Showing posts with label RamCharan. Show all posts
Showing posts with label RamCharan. Show all posts

20/08/2016

Charan's next with Express director?

From a long time this young talented director is narrating couple of stories to Ram Charan, and we hear that finally he flattered the star mega hero with one of the love story he carved. 

"Express Raja" fame Merlapaka Gandhi is right now busy carving out a new film and this time his hero is none other than Ram Charan. Due to his closeness with Sharwanand, this director took Charan's appointment and narrated a beautiful love story to him.

We hear that Charan liked it and the film will go on floors after Sukumar's movie starts. From November, Charan might shoot for both Sukumar and Gandhi's film as well, says a source. 

However the flop show of Orange is still reeling in minds of Mega fans and they are worried what this new love story will do to Charan now

15/08/2016

ఫస్ట్ లుక్: సీరియస్ 'ధృవ' భలే ఉన్నాడు

ఇప్పటికే తన ప్రీ-లుక్ తో అదరగొట్టేసిన రామ్ చరణ్.. ఇప్పుడు స్వాతాంత్ర్యదినోత్సవ సందర్భంగా తన కొత్త సినిమా ఫస్ట్ లుక్ తో మెగా అభిమానులకు ఆనందం పంచుతున్నాడు. ముందుగా అనుకున్నట్లే ఈ సినిమా మొదటి చూపులను ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు రిలీజ్ చేశారు. 

చెప్పేది ఒక పోలీస్ ఆఫీసర్ కథ కాబట్టి.. చాలా ఇంటెన్స్ గా ఆ పాత్రలను చూపించాలని ఫిక్సయినట్లున్నారు. అందుకే చరణ్ నడిచొస్తున్న స్టిల్స్ చాలా యాక్షన్ ఫీల్ తో అదిరిపోయాయ్. క్లోజప్ పోస్టర్ అయినా.. వాకింగ్ స్టిల్ అయినా.. డిఫరెంట్ ఫేషియల్ లుక్.. కొత్తగా ఉన్న ఆ మీసం.. అలాగే డిఫరెంట్ నడక.. అదరగొట్టశాయి. ఈ పోస్టర్లతో మెగా ఫ్యాన్లకు నిజంగానే పండగే. సీరియస్ లుక్కులో రామ్ చరణ్ భలేగా ఉన్నాడు. అయితే టైటిల్ డిజైన్ వెనుక '8' అనే అక్షరం ఎందుకు పెట్టారు? దానికి ధృవకు సంబంధం ఏంటి? అక్టోబర్ 8న సినిమా వస్తోందా? లేకపోతే ఇంకేమైనా ట్విస్టు ఉందా? మొదలగు విషయాలు తెలియాల్సి ఉంది. 

12/08/2016

ప్రీ-లుక్ టాక్: చరణ్ చంపేశాడంతే

కేవలం బ్లూ కలర్ బ్యాక్ డ్రాప్ లో 'ప్రీ లుక్' కూడా ఒక రేంజులో ఉంటుంది ఎవ్వరూ ఊహించరు. కాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం ఉతికి ఆరేస్తున్నాడు. ఈ స్వాతంత్ర్యదినోత్సవం నాడు ''ధృవ' సినిమా ఫస్ట్ లుక్ విడుదలవుతోందనే సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ విషయం చెప్పడానికి ఒక ప్రీ-లుక్ పోస్టర్ విడుదల చేశాడు చరణ్. పదండి ఎలా ఉందో చూద్దాం. 

'నా శత్రువే నా బలం' అనే కాన్సెప్టుతో ఈ సినిమా తెరకెక్కుతోంది. అందుకే మై ఎనిమీ ఈజ్ మై స్ర్టెంగ్త్ అంటూ ఇప్పుడు ఈ పోస్టర్ ముందుకొచ్చింది. రామ్ చరణ్ అలా బ్యాక్ నుండి కనిపిస్తున్నా కూడా.. ఆ ఫోజు చూస్తుంటే ఏదో హాలీవుడ్ పోస్టర్ చూస్తున్నట్లు ఉంది. సురేందర్ రెడ్డి క్రియేటివిటీ అంతా పోస్టర్లో కూడా బాగానే జొప్పించాడనే ఇట్టే చొప్పేయవచ్చు. ఆర్గనైజ్డ్ క్రిమినల్ యాక్టివిటీ అనే టాపిక్ మీద జరిగే ఈ సినిమా.. తమిళంలో వచ్చిన థని ఒరువన్ సినిమాకు రీమేక్. అరవింద్ స్వామీ ఈ సినిమాలో విలన్ గా చేయడం విశేషం. 

