ్ చరణ్ కి కూడా సంక్రాంతి బాగానే అచ్చొచ్చింది. టఫ్ కాంపిటీషన్ లో కూడా రెండు సార్లు హిట్ కొట్టాడు. కానీ ధృవను పొంగల్ కి షెడ్యూల్ చేసే ఛాన్స్ హీరో చరణ్ కి లేకపోయింది. ఇందుకు కారణం.. చెర్రీలోని ప్రొడ్యూసర్ కి ఉన్న కమిట్ మెంట్. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి రీలాంఛ్ మూవీ ఖైదీ నెంబర్ 150ని నిర్మిస్తున్న చరణ్.. పొంగల్ ని ఆ సినిమాకి ఇచ్చేశాడు. ఇప్పుడు తన చిత్రాన్ని అక్కడ పెట్టి.. చిరు సినిమాని డిస్టర్బ్ చేసే ఉద్దేశ్యంలో ప్రొడ్యూసర్ చరణ్ లేడు. అలా మెగా పవర్ స్టార్ పై.. ప్రొడ్యూసర్ రామ్ చరణ్ నెగ్గేశాడు. 

డిసెంబర్ మధ్యలో రావడం.. లోకల్ మార్కెట్లో ఎలాగున్నా.. ఓవర్సీస్ మార్కెట్లో అయితే సంచలనాలకు స్కోప్ లేని సీజన్ అది. అందుకే చిరు కోసం చరణ్ పెద్ద త్యాగమే చేశాడని ఇండస్ట్రీ జనాలు అంటున్నారు. 

14/09/2016

చెర్రీలో ఈ ట్యాలెంట్ కూడా ఉందా

రామ్ చరణ్ లో చాలానే ట్యాలెంట్స్ ఉన్నాయనే సంగతి అభిమానులకు బాగానే తెలుసు. డ్యాన్సులు.. ఫైట్లు ఇరగదీసేయడమే కాదు.. హార్స్ రైడింగ్స్- అడ్వంచరస్ బైక్ డ్రైవింగ్ లాంటివి మనోడు ఇరగదీసేస్తాడు. ఇన్ని కళలు ఉన్న చెర్రీ.. ఇప్పుడు మెగాస్టార్ 150వ సినిమా.. ఖైదీ నెంబర్ 150తో ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేసేశాడు. 

ఈ మెగా మూవీకి రామ్ చరణ్ తో పాటు వాళ్ల అమ్మ సురేఖ కూడా నిర్మాతే. సెట్స్ లో ఈ ప్రొడ్యూసర్స్ ఇద్దరూ రీసెంట్ గా హంగామా చేశారు. లీజర్ టైమ్ లో.. చెర్రీ తన లోని మరో ట్యాలెంట్ ని బయటపెట్టాడు. ఓ చిన్నారిని ఎదురుగా నుంచో బెట్టి.. తన ఫేస్ ని స్కెచ్ వేసేశాడు చరణ్. ఈ డ్రాయింగ్ ని కాసింత క్లోజప్ లోంచి కూడా చూపించారు కాబట్టి.. చరణ్ ట్యాలెంట్ ఈజీగానే అర్ధమైపోతుంది. 

'చెర్రీలో దాగి ఉన్న ట్యాలెంట్ ని చూశారా.. ఖైదీ నెం 150 సెట్స్ లో లైవ్ స్కెచింగ్ సెషన్' అంటూ కొణిదెల ప్రొడక్షన్స్ స్వయంగా ఓ వీడియోను రిలీజ్ చేయగా.. ఇందులో చరణ స్కెచ్ లు వేయడం.. పక్కన ఉన్న వాళ్ల అమ్మ ఆ పేపర్ ని చూసి మనసారా నవ్వేయడం గమనించచ్చు. మొత్తానికి చరణ్ లో ఉన్న మరో ట్యాలెంట్ ఇలా బయటకొచ్చింది. చరణ్ లో మరెన్ని ట్యాలెంట్స్ ఉన్నాయో?

