16/06/2016

చెర్రీకి డిజిటల్ పనిష్మెంట్?

ఇవాల్టి రోజుల్లో ఎలక్ట్రానిక్స్ ఉపయోగించకుండా గడపమంటే ఎలా ఉంటుంది? ఎలక్ట్రానిక్ పరికరాలు డిజిటల్ ఎక్విప్మెంట్ కు దూరంగా ఉండమంటే.. అదే పెద్ద పనిష్మెంట్. ఎందుకంటే సెల్ ఫోన్ లేకుండా నిమిషం కూడా గడపలేని పరిస్థితిలోకి మనుషులు వచ్చేశారు కదా. 

కానీ ఎటువంటి ఎలక్ట్రానిక్స్ ఉపయోగించకుండా ఉండడాన్ని డిజిటల్ డిటాక్స్ అంటారు. ఇందులో సెల్ ఫోన్స్ కూడా ఉంటాయండోయ్. వాటిని కూడా ముట్టుకోకూడదు. గత రెండు వారాలుగా రామ్ చరణ్ ఈ డిజిటల్ డిటాక్స్ సిట్యుయేషన్ లోనే ఉన్నాడు. ఇలా ఉండమని సూచించిదని ఎవరో కాదు. తన భార్య ఉపాసన చెప్పడంతోనే ఇలా డిజిటల్ పరికరాలకు తాత్కాలికంగా దూరమయ్యాడు చెర్రీ. నిజానికి ఇదో చికిత్సలాంటిది. వాటికి అలవాటు పడిపోయి అవి లేకుండా బతకలేమేమో అనే పరిస్థితికి మనుషులు జారిపోయారు కదా. అలాంటి ఫీలింగ్ నుంచి బయటకు తెచ్చేందుకు ఈ డిజిటల్ డిటాక్స్ ఉపయోగపడుతుంది. 

'ప్రతీ ఏటా ఇలా ఎలక్ట్రానిక్స్ నుంచి వెకేషన్ తీసుకోవడం తప్పనిసరి అని ఉపాసన చెప్పడంతో.. చరణ్ వెంటనే అమలు చేసేశాడు' అంటున్నారు సన్నిహితులు. అసలు చెర్రీలాంటి సెలబ్రిటీ బిజీ పర్సన్ కి ఇది కష్టమే అయినా.. భార్య సహకారంతో బండి లాగించేస్తున్నాడట. ఇదే సమయంలో ఉపాసన కూడా సేమ్ థెరపీ పాటిస్తోంది. ఎంతైనా భార్య చెప్పగానే వెంటనే అమల్లో పెట్టేశాడంటే.. చెర్రీని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది కదూ. 

No comments:

Post a Comment