ఇకపోతే హిప్ హాప్ తమిళ ను తొలిసారి తెలుగులో సంగీత దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు చరణ్. ఈ సినిమాతో తొలి రీమేక్ కూడా చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. మొత్తానికి ఈ ప్రీ-లుక్ తోనే ఇలా చంపేశాడు.. మరి ఫస్ట్ లుక్ ఎలా ఉండోబోతుందో చూద్దాం. 

05/08/2016

తొలిసారి సెట్ కు వచ్చిన రామ్ చరణ్

ప్రస్తుతం ధృవ సినిమా షూటింగులో బాగా బిజీగా ఉన్న రామ్ చరణ్.. ఇప్పుడు సడన్ గా కొత్త ట్విస్టిచ్చాడు. ఒక ప్రక్కన తన సినిమా షూటింగులో పాల్గొంటూనే.. మనోడు తన తొలి ప్రొడక్షన్ వెంచర్ గురించి కూడా కేర్ తీసుకుంటున్నాడని తెలుస్తోంది. అదిగో ఈరోజు సరదాగా ఒకసారి అసలు డ్యాడ్ సినిమా షూటింగ్ స్పాటులో ఏం జరుగుతుందో చూడ్డానికి నిర్మాత గారు సెట్టుకొచ్చారు. 

వివి వినాయక్ డైరక్షన్లో మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన కీలక మూడో షెడ్యూల్ ను ఈరోజు నుండే మొదలు పెట్టారు. ఆల్రెడీ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు.. అలాగే చిత్ర ఆర్ట్ డైరక్టర్ తోట తరణి గత కొన్ని రోజులుగా కష్టపడి రూపొందించిన ఒక సెట్లో ఇప్పుడు చిత్రీకరణ మొదలైంది. అసలు ఈ యవ్వారం అంతా ఎలా జరుగుతుందో ఒక మారు చూడ్డానికి చరణ్ ఈరోజు లొకేషన్ కు విచ్చేశాడని తెలుస్తోంది. అయితే కేవలం పక్కనుండి షూటింగ్ చూడటమే తప్పించి.. ఇదేంటి అదేంటి అని ఒక్క ప్రశ్న కూడా వేయకుండా అక్కడ నుండి లంచ్ చేసి బయలుదేరాడట కుర్రాడు. 

శరవేగంగా 150వ చిత్రాన్ని రూపొందిస్తున్న తీరును చూస్తుంటే.. మనోళ్ళు సంక్రాంతి 2017 డేటును అస్సలు మిస్సయేలా లేరే. 

19/07/2016

ఉపాసన ప్లాన్స్ అన్నీ అందుకోసమేనా!!

ఈ మధ్యన రామ్ చరణ్ కోసం ఏకంగా ముంబయ్ నుండి ఒక పి.ఆర్. ఏజన్సీని దించింది ఆయన భార్య ఉపాసన కామినేని. అయితే ఈ ఏజన్సీ వారు కేవలం ఏదో ఏజన్సీ అన్నట్లు కాకుండా.. అసలు ముంబయ్ టచ్ అంటే ఏంటో చూపిస్తున్నారు. సోషల్ మీడియాలో చరణ్ చేత స్వయంగా ఇంటర్యూలు పెట్టించడం.. అన్ని లీడింగ్ మీడియా హౌసుల్లోనూ చరణ్ గురించి కవరేజ్ విపరీతంగా పెంచడం వంటి చేస్తున్నారు. మామూలుగానే ఈ మెగా హీరోకు ఉన్న క్రేజ్ కారణంగా ఏదైనా వార్తే అవుతుంది. ఇక స్వయంగా ఒక ఏజన్సీ రంగంలోకి దిగి ఆ పనిచేస్తుంటే.. ఇంకేముంది క్రేజ్ డబుల్ అవుతుంది. 