12/09/2016

మళ్లీ తెరపైకి చెర్రీ.. మణిరత్నం సినిమా

రామ్ చరణ్ కథానాయకుడిగా మణిరత్నం దర్శకత్వంలో సినిమా తెరకెక్కబోతోందన్న విషయం ఎప్పట్నుంచో ప్రచారంలో ఉంది. ఆ మధ్య మణిరత్నం తన భార్య సుహాసినితో కలిసి  హైదరాబాద్ కి వచ్చి  చిరు ఇంట్లో కథా చర్చలు సాగించినట్టు వార్తలొచ్చాయి. అది రామ్ చరణ్ తో సినిమాకోసమేనట.  అయితే ఏమైందో ఏంటో కానీ... ఆ కాంబినేషన్ లో సినిమా కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం కార్తీతో ఓ సినిమా చేస్తున్నాడు మణి. ఓ పైలట్ ప్రేమకథతో తెరకెక్కుతున్న సినిమా అది. శరవేగంగా షూటింగ్ జరుగుతున్నట్టు సమాచారం. 

అయితే ఇదివరకటిలాగా కాకుండా మణిరత్నం ఓ సినిమా సెట్స్ పై ఉండగానో తదుపరి చేయనున్న మరో చిత్రం గురించి కసరత్తులు షురూ చేసినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే రామ్ చరణ్ తో సినిమా తెరపైకొచ్చింది. ఇటీవల చెర్రీకి మణి ఓ లైన్ వినిపించినట్టు సమాచారం. మణిరత్నం తనతో సినిమా చేయడమే గ్రేట్ అనుకొంటున్నారు రామ్ చరణ్. సో ఆయన ఒప్పుకోవడం గ్యారెంటీ అనేది పరిశ్రమ వర్గాల మాట. 

బ్లాక్ బస్టర్ సీక్వెల్ లో చెర్రీ చేస్తాడా?

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో బ్లాక్ బస్టర్స్ చాలానే ఉంటాయి. ఖైదీ తర్వాత అన్నింటిలోకి స్పెషల్ గా చెప్పుకునే మూవీస్ లో జగదేకవీరుడు-అతిలోక సుందరి ఫస్ట్ ఉంటుంది. చిరంజీవి రేంజ్ ని కాంపిటీటివ్ హీరోలు అందుకోలేనంత హైట్స్ కి తీసుకెళ్లిన మూవీ ఇది. నిర్మాత అశ్వనీదత్ ఎంతో నమ్మకంతో ఈ సినిమాని తీశాడు. అంతకు మించి లాభాలను కూడా అందుకున్నాడు. 

ఈ జగదేకవీరుడు చిత్రానికి సీక్వెల్ తీయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాడు అశ్వనీదత్. అయితే.. ఇందులో రామ్ చరణ్ మాత్రమే నటించాలన్నది ఆయన కోరిక. ఇప్పటికే పలుమార్లు చరణ్ తో మాట్లాడ్డమే కాదు.. చాలామంది దర్శకులు.. స్టోరీ రైటర్లతో మాట్లాడేశాడు కూడా. ఇటు స్టోరీ దొరకలేదు.. అటు చరణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు కానీ.. ఈయన ఇప్పటికే 'జగదేకవీరుడు' టైటిల్ ని రిజిస్టర్ కూడా చేయించేశాడు. ఇప్పటికీ ఈ సీక్వెల్ ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి.

అయితే.. అటు స్టోరీ ఫైనల్ కాకుండా.. ఇటు డైరెక్టర్ ఎవరో తేలకుండా.. తండ్రి నటించిన బ్లాక్ బస్టర్ సీక్వెల్ లో నటించేందుకు రామ్ చరణ్ ఎలా గ్రీన్ సిగ్నల్ ఇస్తాడన్నదే అసలు పాయింట్. ముందు ఇవి ఫైనల్ అయితే.. అప్పుడు చెర్రీ కూడా ఒక అడుగు ముందుకేసి ధైర్యం చేయచ్చు లేకపోతే ఇలా మాటల దగ్గరే ఏళ్లు గడిచిపోతాయ్.  

