Showing posts with label Pawan Kalyan. Show all posts
Showing posts with label Pawan Kalyan. Show all posts

16/11/2016

ఈ సంగతి తెలిస్తే పవన్ కు ఫ్యాన్ అయిపోవాల్సిందే

సినిమావాళ్లు చాలా కమర్షియల్ గా ఉంటారని చెబుతుంటారు. పని ఉందా పూసుకుంటారని.. పని పూర్తి అయ్యాక ఎవరో తెలీదన్నట్లుగా వ్యవహరిస్తారని.. అది వారి తప్పు కాదని.. వారున్న ఇండస్ట్రీ అలాంటిదని చెబుతుంటారు. ఇక్కడ తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే అన్నట్లుగా వ్యవహరిస్తారని.. పైకి ఎంత పూసుకున్నా.. లెక్కల దగ్గరికి వచ్చేసరికి మాత్రం చాలా మొండిగా ఉంటారని ఏ మాత్రం తగ్గరన్నట్లు చెబుతుంటారు. అయితే.. ఇలాంటి మాటలకు పూర్తి భిన్నంగా కనిపిస్తారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్.

మిగిలిన హీరోలకు చాలా భిన్నమని కొందరు.. మంచితనానికి నిలువెత్తు రూపంగా మరికొందరు వర్ణిస్తే.. ఎప్పుడేం చేస్తాడో తెలీదని.. టెంపర్ మెంట్ చాలా ఎక్కువని.. మెంటలోడని మరికొందరు ఆయనపై ఘాటు విమర్శలు చేస్తుంటారు. మరింత మాట అంటున్నారు కదా.. దానికేమైనా ఆధారం ఉందా? అంటే.. మళ్లీ మాట్లాడని పరిస్థితి.

ఇదంతా ఒక కోణమైతే.. సాయం ఎవరికి వచ్చినా సరే.. సహాయం చేసేందుకు పెద్ద మనసుతో పవన్ ముందుంటారని ఆయన్ను అభిమానించని వారుసైతం ఒప్పుకునే మాట. రాజకీయంగా.. సినిమాల పరంగా ఆయన్ను వ్యతిరేకించే వారు మాత్రం వ్యక్తిగతంగా పవన్ ను విమర్శించేందుకు ఇష్టపడరు. ఆయన చేసే గుప్త దానాల గురించి కొందరు అనుకోని రీతిలో ఓపెన్ అయిపోవటం.. పవన్ లో ఇలాంటి మనిషి దాగి ఉన్నాడా? అనిపించక మానదు. కష్టంలో ఉన్న వారికి సాయం చేసే గుణం పవన్ లో చిన్నతనం నుంచి ఉందని.. ఆ మాటకు వస్తే.. సినిమాల్లోకి రాక ముందే ఆయనలో ఆ లక్షణం ఉందని తెలిసినప్పుడు మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే.

తాజాగా.. సినిమా ఇండస్ట్రీలో హీరోలకు ఓనమాలు నేర్పించే స్టార్ మేకర్ సత్యానంద్ ఓ టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన పలు హీరోల గురించి చెప్పుకొచ్చారు. దాదాపు 95 మంది హీరోల్ని సినిమా ఇండస్ట్రీకి ఇచ్చిన ఆయన.. పవన్ కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పుకొచ్చారు. తన దగ్గర యాక్టింగ్ లో శిక్షణ పొందిన పవన్.. తర్వాత కూడా టచ్ లో ఉండేవాడని.. చాలా స్నేహంగా ఉండేవాడని.. హైదరాబాద్ రావాలని కోరేవాడని చెప్పారు.

