సరైనోడు.. ఇప్పటివరకూ ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్. మాస్ మసాలా మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి.. ఆడియన్స్ నుంచి విపరీతమైన మద్దతు లభించింది. ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర 65 కోట్ల రూపాయలకు పైగా షేర్ సాధించిన సరైనోడు.. ఇప్పటికీ చెప్పుకోదగ్గ మొత్తంలోనే రాబడుతోంది. ప్రస్తుతం థియేటర్లలో అ..ఆ.. సంచలనాలు నమోదు అవుతుండడంతో.. జోరు కొంచెం తగ్గిన మాట నిజమే అయినా.. రికార్డుల వేట మాత్రం కొనసాగుతూనే ఉంది. అల్లు అర్జున్ మూవీ సరైనోడు ఇంతగా ఆడేయడం.. అందరి కంటే పెద్ద షాక్ రివ్యూ రైటర్లకు - విమర్శకులకే అని చెప్పాలి.
ఏప్రిల్ 22న సరైనోడు విడుదలైనపుడు.. చాలా వరకు దారుణమైన రివ్యూలు రేటింగ్స్ వచ్చాయి. మాస్ రచ్చ ఎక్కువైపోయిందని స్టోరీ పెద్దగా ఏం లేదని బోయపాటి మళ్లీ తన పాత రూట్ లోనే వెళ్లాడని.. ఇలా చాలానే విమర్శలు ఎక్కుపెట్టారు. ఎన్ని మాటలు వినిపించినా.. ఎన్ని విమర్శలు వచ్చినా.. సరైనోడు మాత్రం సత్తా చాడాడు. టికెట్ కౌంటర్ దగ్గర సెన్సేషన్స్ సృష్టించాడు.
ఇప్పుడీ మూవీ 50 రోజుల రన్ పూర్తి చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 115 సెంటర్లలో 50 డేస్ కంప్లీట్ చేసుకోవడం.. చాలామంది క్రిటిక్స్ ని నోరెళ్లబెళ్లేట్లుగా చేసింది. అసలు.. ఈ రేటింగులు ఇచ్చే జనాలు. మాస్ అడియన్స్ ఏం కోరుకుంటున్నారో చేయడం వంటివి ఎవరికైనా కష్టం మాత్రమే కాదు నష్టం కూడా. సరైనోడు సక్సెస్ ని రికార్డులను చూస్తే.. తమ పైత్యమే తప్ప మాస్ అడియన్స్ కి ఏం కావాలో క్రిటిక్స్ తెలుసుకోలేకపోతున్నారని చెప్పచ్చు.
No comments:
Post a Comment