మెగా డాటర్ గా ఎన్నో అంచనాల మధ్య టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నీహారికకు.. ఎంట్రీ సింపుల్ గానే వచ్చినా సక్సెస్ మాత్రం అందలేదు. ఒక మనసు మూవీ పరాజయం పాలవడం ఆమెను నిరుత్సాహపరిచింది. అయితే.. సినిమా రిజల్ట్ తేడా కొట్టినా.. నీహారిక చేసిన రోల్ కు.. ఆమె యాక్టింగ్ కు ప్రశంసలు రావడం మాత్రమే చెప్పుకోదగ్గ అంశం. మరిప్పుడు నీహారిక రెండో సినిమా చేస్తుందా చేయదా అనేదే పెద్ద ప్రశ్నగా మిగిలింది.
ఒక మనసు రిలీజ్ కాక ముందే నీహారికకు కొన్ని ఆఫర్స్ వచ్చాయి. అయితే తొలిసినిమా రిజల్ట్ ను బట్టి.. ఆడియన్స్ రిసీవ్ చేసుకున్న పద్ధతిని బట్టి.. నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో నిర్ణయం తీసుకోవాలని ముందే నిర్ణయించారు.ఇప్పుడు సినిమా వచ్చింది.. జనాలు రిజల్ట్ కూడా ఇచ్చేశారు. నీహారికను ఓ శృతి హాసన్ టైపులో గ్లామర్ రోల్ లో ఊహించుకోవడం కుదరదనే విషయం ముందే చెప్పేశారు. సో.. కాసింత ఒద్దికైన పద్ధతైన పాత్రల్లో మాత్రమే మెగా డాటర్ కనిపించాల్సి ఉంటుందన్న మాట. అసలు గ్లామర్ అనే మాటే లేకుండా.. కెరీర్ కంటిన్యూ చేసిన తెలుగు హీరోయిన్ లయ ఒక్కతే.
ఇప్పుడు నీహారిక కూడా ఆమెను ఇన్ స్పిరేషన్ తీసుకుని కెరీర్ కంటిన్యూ చేస్తుందా అన్నదే క్వశ్చన్. మరోవైపు తండ్రి నాగేంద్ర బాబు మాత్రం తొలి సినిమాలో కూతురు కనిపించిన తీరును.. కనబరిచిన నటనకు అందరూ ప్రశంసిస్తుండడంతో సంతోషిస్తున్నాడు. ఇక ఒక మనసులో నీహారికకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేసిన తల్లి మాత్రం నిరుత్సాహపడిందని అంటున్నారు. అందరూ కలిసి.. కెరీర్ కంటిన్యూ చేసే విషయంలో నిర్ణయం నీహారికకే వదిలేశారని తెలుస్తోంది.
No comments:
Post a Comment