‘‘ఓ రోజు ముంబయి నుంచి వైజాగ్ వెళుతున్నప్పుడు హైదరాబాద్ రమ్మన్నాడు. చెల్లెలి పెళ్లి ఉందని కుదరదని చెప్పా. అంతే.. నా ఆర్థిక పరిస్థితి గురించి ఆరా తీశాడు. సికింద్రాబాద్ స్టేషన్ కు వచ్చి కలిశాడు. ఓ చిన్న బాక్స్ చేతిలో పెట్టాడు. ఇంటికెళ్లి చూస్తే.. అందులో రూ.50వేలు ఉన్నాయి. ఆ తర్వాత పెళ్లికి వచ్చి మరో రూ.50వేలు ఇచ్చాడు. అడగకుండానే ఇంత సాయం చేశాడు. ఇదంతా 1993లో జరిగింది. అప్పటికి పవన్ ఇంకా సినిమాల్లో యాక్ట్ చేయలేదు. అయినా.. అప్పట్లోనే అంత పెద్ద సాయం చేశాడు. సేవాగుణం పవన్ సహజ లక్షణం’’ అంటూ పవన్ గురించి చెప్పుకొచ్చారు. సినిమా ఇండస్ట్రీలో మనుషులు చాలా కమర్షియల్ గా ఉంటారని చెప్పే ఉదంతాలకు పవన్ కల్యాణ్ మినహాయింపుగా చెప్పక తప్పదు.

21/09/2016

కాటమరాయుడితో కొత్తమ్మాయి

మామూలుగా ఓ స్టార్ హీరో సినిమా అంటే.. ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురు చూస్తారు అభిమానులు. ఐతే పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం ఆయన సినిమా ఎప్పుడు మొదలవుతుంది.. ఎప్పుడు రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు ప్రారంభిస్తారు అని చూస్తారు ఫ్యాన్స్. పవన్ లాస్ట్ మూవీ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ విషయంలో ఎంత జాప్యం జరిగిందో తెలిసిందే. లేటెస్ట్ మూవీ ‘కాటమరాయుడు’ ముహూర్తం జరుపుకుని మూడు నెలలు దాటింది. ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ విషయంలో అనుకున్న డేట్లు రెండు మూడు దాటిపోయాయి. ఎట్టకేలకు ఈ నెల 24 నుంచి సినిమా నిజంగానే సెట్స్ మీదికి వెళ్లిపోతుందని అంటున్నారు.

ఈ నేపథ్యంలో ‘కాటమరాయుడు’ గురించి ఓ కొత్త అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాలో యామినీ భాస్కర్ అనే కొత్తమ్మాయి కీలక పాత్ర పోషిస్తోందట. ఈ సినిమాలో శ్రుతి హాసన్ ఓ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి యామిని పాత్ర ఏంటో చూడాలి. యామిని ఇంతకముందు ‘కీచక’ అనే సినిమాలో హీరోయిన్ పాత్ర చేసింది. అలాగే ‘రభస’లో ఓ చిన్న క్యారెక్టర్ చేసింది. పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ స్టార్ సినిమాలో ఛాన్స్ అనగానే ఉబ్బితబ్బిబ్బయిపోతోంది యామిని. పవన్ తో ఇంతకుముందు ‘గోపాల గోపాల’ తీసిన కిషోర్ పార్థసాని (డాలీ) దర్శకత్వం వహించబోయే సినిమా ఇది. పవన్ మిత్రుడు శరత్ మరారే నిర్మిస్తున్నాడు. అనూప్ రూబెన్స్ దర్శకత్వం వహిస్తాడు

16/09/2016

Pawan Kalyan is A JOKER - Asaduddin Owaisi

Ever since Pawan Kalyan spoke in Kakinada meeting, there has been huge buzz regarding Pawan's political career. However most of the Political parties considered him as a big fat joke. Already we reported that many political leaders mocking Pawan Kalyan.

Now AIMIM party President Asaduddin Owaisi addressed a Public meet recently and called Jana Sena President and actor Power Star Pawan Kalyan as a joker for his support to the Prime Minister Narendra Modi. Asaduddin Owaisi also said that Modi is solely responsible for death of 350 people during Godhra violence. He further lashed out TDP Chief Chandrababu Naidu saying that he was in alliance with BJP and still supporting them. He asked the crowd to utter the name of actor who met Modi ji in person and extended his unconditional support.

And soon after everyone said Pawan, he called him as JOKER in a satirical manner. Earlier Owaisi had slammed the Bollywood actor Salman Khan when he met Modi and urged his supporters to boycott Salman Khan’s movies.

