ఈ మధ్యన రామ్ చరణ్ కోసం ఏకంగా ముంబయ్ నుండి ఒక పి.ఆర్. ఏజన్సీని దించింది ఆయన భార్య ఉపాసన కామినేని. అయితే ఈ ఏజన్సీ వారు కేవలం ఏదో ఏజన్సీ అన్నట్లు కాకుండా.. అసలు ముంబయ్ టచ్ అంటే ఏంటో చూపిస్తున్నారు. సోషల్ మీడియాలో చరణ్ చేత స్వయంగా ఇంటర్యూలు పెట్టించడం.. అన్ని లీడింగ్ మీడియా హౌసుల్లోనూ చరణ్ గురించి కవరేజ్ విపరీతంగా పెంచడం వంటి చేస్తున్నారు. మామూలుగానే ఈ మెగా హీరోకు ఉన్న క్రేజ్ కారణంగా ఏదైనా వార్తే అవుతుంది. ఇక స్వయంగా ఒక ఏజన్సీ రంగంలోకి దిగి ఆ పనిచేస్తుంటే.. ఇంకేముంది క్రేజ్ డబుల్ అవుతుంది.
అసలు ఉపాసన ఇంత కేర్ తీసుకోవడానికి ఒక పెద్ద రీజనే ఉంది. నిజానికి ఇప్పటివరకు రామ్ చరణ్ కేవలం మెగా క్రేజ్ పైనే ఆధారపడ్డాడు కాని.. సొంతంగా బ్రాండింగ్ చేసుకోలేదు. గతంలో నమ్రతా శిరోద్కర్ ఎలాగైతే మహేష్ ను ఒక బ్రాండ్ గా తీర్చిదిద్ది ఏకంగా డజను బ్రాండ్ల తాలూకు యాడ్స్ అతని చేతిలోకి తెచ్చిందో.. ఇప్పుడు ఉపాసన కూడా సేమ్ అదే ఫాలో అవుతోందట. మొదట కార్పొరేట్ కంపెనీల యాడ్లను తెచ్చి.. తరువాత పెద్ద పెద్ద ప్రాడక్టులను కొన్ని చరణ్ ఖాతాలో వేయిస్తుందట. దాని తరువాత బాలీవుడ్డులో వీలైతే మరో రెండు సినిమాలను కూడా చరణ్ చేత సైన్ చేయిస్తారని తెలుస్తోంది. ఆ దిశగానే ఉపాసన ప్లాన్స్ అమలవుతున్నాయి.
ఇవన్నీ చేయడం వలన బ్రాండ్ వాల్యూ పెరగడమే కాదు.. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు చరణ్ తో సినిమాలను చేయడానికి క్యూ కట్టే ఛాన్సుంది. అయితే ఇలాంటి బ్రాండింగ్ ఎంత చేసినా కూడా.. కంటెంట్ వైజ్ మంచి సినిమాలను సెలక్టు చేసుకుని హిట్లు కూడా కొట్టాల్సిన ఆవశ్యకత ఉంది.
No comments:
Post a Comment