Showing posts with label Roja. Show all posts
Showing posts with label Roja. Show all posts

16/09/2016

కొమరం పులిలా రావయ్యా.. పవన్

ఆ ఇద్దరూ సినిమాల్లో మంచి పేరున్నవాళ్లే. ఇప్పుడు రాజకీయాల్లోనూ వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ పాపులరే. ఇద్దరూ కలిసి నటించిన సందర్భాలు లేకపోయినా ఒకే కాలంలో రాజకీయాలు చేస్తున్నారు. తాజాగా అందులో ఒకరిపై ఇంకొకరు ఘాటైన విమర్శలే చేయడంతో రాజకీయంగా అలజడి రేగుతోంది. అందులో ఒకరు ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్న జనసేన అధినేత - హీరో వపన్ కళ్యాణ్ అయితే... రెండో వ్యక్తి - వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత - మాజీ హీరోయిన్ రోజా.  పవన్ తన హీరోయిజం చూపించాలే కానీ గోడ మీద పిల్లిలా ఉండకూడదని ఆమె అనడం సంచలనంగా మారింది.

ప్రజాసేవ చేయాలని - రాజకీయాల్లోకి రావాలని ఆలోచించే పక్షంలో గోడమీద పిల్లిలా పూటకో మాట చెప్పకుండా కొమరం పులిలా వచ్చి ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు పోరాడాలని పవన్ కు రోజా  సలహా ఇచ్చారు. తిరుపతిలో జరిగిన అఖిలపక్ష నేతల నిరాహారదీక్షలో పాల్గొన్న ఆమె ఎన్నికలు జరుగుతున్నప్పుడు వచ్చిన పవన్ - టీడీపీ - బీజేపీలకు మద్దతిస్తున్నట్టు చెప్పి వెళ్లిపోయారని - ఆపై రెండున్నరేళ్ల సమయంలో రెండు మీటింగులు పెట్టి డైలాగులు కొట్టారని ఎద్దేవా చేశారు. చేతనైతే ఎన్టీఆర్ లా పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చి చూపాలని సవాల్ విసిరారు. 

మరోవైపు తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని వాగ్దానాలు చేసిన విషయాన్ని గుర్తు చేసిన ఆమె నాడు పవన్ కూడా హోదా వస్తుందని చెప్పారని ఇప్పుడిక రెండున్నరేళ్ల తరువాత ఇంకా వేచి చూసే ధోరణి ఏంటని ప్రశ్నించారు. కాగా పవన్ పై బీజేపీ నేతలు మండిపడుతున్నా వైసీపీ నుంచి ఎవరూ ఆయనపై ఫైరవ్వలేదు. తాజాగా రోజా వ్యాఖ్యలతో పవన్ పై విమర్శల దాడి మరింత పెరిగినట్లయింది. కాగా... రాజకీయంగా విమర్శలు ఎలా ఉన్నా పవన్ కుటుంబంతో రోజాకు మంచి సంబంధాలే ఉన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న పవన్ సోదరుడు చిరంజీవితో రోజా పలు సినిమాల్లో నటించారు. పవన్ మరో సోదరుడు నాగబాబు - రోజాలు కలిసి ప్రస్తుతం టీవీ షోల్లో జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. వ్యక్తిగతంగా మంచి సంబంధాలే ఉన్నా రాజకీయంగా పవన్ వైఖరిని మాత్రం రోజా తీవ్రంగా తప్పు పట్టారు. మరి రోజా విమర్శలను విమర్శలుగా కాకుండా సూచనలుగా తీసుకుని పవన్ మారుతాడా.. కొమరం పులిలా విజృంభించి రోజా కోరిక తీరుస్తాడా అన్నది చూడాలి.

07/09/2016

పవన్ మీద రోజా రివర్స్ అటాక్

మొన్న తిరుపతి సభలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజానుద్దేశించి పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తనను రబ్బర్ సింగ్ అని రోజా అన్న విషయాన్ని గుర్తు చేస్తూ.. నోరుజారితే సస్పెండయి ఇంట్లో కూర్చోవాల్సి వస్తుందంటూ రోజా మీద సెటైర్ వేశాడు పవన్. ఈ వ్యాఖ్యలపై రోజా స్పందిస్తూ.. పవన్ మీద రివర్స్ అటాక్ చేసింది. షూటింగ్ లేనపుడు మాత్రమే పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక హోదా గుర్తుకొస్తుందని.. దాని కోసం పోరాటం అంటూ బయటకు వస్తాడని రోజా విమర్శించింది. ఖాళీ సమయాల్లో పోరాటం చేసే వారు నాయకులు కాలేరని పవన్ ను ఉద్దేశించి రోజా పేర్కొంది. పవన్ కళ్యాణ్ కాకినాడ సభను ప్రభుత్వమే స్పాన్సర్ చేస్తోందని ఆమె ఆరోపించింది. చారు.

తాను ప్రజల సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తానని.. పవన్ కళ్యాణ్ మాదిరి భజన చేయనని ఆమె అన్నారు. అదికారంలో ఉన్న పార్టీ నుంచి ప్యాకేజీ తీసుకోలేదనే తనను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని.. ఈ విషయంలో తాను గర్వపడుతున్నానని రోజా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి కూడా రోజా విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అదికారంలోకి వచ్చినప్పుడల్లా కరవు వస్తుందని.. చంద్రబాబు-కరవు కవల పిల్లలని రోజా వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రత్యేక హోదా సాధించడంలో విఫలమయయారన్నారు. ఆర్థిక ప్యాకేజీ ప్రకటిస్తే కమీషన్లు కొట్టేయొచ్చని టీడీపీ నేతలు ఆలోచిస్తున్నారని ఆరోపించారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిన చంద్రబాబు తన స్వార్థం కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని విమర్శించారు.

21/08/2016

Pawan Kalyan is just Rubber Singh

Jana Sena chief Pawan Kalyan made it clear that he doesn't want to make any statement on Special Category Status in a hurried manner or fit of anger. He, however, wishes to remain patient until Centre makes it stand clear.

YSR Congress MLA RK Roja came down heavily on the Actor-turned-Politician. 'Pawan Kalyan is Gabbar Singh only in Films. In real life, He is just Rubber Singh,' she criticized.