Showing posts with label Mahesh Babu. Show all posts
Showing posts with label Mahesh Babu. Show all posts

22/09/2016

ఎన్టీఆర్.. చిరు.. మహేష్.. అంటున్న నాని

తెలుగులో ‘స్టార్’ అనే పదానికి అర్థం మారుతోందంటున్నాడు నాని. భవిష్యత్తులో అసలే హీరో కూడా స్టార్ కాదని నాని చెప్పాడు. ‘‘గత కొన్ని దశాబ్దాల్లో స్టార్ అనే పదానికి అర్థం మారింది. మొదట్లో ఎన్టీఆర్ గారు భారీ పాత్రలు చేసేవాళ్లు. ఆయన పెద్ద స్టార్ అయ్యారు. తర్వాత చిరంజీవిగారు డ్యాన్సులు.. ఫైట్లతో తన ప్రత్యేకత చాటుకున్నారు. పెద్ద స్టార్ అయ్యారు. ఆ తర్వాత మహేష్ బాబు తన లుక్స్.. సటిల్ యాక్టింగ్ స్టైల్ తో స్టార్ అయ్యారు. నా దృష్టిలో ఇకపై స్టార్ అనే పదానికి అర్థం మారుతుంది. రాబోయే రోజుల్లో కంటెంటే బిగ్గెస్ట్ స్టార్ అవుతుందని నా అభిప్రాయం’’ అని నాని విశ్లేషించాడు.

ఇక తన వరకు తాను స్టార్ కాదని నాని స్పష్టం చేశాడు. ‘‘నేను ఏ స్టార్ లీగ్ కూ చెందను. నెంబర్ రేసులో ఉండను. నా సినిమాలు.. నా నటన అంతా డిఫరెంట్. నేనెప్పుడూ నటుడిగానే ఉంటాను. స్టార్ కాదు. ఒకవేళ స్టార్ ఇమేజ్ ఉందనిపించినా.. అది నా సినిమాలు హిట్టయ్యే వరకే. నా సినిమాల వసూళ్ల గురించి.. బిజినెస్ గురించి కూడా నేను పెద్దగా పట్టించుకోను. ఓ కథ ఎంచుకునేటపుడు ప్రేక్షకులకు నచ్చుతుందా లేదా అని చూస్తా. విడుదల తర్వాత రెస్పాన్స్ ఎలా ఉందో చూస్తా. వీటి మీదే ప్రధానంగా నా దృష్టి ఉంటుంది. అందుకే నా ప్రతి సినిమానూ నేను థియేటరుకు వెళ్లి ప్రేక్షకులతో కలిసి చూస్తా. నేను కథ విషయంలో.. సన్నివేశాల విషయంలో ఎలా ఫీలయ్యానో అలాగే ప్రేక్షకులు కూడా ఫీలవుతున్నారో లేదో చూస్తాను. దాన్ని బట్టే సినిమాలు ఎంచుకుంటాను’’ అని నాని చెప్పాడు. 

17/09/2016

MB40: ఇదే మెగా స్పీచ్

ఇక ఎంబి 40 కార్యక్రమానికి చీఫ్ గెస్టుగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఏమని చెబుతారా అనే అందరూ ఎదురు చూశారు. ఇదిగో ఆ మెగా మాటలను వినండి మరి. 

''నిజంగా.. మనస్ఫూర్తిగా.. సభా మర్యాద కాకపోయినా కూడా.. వేదిక మీద ఉన్న పెద్దలకు ఆ తరువాత ప్రేక్షకులకు మలి నమస్కారం తెలియజేసుకుంటాం కాని.. చాలా పెద్ద హృదయంతో చాలా ఓపికగా ఇంతసేపు ఇక్కడకు వచ్చిన పెద్దల మాటలను ఓర్పుగా  వింటూ కూర్చున్నారు.. అందుకు విశాఖ ప్రజలకు మొట్టమొదటిగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా'' అంటూ అత్యంత ఎక్సయిట్మెంట్ తో తన స్పీచ్ మొదలుపెట్టారు మెగాస్టార్ చిరంజీవి. 