10/09/2016

పోలీసులకు 'ధృవ' స్పెషల్ ఇన్విటేషన్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పటివరకూ మేకోవర్ విషయంలో భారీగా ఛేంజ్ ఎప్పుడూ ట్రై చేయలేదు. హెయిర్ స్టైల్ లో మార్పు తప్పితే.. ఈ విషయంలో పెద్దగా ఎఫర్ట్ పెట్టింది కూడా లేదు. అయితే.. రాబోయే మూవీ 'ధృవ' కోసం మాత్రం చెర్రీ చాలానే కష్టపడ్డాడు. ఐపీఎస్ ఆఫీసర్ గా కనిపించే లుక్ ప్లస్ బాడీ లాంగ్వేజ్  కోసం చాలామందినే అప్రోచ్ అయ్యాడు చెర్రీ. 

దసరాకి ధృవ రిలీజ్ కావాల్సి ఉంది కానీ.. షూటింగ్ విషయంలో తొందరపడి క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా ఉండేందుకు వాయిదా వేసేసుకున్నారు. ఎప్పుడు విడుదల చేస్తారనే అంశంపై ఇంకా క్లారిటీ లేదు కానీ.. ఫస్ట్ కాపీ చేతికి రాగానే.. కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ కు స్పెషల్ షో వేయనున్నారట. రెండురాష్ట్రాల నుంచి కొంతమంది పోలీస్ ఉన్నతాధికారులను.. వారి కుటుంబ సభ్యుల కోసమే ఈ ప్రత్యేక ప్రదర్శన ఉంటుందని తెలుస్తోంది. ఇందుకు కారణమేంటో తెలుసా?

రామ్ చరణ్ ధృవను స్టార్ట్ చేసే ముందు చాలామంది పోలీస్ లను కలిశాడు. ఐపీఎస్ అధికారి బిహేవియర్ ఎలా ఉంటుంది.. లుక్ ఎలా ఉండాలి.. వాకింగ్.. టాకింగ్.. ఇలా చాలా విషయాలను దగ్గరుండి మరీ అబ్జర్వ్ చేశాడట. అప్పట్లో తను కలిసినవాళ్లతోపాటు మరింత మందిని కూడా ఈ స్పెషల్ షోకి అహ్వానిస్తోంది చెర్రీ అండ్ టీమ్. ఈ స్పెషల్ షో ఎప్పుడు వేస్తారనే డౌట్ రావడం సహజమే కానీ.. ఇంకా డేట్ ఎవరికీ చెప్పలేదు. జస్ట్ ముందుగా ఇన్వైట్ చేస్తున్నారంతే. 

07/09/2016

ధృవ..'జనతా'ను గ్యారేజ్‌కి నెట్టేసింది!

ఇటీవలి కాలంలో టాలీవుడ్ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన సినిమా జనతా గ్యారేజ్ అనడంతో సందేహం అక్కర్లేదు. టైటిల్ దగ్గర్నుంచి నటీనటుల ఎంపిక, షూటింగ్‌లో వేగం, టీజర్, పాటలు, ట్రైలర్ ఇలా అన్నివిధాలా ఆకట్టుకున్న జనతా గ్యారేజ్ పట్ల అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. సినిమాపై టాక్ ఎలా ఉన్నా.. కలెక్షన్ల వర్షం కురిపిస్తూ ముందుకు దూసుకెళ్తోంది జనతా గ్యారేజ్. అయితే, ఇటువంటి హంగామా ఏమీ లేకుండా, ఇంకా నెగటివ్ ప్రచారంతో విడుదలకు సిద్ధమవుతున్న చిత్రం రామ్ చరణ్ ధృవ. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ సినిమా.. ప్రీ రిలీజ్ బిజినెస్‌లో జనతా గ్యారేజ్‌ను మించిపోవడం.. ఎన్టీఆర్ అభిమానులకే కాక, సినీ వర్గాలకు సైతం షాక్ ఇచ్చింది.

