09/06/2016

నా శిష్యుడు 'బంగారం' లాంటోడు..


టాలీవుడ్ లో ఇప్పుడు టాప్ స్టార్లుగా వెలిగిపోతున్న చాలా మంది హీరోలకు నటనలో అక్షరాభ్యాసం చేయించింది సత్యానంద్ అని అందరికీ తెలిసిందే. యాక్టర్‌గానే కాకుండా ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకన్నారాయన. తనదగ్గర ట్రైనింగ్ తీసుకున్నవాళ్లందరిలో ఆయనకు నచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణేనట. మొదట పవన్ కళ్యాణ్ ను చిరంజీవి తన దగ్గరకు పంపినప్పుడు సిగ్గుపడుతున్న పవన్‌ను చూసి అసలు ఇతనికి యాక్టింగ్‌లో ట్రైనింగ్ ఇవ్వగలనా? అనే డౌట్ వచ్చిందట. తర్వాత కాలంలో అదే వ్యక్తి పవర్‌స్టార్ స్థాయికి ఎదగడం ఊహించని విషయం అంటూ వ్యాఖ్యానించారు సత్యానంద్. 

ట్రైనింగ్ తరువాత పవర్‌స్టార్ టాప్ స్టేజ్ కి ఎదిగినా.. తను నాతో ఎప్పుడు ఫోన్‌లో మాట్లాడుతుండేవారు. కుటుంబ విషయాలు కూడా చర్చకు వచ్చేవి. ఆ మాటల మధ్యలో సత్యానంద్ చెల్లెలి పెళ్లికి తన దగ్గర డబ్బు లేదన్న విషయం ప్రస్తావనకు వచ్చిందట. దీంతో పవన్ సత్యానంద్‌ను వెంటనే హైదరాబాద్‌కు పిలిపించి 50 వేల రూపాయలు సాయం చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు సత్యానంద్. తరువాత పవన్ కళ్యాణ్ తన చెల్లెలి పెళ్లికి రావడమే కాకుండా తిరిగి వెళ్లే సమయంలో డబ్బు పెట్టిన బ్యాగ్ ఒకటి అందించి వెళ్లారనీ, కేవలం పవన్ సాయంతోనే తన చెల్లెలి పెళ్లి ఎటువంటి ఇబ్బందులు లేకుండా విషయాన్ని తెలిపారు.

అంత మంచి మనసున్న వ్యక్తి తన స్టూడెంట్ కావడం తనకెంతో గర్వంగా ఉందని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు ఆయన. తన దగ్గర నటన నేర్చుకుని ఉన్నత స్థానాలకెదిగిన హీరోల గురించి తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ‌లో ఈ విషయాలను రివీల్ చేశారు సత్యానంద్.

No comments:

Post a Comment