Showing posts with label Niharika. Show all posts
Showing posts with label Niharika. Show all posts

04/07/2016

మెగా డాటర్ నెక్ట్స్ సంగతి ఏంటో!

మెగా డాటర్ గా ఎన్నో అంచనాల మధ్య టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నీహారికకు.. ఎంట్రీ సింపుల్ గానే వచ్చినా సక్సెస్ మాత్రం అందలేదు. ఒక మనసు మూవీ పరాజయం పాలవడం ఆమెను నిరుత్సాహపరిచింది. అయితే.. సినిమా రిజల్ట్ తేడా కొట్టినా.. నీహారిక చేసిన రోల్ కు.. ఆమె యాక్టింగ్ కు ప్రశంసలు రావడం మాత్రమే చెప్పుకోదగ్గ అంశం. మరిప్పుడు నీహారిక రెండో సినిమా చేస్తుందా చేయదా అనేదే పెద్ద ప్రశ్నగా మిగిలింది. 

ఒక మనసు రిలీజ్ కాక ముందే నీహారికకు కొన్ని ఆఫర్స్ వచ్చాయి. అయితే తొలిసినిమా రిజల్ట్ ను బట్టి.. ఆడియన్స్ రిసీవ్ చేసుకున్న పద్ధతిని బట్టి.. నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో నిర్ణయం తీసుకోవాలని ముందే నిర్ణయించారు.ఇప్పుడు సినిమా వచ్చింది.. జనాలు రిజల్ట్ కూడా ఇచ్చేశారు. నీహారికను ఓ శృతి హాసన్ టైపులో గ్లామర్ రోల్ లో ఊహించుకోవడం కుదరదనే విషయం ముందే చెప్పేశారు. సో.. కాసింత ఒద్దికైన పద్ధతైన పాత్రల్లో మాత్రమే మెగా డాటర్ కనిపించాల్సి ఉంటుందన్న మాట. అసలు గ్లామర్ అనే మాటే లేకుండా.. కెరీర్ కంటిన్యూ చేసిన తెలుగు హీరోయిన్ లయ ఒక్కతే.

ఇప్పుడు నీహారిక కూడా ఆమెను ఇన్ స్పిరేషన్ తీసుకుని కెరీర్ కంటిన్యూ చేస్తుందా అన్నదే క్వశ్చన్. మరోవైపు తండ్రి నాగేంద్ర బాబు మాత్రం తొలి సినిమాలో కూతురు కనిపించిన తీరును.. కనబరిచిన నటనకు అందరూ ప్రశంసిస్తుండడంతో సంతోషిస్తున్నాడు. ఇక ఒక మనసులో నీహారికకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేసిన తల్లి మాత్రం నిరుత్సాహపడిందని అంటున్నారు. అందరూ కలిసి.. కెరీర్ కంటిన్యూ చేసే విషయంలో నిర్ణయం నీహారికకే వదిలేశారని తెలుస్తోంది. 

24/06/2016

నాగబాబు వైఫ్ టేస్ట్ సూపర్

ఈ సీజన్ లో మెగా ఫ్యాన్స్ కి మోస్ట్ అవైటెడ్ మూవీ ఒక మనసు. మెగా డాటర్ నీహారిక హీరోయిన్ గా అరంగేట్రం చేస్తుండడంతో అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. ఇప్పుడా రోజు రానే వచ్చింది. ఒక మనసు మూవీ చూసిన వాళ్లందరికీ ఓ విషయంలో మాత్రం మైండ్ బ్లాంక్ అయిపోయింది. కాటర్ చీరలు - చుడీదార్లతో ఒక అమ్మాయిని ఇంత అందంగా చూపించచ్చా అనిపించేసింది. 