అసలు ఉపాసన ఇంత కేర్ తీసుకోవడానికి ఒక పెద్ద రీజనే ఉంది. నిజానికి ఇప్పటివరకు రామ్ చరణ్ కేవలం మెగా క్రేజ్ పైనే ఆధారపడ్డాడు కాని.. సొంతంగా బ్రాండింగ్ చేసుకోలేదు. గతంలో నమ్రతా శిరోద్కర్ ఎలాగైతే మహేష్ ను ఒక బ్రాండ్ గా తీర్చిదిద్ది ఏకంగా డజను బ్రాండ్ల తాలూకు యాడ్స్ అతని చేతిలోకి తెచ్చిందో.. ఇప్పుడు ఉపాసన కూడా సేమ్ అదే ఫాలో అవుతోందట. మొదట కార్పొరేట్ కంపెనీల యాడ్లను తెచ్చి.. తరువాత పెద్ద పెద్ద ప్రాడక్టులను కొన్ని చరణ్ ఖాతాలో వేయిస్తుందట. దాని తరువాత బాలీవుడ్డులో వీలైతే మరో రెండు సినిమాలను కూడా చరణ్ చేత సైన్ చేయిస్తారని తెలుస్తోంది. ఆ దిశగానే ఉపాసన ప్లాన్స్ అమలవుతున్నాయి. 

ఇవన్నీ చేయడం వలన బ్రాండ్ వాల్యూ పెరగడమే కాదు.. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు చరణ్ తో సినిమాలను చేయడానికి క్యూ కట్టే ఛాన్సుంది. అయితే ఇలాంటి బ్రాండింగ్ ఎంత చేసినా కూడా.. కంటెంట్ వైజ్ మంచి సినిమాలను సెలక్టు చేసుకుని హిట్లు కూడా కొట్టాల్సిన ఆవశ్యకత ఉంది. 

16/07/2016

ది మెగా ఫ్యాన్' ప్రాజెక్టు అంటే..

సోషల్ అవేర్ నెస్ అనే కాన్సెప్ట్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి మంచి క్లారిటీ ఉంది. ఏదో ఒక సందర్భాన్ని కల్పించుకుని మరీ సామాజిక కార్యక్రమాలవైపు అడుగులు వేస్తాడు. ఇప్పుడు తను ఫ్యాన్స్ కోసం చేపట్టబోతున్న ఓ ఫ్యూచర్ ప్రాజెక్ట్ గురించి డీటైల్డ్ గా డిస్క్రిప్షన్ ఇచ్చాడు రామ్ చరణ్. 

''ది మెగా ఫ్యాన్ అనే  పేరుతో ఓ స్మాల్ ప్రాజెక్ట్ చేస్తాం. ఎవరైనా సరే అభిమానులు తమ సొంత సిటీలోనో.. ఏరియాలోనో..  సొసైటీ కోసం ఓ మంచి పని చేయాలి. ఎనీ గుడ్ వర్క్ చేసి వీడియో తీయండి. అందరూ మంచి పనులే చేయాలని చెప్పడమే దీని ఉద్దేశ్యం. వాటర్ ప్రాబ్లెమ్ కావచ్చు.. స్వచ్ఛ్ భారత్ లాంటిది కావచ్చు.. ఏదైనా సరే చిన్నదైనా పెద్దదైనా గుడ్ యాక్టివిటీ చేపట్టి.. దాన్ని నా ఫేస్ బుక్ లో పోస్ట్ చేయండి. వాటిలో బెస్ట్ అనిపించేవి కొన్ని సెలక్ట్ చేసి.. ఆ వ్యక్తులను డాడ్ 150 సినిమా సెట్స్ కి తీసుకెళ్తాం. అక్కడ షూటింగ్ చూసే అవకాశంతో పాటు.. అందరితోనూ కలిసే అవకాశం కూడా కల్పిస్తాం'' అంటూ అభిమానులకు బంపర్ ఆఫర్ ఇచ్చేశాడు. 

ఇతర విషయాలకు వస్తే.. చరణ్ ప్రస్తుతం ఫేస్ బుక్ లో మాత్రమే ఉన్నాడు.. ట్విట్టర్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్స్ పై పెద్దగా ఇంట్రెస్ట్ లేదన్నాడు. ''నేను అంత సోషల్ గై కాదు.. ఫేస్ బుక్ నే అభిమానులతో టచ్ లో ఉండేందుకు మెయింటెయిన్ చేస్తున్నా.. వీలైతే మిగతావి కూడా త్వరలో ట్రై చేస్తా'' అంటూ సోషల్ మీడియా గురించిన తన ఒపీనియన్ చెప్పాడు చెర్రీ. 

15/07/2016

చెర్రీ చేసేవి.. చేయాలని అనుకునేవి..

రామ్ చరణ్ ధృవ మూవీ హై రేంజ్ స్పీడ్ లో ఫినిష్ అయిపోతోంది. ఆగస్ట్ 15న ఫస్ట్ లుక్.. అక్టోబర్ లో సినిమా రిలీజ్ ఖాయమంటూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చెప్పేశాడు. మరి చెర్రీ చేయనున్న నెక్ట్స్ మూవీ ఏంటి? ఇదే ప్రశ్న చరణ్ ని నేరుగా ఫేస్ బుక్ లైవ్ లో ఓ అభిమాని అడిగాడు. 