వైజాగ్‌లో జనతా హక్కులు రూ.5.1కోట్లకు అమ్ముడుపోతే... ధృవ రూ.5.4 కొల్లగొట్టింది. మరోవైపు సీడెడ్‌లో సైతం జనతాకు సమానంగా ధృవ రూ.9కోట్ల బిజినెస్ చేసింది. ఎటువంటి అంచనాలు లేని, రిలీజ్‌కు ముందే నెగటివ్ టాక్ ఉన్న ధృవ ప్రీ రిలీజ్ బిజినెస్‌తో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

రిలీజ్‌కు ముందే దాదాపు రూ.50కోట్ల మార్క్ చేరుకునే అవకాశాలున్న ఈ సినిమా కాస్త పాజిటివ్ టాక్ సంపాదిస్తే.. జనతా రికార్డులు గల్లంతవుతాయని టాలీవుడ్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.

'ధృవ' డిసెంబర్ లోకి దూకింది అందుకే

ఇప్పుడు ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ ఏంటంటే.. అసలు అక్టోబర్ 7న రావల్సిన ''ధృవ'' సినిమా డిసెంబర్ లోకి ఎందుకు దూసుకెళ్లింది? అసలు ఇప్పటివరకు గీతా ఆర్ట్స్ ఇలా పోస్టుపోన్ రూమర్ల మీద ఎందుకు స్పందించలేదు? రామ్ చరణ్ కూడా దసరాకే పండగ అన్నాడు కదా.. సైలెంట్ అయిపోయాడేంటి? ఇలాంటి ప్రశ్నలే మెగాభిమానుల మదిని తొలిచేస్తున్నాయి. 

నిజానికి చాలా టైట్ షెడ్యూల్ లో పనిచేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మెగా ఫ్యాన్స్ కు దసరాకు ''ధృవ'' ట్రీట్ అందించేసి ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ హడావుడి పడిపోయి రిలీజ్ చేయడానికి.. రామ్ చరణ్ సినిమాకు సీజన్ తో పనిలేదు. అలాగే దసరాకు ఎప్పటిలాగానే ఈసారి కూడా చాలా కాంపిటీషన్ ఉంది. పైగా పెద్ద సినిమాల్లో కేవలం జనతా గ్యారేజ్ ఒక్కటే అప్పటికి ధియేటర్లలో ఉంటుంది. అప్పటికే ఈ గ్యారేజ్ విడుదలై చాలా రోజులు అయిపోయి ఉంటుంది కాబట్టి.. ఓ నాలుగైదు సినిమాల కోసం జనం ఎదురుచూస్తుంటారు. కాని ఇలాంటి కాంపిటీషన్లో ఏ స్టార్ హీరో సినిమాను దించినా కూడా.. 50 కోట్లు వసూలు చేయడం గగనం అయిపోతోంది. అందుకే సోలోగా వచ్చి ఒక 80 కోట్ల షేర్ పట్టేయాలని.. సినిమాను డిసెంబర్ మొదటివారానికి చరణ్ అండ్ కో పోస్టుపోన్ చేయించారట. 

ఇప్పటికే హీరోయిన్ రకుల్ ప్రీత్ తో పాటలను షూట్ చేసేశారు. అలాగే అరవింద్ స్వామికి సంబంధించి కీలకమైన సన్నివేశాలు కూడా పూర్తయ్యాయ్. ప్రస్తుతం హైదరాబాద్ లో టాకీ పార్టును తీస్తున్నారు. కొన్ని యాక్షన్ సీన్స్ షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందట. త్వరగా ఇవన్నీ పూర్తి చేసుకుని.. వీలైనంత ప్రీ-రిలీజ్ బజ్ సృష్టించి.. అప్పుడు సినిమాను దించేస్తారట గీతా ఆర్ట్స్ వారు. అది సంగతి. 

