Showing posts with label Sai Dharam Tej. Show all posts
Showing posts with label Sai Dharam Tej. Show all posts

11/09/2016

జార్జియా చెక్కేస్తున్న తేజు-రకుల్

మెగా హీరో సాయి ధరం తేజ్ రీసెంట్ గా తిక్క అంటూ ఓ మూవీతో ఫ్లాప్ కొట్టాడు కానీ.. కుర్రాడు మాత్రం స్పీడ్ ఏ మాత్రం తగ్గించలేదు. ఇప్పటికే రెండు సార్లు ఇరవై కోట్ల షేర్ సాధించేసి సక్సెస్ కొట్టిన ఉత్సాహం మెగా కుర్రాడిలో బాగానే కనిపిస్తోంది. అదే ఊపులో గోపిచంద్ మలినేని డైరెక్షన్ లో ఓ సినిమాని తెగ స్పీడ్ గా ఫినిష్ చేసేస్తున్నాడు. 

ఈ మూవీలో తేజు ఓ ఫ్యాషన్ మేగజైన్ కి ఎడిటర్ గా నటిస్తుండగా.. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. రుకుల్ రోల్ అథ్లెట్ అని తెలుస్తోంది. తేజు-రకుల్ కాంబినేషన్ లో తొలిసారిగా రూపొందుతున్న ఈ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా కోసం ఫారిన్ లొకేషన్స్ లో కూడా షూటింగ్ చేయాల్సి ఉండగా.. జార్జియా-టర్కీ దేశాల్లో చిత్రీకరించేందుకు యూనిట్ నిర్ణయించింది. నెల రోజులకు పైగా సాగనున్న ఈ షెడ్యూల్ లో.. ప్రధానమైన కొన్ని సీన్స్ తో పాటు రెండు పాటలను కూడా పిక్చరైజ్ చేయనున్నారని తెలుస్తోంది. 

ఫారిన్ షెడ్యూల్ లో హీరో సాయి ధరం తేజ్.. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ల తో పాటు మరి కొంతమంది ప్రధానమైన యాక్టింగ్ టీమ్ కూడా ఉంటారట. ఈ నెలాఖరులో కానీ.. అక్టోబర్ తొలివారంలో కాని జార్జియా షెడ్యూల్ ప్రారంభమవుతుందని నిర్మాత నల్లమలుపు బుజ్జి చెబుతున్నారు. డిసెంబర్ నాటికి ఈ చిత్రం షూటింగ్ పూర్తి కానుందని తెలుస్తోంది. 

04/09/2016

Ram Charan's Support to Nakshatram

Creative director Krishna Vamsi's upcoming film 'Nakshatram' is set to have an aggressive promotional campaigning. In accordance with it the makers would use the star power of Mega Power Star Ram Charan

Ram Charan will be unveiling ten first looks of the film, maybe all at once, in an occasion with the date yet to be mentioned. It can be assumed that all the key characters get ups maybe seen including Supreme hero Sai Dharam Tej, who happens to essay cop's role in the film. 

'Happy to Share that #Nakshatram's First ten looks are to be unveiled by Mega Power Star #RamCharan,' official handle of team 'Nakshatram' tweets. It is a known fact thatRam Charan and Krishna Vamsi earlier worked for 'Govindhudu Andarivadele'. They shared good rapport between them.

02/09/2016

Winner locked for Sai Dharam Tej’s next?

Following the disappointing outcome of his last release, Thikka, young hero Sai Dharam Tej is determined to bounce back to his success streak with the ongoing action entertainer under Gopichand Malineni’s direction.

According to the latest reports, Winner has been locked by the makers as the film’s title. The title has been in discussions ever since the project was announced several months ago. The film’s shooting is going on in Hyderabad and it has Rakul Preet Singh playing Sai’s love interest.

Nallamalupu Bujji and Tagore Madhu are producing this film and Thaman is scoring the music.

27/08/2016

Mega hero turns Fashion Mag editor

Already in real life, mega hero Allu Sirish has established and ran a cinema magazine named South Scope which he sold later. Here's another interesting happening. 

This time mega menalludu Saidharam Tej is turning into a fashion magazine editor. But he's not going to handle any real life magazine, but only on reel life he's going to do it. 

In upcoming film of Gopichand Malineni, we hear that Saidharam will be seen as a fashion magazine editor and he recently got a new haircut done in Mumbai to fit in the role. 