''నా నెక్ట్స్ సినిమా సుకుమార్ గారితో ఉంటుంది. ఇప్పటికే ప్రాజెక్ట్ కన్ఫాం అయింది. దీన్ని అక్టోబర్ నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది'' అంటూ క్లారిటీ ఇచ్చాడు చరణ్. ఇక చేయాలని అనుకుంటున్న సినిమాలపై కూడా చాలానే సవాళ్లు చెర్రీకి ఎదురయ్యాయి. ''గౌతమ్ మీనన్ సినిమాలు నేను చాలా ఎంజాయ్ చేస్తా. ఆల్మోస్ట్ ప్రతీ మూవీ చూస్తాను. త్వరలో ఆయనతో ఓ మూవీ చేస్తానని అనుకుంటున్నా'' అని ఫ్యాన్ కి జవాబిచ్చిన చరణ్.. మురుగదాస్ తో కూడా ఏదో ఒక రోజు పని చేయడం ఖాయమని చెప్పడం విశేషం. ఇక డెబ్యూ డైరెక్టర్లతో సినిమా అంటే చాలా ఉత్సాహమని.. తప్పకుండా చేస్తానని క్లారిటీ ఇచ్చేశాడు. 

వీటన్నిటికంటే చెర్రీకి ఎదురైన టఫ్ క్వశ్చన్ ఏంటంటే.. బాలీవుడ్ లో మళ్లీ ట్రై చేస్తారా అనే. జంజీర్ తో ఓ సారి దెబ్బ తిన్నాడు కాబట్టి.. దీనికి నో అనే ఆన్సర్ వస్తుందని ఎక్స్ పెక్ట్ చేశారంతా. కానీ ''బాలీవుడ్ లో మళ్లీ ప్రాజెక్ట్.. మంచి సబ్జెక్ట్ దొరకాలే కానీ ఎక్కడైనా చేస్తా.. అది తమిళ్ కావచ్చు.. బాలీవుడ్ కావచ్చు.. మరేదైనా కావచ్చు. ఏ మూవీ చేసేందుకైనా నేను రెడీ'' అంటూ తన బాలీవుడ్ ఫ్యూచర్ పై ఓ స్పష్టత ఇచ్చాడు మెగా పవర్ స్టార్. 

మెగా' ఫ్యామిలీ చాలా మంచిదన్న కోడలు

ఉపాసన.. మెగా తనయుడు రామ్ చరణ్ కు భార్య అయ్యాక ఈమె చాలామందికి దగ్గరైపోయింది. మెగా కుటుంబానికి కోడలుగా వెళ్లక ముందే ఈమె వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి వారసురాలు. అయితే.. తన గురించి తాను చెప్పుకోవాలంటే.. ఇవి మాత్రమే కాదని - బిలియన్ డాలర్ వాణిజ్య సామ్రాజ్యాన్ని సృష్టించాలని తపన పడే వ్యక్తిగా అభివర్ణించుకుంటుంది ఉపాసన. 

మెగాస్టార్ కి కోడలిగా వెళ్తుందని తెలిసినప్పటి నుంచి తన చుట్టూ ప్రపంచం మారిపోయిందని ఉపాసన చెబుతోంది. అభినందించిన వారితో పాటు విమర్శలు కూడా వచ్చాయన్న ఆమె.. తన చుట్టూ వస్తున్న వార్తల కారణంగా మరింత అలర్ట్ గా మారానని తెలిపింది. 'నేను కలిసిన మంచి వ్యక్తుల్లో అత్యుత్తమం అంటే నా అత్తారింట్లో మనుషులే. కేవలం కుటుంబంలోనే కాదు.. రామ్ చుట్టూ ఉండే ప్రతీ ఒక్కరు నా గురించి ఎంతో కేర్ తీసుకుంటారు. ఇంట్లో కుక్ దగ్గర నుంచి సెట్స్ లో డైరెక్టర్ వరకు అందరు సహాయం చేసే వ్యక్తులే. చరణ్.. తన కుటుంబం ఇంత సపోర్ట్ లేకుండా ఉండే ఇలా ఉండేదాన్ని కాదేమో' అని చెప్పింది చిరుత లైఫ్ పార్ట్నర్. 