కొమరం పులిలా రావయ్యా.. పవన్

ఆ ఇద్దరూ సినిమాల్లో మంచి పేరున్నవాళ్లే. ఇప్పుడు రాజకీయాల్లోనూ వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ పాపులరే. ఇద్దరూ కలిసి నటించిన సందర్భాలు లేకపోయినా ఒకే కాలంలో రాజకీయాలు చేస్తున్నారు. తాజాగా అందులో ఒకరిపై ఇంకొకరు ఘాటైన విమర్శలే చేయడంతో రాజకీయంగా అలజడి రేగుతోంది. అందులో ఒకరు ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్న జనసేన అధినేత - హీరో వపన్ కళ్యాణ్ అయితే... రెండో వ్యక్తి - వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత - మాజీ హీరోయిన్ రోజా.  పవన్ తన హీరోయిజం చూపించాలే కానీ గోడ మీద పిల్లిలా ఉండకూడదని ఆమె అనడం సంచలనంగా మారింది.

ప్రజాసేవ చేయాలని - రాజకీయాల్లోకి రావాలని ఆలోచించే పక్షంలో గోడమీద పిల్లిలా పూటకో మాట చెప్పకుండా కొమరం పులిలా వచ్చి ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు పోరాడాలని పవన్ కు రోజా  సలహా ఇచ్చారు. తిరుపతిలో జరిగిన అఖిలపక్ష నేతల నిరాహారదీక్షలో పాల్గొన్న ఆమె ఎన్నికలు జరుగుతున్నప్పుడు వచ్చిన పవన్ - టీడీపీ - బీజేపీలకు మద్దతిస్తున్నట్టు చెప్పి వెళ్లిపోయారని - ఆపై రెండున్నరేళ్ల సమయంలో రెండు మీటింగులు పెట్టి డైలాగులు కొట్టారని ఎద్దేవా చేశారు. చేతనైతే ఎన్టీఆర్ లా పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చి చూపాలని సవాల్ విసిరారు. 

మరోవైపు తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని వాగ్దానాలు చేసిన విషయాన్ని గుర్తు చేసిన ఆమె నాడు పవన్ కూడా హోదా వస్తుందని చెప్పారని ఇప్పుడిక రెండున్నరేళ్ల తరువాత ఇంకా వేచి చూసే ధోరణి ఏంటని ప్రశ్నించారు. కాగా పవన్ పై బీజేపీ నేతలు మండిపడుతున్నా వైసీపీ నుంచి ఎవరూ ఆయనపై ఫైరవ్వలేదు. తాజాగా రోజా వ్యాఖ్యలతో పవన్ పై విమర్శల దాడి మరింత పెరిగినట్లయింది. కాగా... రాజకీయంగా విమర్శలు ఎలా ఉన్నా పవన్ కుటుంబంతో రోజాకు మంచి సంబంధాలే ఉన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న పవన్ సోదరుడు చిరంజీవితో రోజా పలు సినిమాల్లో నటించారు. పవన్ మరో సోదరుడు నాగబాబు - రోజాలు కలిసి ప్రస్తుతం టీవీ షోల్లో జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. వ్యక్తిగతంగా మంచి సంబంధాలే ఉన్నా రాజకీయంగా పవన్ వైఖరిని మాత్రం రోజా తీవ్రంగా తప్పు పట్టారు. మరి రోజా విమర్శలను విమర్శలుగా కాకుండా సూచనలుగా తీసుకుని పవన్ మారుతాడా.. కొమరం పులిలా విజృంభించి రోజా కోరిక తీరుస్తాడా అన్నది చూడాలి.

15/09/2016

పవన్‌ మహేష్‌కు సపోర్టిచ్చాడు-రేణు

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మాజీ భార్య రేణు దేశాయ్‌ ఈ రోజు ఒక ఆసక్తికర ఇంటర్వ్యూను తన ట్విట్టర్‌ పేజీలో షేర్‌ చేసింది. తనపై దుష్ప్రచారం చేస్తూ.. తనను తిట్టిపోస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టే అభిమానుల్ని టార్గెట్‌ చేస్తూ ఆమె కొన్ని వ్యాఖ్యలు చేసింది. యాంటీ ఫ్యాన్స్‌ కొందరు తనను తరచుగా తిడుతూ పోస్టులు పెడుతుంటారని.. ఇది ఎంత మాత్రం సబబు కాదని ఆమె పేర్కొంది.