ముందుగా టి.సుబ్బిరామి రెడ్డి కళా హృదయాన్ని అభినందించిన చిరంజీవి.. అత్యంత ఆప్తుడు మిత్రుడు అయిన మోహన్ బాబు గురించి మట్లాడారు చిరు. ''సుబ్బిరామి రెడ్డి గారి ఫంక్షన్లకు ఎన్నోసార్లు వచ్చాను కాని.. ఇప్పుడు మాత్రం కేవలం మోహన్ బాబు గురించే వచ్చాను'' అని సెలవిచ్చారు చిరు. ''ఏమయ్యా చిరంజీవి.. నేనయ్యా మోహన్ బాబును.. విశాఖలో ఎంబి 40. నువ్వు రావాలి అని చెప్పాడు'' అంటూ చిరంజీవి స్వయంగా మోహన్ బాబు వాయిస్ లో మిమిక్రీ చేసి మరీ వినిపించారు.

పొరపాటను సినిమా షూటింగ్ పెట్టాను.. కాకపోతే లాస్ట్ మినిట్ లో తెలుసుకుని ఈ రాక్షసుడు ఇక్కడకు రాకపోతే చంపేస్తాడని చెబుతూ క్యాన్సిల్ చేసుకున్నాను అని వివరించారు. ''బయట మనిద్దరినీ టామ్ అండ్ జెర్రీ అనుకుంటున్నారు. మనం సరదాగా మాట్లాడుకోవడం ఇలా సోషల్ మీడియాలో గొడవగా మారడం ఏంటి అని మోహన్ బాబును అడిగితే.. అనుకోనివ్వవయ్యా ఏమైందిలే.. అంటూ తీసిపాడేస్తాడు. నాది కూడా అదే మనస్థత్వం. మా మధ్య మా రిలేషన్ ఎలా ఉందనేదే ముఖ్యం'' అంటూ తమ రిలేషన్ గురించి చెప్పారు చిరంజీవి.

''ఇది ఒక కష్టానికి జరుగుతున్న సన్మానం.. ఒక మనస్థత్వానికి.. ఒక పట్టుదలకు.. జరుగుతున్న సన్మానం. ఆయన 40 ఏళ్ళు పూర్తి చేసుకుంటే నేను 37 ఏళ్లు పూర్తి చేసుకున్నా. 1975లో కెరియర్ మొదలెట్టినప్పటినుండి ఇప్పటివరకు ఈ సుదీర్ఘ జర్నీలో అలుపెరగకుండా కష్టపడ్డాడు మోహన్ బాబు. సినిమా కెరియర్ పూల పాన్పుకాదు ముళ్ల బాట. అలాంటి ఈ ఇండస్ర్టీలో నటనలో కీర్తి శిఖరాలను అందుకుని ముందుకెళ్ళడం అనేది మామూలు విషయం కాదు. ఆయన ఒక వింధ్య పర్వతం'' అంటూ కొనియాడరు మెగాస్టార్. 

మోహన్ బాబు డైలాగులను పొందుపరిచి ఒక బుక్ గా లండన్ పార్లమెంటులో దానిని ఆవిష్కరించడం అనేది కళాకారులుగా మా అందరికీ ఎంతో గర్వకరాణం అంటూ మోహన్ బాబును అభినందించారు చిరు. ఆయన చిత్రాలను కూరుస్తూ అచ్చేసిన ఆ పుస్తకానికి నన్ను 'ముందుమాట' రాయమనడం అనేదే నాకు గర్వకారణం అంటూ ముగించారు మెగాస్టార్ చిరంజీవి. 