ఒక మనసులో ప్రధానమైన హైలైట్.. నీహారిక లుక్ అని ఒప్పుకోవాల్సిందే. ప్రతీ ఫ్రేమ్ లోనూ ఎంతో అందంగా కనిపించింది మెగా డాటర్. ఎక్కడా ఆర్భాటం ఉండదు.. శారీస్ - చుడీదార్లు - పంజాబీ డ్రస్సులు.. అంతా నార్మల్ వేర్. అందుకు తగ్గట్లుగా మ్యాచింగ్ ఆర్నమెంట్స్. అందులో కూడా బంగారం ధగధగలు పెద్దగా కనిపించవు. ఫ్యాషనబుల్ ఫ్యాన్సీ వేర్ ని ఇంత అందంగా చూపించచ్చని నీహారిక నిరూపించింది. నిజానికి ఈ క్రెడిట్ అంతా నాగబాబు భార్య పద్మజ కొణిదెలకే దక్కుతుంది. 30-40 సన్నివేశాలకు గాను 60-70 డ్రస్సుల డిజైనింగ్. అన్నీ పద్మజ సొంత డిజైన్సే కావడం విశేషం. 

కూతురును సినిమా రంగానికి పరిచయం చేస్తూ ఆమె తీసుకున్న జాగ్రత్తలు అమోఘం అనాల్సిందే. నీహారిక తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోనుందంటే.. అందుకు కారణం ఖచ్చితంగా నాగబాబు భార్యే. ఆమె స్టైలింగ్ - కాస్ట్యూమ్స్ తోనే సినిమాకి సగం కలర్ వచ్చేసింది. ఈ విషయంలో మాత్రం నాగబాబు వైఫ్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. 

22/06/2016

పవన్ వేరు.. మేం వేరు కాదు-నిహారిక

మెగా ఫ్యామిలీ అంటే అందులో పవన్ కళ్యాణ్ కూడా భాగమేనని.. ఆయన వేరు తాము వేరు కాదని అంటోంది కొణిదెల నిహారిక. తాను కథానాయికగా పరిచయమవుతున్న ‘ఒక మనసు’ సినిమాను పవన్ చూస్తాడని ఆమె ఆశాభావం వ్యక్తం చేసింది. తమ ఫ్యామిలీ కోసం ‘ఒక మనసు’ ప్రివ్యూ షో వేయబోతున్నట్లు ఆమె వెల్లడించింది. ‘‘మా ఫ్యామిలీలో అందరి కోసం నా సినిమాను ప్రివ్యూ వేయాలనుకుంటున్నాం. పెదనాన్న చిరంజీవి తప్పకుండా ఆ షోకు హాజరవుతారు. ఫ్యామిలీ అంటే అందులో పవన్ బాబాయి కూడా ఉంటారు. ఆయన వేరు.. మేం వేరు కాదు. ఆయన కూడా నా సినిమా చూస్తారని ఆశిస్తున్నా. అందరూ నా పెర్ఫామెన్స్ గురించే ఏమంటారో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అని నిహారిక చెప్పింది.

ఇక సినిమాల్లోకి రావాలనుకున్నపుడు తమ కుటుంబ సభ్యులు ఎలా స్పందించారో చెబుతూ.. ‘‘నేను సినిమాల్లోకి వెళ్లాలని స్థిరమైన నిర్ణయం తీసుకున్నాక ఇంట్లో వాళ్ళను సంప్రదించా. అందరూ ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో.. హీరోయిన్లను కొందరు ఎలా చూస్తారో చెప్పారు. అయితే నా విషయంలో యాక్టింగ్ పరంగా నా కమిట్మెంట్ ఏంటో చెప్పా. అప్పుడు చిరంజీవి పెదనాన్న - కళ్యాణ్ బాబాయ్ కన్విన్స్ అయ్యారు. ఇష్టంగా చేస్తే ఎందులోనైనా విజయం సాధించవచ్చని.. నెగెటివిటీని పక్కనపెట్టి జాగ్రత్తగా సినిమాలు పాత్రలు ఎంపిక చేసుకోమని సలహా ఇచ్చారు. వాళ్ళిచ్చిన సపోర్టును ఎప్పటికీ నిలుపుకుంటూ. మంచి సినిమాలు చేస్తా” అని నిహారిక చెప్పింది.