తన లుక్స్ పై కూడా స్పందించిన ఉపాసన.. వ్యక్తిగతంగా తాను చిన్నప్పటి నుంచి బాగా లావుగా ఉండి ఇబ్బంది పడేదాన్నని చెప్పింది. అయితే.. తన తండ్రి.. ఆ తర్వాత భర్త ఎంతో మద్దతుగా నిలిచి ఇప్పుడు తననిలా మార్చేశారని అంటోంది. 'ఎంత ఫిట్ గా ఉంటే అంత కాన్ఫిడెన్స్ కళ్లలో కనిపిస్తుందని నా భర్త చెప్పారు.. నేను అదే ఫాలో అయిపోతున్నా' అంటోంది ఉపాసన. 

01/07/2016

చెర్రీ.. లుక్ తోనే చితక్కొట్టేశాడు

 రామ్ చరణ్ ఇప్పుడు హైద్రాబాద్ వచ్చేశాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తని ఒరువన్ రీమేక్ ధృవ షూటింగ్ కోసం.. కశ్మీర్ వెళ్లింది యూనిట్. ఇప్పుడు అక్కడ షెడ్యూల్ ని ఫినిష్ చేసిన రామ్ చరణ్..  హైద్రాబాద్ చేరుకున్నాడు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఇలా కెమేరాలకు చిక్కాడు చరణ్.

10 రోజులకు పైగా జరిగిన కశ్మీర్ షెడ్యూల్ లో.. ఒక పాటతో పాటు కొన్ని కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. ముఖ్యంగా ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది చెర్రీ లుక్ గురించే. ఐపీఎస్ ఆఫీసర్ లుక్ కోసం కొన్ని నెలల పాటు శ్రమించిన చరణ్.. అథ్లెటిక్ బాడీకి మేకోవర్ చేశాడు. నీట్ గా షేవ్ చేసిన గడ్డం.. స్టిఫ్ బాడీ.. ధృడంగా ఉంటూ సన్నగా కనిపించే లుక్.. డిఫరెంట్ హెయిర్ స్టైల్.. ఇలా ప్రతీ విషయంలోనూ కొత్తగా కనిపించేందుకు కొన్ని నెలల పాటు ట్రైనప్ అయ్యాడు చరణ్. 

ఆ కష్టం ఇప్పుడు చరణ్ లుక్ లో స్పష్టంగా కనిపిస్తోంది. బ్లూకలర్ షర్ట్ - బ్లూ జీన్స్ - బ్లూ క్యాప్ లో చెర్రీ అలా నడిచొస్తున్న లుక్.. ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఇప్పటికే కశ్మీర్ లో షూటింగ్ స్పాట్ నుంచి తీసిన ఓ పిక్చర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. రీసెంట్ పోలీస్ లుక్ లో ఉన్న ఫోటోన షేర్ చేశాడు నవదీప్. ఇప్పుడు పూర్తి లుక్ తో కశ్మీర్ షూటింగ్ నుంచి తిరిగొస్తూ... శంషాబాద్ ఎయిర్ పోర్టులో కెమేరాలకు దొరికిపోయాడు రామ్ చరణ్. 

30/06/2016

మాస్ నాయక్ కి చెర్రీ గ్రీన్ సిగ్నల్

మెగా ఫ్యామిలీ హీరోలకు దర్శకుడు వి.వి.వినాయక్ అంటే విపరీతమైన నమ్మకం. మాస్ మూవీస్ విషయంలో వినాయక్ ని మించిన నాయక్ లేడని గట్టిగా నమ్ముతారు. అందుకే మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా విషయంలో ముందు నుంచి వినాయక్ పేరు వినిపించింది. చివరకు స్టోరీ సంగతి ఎలా ఎటు మారినా.. చివరకు వినాయక్ చేతిలోనే ఆ సినిమాని పెట్టారు హీరో చిరంజీవి- నిర్మాత రామ్ చరణ్. 

ఎంతమంది ఎన్ని సబ్జెక్టులు చెప్పినా తను నిర్మాతగా తీసే మొదటి మూవీకి వినాయక్ నే దర్శకుడిగా రామ్ చరణ్ ఎంచుకున్నాడు. మెగా 150కోసం నెలకొన్న పోటీని సక్సెస్ ఫుల్ గా హ్యాండిల్ చేయగలిగాడు వినాయక్. ఇప్పుడు రామ్ చరణ్ తో కూడా వినాయక్ ఓ సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్టులను ఫినిష్ చేసుకున్న తర్వాత తామిద్దరం ఓ సినిమా చేయాలనే నిర్ణయానికి వచ్చారణ చరణ్-వినాయక్. వీరిద్దరూ కలిసి గతంలో నాయక్ చిత్రాన్ని చేసి సక్సెస్ కొట్టిన విషయం మెగాఫ్యాన్స్ కి బాగానే గుర్తుంది. 

