23/06/2016

50 రోజులు.. 25 కోట్లు

సుప్రీమ్ సినిమా విడుదలైనపుడు చాలామంది జస్ట్ ఏవరేజ్ అన్నారు.. బయ్యర్లకు నష్టాలు తప్పవన్నారు.. కానీ చివరికి చూస్తే అది సాయిధరమ్ తేజ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అయి కూర్చుంది. ఏకంగా 25 కోట్ల షేర్ కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 25 కేంద్రాల్లో అర్ధశత దినోత్సవం కూడా జరుపుకోవడం విశేషం. మూడు వారాలు ఆడటం కూడా గగనమైపోతున్న ఈ రోజుల్లో 25 సెంటర్లలో 50 రోజులు ఆడటమంటే చిన్న విషయమేమీ కాదు. హైదరాబాద్ లోని సంధ్య థియేటర్లో ఇప్పటికే రూ.50 లక్షలకు పైగా షేర్ కలెక్ట్ చేసి ఆశ్చర్యపరిచిన ఈ సినిమా.. అదే థియేటర్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. వైజాగ్ లో రెండు థియేటర్లలో ఈ సినిమా 50 రోజులాడటం విశేషం.

నైజాం ఏరియాలో ఈ సినిమా రూ.8.5 కోట్ల షేర్ వసూలు చేయడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఈ ఏరియాలో 16 కోట్ల దాకా గ్రాస్ వసూలైంది. రాయలసీమలో రూ.3.5 కోట్లు.. వైజాగ్ లో రూ.3 కోట్లు షేర్ వచ్చింది. ఆంధ్రా మొత్తం కలిపి రూ.10 కోట్ల దాకా షేర్.. రూ.17 కోట్ల గ్రాస్ వసూలైంది. కర్ణాటకలో రూ.2 కోట్ల దాకా షేర్ వచ్చింది. అమెరికాలో ఈ సినిమా పెద్దగా ప్రభావం చూపించలేదు. ఓవరాల్ గా రూ.25 కోట్ల షేర్.. రూ.44 కోట్ల గ్రాస్ తో స్టార్ హీరో సినిమా స్థాయిలో వసూళ్లు సాధించింది. అనిల్ రావిపూడి ‘పటాస్’ కంటే కూడా ఇది ఎక్కువ వసూళ్లు సాధించడం విశేషం. ‘పటాస్’కు తొలి రోజు నుంచే సూపర్ హిట్ టాక్ రాగా.. ‘సుప్రీమ్’ యావరేజ్ టాక్ తో మొదలైంది.

No comments:

Post a Comment