తెలుగు హీరోలందరూ చాలా మంచి సంబంధాలు కలిగి ఉంటారని.. తాను పవన్‌తో ఉన్నపుడు వెంకటేష్‌ తరచుగా తమ ఇంటికి వచ్చేవారని.. అలాగే అప్పట్లో తన సినిమా పైరసీకి సంబంధించి మహేష్‌ బాబు పోరాడినపుడు పవన్‌ అతడికి అండగా నిలిచాడని.. సాయం చేశాడని.. హీరోలందరూ స్నేహంగానే ఉన్నా అభిమానులు మాత్రం అవతలి హీరోల మీద ఇలా ఎందుకు దుష్ప్రచారం చేస్తారో.. వారి కుటుంబ సభ్యుల మీద సోషల్‌ మీడియాలో ఎందుకు దాడి చేస్తారో అర్థం కాదని రేణు పేర్కొంది.

తాను పవన్‌ కళ్యాణ్‌కు 17 ఏళ్లుగా స్నేహితురాలినని.. తన బిడ్డలకు తల్లినని.. తాను పవన్‌ ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పెడితే వేరే హీరోల అభిమానులు అభ్యంతరం ఏంటని.. తనను ఎందుకు దూషిస్తారని రేణు ప్రశ్నించింది. అభిమానులు తమ హీరో మీద ఎంత అభిమానమైనా చూపించవచ్చని.. కానీ అవతలి హీరోల కుటుంబ సభ్యుల్ని టార్గెట్‌ చేయడం మాత్రం కరెక్ట్‌ కాదని రేణు పేర్కొంది.

రోజూ పవన్ ఫోటోలు పోస్ట్ చేస్తా -రేణు

పవన్ మాజీ వైఫ్ రేణూ దేశాయ్ ఈ మధ్య ఓసారి పవన్ కళ్యాణ్ ఇంటెన్స్ లుక్ తో అన్ సీన్ ఫోటోను ఒకటి ట్వీట్ చేసింది. అప్పటి నుంచి రేణును విపరీతంగా ట్రాలింగ్ చేస్తున్నారు చాలామంది. 'మీరందరూ ఫ్యాన్స్.. నేను ఫ్రెండ్.. నేనెందుకు పవన్ కళ్యాణ్ ఫోటో పోస్ట్ చెయ్యకూడదు.. నేనెందుకు పవన్ గురించి మాట్లాడకూడదు' అంటోంది రేణూ దేశాయ్.

'ఆయనకి ఇష్టం..నాకు ఇష్టం.. ఆయనకి ఇష్టం లేకపోతే నేను మాట్లాడను.. ఎవరికో ఎందుకు ప్రాబ్లెం అయితే నేనెందుకు పట్టించుకోవాలి? విడాకులపై జస్ట్ ఓ సంతకం చేసిన తర్వాత.. మీరు ఇప్పుడు మేం విడిపోయిన క్లైమాక్స్ చూస్తున్నారు. 1999 నుంచి ఈ జర్నీలో 11 ఏళ్లపాటు ఒక భాగం. నేను తన పిల్లలకు తల్లిని. తను నా ఫ్రెండ్. మాకు ఇద్దరు పిల్లలున్నారు.. మేమేం శత్రువులు కాదు. గొడవపడి విడిపోలేదు.. పిల్లల ఎమోషనల్ ఈక్వేషన్ కోసం మేం ఫ్రెండ్లీ రిలేషన్ ని కలిగి ఉన్నాం' అంటూ తన ఆవేశం వెలిబుచ్చింది పవన్ మాజీ వైఫ్. 