04/09/2016

Ram Charan's Support to Nakshatram

Creative director Krishna Vamsi's upcoming film 'Nakshatram' is set to have an aggressive promotional campaigning. In accordance with it the makers would use the star power of Mega Power Star Ram Charan

Ram Charan will be unveiling ten first looks of the film, maybe all at once, in an occasion with the date yet to be mentioned. It can be assumed that all the key characters get ups maybe seen including Supreme hero Sai Dharam Tej, who happens to essay cop's role in the film. 

'Happy to Share that #Nakshatram's First ten looks are to be unveiled by Mega Power Star #RamCharan,' official handle of team 'Nakshatram' tweets. It is a known fact thatRam Charan and Krishna Vamsi earlier worked for 'Govindhudu Andarivadele'. They shared good rapport between them.

02/09/2016

చెర్రీ- పవన్.. మధ్యలో గన్!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. రామ్ చరణ్.. ఈ బాబాయ్ అబ్బాయ్ లు మెగా ఫ్యామిలీలో మెయిన్ పిల్లర్స్ అనే విషయం తెలిసిందే. మెగా ఫ్యామిలీలో జరిగే సినిమాలు- పర్సనల్ ఈవెంట్లకు పవన్ దూరంగా ఉండడం.. చాలామందికి చాలానే డౌట్స్ క్రియేట్ చేస్తుంది. అయితే.. పవన్ ఎప్పుడూ తనకు రామ్ చరణ్ అంటే ఎంతిష్టమో మాటలతో చెప్పలేదు కానీ.. బాబాయ్ లేకుండా మేము లేమని చరణ్ చాలాసార్లే చెప్పేశాడు. 

మరి ఈ బాబాయ్-అబ్బాయ్ ల మధ్య అనుబంధం ఎంతుందో ప్రపంచానికి ఎలా తెలుస్తుంది? అందుకే పవన్ పుట్టిన రోజున చెర్రీ ఒక ఫోటోని మెగాభిమానులతో షేర్ చేసుకున్నాడు. ఆ ఫోటోలో పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ గెటప్ లో ఉంటే.. చెర్రీ ఓ కుర్తాలో సింపుల్ గా కనిపిస్తాడు. చరణ్ కుర్చీలో కూర్చుని ఉంటే.. వెనకాల నుంచున్న పవన్.. చెర్రీ మొహాన్ని గెడ్డం దగ్గర పట్టుకుని ఫోటోకు పోజిచ్చాడు. మధ్యలో సర్దార్ గన్ కూడా ఉంటుంది లెండి. దాన్ని ఇద్దరూ కలిసి హ్యాండిల్ చేసేశారు.

పవన్-చరణ్ లను ఇంత ఆప్యాయంగా చూసిన దాఖలాలు గతంలో లేవు. అందుకే ఇప్పుడు బాబాయ్- అబ్బాయ్ లు ఇంత క్లోజ్ అనుకుంటున్నారు చాలామంది. రామ్ చరణ్ కు తండ్రి చిరు కంటే బాబాయ్ పవన్ దగ్గరే చేరిక ఎక్కువని.. గారాలు పోతూ ఉంటాడని చెప్పుకుంటారు లెండి. ఈ ఫోటో చూస్తే అది నిజమే అని కనిపిస్తోంది కదా.

'Dhruva' composer reveals audio status

From a time, various regular updates are being heard about Ram Charan's "Dhruva" while people do worry that if everything is getting as per schedule. 

As the release date is set for October 7th, which is hardly a month away, folks are now worried about the status of the film's audio launch. 