అయితే.. ఈ ప్రాజెక్ట్ ఇప్పుడప్పుడే మొదలయ్యే అవకాశం లేదు. వినాయక్ ప్రస్తుతం తన కాన్సంట్రేషన్ అంతా మెగా 150పైనే పెట్టాడు. ఆ తర్వాతే కొత్త మూవీ స్క్రిప్ట్ పై కూచోనున్నాడు. ఇక రామ్ చరణ్ అయితే ధృవను దసరాకు తెచ్చిన తర్వాత సుకుమార్ తోను.. ఆ తర్వాత మారుతీ తోను ఓ సినిమా చేస్తాడనే టాక్ ఉంది. అప్పటికి గానీ వినాయక్ సినిమా సంగతి తేలే ఛాన్స్ లేదు. ఇదంతా జరగడానికి 2018 వచ్చేస్తుందేమో. 

27/06/2016

చరణ్ కోసం మెగా బడ్జట్ సెట్టయ్యిందా?

మొన్నటి వరకు ఒక మెగా రూమర్ తెగ చెక్కర్లు కొట్టింది. అదేంటంటే.. అసలు రామ్ చరణ్ తో తక్కువ బడ్జెట్ లో సినిమా తీయమంటే.. మన సుకుమార్ మాత్రం చుక్కులు కనిపించే లెక్కలు చెప్పి ఆకాశమంత బడ్జెట్ అడుగుతున్నాడని. అయితే ఇవన్నీ రూమర్లే అంటున్నారు సన్నిహితులు. ఎందుకంటే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి స్ర్కిప్టుకు ఫైనల్ టచప్ లు ఇస్తున్నాడట సుక్కూ. బడ్జెట్ తో సంబంధం లేకుండా తను అనుకున్న కథ తాను చేసుకెళ్లిపోతున్నాడట. 

నిజానికి ఇప్పటికే రామ్ చరణ్ అండ్ సుకుమార్ లు కలసి చేయబోయే ప్రాజెక్టు బడ్జెట్ పై ఒక అంచనాకు వచ్చేశారట నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్. ఒక ప్రక్కన జనతా గ్యారేజ్ పోస్టు ప్రొడక్షన్ పనులు చూసుకుంటూనే.. మరో ప్రక్కన చెర్రీతో చేసే సినిమా కోసం వీరు ప్రీ-ప్రొడక్షన్ మొదలెట్టారని తెలుస్తోంది. అనుకున్నట్లే వీరు సెప్టెంబర్ నెలలో సినిమాను పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. గతంలో మాదిరిగా రామ్ చరణ్ ఒక సినిమా పూర్తవ్వగానే ఓ ఆర్నెల్లు గ్యాప్ తీసుకోకుండా.. ఈసారి మాత్రం వెంటనే సుక్కూ సినిమా షూటింగ్ లో పాల్గొంటాడట. ఇవన్నీ చూస్తుంటే.. చెర్రీ సుకుమార్ ల సినిమా కోసం మెగా బడ్జెట్ సెట్ అయిపోయిందనే అనుకోవాలి మరి. 

ప్రస్తుతం చరణ్ కాశ్మీర్ లో తని ఒరువన్ రీమేక్ అయిన ధృవ సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు. అది సంగతి. 

కాశ్మీర్ లో కూడా చెర్రీ అదే తంతు!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు కాశ్మీర్ లో కొత్త సినిమా షూటింగ్ చేస్తున్నాడు. కోలీవుడ్ బ్లాక్ బస్టర్ తని ఒరువన్ కి రీమేక్ గా తెరకెక్కుతున్న ధృవలో.. చెర్రీ పోలీసాఫీసర్ గా కనిపిస్తున్నాడు. ఈ మూవీలో పాత్ర కోసం చెర్రీ కసరత్తులు ట్రైనింగ్ చూస్తే.. ఇకపై పోలీస్ పాత్ర చేసే వారందరికీ ఇన్ స్పిరేషన్ గా మిగిలిపోతాడేమో అనిపిస్తోంది. 

