Showing posts with label Renu Desai. Show all posts
Showing posts with label Renu Desai. Show all posts

15/09/2016

పవన్‌ మహేష్‌కు సపోర్టిచ్చాడు-రేణు

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మాజీ భార్య రేణు దేశాయ్‌ ఈ రోజు ఒక ఆసక్తికర ఇంటర్వ్యూను తన ట్విట్టర్‌ పేజీలో షేర్‌ చేసింది. తనపై దుష్ప్రచారం చేస్తూ.. తనను తిట్టిపోస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టే అభిమానుల్ని టార్గెట్‌ చేస్తూ ఆమె కొన్ని వ్యాఖ్యలు చేసింది. యాంటీ ఫ్యాన్స్‌ కొందరు తనను తరచుగా తిడుతూ పోస్టులు పెడుతుంటారని.. ఇది ఎంత మాత్రం సబబు కాదని ఆమె పేర్కొంది.

తెలుగు హీరోలందరూ చాలా మంచి సంబంధాలు కలిగి ఉంటారని.. తాను పవన్‌తో ఉన్నపుడు వెంకటేష్‌ తరచుగా తమ ఇంటికి వచ్చేవారని.. అలాగే అప్పట్లో తన సినిమా పైరసీకి సంబంధించి మహేష్‌ బాబు పోరాడినపుడు పవన్‌ అతడికి అండగా నిలిచాడని.. సాయం చేశాడని.. హీరోలందరూ స్నేహంగానే ఉన్నా అభిమానులు మాత్రం అవతలి హీరోల మీద ఇలా ఎందుకు దుష్ప్రచారం చేస్తారో.. వారి కుటుంబ సభ్యుల మీద సోషల్‌ మీడియాలో ఎందుకు దాడి చేస్తారో అర్థం కాదని రేణు పేర్కొంది.

తాను పవన్‌ కళ్యాణ్‌కు 17 ఏళ్లుగా స్నేహితురాలినని.. తన బిడ్డలకు తల్లినని.. తాను పవన్‌ ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పెడితే వేరే హీరోల అభిమానులు అభ్యంతరం ఏంటని.. తనను ఎందుకు దూషిస్తారని రేణు ప్రశ్నించింది. అభిమానులు తమ హీరో మీద ఎంత అభిమానమైనా చూపించవచ్చని.. కానీ అవతలి హీరోల కుటుంబ సభ్యుల్ని టార్గెట్‌ చేయడం మాత్రం కరెక్ట్‌ కాదని రేణు పేర్కొంది.

రోజూ పవన్ ఫోటోలు పోస్ట్ చేస్తా -రేణు

పవన్ మాజీ వైఫ్ రేణూ దేశాయ్ ఈ మధ్య ఓసారి పవన్ కళ్యాణ్ ఇంటెన్స్ లుక్ తో అన్ సీన్ ఫోటోను ఒకటి ట్వీట్ చేసింది. అప్పటి నుంచి రేణును విపరీతంగా ట్రాలింగ్ చేస్తున్నారు చాలామంది. 'మీరందరూ ఫ్యాన్స్.. నేను ఫ్రెండ్.. నేనెందుకు పవన్ కళ్యాణ్ ఫోటో పోస్ట్ చెయ్యకూడదు.. నేనెందుకు పవన్ గురించి మాట్లాడకూడదు' అంటోంది రేణూ దేశాయ్.

'ఆయనకి ఇష్టం..నాకు ఇష్టం.. ఆయనకి ఇష్టం లేకపోతే నేను మాట్లాడను.. ఎవరికో ఎందుకు ప్రాబ్లెం అయితే నేనెందుకు పట్టించుకోవాలి? విడాకులపై జస్ట్ ఓ సంతకం చేసిన తర్వాత.. మీరు ఇప్పుడు మేం విడిపోయిన క్లైమాక్స్ చూస్తున్నారు. 1999 నుంచి ఈ జర్నీలో 11 ఏళ్లపాటు ఒక భాగం. నేను తన పిల్లలకు తల్లిని. తను నా ఫ్రెండ్. మాకు ఇద్దరు పిల్లలున్నారు.. మేమేం శత్రువులు కాదు. గొడవపడి విడిపోలేదు.. పిల్లల ఎమోషనల్ ఈక్వేషన్ కోసం మేం ఫ్రెండ్లీ రిలేషన్ ని కలిగి ఉన్నాం' అంటూ తన ఆవేశం వెలిబుచ్చింది పవన్ మాజీ వైఫ్. 

