01/07/2016

మెగా క్రికెట్ టీం.. పవన్ కొడుకే బ్యాలెన్స్

"మా ఫ్యామిలీ హీరోలంతా కలిస్తే.. ఓ క్రికెట్ టీమ్ అంత ఉంటుంది".. కొన్ని నెలల క్రితం ఓ మెగా హీరో మీడియా ముందు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది.  పవన్ రాలేదేంటి అని మీడియా అడిగిన సందర్భంలో.. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ఇలా చెప్పి.. అందరూ అన్నిసార్లు రావాలంటే కుదురుతుందా? అని నిలదీశాడు. ఆ అడిగిన సందర్భం ఏదైనా.. ఈ మాటేమీ అతిశయోక్తి కాదు. అలాగని సొంత డబ్బా అంతకంటే కాదు. మెగా ఫ్యామిలీ నిజంగానే అంతమంది హీరోలు ఉన్నారు. 

మెగాస్టార్ చిరంజీవి.. నాగేంద్ర బాబు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. రామ్ చరణ్ తేజ్.. అల్లు అర్జున్.. అల్లు శిరీష్- సాయిధరంతేజ్.. వరుణ్ తేజ్.. ఇలా 8మంది హీరోలు ఇప్పటికే టాలీవుడ్ లో ఉన్నారు. వీరు కాకుండా.. సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ కూడా హీరో అయ్యేందుకు ట్రైనింగ్ అవుతున్నాడని తెలుస్తోంది. రీసెంట్ గా చిరు ఫ్యామిలీలోకి ఎంటర్ అయిన చిన్నల్లుడు కళ్యాణ్ కూడా హీరోగా మారేందుకు ఉత్సాహం చూపుతున్నాడనే టాక్ ఉంది. అంటే.. ఈ కళ్యాణ్ నెంబర్ 10 అన్నమాట.

ఇంకొక్కరు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చారంటే.. వరుణ్ తేజ్ చెప్పిన మెగా క్రికెట్ టీమ్ రెడీ అయిపోతుంది. ఆ పదకొండో బ్యాట్స్ మెన్ గా వచ్చే అవకాశాలు ఎవరికున్నాయో తెలుసా? ఇంకెవరు బుల్లి పవర్ స్టార్ అకీరాకే. ఏజ్ ప్రకారం చూస్తే.. చిరు కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి హీరోగా వచ్చే అవకాశాలు అకీరా కి మాత్రమే ఉన్నాయి. అలా అకీరాతో క్రికెట్ టీమ్ రెడీ అవుతుందన్న మాట. 

No comments:

Post a Comment