15/09/2016

పవన్‌ మహేష్‌కు సపోర్టిచ్చాడు-రేణు

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మాజీ భార్య రేణు దేశాయ్‌ ఈ రోజు ఒక ఆసక్తికర ఇంటర్వ్యూను తన ట్విట్టర్‌ పేజీలో షేర్‌ చేసింది. తనపై దుష్ప్రచారం చేస్తూ.. తనను తిట్టిపోస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టే అభిమానుల్ని టార్గెట్‌ చేస్తూ ఆమె కొన్ని వ్యాఖ్యలు చేసింది. యాంటీ ఫ్యాన్స్‌ కొందరు తనను తరచుగా తిడుతూ పోస్టులు పెడుతుంటారని.. ఇది ఎంత మాత్రం సబబు కాదని ఆమె పేర్కొంది.

తెలుగు హీరోలందరూ చాలా మంచి సంబంధాలు కలిగి ఉంటారని.. తాను పవన్‌తో ఉన్నపుడు వెంకటేష్‌ తరచుగా తమ ఇంటికి వచ్చేవారని.. అలాగే అప్పట్లో తన సినిమా పైరసీకి సంబంధించి మహేష్‌ బాబు పోరాడినపుడు పవన్‌ అతడికి అండగా నిలిచాడని.. సాయం చేశాడని.. హీరోలందరూ స్నేహంగానే ఉన్నా అభిమానులు మాత్రం అవతలి హీరోల మీద ఇలా ఎందుకు దుష్ప్రచారం చేస్తారో.. వారి కుటుంబ సభ్యుల మీద సోషల్‌ మీడియాలో ఎందుకు దాడి చేస్తారో అర్థం కాదని రేణు పేర్కొంది.

తాను పవన్‌ కళ్యాణ్‌కు 17 ఏళ్లుగా స్నేహితురాలినని.. తన బిడ్డలకు తల్లినని.. తాను పవన్‌ ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పెడితే వేరే హీరోల అభిమానులు అభ్యంతరం ఏంటని.. తనను ఎందుకు దూషిస్తారని రేణు ప్రశ్నించింది. అభిమానులు తమ హీరో మీద ఎంత అభిమానమైనా చూపించవచ్చని.. కానీ అవతలి హీరోల కుటుంబ సభ్యుల్ని టార్గెట్‌ చేయడం మాత్రం కరెక్ట్‌ కాదని రేణు పేర్కొంది.

07/09/2016

మహేష్ మూవీయే మెగా హీరో చేతికి?

టాలీవుడ్ లో సినిమాలు.. వాటి స్టోరీలు అన్నీ హీరో చుట్టూనే తిరుగుతూ ఉంటాయనే విషయం తెలిసిందే. ఓ హీరోకి ఒక లైన్ చెప్పి ఓకే అనిపించుకుని.. ఆ తర్వాత ఆ స్టార్ కి అనుగుణంగా స్క్రిప్ట్ ని డెవలప్ చేయడం చాలా ఏళ్లుగా ఉన్న ఆనవాయితీ. కానీ అతి కొద్ది మంది డైరెక్టర్లు మాత్రమే ముందుగా స్క్రిప్ట్ పూర్తి చేసుకుని ఆ తర్వాత హీరో కోసం వెతుకుతారు. తమ స్క్రిప్ట్ కి అనుగుణంగా యాక్ట్ చేయాలని వారికి చెప్పగల ధైర్యం చేస్తారు. అలాంటి వాళ్లు చాలా తక్కువమందే ఉంటారు కానీ.. వారిలో ఒకడు శేఖర్ కమ్ముల.