'పక్క హీరోల ఫ్యాన్సే ఇదంతా చేస్తున్నారు. నాకేదో క్రేజ్ తెచ్చుకోవడం అంటూ ఆరోపణలు చేస్తారు. నిజానికి స్టార్స్ కి మంచి రిలేషన్స్ ఉన్నాయ్. వెంకటేష్ చాలా సార్లు మా ఇంటికొచ్చారు. మహేష్ ని కళ్యాణ్ గారు పైరసీ ఇష్యూలో సపోర్ట్ చేశారు. వాళ్లంతా ప్రొఫెషనల్స్' అని చెప్పిన రేణూ.. 'సెలబ్రిటీలు పర్ఫెక్ట్ గా ఉండాల్సి వస్తుందని.. కామన్ పబ్లిక్ ఎలా అయినా ఉండొచ్చా' అని నిలదీసింది. 

'మీకు నచ్చకపోతే ఆ హీరోల అమ్మ.. భార్యను తిట్టడం పద్ధతి కాదు.. సంస్కారం కాదు.. మీ అమ్మానాన్నలు నేర్పింది ఇది కాదు' అంటూ ట్విట్టర్ లో తనకు బూతులు ట్వీట్ చేస్తున్న వాళ్లకు క్లాస్ పీకేసింది.  'మీప్లాబ్లెమ్స్ మీరే చూస్కోండి.. నేను ట్విట్టర్ వదిలిపెట్టను.. రోజూ నేను ఆయన ఫోటోలు ట్వీట్ చేస్తా.. పిల్లల ఫోటోలు మాత్రం అప్పుడప్పుడు పోస్ట్ చేస్తా' అని చెప్పింది రేణు దేశాయ్. చివరగా 'ఆయన నా ఫ్రెండ్. నా పిల్లలకు ఆయన తండ్రి. తన పిల్లలకు నేను తల్లి' అని చెప్పింది పవన్ కళ్యాణ్ మాజీ వైఫ్. 

14/09/2016

రేణు దేశాయ్ సెన్సేషనల్ ఇంటర్వ్యూ?

పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయినప్పటికీ ఎప్పుడూ తెలుగు వాళ్లతో టచ్ లోనే ఉంది రేణు దేశాయ్. పవన్ మీద తరచుగా ఆమె తన ప్రేమను వ్యక్తం చేస్తూనే ఉంటుంది. అభిమానుల్ని ఉద్దేశించి కూడా సోషల్ మీడియాలో ఏవో పోస్టులు పెడుతూనే ఉంటుంది. ఐతే కొందరు అభిమానులు ఆమెను కించపరిచేలా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్నారట. పోస్టులు పెడుతున్నారట. వీటిపై ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఇలాంటి వాళ్లకు రిటార్ట్ ఇచ్చేలా ఓ ఇంటర్వ్యూ ఇచ్చిందట. ఆ ఇంటర్వ్యూ వీడియోను ఈ రోజు సాయంత్రం తర్వాత పోస్ట్ చేయబోతున్నానంటూ ట్విట్టర్లో ఓ మెసేజ్ పెట్టింది రేణు.

