Showing posts with label Akira Nandhan. Show all posts
Showing posts with label Akira Nandhan. Show all posts

03/09/2016

పవన్ కొడుక్కి తెలుగు స్పష్టంగా వచ్చు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ హైదరాబాద్ లో కనిపించడం తక్కువ. చిన్నపుడు తల్లి.. దండ్రి కలిసున్నన్ని రోజులు హైదరాబాద్ లో ఉన్న అకీరా.. వాళ్లిద్దరూ విడిపోయాక తెలుగు గడ్డకు దూరమైపోయాడు. పుణెలో తల్లితో పాటే ఉంటూ అక్కడే చదువుకుంటున్నాడు. అతను తెలుగు చదివే అవకాశమే లేదు. తల్లి ఎలాగూ మరాఠీ కాబట్టి.. ఇంట్లో తెలుగు మాట్లాడే అవకాశం లేదు. మరి అతడికి తెలుగు వస్తుందా అని చాలామందికి సందేహం ఉండొచ్చు.

ఐతే పవన్ కొడుకు స్పష్టంగా తెలుగులో మాట్లాడతాడు అంటోంది రేణు. చిన్నప్పట్నుంచి అకీరాకు తెలుగు బాగానే వచ్చని.. ఇప్పుడు కూడా ఇంట్లో అతను తెలుగులో మాట్లాడుతుంటాడని చెప్పింది రేణు. అకీరా భవిష్యత్తులో తండ్రి దగ్గరికే వస్తాడన్న సంకేతాలు కూడా ఇచ్చింది రేణు. అకీరా భవిష్యత్తేంటన్నది పవన్ చేతుల్లోనే ఉందని ఆమె చెప్పింది. పవన్ ఆడియో వేడుకలకు అకీరా రావడం అన్నది తండ్రి చేతుల్లోనే ఉందని.. ఇందులో తన ప్రమేయం ఏమీ లేదని ఆమె ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది.

ఇక పవన్ ఫేస్ బుక్ లోకి వస్తే బాగుంటుంది కదా అన్న అభిప్రాయాలపై రేణు స్పందిస్తూ.. ‘‘పవన్ సోషల్ మీడియాలోకి రావాలని నేను రెండేళ్ల కిందటే సలహా ఇచ్చాను. కనీసం ట్విట్టర్లోకి అయినా వచ్చాడు సంతోషం’’ అని రేణు పేర్కొంది. పవన్.. రేణు గురించి మాట్లాడి చాలా ఏళ్లయిపోయినా.. రేణు మాత్రం తరచుగా పవన్ ప్రస్తావన తెస్తూ అతడిపై తనకున్న అభిమానాన్ని చాటుకుంటూనే ఉంటుంది.