27/06/2016

మూడు నెలల్లో మళ్లీ మెగా మేనల్లుడి రచ్చ

ఏడాదికి కనీసం రెండు సినిమాలు రిలీజయ్యేలా ప్లాన్ చేసుకుని దూసుకెళ్తున్నాడు మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్. గత ఏడాది అతడి సినిమాలు రెండు రిలీజయ్యాయి. ఈ ఏడాది మేలో ‘సుప్రీమ్’ తో పలకరించిన సాయిధరమ్.. కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఊపులో తన తర్వాతి సినిమాను కూడా శరవేగంగా పూర్తి చేసేస్తున్నాడు. ‘ఓం 3డి’  ఫేమ్ సునీల్ రెడ్డి దర్శకత్వంలో సాయిధరమ్ ‘తిక్క’  సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ‘తిక్క’  ఫస్ట్ పోస్టర్ కూడా రిలీజైంది. దానికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఈ చిత్రాన్ని ఆగస్టులోనే రిలీజ్ చేసేయబోతున్నారట. అంటే సుప్రీమ్ వచ్చిన మూడు నెలలకే సాయిదరమ్ మరోసారి రచ్చ చేయబోతున్నాడన్నమాట.

ఇటీవలే ‘తిక్క’  టాకీ పార్ట్ కూడా పూర్తయింది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో సాయిధరమ్-పరహ్ ల మీద ఓ ఐటెం సాంగ్ చిత్రీకరిస్తున్నారు. ప్రేమ్ రక్షిత్ ఈ పాటకు డ్యాన్స్ కంపోజ్ చేస్తున్నాడు. ఈ సందర్భంగానే ప్రెస్ మీట్ పెట్టి సినిమా రిలీజ్ గురించి వెల్లడించింది తిక్క యూనిట్. దర్శకుడు సునీల్ రెడ్డి మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం చేస్తున్న పాట కాకుండా ఇంకో రెండు సాంగ్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. అందులో ఒకటి హైదరాబాద్ లో చిత్రీకరిస్తే  ఇంకో పాటను లడఖ్ లో ప్లాన్ చేస్తున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను ఆగస్టులో విడుదలకు సిద్ధం చేస్తున్నాం’ ’  అన్నాడు. తమన్ సంగీతాన్నందిస్తున్న ఈ చిత్రాన్ని రోహిన్ రెడ్డి నిర్మిస్తున్నాడు.

23/06/2016

50 రోజులు.. 25 కోట్లు

సుప్రీమ్ సినిమా విడుదలైనపుడు చాలామంది జస్ట్ ఏవరేజ్ అన్నారు.. బయ్యర్లకు నష్టాలు తప్పవన్నారు.. కానీ చివరికి చూస్తే అది సాయిధరమ్ తేజ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అయి కూర్చుంది. ఏకంగా 25 కోట్ల షేర్ కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 25 కేంద్రాల్లో అర్ధశత దినోత్సవం కూడా జరుపుకోవడం విశేషం. మూడు వారాలు ఆడటం కూడా గగనమైపోతున్న ఈ రోజుల్లో 25 సెంటర్లలో 50 రోజులు ఆడటమంటే చిన్న విషయమేమీ కాదు. హైదరాబాద్ లోని సంధ్య థియేటర్లో ఇప్పటికే రూ.50 లక్షలకు పైగా షేర్ కలెక్ట్ చేసి ఆశ్చర్యపరిచిన ఈ సినిమా.. అదే థియేటర్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. వైజాగ్ లో రెండు థియేటర్లలో ఈ సినిమా 50 రోజులాడటం విశేషం.

నైజాం ఏరియాలో ఈ సినిమా రూ.8.5 కోట్ల షేర్ వసూలు చేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఈ ఏరియాలో 16 కోట్ల దాకా గ్రాస్ వసూలైంది. రాయలసీమలో రూ.3.5 కోట్లు.. వైజాగ్ లో రూ.3 కోట్లు షేర్ వచ్చింది. ఆంధ్రా మొత్తం కలిపి రూ.10 కోట్ల దాకా షేర్.. రూ.17 కోట్ల గ్రాస్ వసూలైంది. కర్ణాటకలో రూ.2 కోట్ల దాకా షేర్ వచ్చింది. అమెరికాలో ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపించలేదు. ఓవరాల్ గా రూ.25 కోట్ల షేర్.. రూ.44 కోట్ల గ్రాస్ తో స్టార్ హీరో సినిమా స్థాయిలో వసూళ్లు సాధించింది. అనిల్ రావిపూడి ‘పటాస్’ కంటే కూడా ఇది ఎక్కువ వసూళ్లు సాధించడం విశేషం. ‘పటాస్’కు తొలి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ రాగా.. ‘సుప్రీమ్’ యావరేజ్ టాక్ తో మొదలైంది.