'పక్క హీరోల ఫ్యాన్సే ఇదంతా చేస్తున్నారు. నాకేదో క్రేజ్ తెచ్చుకోవడం అంటూ ఆరోపణలు చేస్తారు. నిజానికి స్టార్స్ కి మంచి రిలేషన్స్ ఉన్నాయ్. వెంకటేష్ చాలా సార్లు మా ఇంటికొచ్చారు. మహేష్ ని కళ్యాణ్ గారు పైరసీ ఇష్యూలో సపోర్ట్ చేశారు. వాళ్లంతా ప్రొఫెషనల్స్' అని చెప్పిన రేణూ.. 'సెలబ్రిటీలు పర్ఫెక్ట్ గా ఉండాల్సి వస్తుందని.. కామన్ పబ్లిక్ ఎలా అయినా ఉండొచ్చా' అని నిలదీసింది. 

'మీకు నచ్చకపోతే ఆ హీరోల అమ్మ.. భార్యను తిట్టడం పద్ధతి కాదు.. సంస్కారం కాదు.. మీ అమ్మానాన్నలు నేర్పింది ఇది కాదు' అంటూ ట్విట్టర్ లో తనకు బూతులు ట్వీట్ చేస్తున్న వాళ్లకు క్లాస్ పీకేసింది.  'మీప్లాబ్లెమ్స్ మీరే చూస్కోండి.. నేను ట్విట్టర్ వదిలిపెట్టను.. రోజూ నేను ఆయన ఫోటోలు ట్వీట్ చేస్తా.. పిల్లల ఫోటోలు మాత్రం అప్పుడప్పుడు పోస్ట్ చేస్తా' అని చెప్పింది రేణు దేశాయ్. చివరగా 'ఆయన నా ఫ్రెండ్. నా పిల్లలకు ఆయన తండ్రి. తన పిల్లలకు నేను తల్లి' అని చెప్పింది పవన్ కళ్యాణ్ మాజీ వైఫ్. 

14/09/2016

కాటమరాయుడు.. కొత్త డేట్

ఇప్పటికే మూడున్నర నెలలవుతోంది పవన్ కళ్యాణ్ తన కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టి. కానీ షూటింగ్ విషయంలో మాత్రం ఒక్క అడుగూ ముందుకు పడలేదు. ఇదిగో అదిగో అంటున్నారు కానీ.. రెగ్యులర్ షూటింగ్ మాత్రం మొదలు కాలేదు. ఆ మధ్య రెండు రోజులు ఏదో లాంఛనంగా షూటింగ్ చేశారన్నారు కానీ.. అందులో కూడా ఎంత వాస్తవమో తెలియదు. ఇంతలో పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా అతడి పాత లుక్ ఒకదానికి కొంచెం హంగులద్ది ‘కాటమరాయుడు’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. పవన్ ఉన్నట్లుండి ప్రత్యేక హోదా అంశాన్ని నెత్తికెత్తుకుని పోరాటం మొదలుపెట్టడంతో అసలు ఈ సినిమా ఏమవుతుందో అని అంతా సందేహించారు.

ఇలాంటి టైంలో ‘కాటమరాయుడు’కు సంబంధించి ఓ లేటేస్ట్ అప్ డేట్ ఒకటి బయటికి వచ్చింది. ఈ నెల 24 నుంచి ‘కాటమరాయుడు’ రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందట. పవన్ కళ్యాణ్ - శ్రుతిహాసన్ లతో పాటు కీలక పాత్రధారులందరూ ఈ షెడ్యూల్లో షూటింగుకి హాజరవుతారట. మధ్యమధ్యలో కొన్ని పొలిటికల్ కమిట్మెంట్ల కోసం కొన్ని డేట్లను మినహాయిస్తే పవన్ రెగ్యులర్ గా షూటింగులో పాల్గొంటాడని సమాచారం. ఈ ఏడాది చివరికల్లా టాకీ పార్ట్ పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. దీని తర్వాత త్రివిక్రమ్ సినిమాను కూడా వెంటనే మొదలుపెట్టాలని పవన్ భావిస్తున్నాడు. డాలీ దర్శకత్వం వహిస్తున్న ‘కాటమరాయుడు’ను పవన్ మిత్రుడు శరత్ మరారే నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

రేణు దేశాయ్ సెన్సేషనల్ ఇంటర్వ్యూ?

పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయినప్పటికీ ఎప్పుడూ తెలుగు వాళ్లతో టచ్ లోనే ఉంది రేణు దేశాయ్. పవన్ మీద తరచుగా ఆమె తన ప్రేమను వ్యక్తం చేస్తూనే ఉంటుంది. అభిమానుల్ని ఉద్దేశించి కూడా సోషల్ మీడియాలో ఏవో పోస్టులు పెడుతూనే ఉంటుంది. ఐతే కొందరు అభిమానులు ఆమెను కించపరిచేలా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్నారట. పోస్టులు పెడుతున్నారట. వీటిపై ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఇలాంటి వాళ్లకు రిటార్ట్ ఇచ్చేలా ఓ ఇంటర్వ్యూ ఇచ్చిందట. ఆ ఇంటర్వ్యూ వీడియోను ఈ రోజు సాయంత్రం తర్వాత పోస్ట్ చేయబోతున్నానంటూ ట్విట్టర్లో ఓ మెసేజ్ పెట్టింది రేణు.

‘‘ఈ రోజు సాయంత్రం ఒక ముఖ్యమైన ఇంటర్వ్యూను పోస్ట్ చేస్తాను. అందులోని విషయం నన్ను ఆదరించి.. నా మంచి కోరే అభిమానుల్ని ఉద్దేశించి కాదు. అది ఫేస్ బుక్.. ట్విట్టర్లో నా పర్సనల్ లైఫ్ గురించి వెకిలిగా ప్రవర్తిస్తున్న వారిని ఉద్దేశించినది. ఈ వీడియో చూశాక అయినా వాళ్లలో మార్పు వస్తుందని ఆశిస్తన్నాను. నా నిజమైన అభిమానులకు నేను ఎప్పుడూ కృతజ్నురాలినే’’ అంటూ తెలుగు మాటల్ని ఇంగ్లిష్ లో టైప్ చేసి ఈ మెసేజ్ పెట్టింది రేణు. ఆమె మాటల్ని బట్టి చూస్తుంటే ఈ ఇంటర్వ్యూ కొంచెం సెన్సేషనల్ గానే ఉండేలా కనిపిస్తోంది. తనను ట్రోల్ చేసే వాళ్లను ఉద్దేశించి రేణు గట్టి రిటార్టే ఇచ్చినట్లుంది.

పవన్ కళ్యాణ్ ‘బోస్’ కాబోతున్నాడా?

ఫిలిం ఛాంబర్లో ఈ మధ్య కొత్తగా రిజిస్టరైన టైటిళ్లు భలే ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఇందులో కొందరు బడా స్టార్ల సినిమాలకు సంబంధించిన టైటిళ్లతో పాటు కొన్ని క్రేజీ సినిమాల పేర్లు కూడా ఉన్నాయి. లేటెస్ట్ టైటిళ్లలో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్నది ‘బోస్’. ఈ టైటిల్ దాసరి నారాయణరావు సంస్థ ‘తారకప్రభు ఫిలిమ్స్’ పేరిట రిజిస్టరవడం విశేషం. ‘సన్ ఆఫ్ ఇండియా’ అనేది క్యాప్షన్. దాసరి తన బేనర్లో సినిమా తీసి చాలా కాలమైంది. ఈ మధ్యే పవన్ కళ్యాణ్ తో కమిటైన సినిమాకు సంబంధించి ఓ ప్రకటన కూడా ఇచ్చారు. మరి ‘బోస్’ అనే టైటిల్ పవన్ కోసమేనా.. లేక తన కొడుకు అరుణ్ కుమార్ తో సినిమా తీయడానికేమైనా రిజిస్టర్ చేయించాడా అన్నది తెలియాల్సి ఉంది.

