Showing posts with label Nani. Show all posts
Showing posts with label Nani. Show all posts

22/09/2016

ఎన్టీఆర్.. చిరు.. మహేష్.. అంటున్న నాని

తెలుగులో ‘స్టార్’ అనే పదానికి అర్థం మారుతోందంటున్నాడు నాని. భవిష్యత్తులో అసలే హీరో కూడా స్టార్ కాదని నాని చెప్పాడు. ‘‘గత కొన్ని దశాబ్దాల్లో స్టార్ అనే పదానికి అర్థం మారింది. మొదట్లో ఎన్టీఆర్ గారు భారీ పాత్రలు చేసేవాళ్లు. ఆయన పెద్ద స్టార్ అయ్యారు. తర్వాత చిరంజీవిగారు డ్యాన్సులు.. ఫైట్లతో తన ప్రత్యేకత చాటుకున్నారు. పెద్ద స్టార్ అయ్యారు. ఆ తర్వాత మహేష్ బాబు తన లుక్స్.. సటిల్ యాక్టింగ్ స్టైల్ తో స్టార్ అయ్యారు. నా దృష్టిలో ఇకపై స్టార్ అనే పదానికి అర్థం మారుతుంది. రాబోయే రోజుల్లో కంటెంటే బిగ్గెస్ట్ స్టార్ అవుతుందని నా అభిప్రాయం’’ అని నాని విశ్లేషించాడు.

ఇక తన వరకు తాను స్టార్ కాదని నాని స్పష్టం చేశాడు. ‘‘నేను ఏ స్టార్ లీగ్ కూ చెందను. నెంబర్ రేసులో ఉండను. నా సినిమాలు.. నా నటన అంతా డిఫరెంట్. నేనెప్పుడూ నటుడిగానే ఉంటాను. స్టార్ కాదు. ఒకవేళ స్టార్ ఇమేజ్ ఉందనిపించినా.. అది నా సినిమాలు హిట్టయ్యే వరకే. నా సినిమాల వసూళ్ల గురించి.. బిజినెస్ గురించి కూడా నేను పెద్దగా పట్టించుకోను. ఓ కథ ఎంచుకునేటపుడు ప్రేక్షకులకు నచ్చుతుందా లేదా అని చూస్తా. విడుదల తర్వాత రెస్పాన్స్ ఎలా ఉందో చూస్తా. వీటి మీదే ప్రధానంగా నా దృష్టి ఉంటుంది. అందుకే నా ప్రతి సినిమానూ నేను థియేటరుకు వెళ్లి ప్రేక్షకులతో కలిసి చూస్తా. నేను కథ విషయంలో.. సన్నివేశాల విషయంలో ఎలా ఫీలయ్యానో అలాగే ప్రేక్షకులు కూడా ఫీలవుతున్నారో లేదో చూస్తాను. దాన్ని బట్టే సినిమాలు ఎంచుకుంటాను’’ అని నాని చెప్పాడు. 

19/06/2016

మహేష్.. నాని.. బన్నీ.. అదీ చాయిస్

ఫిలింఫేర్ అవార్డులకు ఇండియాలో ఒక స్థానం ఉంది. దాదాపు 60 ఏళ్ళ పైమాటే ఈ బ్లాక్ లేడీ ట్రోఫీలు మన సినిమా టెక్నీషియన్ల ఇళ్లలో నివాసం ఏర్పరుచుకోవడం మొదలెట్టి. ఇప్పుడు మన తెలుగుకు సంబంధించి గత 63వ ఫిలింఫేర్ అవార్డులను నిన్నే ఇచ్చారు. ఉత్తమ నటన కనబరిచిన మన స్టార్ హీరోలు ఎవరో చూద్దామా?

ఇకపోతే ఉత్తమ నటుడు ట్రోఫీ మాత్రం.. ఇన్ పర్సన్ ఆటెండ్ కాకపోయినా మహేష్ బాబుకే దక్కింది. శ్రీమంతుడు సినిమాలోని మనోడి నటనకు ఆ కానుకను అందజేశారు. కాంపిటీషన్ లో అల్లు అర్జున్ (సన్నాఫ్ సత్యమూర్తి).. ప్రభాస్ (బాహుబలి).. జూ.ఎన్టీఆర్ (టెంపర్) ఉన్నప్పటికీ.. బ్లాక్ లేడి మాత్రం మహేష్ కే వచ్చిందిలే. ఇక స్పెషల్ జ్యూరి అందించే ఉత్తమ నటుడు అవార్డును మాత్రం.. భలే భలే మగాడివోయ్ సినిమాలోని నటనకు నాని తీసుకపోయాడు. అది కూడా కత్తిలాంచి ఛాయిస్ అనే చెప్పాలి. 

కట్ చేస్తే.. ఉత్తమ నటుడు క్యాటగిరీ వచ్చేసరికి.. బల్లాలదేవ రానా.. కట్టప్ప సత్యరాజ్.. మూర్తి గారు పోసాని.. అలాగే శ్రీమంతుడు జగపతి బాబు ఉన్నారు.  ఇలా చాలామంది హేమాహేమీలు ఉన్నా కూడా.. రుద్రమదేవి సినిమాలో నువ్వు గమ్మునుండవోయ్ అంటూ బన్నీ చేసిన యాక్షన్ కు బ్లాక్ లేడి ఇవ్వక తప్పలేదు. మనోడు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తనకు ఈ అవకాశం కలిపించిన యావత్ తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పి.. అవార్డును వారికే అంకితమిచ్చాడు. 


15/06/2016

బాలయ్య అభిమాని పవన్ అభిమాని అయ్యాడు

టాలీవుడ్లో గతేడాది నుంచి వరుస సక్సెస్లతో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో నాని. ఎవడే సుబ్రహ్మణ్యం - జెండా పైకపిరాజు - భలే భలే మగాడివోయ్ - కృష్ణగాడి వీరప్రేమగాథ సినిమాల తర్వాత నాని మార్కెట్ డబుల్ అయ్యింది. ఇక ఈ యేడాది ఇప్పటికే కృష్ణగాడి సినిమాతో హిట్ కొట్టి ఈ శుక్రవారం ఒకప్పటి బ్లాక్ బస్టర్ టైటిల్ జెంటిల్ మేన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. 

 మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. కృష్ణగాడి సినిమాలో బాలయ్య అభిమానిగా కనిపించి మెప్పించిన నాని ఇప్పుడు పవర్ స్టార్ అభిమానిగా కనిపించనున్నాడు. కృష్ణగాడి సినిమాలో చేతి మీద జై బాలయ్య టాటూతో కనిపించిన నాని నందమూరి అభిమానులను కూడా ఎట్రాక్ట్ చేశాడు. నందమూరి అభిమానులందరూ నాని సినిమాకు మంచి సపోర్ట్ ఇచ్చారు.

 ఇక జెంటిల్ మేన్ తర్వాత నాని ఉయ్యాల జంపాల ఫేం విరించి వర్మ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే షూటింగ్ జరుపుకోనుంది. ఈ సినిమాలో నాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానిగా కనిపించనున్నాడు. ఇప్పటికే యంగ్ హీరో నితిన్ రియల్ లైఫ్ లో పవన్ వీరాభిమానిగా పాపులర్ అయ్యి పవన్ ఫ్యాన్స్ ను బాగానే వాడుకుంటున్నాడు. ఇక ఇప్పుడు నాని రీల్ లైఫ్ లో పవన్ అభిమాని అవతారం ఎత్తనున్నాడు. మరి నాని సినిమాకు పవన్ సెంటిమెంట్ ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.