మొదట్లో కమ్ముల సినిమాలు బాగానే ఆడినా తర్వాత జనాలకు ఒకటే నేరేషన్ బోర్ కొట్టేసింది. దీంతో బౌన్స్ బ్యాక్ అయేందుకు ఓ పక్కా స్క్రిప్ట్ రాసుకుని మహేష్ ని కలిశాడు. సూపర్ స్టార్ కి కూడా స్క్రిప్ట్ నచ్చడంతో సినిమా చేసేద్దామన్నా.. ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కాలేదు. తర్వాత అదే స్క్రిప్ట్ తీసుకుని జూనియర్ ఎన్టీఆర్ దగ్గరకు వెళితే.. అప్పటికే ఫ్లాప్ లతో సతమతమవుతున్న యంగ్ టైగర్.. ధైర్యం చేయలేకపోయాడు. దీంతో ఈ స్టోరీ-స్క్రిప్ట్ మెగా హీరో వరుణ్ తేజ్ దగ్గరికి చేరింది. 

ప్రస్తుతం ఫిదా అనే టైటిల్ పై వరుణ్ తేజ్ చేస్తున్న సినిమా ఇదే. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. విచిత్రం ఏంటంటే.. ఈ కథ మహేష్ కే మొదట వినిపించినట్లు వరుణ్ తేజ్ కి కూడా చెప్పాడట శేఖర్ కమ్ముల. అయినా సరే దిల్ రాజు నిర్మాణంలో ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. అలా మహేష్ చేయాల్సిన మూవీ మెగా హీరో చేతిలోకి వచ్చింది. అదీ ఫిదా కథ. 

19/06/2016

మహేష్.. నాని.. బన్నీ.. అదీ చాయిస్

ఫిలింఫేర్ అవార్డులకు ఇండియాలో ఒక స్థానం ఉంది. దాదాపు 60 ఏళ్ళ పైమాటే ఈ బ్లాక్ లేడీ ట్రోఫీలు మన సినిమా టెక్నీషియన్ల ఇళ్లలో నివాసం ఏర్పరుచుకోవడం మొదలెట్టి. ఇప్పుడు మన తెలుగుకు సంబంధించి గత 63వ ఫిలింఫేర్ అవార్డులను నిన్నే ఇచ్చారు. ఉత్తమ నటన కనబరిచిన మన స్టార్ హీరోలు ఎవరో చూద్దామా?

ఇకపోతే ఉత్తమ నటుడు ట్రోఫీ మాత్రం.. ఇన్ పర్సన్ ఆటెండ్ కాకపోయినా మహేష్ బాబుకే దక్కింది. శ్రీమంతుడు సినిమాలోని మనోడి నటనకు ఆ కానుకను అందజేశారు. కాంపిటీషన్ లో అల్లు అర్జున్ (సన్నాఫ్ సత్యమూర్తి).. ప్రభాస్ (బాహుబలి).. జూ.ఎన్టీఆర్ (టెంపర్) ఉన్నప్పటికీ.. బ్లాక్ లేడి మాత్రం మహేష్ కే వచ్చిందిలే. ఇక స్పెషల్ జ్యూరి అందించే ఉత్తమ నటుడు అవార్డును మాత్రం.. భలే భలే మగాడివోయ్ సినిమాలోని నటనకు నాని తీసుకపోయాడు. అది కూడా కత్తిలాంచి ఛాయిస్ అనే చెప్పాలి. 

కట్ చేస్తే.. ఉత్తమ నటుడు క్యాటగిరీ వచ్చేసరికి.. బల్లాలదేవ రానా.. కట్టప్ప సత్యరాజ్.. మూర్తి గారు పోసాని.. అలాగే శ్రీమంతుడు జగపతి బాబు ఉన్నారు.  ఇలా చాలామంది హేమాహేమీలు ఉన్నా కూడా.. రుద్రమదేవి సినిమాలో నువ్వు గమ్మునుండవోయ్ అంటూ బన్నీ చేసిన యాక్షన్ కు బ్లాక్ లేడి ఇవ్వక తప్పలేదు. మనోడు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తనకు ఈ అవకాశం కలిపించిన యావత్ తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పి.. అవార్డును వారికే అంకితమిచ్చాడు.