18/06/2016

తన మూడు లవ్స్ ను రివీల్ చేసిన సాయి ధరమ్

ఆచితూచి మాట్లాడటం.. వ్యక్తిగత విషయాల్ని పెద్దగా షేర్ చేయకపోవటం లాంటివి సినిమా ఇండస్ట్రీలో కామన్. ఆ మాటకు వస్తే ప్రముఖులు ఎవరూ ఓపెన్ కారు. ఎందుకంటే వారు మాట్లాడే ప్రతి మాటా వారి ఇమేజ్ మీద ప్రభావం చూపిస్తుంది. అయితే.. అలాంటివేమీ పెట్టుకోకుండా మొహమాటం లేకుండా తన లోపలి ప్రేమికుడ్ని ఆవిష్కరించారు మెగా క్యాంప్ కుర్ర హీరో సాయి ధరమ్ తేజ్. రీల్ లైఫ్ ముచ్చట్లు కాకుండా రియల్ లైఫ్ ముచ్చట్లు చెప్పేసి అందరిని హాయిగా నవ్వించేసిన అతగాడు తన మూడు ఫెయిల్యూర్ లవ్ ఎపిసోడ్ల గురించి చెప్పుకొచ్చాడు.

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వస్తున్న సాహసం శ్వాసగా సాగిపో ఆడియో ఫంక్షన్లో మాట్లాడిన తేజ్.. గౌతమ్ సినిమాల ప్రభావంతో మూడుసార్లు ఎదురుదెబ్బలు తిన్నట్లుగా చెప్పాడు. ఆయన సినిమాల ప్రభావంతో మూడుసార్లు లవ్ లో పడ్డానని.. మూడుసార్లు దెబ్బ పడిందని చెప్పుకొచ్చాడు. ఏదో పైపైకి మాటలన్నట్లు కాకుండా గౌతమ్ ఏ సినిమాలు తన మీద ప్రభావం చూపించాయో డీటైల్డ్ గా వెల్లడించాడు.

 ‘షుర్షణ’ సినిమా చూశాక బాగా చదువుకున్న అమ్మాయితో ప్రేమలో పడాలని భావించి.. అమెరికాలో ఉన్న ఓ అమ్మాయికి ప్రపోజ్ చేద్దామని వెళ్లేసరికి.. అమ్మడు మరొకరితో ఎంగేజ్ అయిపోయిందని.. చేసేదేమీ లేక వెనక్కి వచ్చేశానన్నాడు. తర్వాత ‘ఏం మాయ చేశావే’ చూసి మరో అమ్మాయిని ప్రేమించానని.. ఆ అమ్మాయి దగ్గరకు వెళితే ముందు కెరీర్ మీద ఫోకస్ చేయి అని చెప్పటంతో వర్క్ వుట్ కాలేదని.. ఆ తర్వాత ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ చూసి మరోసారి ఇంకో అమ్మాయి ప్రేమలో పడితే తను సైతం హ్యాండ్ ఇచ్చిందన్నాడు.  మూడు వన్ సైడ్ ప్రేమలతో ఎదురుదెబ్బలు తిన్న తాను.. సాహసం శ్వాసగా సాగిపో అంటూ డిసైడ్ అయ్యానని చెబితే అందరి మనసుల్ని దోచుకున్నాడు.  తన మీద గౌతమ్ ప్రభావం ఎంత ఉందన్న విషయాన్ని ఆయనకు గుర్తు ఉండిపోయేటట్లు చెప్పినట్లు కనిపించట్లేదు..? చూస్తుంటే.. తేజ్ లో చాలా విషయమే ఉందండోయ్.

10/06/2016

ఒక్క ఫ్యామిలీ.. 16 సినిమాలు.. మెగా లెక్క

మెగా కాంపౌండ్.. నిజంగానే కాంపౌండ్ అనే పదం మెగా కుటుంబానికి సరిగ్గా సరిపోతుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు.. అరడజనుకు పైగా హీరోలు వరుసపెట్టి సినిమాలు చేసేస్తుంటే.. ఇండస్ట్రీ కళకళ్లాడిపోతూ ఉంటుంది. ఆ ఫ్యామిలీ ఇంకా వెలిగిపోతూ ఉంటుంది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్నవి.. ఇప్పటికే ఓకే అనిపించేసుకుని త్వరలో ప్రారంభించుకోనున్నవి.. మొత్తం మెగా సినిమాల లెక్క చూస్తే ఔరా అనిపించక మానదు. ఈ కౌంట్ ఏకంగా 16 అంటే ప్రత్యర్ధి హీరోలకు గుండె గుభేల్ మనిపించడం ఖాయం. 

మెగాస్టార్ చిరంజీవి: చిరంజీవి 150వ చిత్రంగా కత్తిలాంటోడు ప్రారంభమైంది. వివి వినాయక్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారు. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్: పవన్ కళ్యాణ్ హీరోగా ఎస్ జే సూర్య డైరెక్షన్ లో ఓ మూవీ తెరకెక్కనుంది. దీని తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో మూవీ చేయనున్నాడు పవన్. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పనులు మొదలయ్యాయి. 

రామ్ చరణ్: చెర్రీ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ధృవ చిత్రాన్ని చేస్తున్నాడు. ఆ వెంటనే సుకుమార్ తో సినిమా స్టార్ట్ చేయనున్నాడు. ఇప్పటికే దీనికి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైపోయాయి. 