‘‘ఈ రోజు సాయంత్రం ఒక ముఖ్యమైన ఇంటర్వ్యూను పోస్ట్ చేస్తాను. అందులోని విషయం నన్ను ఆదరించి.. నా మంచి కోరే అభిమానుల్ని ఉద్దేశించి కాదు. అది ఫేస్ బుక్.. ట్విట్టర్లో నా పర్సనల్ లైఫ్ గురించి వెకిలిగా ప్రవర్తిస్తున్న వారిని ఉద్దేశించినది. ఈ వీడియో చూశాక అయినా వాళ్లలో మార్పు వస్తుందని ఆశిస్తన్నాను. నా నిజమైన అభిమానులకు నేను ఎప్పుడూ కృతజ్నురాలినే’’ అంటూ తెలుగు మాటల్ని ఇంగ్లిష్ లో టైప్ చేసి ఈ మెసేజ్ పెట్టింది రేణు. ఆమె మాటల్ని బట్టి చూస్తుంటే ఈ ఇంటర్వ్యూ కొంచెం సెన్సేషనల్ గానే ఉండేలా కనిపిస్తోంది. తనను ట్రోల్ చేసే వాళ్లను ఉద్దేశించి రేణు గట్టి రిటార్టే ఇచ్చినట్లుంది.

06/09/2016

పవన్ ని చూస్తే జెలసీ అంటున్న రేణూ దేశాయ్ 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్నాక.. పిల్లలతో కలిసి రేణూ దేశాయ్ పూనేలో ఉంటున్న సంగతి తెలిసిందే. అక్కడే ఉంటూ సినిమాలు తీసుకుంటున్న ఈమె.. మధ్యమధ్యలో పవన్ కి సంబంధించిన పాత సంగతులు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. కొడుకు అకీరా.. కూతురు ఆద్యల విషయాలను తన-పవన్ అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది రేణూ.

గతంలో పవన్ కళ్యాణ్ ను స్వయంగా తనే తీసిన ఓ ఫొటోను.. రేణు దేశాయ్ అభిమానులకు షేర్ చేసింది. 'కొత్త పిక్చర్ అందిస్తానని ముందే ప్రామిస్ చేశాగా.. తను ఎక్కువగా ఒక కను రెప్ప పైకి లేపి లుక్ ఇస్తుంటారు. అయన స్కిన్ టోన్ అద్భుతం.. ఎప్పుడు చూసినా నేను జెలస్ అయిపోతుంటా. నేను ఈ ఫోటోను ఎడిట్ చేయలేదు. ఇక్కడ కనిపిస్తున్న స్కిన్ టోన్ ఒరిజినల్. యోగాతో పాటు హెల్దీ ఫుడ్ తీసుకోవడంతో కళ్యాణ్ గారి స్కిన్ ఎప్పుడు మెరుస్తూ ఉంటుంది' అని సోషల్ మీడియా సాక్షిగా చెప్పింది  రేణూ దేశాయ్.

మాజీ భర్త సంగతులు బాగానే ఉన్నాయ్ కానీ.. ఇప్పుడు సడెన్ గా పవన్ ను రేణూ ఎందుకు గుర్తు చేసుకుందా అనిపించక మానదు. తను తీసిన ఇష్క్ వాలా లవ్ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్న సందర్భంగా ఫ్యాన్స్ తో ఓ మినీ ఇంటర్వ్యూ చేసింది రేణూ. అందులో కొత్త పిక్ అందిస్తానని ప్రామిస్ చేసి.. ఇలా మాట నిలబెట్టుకుందన్న మాట.

