మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ అనగానే టాలీవుడ్ అంతా ఆసక్తిగా గమనిస్తోంది. ఒక్క టాలీవుడ్ లోనే కాదు.. ఇండియాలోనే చిరు రీఎంట్రీపై ఆసక్తి నెలకొంది. ఇంతగా మెగాస్టార్ మీద సినీ జనాలు దృష్టి పెట్టడానికి కారణం.. పీక్ స్టేజ్ లో చిరు వెలిగిన తీరే.
ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ అమితాబ్ బచ్చన్ అని తెలిసిందే. ఇండియన్ సినిమా స్క్రీన్ కి మాస్ సొగసులు అద్దాడాయన. అయితే బచ్చన్ కంటే ఎక్కువగా చిరంజీవి రేంజ్ ఉండేదని తెలిస్తే ఆశ్చర్యం వేయక మానదు. వీక్ అనే లీడింగ్ మేగజైన్.. 'బిగ్గర్ దేన్ బచ్చన్' అంటూ చిరంజీవిపై స్పెషల్ స్టోరీ పబ్లిష్ చేసింది.
ఆ మేగజైన్ పబ్లిష్ అయినది 1992లో. అప్పట్లో బిగ్ బీ ఒక్కో సినిమాకి కోటి రూపాయల పారితోషికం తీసుకుంటే.. చిరంజీవికి నిర్మాతలు కోటీ పాతిక లక్షలు చేతిలో పెట్టేవారు. ఈ మేగజైన్ వచ్చేనాటికి చిరు రేంజ్ ఏ స్థాయిలో ఉందో తెలుసా?
1990లో కొండవీటి దొంగ.. జగదేకవీరుడు అతిలోక సుందరి.. కొదమసింహం.. హిందీలో ప్రతిబంధ్.. 1991లో స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్ - గ్యాంగ్ లీడర్ - రౌడీ అల్లుడు - 1992లో ఘరానా మొగుడు రిలీజ్ అయిన తర్వాత.. రాసిన స్పెషల్ స్టోరీ అది. అంటే రెండున్నరేళ్లలో 8 సినిమాలు వస్తే 6 బ్లాక్ బస్టర్స్ - రెండు యావరేజ్ గా ఫేర్ చేశాయి.
No comments:
Post a Comment