కొన్ని పాటలు పోలీస్ ట్రైనింగ్ సహా కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణకు కాశ్మీర్ కి వెళ్లిన చెర్రీ అక్కడకు కూడా... మార్షల్ ఆర్ట్స్ టీమ్ ని వెంట తీసుకెళ్లాడు. అక్కడ గడ్డ కట్టే చలిలో కూడా అకిడో విద్యకు సంబంధించి రెండు గంటల పాటు ప్రాక్టీస్ చేస్తూనే ఉండడం విశేషం. ఇది కాక.. ఈ మూవీ ప్రారంభానికి ముందు నుంచి సినిమాకోసం పక్కా వెజిటేరియన్ గా మారిపోయాడు రామ్ చరణ్. డైటీషియన్ చెప్పిన ఫుడ్ మినహాయిస్తే.. ఒక్క ముక్క కూడా నాన్ వెజ్ నోట పెట్టడం లేదు. 

ఇదంతా సన్నగా ఫిట్ గా కనిపించేందుకే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లావుగా కనిపించకుండా.. ధృడంగా ఉండే లుక్ కోసం చెర్రీ పడుతున్న కష్టం చూసి యూనిట్ మొత్తం ఆశ్చర్యపోతోంది. గతంలో కూడా పోలీస్ పాత్రలో కనిపించిన చరణ్.. అప్పుడు రఫ్ లుక్ లో దర్శనమిచ్చాడంతే. ఇప్పుడు మాత్రం పోలీస్ పాత్రతో సక్సెస్ సాధించేందుకు తన వంతుగా లుక్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. 

16/06/2016

చెర్రీకి డిజిటల్ పనిష్మెంట్?

ఇవాల్టి రోజుల్లో ఎలక్ట్రానిక్స్ ఉపయోగించకుండా గడపమంటే ఎలా ఉంటుంది? ఎలక్ట్రానిక్ పరికరాలు డిజిటల్ ఎక్విప్మెంట్ కు దూరంగా ఉండమంటే.. అదే పెద్ద పనిష్మెంట్. ఎందుకంటే సెల్ ఫోన్ లేకుండా నిమిషం కూడా గడపలేని పరిస్థితిలోకి మనుషులు వచ్చేశారు కదా. 

కానీ ఎటువంటి ఎలక్ట్రానిక్స్ ఉపయోగించకుండా ఉండడాన్ని డిజిటల్ డిటాక్స్ అంటారు. ఇందులో సెల్ ఫోన్స్ కూడా ఉంటాయండోయ్. వాటిని కూడా ముట్టుకోకూడదు. గత రెండు వారాలుగా రామ్ చరణ్ ఈ డిజిటల్ డిటాక్స్ సిట్యుయేషన్ లోనే ఉన్నాడు. ఇలా ఉండమని సూచించిదని ఎవరో కాదు. తన భార్య ఉపాసన చెప్పడంతోనే ఇలా డిజిటల్ పరికరాలకు తాత్కాలికంగా దూరమయ్యాడు చెర్రీ. నిజానికి ఇదో చికిత్సలాంటిది. వాటికి అలవాటు పడిపోయి అవి లేకుండా బతకలేమేమో అనే పరిస్థితికి మనుషులు జారిపోయారు కదా. అలాంటి ఫీలింగ్ నుంచి బయటకు తెచ్చేందుకు ఈ డిజిటల్ డిటాక్స్ ఉపయోగపడుతుంది. 

'ప్రతీ ఏటా ఇలా ఎలక్ట్రానిక్స్ నుంచి వెకేషన్ తీసుకోవడం తప్పనిసరి అని ఉపాసన చెప్పడంతో.. చరణ్ వెంటనే అమలు చేసేశాడు' అంటున్నారు సన్నిహితులు. అసలు చెర్రీలాంటి సెలబ్రిటీ బిజీ పర్సన్ కి ఇది కష్టమే అయినా.. భార్య సహకారంతో బండి లాగించేస్తున్నాడట. ఇదే సమయంలో ఉపాసన కూడా సేమ్ థెరపీ పాటిస్తోంది. ఎంతైనా భార్య చెప్పగానే వెంటనే అమల్లో పెట్టేశాడంటే.. చెర్రీని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది కదూ. 