మరోవైపు అశ్వనీదత్ రిజిస్టర్ చేయించిన ‘జగదేక వీరుడు’ టైటిల్ రామ్ చరణ్ తో చేయాల్సిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి రీమేక్’కు సంబంధించినదే అని భావిస్తున్నారు. రవితేజ సినిమా కోసం ‘క్రాక్’ అనే టైటిల్.. రామ్ సినిమాకు ‘క్రేజీ ఫీలింగ్’ అనే పేరు.. ఎన్టీఆర్ కోసం అతడి అన్నయ్య కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్ పేరు మీద ‘బాక్సర్’ అనే టైటిల్ రిజిస్టర్ చేయించారు. అలాగే అభిషేక్ పిక్చర్స్ అవసరాల శ్రీనివాస్ తో తీయబోయే ‘హంటర్’ రీమేక్ కోసం అదే పేరును రిజిస్టర్ చేయించింది. బాలాజీ సినీ మీడియా గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తీస్తున్న సినిమా కోసం ‘తోపు’ అని ఓ టైటిల్.. ‘గౌతమ్ నందా’ అని మరో టైటిల్ రిజిస్టర్ చేయించింది. 

13/09/2016

పవన్ పై లోకల్ లొల్లి మొదలైంది

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశంపై కాకినాడ సభలో బీజేపీ లక్ష్యంగా విమర్శలు  చేసిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ఇపుడు కొత్త రూపంలో కౌంటర్లు ఎదురవుతున్నాయి. ఇప్పటివరకు ఆ పార్టీ జాతీయనేతలు ముఖ్యంగా రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ సిద్ధార్థానాథ్ సింగ్ స్పందించగా ఇపుడు స్థానిక నాయకులు పవన్ పై కౌంటర్లు మొదలుపెట్టేశారు. 

బీజేపీ ఎమ్మెల్యే  శాసనసభలో చీఫ్ విప్ ఆకుల సత్యనారాయణ తాజాగా పవన్ కు సవాల్ విసిరారు. ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీతో ఒనగూడే ప్రయోజనాలపై పవన్ కల్యాణ్ తో బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నట్లు సత్యనారాయణ చాలెంజ్ చేశారు. తన సవాలుకు స్పందించాలనుకుంటే పూర్తి వివరాలతో రావాలని ఆయన సూచించారు. 

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బీజేపీ చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. రెండున్నరేళ్లుగా రాష్ట్ర అభివృద్ధికి చేసిన కృషిని ఈసందర్భంగా వివరించారు. అంధకారంలో ఉన్న రాష్ట్రానికి 24 గంటలు కరెంటు సరఫరా చేసి విద్యుత్ సమస్యలు తొలగించామన్నారు. కేటాయించిన 11 జాతీయ విద్యా సంస్థల్లో ఐఐటి - ఐఐఎం - ఎయిమ్స్ - ఐఐఎస్ ఇఆర్ - ట్రిపుల్ ఐటీ వంటి సంస్థలకు ఇప్పటికే శంకుస్థాపన జరిగిందన్నారు. పోలవరం ముంపు మండలాలను ఏపీ కలిపి ఆ ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురయ్యే అడ్డంకులను కేంద్రం తొలగించిందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే ఖర్చును 100 శాతం భరిస్తుందని చెప్పారు. బడ్జెట్ తో సంబంధం లేకుండా నాబార్డు నుంచి రుణం తీసుకుని నిధులు విడుదల చేస్తుందన్నారు. రైల్వే జోన్ కూడా త్వరలో విశాఖలో ఏర్పాటు చేస్తామన్నారు. విభజన సమయంలో రాజ్యసభలో వెంకయ్యనాయుడు - అరుణ్ జైట్లీ మాత్రమే ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడారన్నారు. నాడు మాట్లాడని కాంగ్రెస్ - వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలు నేడు రాష్ట్ర ప్రయోజనాలపై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ప్రత్యేక హోదా అనేది సాంకేతికంగా ఇవ్వడం కుదరనందు వల్లే ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నట్లు చెప్పారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసినట్లు పవన్ కల్యాణ్ ఆరోపించడం సరికాదన్నారు. పవన్ కల్యాణ్ లో జాతీయ వాదాన్ని గుర్తించిన నరేంద్రమోడీ ఆయనను ప్రమాణ స్వీకారం సమయంలో పార్లమెంటు సెంట్రల్ హాలుకు ఆహ్వానించినట్లు చెప్పారు. పవన్ కల్యాణ్ రెండున్నరేళ్ల నుంచి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను తెలుసుకోకుండా మాట్లాడటం సరికాదన్నారు. ఇప్పటికైనా పవన్ ప్రత్యేక హోదా - ప్యాకేజీ గురించి మాట్లాడాలి అనుకుంటే స్పందించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు చాలెంజ్ చేశారు. 

