Showing posts with label Sekhar Kammula. Show all posts
Showing posts with label Sekhar Kammula. Show all posts

07/09/2016

మహేష్ మూవీయే మెగా హీరో చేతికి?

టాలీవుడ్ లో సినిమాలు.. వాటి స్టోరీలు అన్నీ హీరో చుట్టూనే తిరుగుతూ ఉంటాయనే విషయం తెలిసిందే. ఓ హీరోకి ఒక లైన్ చెప్పి ఓకే అనిపించుకుని.. ఆ తర్వాత ఆ స్టార్ కి అనుగుణంగా స్క్రిప్ట్ ని డెవలప్ చేయడం చాలా ఏళ్లుగా ఉన్న ఆనవాయితీ. కానీ అతి కొద్ది మంది డైరెక్టర్లు మాత్రమే ముందుగా స్క్రిప్ట్ పూర్తి చేసుకుని ఆ తర్వాత హీరో కోసం వెతుకుతారు. తమ స్క్రిప్ట్ కి అనుగుణంగా యాక్ట్ చేయాలని వారికి చెప్పగల ధైర్యం చేస్తారు. అలాంటి వాళ్లు చాలా తక్కువమందే ఉంటారు కానీ.. వారిలో ఒకడు శేఖర్ కమ్ముల.

మొదట్లో కమ్ముల సినిమాలు బాగానే ఆడినా తర్వాత జనాలకు ఒకటే నేరేషన్ బోర్ కొట్టేసింది. దీంతో బౌన్స్ బ్యాక్ అయేందుకు ఓ పక్కా స్క్రిప్ట్ రాసుకుని మహేష్ ని కలిశాడు. సూపర్ స్టార్ కి కూడా స్క్రిప్ట్ నచ్చడంతో సినిమా చేసేద్దామన్నా.. ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కాలేదు. తర్వాత అదే స్క్రిప్ట్ తీసుకుని జూనియర్ ఎన్టీఆర్ దగ్గరకు వెళితే.. అప్పటికే ఫ్లాప్ లతో సతమతమవుతున్న యంగ్ టైగర్.. ధైర్యం చేయలేకపోయాడు. దీంతో ఈ స్టోరీ-స్క్రిప్ట్ మెగా హీరో వరుణ్ తేజ్ దగ్గరికి చేరింది. 

ప్రస్తుతం ఫిదా అనే టైటిల్ పై వరుణ్ తేజ్ చేస్తున్న సినిమా ఇదే. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. విచిత్రం ఏంటంటే.. ఈ కథ మహేష్ కే మొదట వినిపించినట్లు వరుణ్ తేజ్ కి కూడా చెప్పాడట శేఖర్ కమ్ముల. అయినా సరే దిల్ రాజు నిర్మాణంలో ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. అలా మహేష్ చేయాల్సిన మూవీ మెగా హీరో చేతిలోకి వచ్చింది. అదీ ఫిదా కథ.