Clearing all the doubts, today music composer Hip Hop Thamizha stated, "Dhruva audio nearing completion. Mix & master in progress. Huge experience working with Charan anna & Soori anna". That sets everything in motion, as the audio will be released soon. 

Produced by Geetha Arts, Dhruva is being directed by Surender Reddy. 

31/08/2016

Dhruva’s first look teaser on Vinayaka Chavithi?

The shooting of Ram Charan’s Dhruva is nearing completion and the makers are trying everything possible to make this film a huge hit for Ram Charan.

Latest update now reveals that the team are planning to release a special teaser on the occasion of Vinayaka Chavithi next week. An official confirmation is yet to be made regarding this news.

Directed by Surender Reddy, Dhruva is the official remake of the hit Tamil film Thani Oruvan. Rakul Preet is the female lead and Geetha Arts produces this big budget action entertainer.

Sukumar to pull record feat with Mega hero

Director Sukumar is always famous for his slow-work and star heroes sometime fear to work with him because he takes long time to finish shoots. 

But the director is said to be mending his ways for his upcoming flick with Ram Charan as the Mega Powerstar imposed him severe deadlines to wrap the work. 

As per updates, Charan-Sukumar film will roll on floors in September, and forget about competition of the project, the film is likely to this cinemas in February 2017 itself. Will Sukumar really fill this record feat for this mega hero? Only time will tell. 

Meanwhile Ram Charan's Dhruva is slated for October 7th release and movie's shoot is going on.

24/08/2016

Sister Love for Ram Charan!

On this Year's Raksha Bandhan, We might have come across many lovable moments and one of the best happens to be that of Gautham Krishan-Sitara Ghattamaneni. An equally special moment is now garnering the attention of everyone.

Polena, Pawan Kalyan's Daughter with 3rd Wife, tied a rakhi to none other than Ram Charan. The photograph of Cherry & Polena made the day of Mega Fans. While one can notice the innocence of a kid, Even the affection from big brother don't go unnoticed.

A good upbringing is something which keeps the family members united. Credit to Anna Lezhneva for making this happen!

21/08/2016

Charan's 2 Back to Back Love Stories?

Mega Power Star Ram Charan's ongoing project 'Dhruva's shoot will be wrapped up in next month. Soon, he will be teaming up with Sukumar. It was earlier speculated that it's going to be a Science fiction entertainer. But then, inside sources rubbished the gossips and disclosed that it would be a romantic entertainer with a village backdrop. 

On the other hand, Ram Charan has reportedly given nod to work with Merlapaka Gandhi. The director is on cloud nine with two super hits like 'Venkatadri Express' and 'Express Raja' recently. Buzz is that the movie would be a romantic and class entertainer. However, official reports are awaited aboutRam Charan and Merlapaka Ganthi's project.

Ram Charan's 'Dhruva' is being directed by Surender Reddy. Rakul Preet Singh shares the screen space with Ram Charan in this movie. Hiphop Tamizha composed the music of the movie. The movie is being produced by Mega producer Allu Aravind on Geetha Arts.

19/08/2016

 Allu Arjun cameo in Charan’s Dhruva

If ongoing buzz in media and film industry  is to be believed, Stylish star Allu Arjun has been roped  for the upcoming drama “Dhruva”, in which  Mega actor Ram Charan and Rakul Preet Singh are playing the lead role. The movie is being directed by Surender Reddy. It is an official remake of Tamil hit movie “Thani Oruvan” starring Jayam Ravi. 

 

Bunny will play the role of special cameo. Ram Charan and Bunny are very close and shares good rapport. Earlier both have worked together for the movie “Yevadu", directed by vamsi Paidipally and now once again both are teaming up for this upcoming drama.

The movie is produced by Allu Arvind  under the banner of Geetha Arts and the music is scored by Hip Hop Tamizha .It is set to hit the theaters on 7th October 2016.