స్వచ్ఛమైన వినోదం అందించడమే లక్ష్యమని మొన్న అఆ పాటల విడుదల వేడుకలో చెప్పుకొచ్చాడు త్రివిక్రమ్. అలాంటి వినోదం కోసమే చాలా కష్టపడుతుంటానని అందుకే నా సినిమాలు కాస్త ఆలస్యమవుతుంటాయని చెప్పాడు. తదుపరి కూడా ఆయన రక్తపాతం - హింసలు లేకుండా అత్తారింటికి దారేది - అఆ తరహాలో చిత్రం తెరకెక్కించబోతున్నాడని సమాచారం. నిజానికి త్రివిక్రమ్ లో చాలా కోణాలున్నాయి. ఆయన అత్తారింటికి దారేది - అఆలాంటి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్లని తీయగలరు. అతడు - ఖలేజాలాంటి యాక్షన్ ఎంటర్ టైనర్లనీ తీయగలడు. అతడు - ఖలేజా సినిమాలు కూడా మంచి టాకే తెచ్చుకొన్నాయి కానీ... వసూళ్లు మాత్రం దక్కలేదు. అలాంటి చిత్రాలని కుటుంబ ప్రేక్షకులు చూడరన్న విషయం అర్థమైంది. అందుకే ఇటీవల త్రివిక్రమ్ దృష్టంతా క్లీన్ ఫ్యామిలీ కథలపైనే పెట్టినట్టు తెలుస్తోంది. కుటుంబం నేపథ్యంలో స్వచ్ఛమైన కథల్ని తీస్తే ఎన్ని లాభాలుంటాయో ఆయనకి చివరిగా తీసిన మూడు సినిమాలతో బాగా అర్థమైంది. సన్నాఫ్ సత్యమూర్తి యావరేజ్ సినిమా అనే టాక్ వచ్చినా వసూళ్లు మాత్రం అదిరిపోయాయి. చివరిలోపు సినిమా హిట్ట్ అన్న టాక్ వచ్చేసింది.
అందుకే మరోసారి అత్తారింటికి దారేది - అఆ తరహా కథనే సిద్ధం చేయడానికి పూనుకొన్నట్టు తెలుస్తోంది. తదుపరి త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ తోనే సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. ఈ కాంబినేషన్ లో ఇదివరకు కోబలిలాంటి మూవీ వస్తుందని ప్రచారం సాగింది. కానీ త్రివిక్రమ్ మాత్రం మరోసారి అత్తారింటికి దారేది తరహా సినిమానే తీయాలని అనుకొంటున్నాడట. ఇప్పటికే ఓ లైన్ కూడా ఫిక్స్ చేసుకొని దాన్ని వర్కవుట్ చేసేందుకు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది.
No comments:
Post a Comment