15/06/2016

ఫ్యాన్స్ కోసం చెర్రీ చేసిన ఛేంజెస్

రామ్ చరణ్ తేజ్ ఇప్పుడు ధృవ షూటింగ్ లో మహా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నాడు. కోలీవుడ్ మూవీ తని ఒరువన్ ని రీమేక్ చేయాలని ఫైనలైజ్ చేశాక.. తెలుగు ఆడియన్స్ కి తగినట్లుగా కొన్ని మార్పులు చేశారనే టాక్ వినిపించింది. అయితే.. సూరి చేసిన ఛేంజెస్ అంతగా ఆకట్టుకోకపోవడం తమిళ వెర్షన్ ఇంకా పటిష్టంగా ఉండడం.. అసలు కోలీవుడ్ మూవీకి ఏ మార్పులు చేయాల్సిన అవసరం లేదని చిరు సూచించడంతో.. సేమ్ డిట్టో దించేసేలా సినిమా రెడీ అవుతోంది. 

కోలీవుడ్ సినిమానే యాజ్ ఇట్ఈజీ గా ఫాలో అవుతారని తెలియడంతో.. చెర్రీ ఫ్యాన్స్ బాగా డిజప్పాయింట్ అయ్యారు. ఇందుకు కారణం.. ఒరిజినల్ వెర్షన్ లో పాటలకు అంతగా స్కోప్ లేకపోవడమే. కానీ తెలుగు ఆడియన్స్ మాత్రం రామ్ చరణ్ నుంచి కచ్చితంగా డ్యాన్స్ నెంబర్స్ కోరుకుంటారనే విషయంలో సందేహం అక్కర్లేదు. అందుకే తమిళ్ సినిమాలో.. పాటల మేరకు మార్పులు ఉండేలా చరణ్ ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. చెర్రీకి చాలా ఇష్టమైన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్.. డ్యాన్స్ మూమెంట్స్ సమకూర్చనున్నాడు. 

ఈ మార్పులే కాదు.. తన గెటప్ లోనూ చరణ్ మేకోవర్ చూపించిన విషయం ప్రీ లుక్ తోనే తెలిసిపోయింది. ఇప్పటికే 2 షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకున్న ధృవ.. త్వరలో 12 రోజుల షెడ్యూల్ కోసం కశ్మీర్ కు వెళ్లనుంది. ఈ నెల 20 నుంచి జూలై ఫస్ట్ వరకూ కశ్మీర్ షెడ్యూల్ ఉండనుంది. 

13/06/2016

అఖిల్ కి ఇన్ స్పిరేషన్ మెగాస్టార్ -నాగ్

సినీ'మా' అవార్డ్స్ లో ఉత్తమ డెబ్యూ యాక్టర్ గా అక్కినేని అఖిల్ కి అవార్డు దక్కింది. దీన్ని అందుకునేందుకు అఖిల్ రాకపోవడంతో.. అక్కినేని నాగార్జున ఈ అవార్డును స్వీకరించారు. కొడుకు తరపున అవార్డు తీసుకున్న నాగ్ మాట్లాడిన మాటలు.. అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాయి. 

'అఖిల్ ఫస్ట్ ఫిలిం సరిగ్గా ఆడకపోయినా.. ఈ అవార్డ్ చిరంజీవి గారి చేతుల మీదుగా రామ్ చరణ్ చేతుల మీదుగా... అంతటి ఇన్ స్పిరేషన్ చేతుల మీదుగా అవార్డ్ వస్తే అంత కంటే ఇంకేం కావాలి? ఈ అవార్డ్ వచ్చింది అనే కంటే ఎవరి చేతుల వచ్చిందో చెప్తాను అఖిల్ కి' అన్నారు నాగార్జున. నిజానికి అఖిల్ మొదటి మూవీ అఖిల్ డిజాస్టర్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే.. అవార్డు ఫంక్షన్ లో ఈ మాటను ఒప్పుకునేందుకు చాలానే ధైర్యం కావాలి. అలాంటి గట్స్ ఉన్న రియల్ హీరో నాగార్జున.

ఆడినా ఆడకపోయినా.. ఎలా ఉన్నా సరే.. ఇదే బెస్ట్ అని ఊదరగొట్టే సినీ జనాలు ఉన్న అంత పెద్ద మూవీ ఫంక్షన్ లో.. తన కొడుకు మొదటి సినిమా సరిగ్గా ఆడలేదు అని నాగ్ చెప్పడం.. చాలామందిని మెస్మరైజ్ చేసింది. ఇలా ధైర్యంగా ఒప్పుకోగలిగేవారు పైకి చెప్పగలిగేవారు ఇండస్ట్రీలో వేరెవరకూ కనిపించరనే కామెంట్స్ అక్కడే వినిపించాయి. ఏమైనా టాలీవుడ్ కింగ్ లో నిజాయితీ పాళ్లు బాగా ఎక్కువబ్బా!