అల్లు అర్జున్: వరుసగా 4 సినిమాలను 50 కోట్లు దాటించిన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు బన్నీ. ఇప్పుడు లింగుస్వామితో కొత్త మూవీ స్టార్ట్ చేయనుండగా.. దీని తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడని ఇప్పటికే స్టోరీ ఓకే అయిపోయిందని తెలుస్తోంది. 

వరుణ్ తేజ్: మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్.. శ్రీను వైట్ల డైరెక్షన్ లో మిస్టర్ టైటిల్ పై ఓ సినిమా చేయనున్నాడు. దీంతో పాటే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కూడా మరో సినిమాని ఒకేసారి షూటింగ్ నిర్వహించనున్నాడు. గతంలో క్రిష్ డైరెక్షన్ లో ఆగిపోయిన రాయబారిని.. మళ్లీ పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పాడు వరుణ్ తేజ్. 

సాయిధరం తేజ్: సునీల్ రెడ్డి దర్శకత్వంలో తిక్క చిత్రాన్ని ఫినిషింగ్ దశకు తెచ్చిన సాయిధరమ్ తేజ్.. గోపీచంద్ మలినేనితో ఓ మూవీని బీవీఎస్ రవి డైరెక్షన్ లో జవాన్ టైటిల్ పై మరో సినిమాని లైన్ లో పెట్టాడు. 

అల్లు శిరీష్: పరశురామ్ దర్శకత్వంలో చేసిన శ్రీరస్తు.. శుభమస్తు ఆఖరి షెడ్యూల్ ప్రారంభిస్తున్నాడు అల్లు శిరీష్. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుండగా.. మల్లిడి వేణు డైరెక్షన్ లో ఓ చిత్రానికి ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. 

నీహారిక: నాగబాబు కూతురు నీహారిక ఒక మనసుతో హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఈ నెల 24న ఈ మూవీ విడుదలైన తర్వాత రిజల్ట్ చూసి.. కొత్త చిత్రాలను యాక్సెప్ట్ చేయనుంది. 

08/06/2016

సుప్రీమ్ హీరో 'జవాన్'గా వస్తున్నాడు

సుప్రీమ్ మూవీతో వరుసగా మూడో హిట్ కొట్టి హ్యాట్రిక్ సక్సెస్ లు సాధించాడు సాయిధరం తేజ్. చైల్డ్ సెంటిమెంట్ - కామెడీ కంటెంట్ లకు.. కరెక్ట్ టైమింగ్ కూడా జోడవడంతో.. కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న తేజు.. కొత్త ప్రాజెక్టులను ఓకే చేయడంలో తెగ స్పీడ్ చూపిస్తున్నాడు. ఇప్పటికే తిక్క టైటిల్ పై రూపొందుతున్న మూవీని ఫినిషింగ్ స్టేజ్ కి తెచ్చిన సాయిధరం తేజ్.. తర్వాత చేయబోయే ప్రాజెక్టుల విషయంలో పక్కా క్లారిటీతో ఉన్నాడు. 

తిక్క కాకుండా ఇప్పటికే రెండు సినిమాలను తేజు ఓకే చేసేశాడు. ఒకటి బీవీఎస్ రవి దర్శకత్వంలో రూపొందనుండగా.. మరొకటి గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కనుంది. తిక్క తర్వాత వెంటనే బీవీఎస్ రవి చిత్రాన్నే స్టార్ట్ చేస్తాడట తేజు. ఈ మూవీని కృష్ణ అనే నిర్మాత ప్రొడ్యూస్ చేయనుండగా.. ఇతను పూరీ జగన్నాథ్ - జూనియర్ ఎన్టీఆర్ లకు సన్నిహితుడు. ఇప్పటికే సాయిధరం తేజ్ కి సుబ్రమణ్యం ఫర్ సేల్ అంటూ ఓ హిట్ అందించిన దర్శకుడు హరీష్ శంకర్ సమర్పణలో.. ఈ మూవీ తెరకెక్కుతుంది. 

ఈ క్రేజీ కాంబినేషన్ లో రూపొందే చిత్రానికి 'జవాన్' అనే టైటిల్ ని ఫిక్స్ చేశారని తెలుస్తోంది. అలాగే 'ఇంటికొక్కడు' అనే ట్యాగ్ లైన్ కూడా ఉంటుందట. మొత్తానికి టైటిల్ లోనే మాంచి పవర్ చూపిస్తున్న సుప్రీమ్ హీరో సాయిధరం తేజ్ మూవీలో.. అంతకంటే ఎక్కువగానే కంటెంట్ ఉంటుందని  డైరెక్టర్ బీవీఎస్ రవి అంటున్నాడు.