Renu Desai jealous of Pawan Kalyan skin texture

03/09/2016

రేణు దేశాయ్ పవన్ ఫోటోని ఏం చేసిందో తెలుసా

నిన్న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో పవన్ కూతురు ఆద్య తల్లి రేణు దేశాయ్ కు గట్టిగా చెప్పిందట ఓ విషయం ఈరోజు నాన్న పుట్టినరోజు కాబట్టి నీ ఫోన్ లో అందునా ట్విట్టర్ లో నాన్న ఫోటో పెట్టుకోమని దాంతో చేసేది లేక కూతురు ఆనందం కోసం ఆ పనే చేసిందట రేణు దేశాయ్ ఈ విషయాన్నీ గురించి ట్వీట్ చేస్తూ ఆద్య కోరిక మేరకు అలాగే చేశాను అని అంటోంది రేణు దేశాయ్ . పవన్ నుండి విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ పూనే లో పిల్లలతో కలిసి ఉంటున్న విషయం తెలిసిందే . పిల్లలను చూడటానికి అపుడపుడు పవన్ పూణే వెళ్లి వస్తున్నాడు కూడా . పిల్లలంటే పవన్ కు ఇష్టం అంతే ఇష్టం పిల్లలకు కూడా పవన్ పై ఉంది కాబట్టే తల్లి పై వత్తిడి తెచ్చి మరీ పవన్ ఫోటో పెట్టించింది ఆద్య. 

పవన్ కొడుక్కి తెలుగు స్పష్టంగా వచ్చు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ హైదరాబాద్ లో కనిపించడం తక్కువ. చిన్నపుడు తల్లి.. దండ్రి కలిసున్నన్ని రోజులు హైదరాబాద్ లో ఉన్న అకీరా.. వాళ్లిద్దరూ విడిపోయాక తెలుగు గడ్డకు దూరమైపోయాడు. పుణెలో తల్లితో పాటే ఉంటూ అక్కడే చదువుకుంటున్నాడు. అతను తెలుగు చదివే అవకాశమే లేదు. తల్లి ఎలాగూ మరాఠీ కాబట్టి.. ఇంట్లో తెలుగు మాట్లాడే అవకాశం లేదు. మరి అతడికి తెలుగు వస్తుందా అని చాలామందికి సందేహం ఉండొచ్చు.

ఐతే పవన్ కొడుకు స్పష్టంగా తెలుగులో మాట్లాడతాడు అంటోంది రేణు. చిన్నప్పట్నుంచి అకీరాకు తెలుగు బాగానే వచ్చని.. ఇప్పుడు కూడా ఇంట్లో అతను తెలుగులో మాట్లాడుతుంటాడని చెప్పింది రేణు. అకీరా భవిష్యత్తులో తండ్రి దగ్గరికే వస్తాడన్న సంకేతాలు కూడా ఇచ్చింది రేణు. అకీరా భవిష్యత్తేంటన్నది పవన్ చేతుల్లోనే ఉందని ఆమె చెప్పింది. పవన్ ఆడియో వేడుకలకు అకీరా రావడం అన్నది తండ్రి చేతుల్లోనే ఉందని.. ఇందులో తన ప్రమేయం ఏమీ లేదని ఆమె ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది.

ఇక పవన్ ఫేస్ బుక్ లోకి వస్తే బాగుంటుంది కదా అన్న అభిప్రాయాలపై రేణు స్పందిస్తూ.. ‘‘పవన్ సోషల్ మీడియాలోకి రావాలని నేను రెండేళ్ల కిందటే సలహా ఇచ్చాను. కనీసం ట్విట్టర్లోకి అయినా వచ్చాడు సంతోషం’’ అని రేణు పేర్కొంది. పవన్.. రేణు గురించి మాట్లాడి చాలా ఏళ్లయిపోయినా.. రేణు మాత్రం తరచుగా పవన్ ప్రస్తావన తెస్తూ అతడిపై తనకున్న అభిమానాన్ని చాటుకుంటూనే ఉంటుంది.

29/08/2016

Renu Desai shares fav picture of Powerstar

For Powerstar Pawan Kalyan fans to put up a common Display Picture on twitter and Facebook, ex-wife Renu Desai has come up with a picture of Pawan today. 

Shot in 2010, this picture has so much history to speak, if we have to believe what Renu Desai says. "This was clicked by me in 2010. I had just bought my Canon 5D and caught him sitting quietly, thinking, staring into the setting sun rays", tweeted Renu Desai.

Talking about the pictures's natural look, she adds, "I love the intensity of his eyes/look in this, hence it's my fav! Also the skin tone is original and not edited by me". 

Meanwhile, Renu's  directorial venture Ishq Wala Love Telugu version will be aired on ETV soon.