జనం మనం - మళ్లీ పెన్ను పడుతున్న పవన్

ప్రత్యేక హోదాపై కాక రేపుతున్న జనసేన అధినేత - సినీ హీరో పవన్ కళ్యాణ్ బహిరంగ సభలతో హడావుడి చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన సభలు సమావేశాలతో పాటు పుస్తకం కూడా రాయడానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. రాజకీయ ఇతివృత్తంతో రానున్న ఈ పుస్తకంలో రాజకీయాలు ఎలా ఉండాలి... ప్రస్తుతం ఎలా ఉన్నాయి... తమ కార్యాచరణ ఏంటనేది రాసుకొస్తారని తెలుస్తోంది. ఈ పుస్తకానికి ‘జనం మనం" అన్న టైటిల్ ఖరారు చేసినట్లు వినికిడి.

కాగా పవన్ గతంలోనూ పుస్తకం రాశారు. ఇజం పేరుతో ఆయన రాసిన పుస్తకానికి ఒక మోస్తరు స్పందన వచ్చింది అప్పట్లో.  కొత్త పుస్తకం 'జనం-మనం"కు  మార్పు కోసం యుద్ధం అన్న సబ్ టైటిల్ ఉంటుందని సమాచారం.  ఇప్పటికే మొదలుపెట్టిన ఈ పుస్తకాన్ని మరో రెండు నెలల్లో పూర్తి చేసి విడుదల చేస్తారని తెలుస్తోంది.

ఈ పుస్తకం  ద్వారా జనసేన సిద్ధాంతాలపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇజంలో కంటే మరింత క్లారిటీగా పలు అంశాలను ఈ పుస్తకం ద్వారా పవన్ కల్యాణ్ వివరించే అవకాశాలున్నాయి. రాజకీయంగా పవన్ కు కూడా క్లారిటీ పెరగడం.. అనేక అనుభవాలు.. అన్నిటి నేపథ్యంలో ఈ పుస్తకంలో కొంత వాస్తవిక ధోరణి ఉండొచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. కాకినాడ సభ తరువాత మళ్లీ ఇప్పట్లో సభేమీ లేకపోవడంతో పవన్ పుస్తక రచనలో మునుగుతున్నట్లు సమాచారం.

12/09/2016

పవన్ కళ్యాణ్ కు వార్నింగ్ ఇస్తున్నారుగా

మేము ఇస్తున్నది తిరుమల శ్రీవారి లడ్డు అని కానీ షుగర్ ఉన్నవాళ్ళ కు అది పాచిపోయిన లడ్డు లాగా అనిపిస్తుందని ,అనవసర విమర్శలు కేంద్రంపై చేయొద్దని పవన్ కళ్యాణ్ కు వార్నింగ్ ఇస్తున్నారు బిజెపి నేతలు , కేంద్ర మంత్రులు . ఆంధ్రప్రదేశ్ కు ప్యాకేజీ లు అవసరం లేదని హోదా ఇవ్వాల్సిందే అంటూ పవన్ కేంద్ర ప్రభుత్వం పై అలాగే వెంకయ్య నాయుడు పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే . దాంతో పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసారు బిజెపి నేతలు . కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ కూడా పవన్ ని అదుపులో ఉండమని హెచ్చరించాడు . ఇక ఆంధ్రప్రదేశ్ కి చెందిన బిజెపి నాయకులు అయితే పవన్ పై ఒంటి కాలు మీద లేస్తున్నారు , విమర్శలకు దిగుతున్నారు . పవన్ మాత్రం వాళ్ళ విమర్శలను పట్టించుకోవడం లేదు ప్రస్తుతానికి . మరి ఎలా ? ఎప్పుడు స్పందిస్తాడో చూడాలి .