Showing posts with label Sukumar. Show all posts
Showing posts with label Sukumar. Show all posts

31/08/2016

Sukumar to pull record feat with Mega hero

Director Sukumar is always famous for his slow-work and star heroes sometime fear to work with him because he takes long time to finish shoots. 

But the director is said to be mending his ways for his upcoming flick with Ram Charan as the Mega Powerstar imposed him severe deadlines to wrap the work. 

As per updates, Charan-Sukumar film will roll on floors in September, and forget about competition of the project, the film is likely to this cinemas in February 2017 itself. Will Sukumar really fill this record feat for this mega hero? Only time will tell. 

Meanwhile Ram Charan's Dhruva is slated for October 7th release and movie's shoot is going on.

21/08/2016

Charan's 2 Back to Back Love Stories?

Mega Power Star Ram Charan's ongoing project 'Dhruva's shoot will be wrapped up in next month. Soon, he will be teaming up with Sukumar. It was earlier speculated that it's going to be a Science fiction entertainer. But then, inside sources rubbished the gossips and disclosed that it would be a romantic entertainer with a village backdrop. 

On the other hand, Ram Charan has reportedly given nod to work with Merlapaka Gandhi. The director is on cloud nine with two super hits like 'Venkatadri Express' and 'Express Raja' recently. Buzz is that the movie would be a romantic and class entertainer. However, official reports are awaited aboutRam Charan and Merlapaka Ganthi's project.

Ram Charan's 'Dhruva' is being directed by Surender Reddy. Rakul Preet Singh shares the screen space with Ram Charan in this movie. Hiphop Tamizha composed the music of the movie. The movie is being produced by Mega producer Allu Aravind on Geetha Arts.

27/06/2016

చరణ్ కోసం మెగా బడ్జట్ సెట్టయ్యిందా?

మొన్నటి వరకు ఒక మెగా రూమర్ తెగ చెక్కర్లు కొట్టింది. అదేంటంటే.. అసలు రామ్ చరణ్ తో తక్కువ బడ్జెట్ లో సినిమా తీయమంటే.. మన సుకుమార్ మాత్రం చుక్కులు కనిపించే లెక్కలు చెప్పి ఆకాశమంత బడ్జెట్ అడుగుతున్నాడని. అయితే ఇవన్నీ రూమర్లే అంటున్నారు సన్నిహితులు. ఎందుకంటే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి స్ర్కిప్టుకు ఫైనల్ టచప్ లు ఇస్తున్నాడట సుక్కూ. బడ్జెట్ తో సంబంధం లేకుండా తను అనుకున్న కథ తాను చేసుకెళ్లిపోతున్నాడట. 

నిజానికి ఇప్పటికే రామ్ చరణ్ అండ్ సుకుమార్ లు కలసి చేయబోయే ప్రాజెక్టు బడ్జెట్ పై ఒక అంచనాకు వచ్చేశారట నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్. ఒక ప్రక్కన జనతా గ్యారేజ్ పోస్టు ప్రొడక్షన్ పనులు చూసుకుంటూనే.. మరో ప్రక్కన చెర్రీతో చేసే సినిమా కోసం వీరు ప్రీ-ప్రొడక్షన్ మొదలెట్టారని తెలుస్తోంది. అనుకున్నట్లే వీరు సెప్టెంబర్ నెలలో సినిమాను పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. గతంలో మాదిరిగా రామ్ చరణ్ ఒక సినిమా పూర్తవ్వగానే ఓ ఆర్నెల్లు గ్యాప్ తీసుకోకుండా.. ఈసారి మాత్రం వెంటనే సుక్కూ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడట. ఇవన్నీ చూస్తుంటే.. చెర్రీ సుకుమార్ ల సినిమా కోసం మెగా బడ్జెట్ సెట్ అయిపోయిందనే అనుకోవాలి మరి. 

ప్రస్తుతం చరణ్ కాశ్మీర్ లో తని ఒరువన్ రీమేక్ అయిన ధృవ సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు. అది సంగతి. 

08/06/2016

సుక్కు సినిమాలో చెర్రీ క్యారెక్టరేంటంటే..

సుకుమార్ సినిమాల్లో హీరోల క్యారెక్టర్లు చాలా టిపికల్ గా ఉంటాయి. ఆర్య.. జగడం.. ఆర్య-2.. 100 పర్సంట్ లవ్.. 1 నేనొక్కడినే.. నాన్నకు ప్రేమతో.. ఇలా ఏ సినిమా చూసినా హీరో క్యారెక్టర్లు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఇప్పుడిక రామ్ చరణ్ కోసం సుక్కు ఎలాంటి పాత్ర రెడీ చేస్తున్నాడా అని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సుక్కు సన్నిహితుల సమాచారం ప్రకారం ఈ సినిమాలో రామ్ చరణ్ ను డాక్టర్ గా చూపించబోతున్నాడట సుక్కు. ఇదొక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ అని.. ‘ఫార్ములా ఎక్స్’ అనేది టైటిల్ అని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. మరి హీరోను డాక్టర్ కు చూపిస్తూ సైన్స్ ఫిక్షన్ తో ఎలా ముడిపెడతాడో చూడాలి. టాలీవుడ్లో హీరోలు డాక్టర్లుగా కనిపించడం చాలా అరుదు. గత కొన్నేళ్లలో చూస్తే.. ‘సింహా’లో బాలయ్య మాత్రమే వైద్యుడిగా కనిపించాడు. అది కూడా ఫుల్ లెంగ్త్ క్యారెక్టరేమీ కాదు.

రామ్ చరణ్ పూర్తి సినిమాలో డాక్టర్ గా కనిపిస్తే తెలుగు సినిమాల్లో ఇది చాలా ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. చరణ్ తండ్రి ‘శంకర్ దాదా జిందాబాద్’లో ఫేక్ డాక్టర్ లాగా కనిపించాడు. చరణ్ ‘రచ్చ’ సినిమాలో కొన్ని నిమిషాల పాటు తెల్ల కోటుతో మెడికో లాగా కనిపించాడు. మరి పూర్తి స్థాయి వైద్యుడిగా చరణ్ ఎలా కనిపిస్తాడో చూద్దాం. ఇంకో రెండు మూడు నెలల్లో స్క్రిప్టు పూర్తి చేసి.. విజయదశమికి ఈ చిత్రాన్ని సెట్స్ మీదికి తీసుకెళ్లాలని భావిస్తున్నాడు సుక్కు.