10/06/2016

ఒక్క ఫ్యామిలీ.. 16 సినిమాలు.. మెగా లెక్క

మెగా కాంపౌండ్.. నిజంగానే కాంపౌండ్ అనే పదం మెగా కుటుంబానికి సరిగ్గా సరిపోతుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు.. అరడజనుకు పైగా హీరోలు వరుసపెట్టి సినిమాలు చేసేస్తుంటే.. ఇండస్ట్రీ కళకళ్లాడిపోతూ ఉంటుంది. ఆ ఫ్యామిలీ ఇంకా వెలిగిపోతూ ఉంటుంది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్నవి.. ఇప్పటికే ఓకే అనిపించేసుకుని త్వరలో ప్రారంభించుకోనున్నవి.. మొత్తం మెగా సినిమాల లెక్క చూస్తే ఔరా అనిపించక మానదు. ఈ కౌంట్ ఏకంగా 16 అంటే ప్రత్యర్ధి హీరోలకు గుండె గుభేల్ మనిపించడం ఖాయం. 

మెగాస్టార్ చిరంజీవి: చిరంజీవి 150వ చిత్రంగా కత్తిలాంటోడు ప్రారంభమైంది. వివి వినాయక్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారు. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్: పవన్ కళ్యాణ్ హీరోగా ఎస్ జే సూర్య డైరెక్షన్ లో ఓ మూవీ తెరకెక్కనుంది. దీని తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో మూవీ చేయనున్నాడు పవన్. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పనులు మొదలయ్యాయి. 

రామ్ చరణ్: చెర్రీ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ధృవ చిత్రాన్ని చేస్తున్నాడు. ఆ వెంటనే సుకుమార్ తో సినిమా స్టార్ట్ చేయనున్నాడు. ఇప్పటికే దీనికి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైపోయాయి. 

అల్లు అర్జున్: వరుసగా 4 సినిమాలను 50 కోట్లు దాటించిన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు బన్నీ. ఇప్పుడు లింగుస్వామితో కొత్త మూవీ స్టార్ట్ చేయనుండగా.. దీని తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడని ఇప్పటికే స్టోరీ ఓకే అయిపోయిందని తెలుస్తోంది. 

వరుణ్ తేజ్: మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్.. శ్రీను వైట్ల డైరెక్షన్ లో మిస్టర్ టైటిల్ పై ఓ సినిమా చేయనున్నాడు. దీంతో పాటే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కూడా మరో సినిమాని ఒకేసారి షూటింగ్ నిర్వహించనున్నాడు. గతంలో క్రిష్ డైరెక్షన్ లో ఆగిపోయిన రాయబారిని.. మళ్లీ పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పాడు వరుణ్ తేజ్. 

సాయిధరం తేజ్: సునీల్ రెడ్డి దర్శకత్వంలో తిక్క చిత్రాన్ని ఫినిషింగ్ దశకు తెచ్చిన సాయిధరమ్ తేజ్.. గోపీచంద్ మలినేనితో ఓ మూవీని బీవీఎస్ రవి డైరెక్షన్ లో జవాన్ టైటిల్ పై మరో సినిమాని లైన్ లో పెట్టాడు. 

అల్లు శిరీష్: పరశురామ్ దర్శకత్వంలో చేసిన శ్రీరస్తు.. శుభమస్తు ఆఖరి షెడ్యూల్ ప్రారంభిస్తున్నాడు అల్లు శిరీష్. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుండగా.. మల్లిడి వేణు డైరెక్షన్ లో ఓ చిత్రానికి ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. 

నీహారిక: నాగబాబు కూతురు నీహారిక ఒక మనసుతో హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఈ నెల 24న ఈ మూవీ విడుదలైన తర్వాత రిజల్ట్ చూసి.. కొత్త చిత్రాలను యాక్సెప్ట్ చేయనుంది.