Showing posts with label Trivikram. Show all posts
Showing posts with label Trivikram. Show all posts

02/09/2016

Three production houses confirm Pawan's films

Powerstar Pawan Kalyan is one hot cake hero if we have to talk about star heroes with most films in the hand. 

On the eve of his birthday today, Pawan's good friend and producer Sharat Marar confirmed that their film is titled "Katam Rayudu" and the shooting is going on. Other than this film, Dasari Narayana Rao's production house Tarakaprabhu films announced that their 38th production is due with Pawan. At the same time producer S Radhakrishna confirmed Pawan and Trivikram's next film as well. 

With three films in pipeline, surely Pawan is going to give a splendid treat to his fans in 2017. Any doubts?

20/08/2016

Pawan & Venky in Trivikram’s next

Earlier Power Star Pawan Kalyan  teamed up with Victory Venkatesh for the movie “Gopala Gopala”, directed by Dolly and it was turned out hit at the box office. Now once again both are going to work together for upcoming multistarrer movie .

 

It has been confirmed that Pawan’s upcoming drama will be multistarrer, which is going to be directed by talented film maker Trivikram Srinivas and Venkatesh  is going to share the screen space with Pawan.  It will go on the floor in November. Currently Trivikram is busy in the script work and  he want  to see Pawan and Venky together on big screen. Venky is popular for his comedy timing and Pawan is best for heroism. The upcoming comedy and action entertainer movie with Venkatesh and Pawan in the style of Trivikram will be a good feast for  movie lovers and Pawan’s fans.

02/07/2016

పవన్ అలా నిర్ణయించుకొన్నాడా?

పవన్ కళ్యాణ్ ఒకటి తలిస్తే వాస్తవంలో మరొకటి జరుగుతున్నట్టుంది. ఎస్.జె.సూర్యతో సినిమా చేసి ఫ్యాన్స్ కి  మళ్లీ ఖుషీ రోజుల్ని గుర్తుకు తెప్పించాలనుకొన్నాడు. కానీ ఊహించని రీతిలో ఎస్.జె.సూర్య ప్రాజెక్టు నుంచి బయటికెళ్లిపోయాడు. దీంతో పవన్ చేసేదేమీ లేక మరో దర్శకుడు డాలీని ఎంపిక చేసుకొన్నాడు. అయితే ఆకుల శివ రాసిన ఆ కథ డాలీకి సెట్టవ్వడం లేదట. స్క్రిప్టు తనదైన స్టైల్ లో రాసుకోవడానికి కాస్త సమయం కావాలని అడుగుతున్నాడట. దాంతో ఆ ప్రాజెక్టు మొత్తాన్ని పక్కనపెట్టేసి త్రివిక్రమ్ తో సినిమా చేయాలని పవన్ నిర్ణయించుకొన్నట్టు తెలిసింది. 

ప్రస్తుతం త్రివిక్రమ్ పవన్ కోసమే కథని సిద్ధం చేస్తున్నాడు. సెప్టెంబరులోపు ఆయన స్క్రిప్టుని సిద్ధం చేస్తాడట. అక్టోబరులో షూటింగ్ ని  మొదలుపెట్టి సమ్మర్ లో సినిమాని రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకొన్నట్టు తెలిసింది. అయితే ఆ ప్రాజెక్టుకి  నిర్మాత ఎవరన్నదే తెలియడం లేదు. ఒకపక్క దిల్ రాజు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. తన సంస్థలో పవన్ తో ఒక్క సినిమా అయినా చేయాలనేది దిల్రాజు ఆశ. ఎలాగో త్రివిక్రమ్-పవన్ ల  క్రేజీ కాంబినేషన్ కాబట్టి ఇంతకంటే మంచి ఛాన్స్ మరొకటి ఉండదని ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. 

25/06/2016

పవన్ కోసం మరో అత్తారిల్లు?

స్వచ్ఛమైన వినోదం అందించడమే లక్ష్యమని మొన్న అఆ పాటల విడుదల వేడుకలో చెప్పుకొచ్చాడు త్రివిక్రమ్. అలాంటి వినోదం కోసమే చాలా కష్టపడుతుంటానని అందుకే నా సినిమాలు కాస్త ఆలస్యమవుతుంటాయని చెప్పాడు. తదుపరి కూడా ఆయన రక్తపాతం - హింసలు లేకుండా అత్తారింటికి దారేది - అఆ తరహాలో  చిత్రం తెరకెక్కించబోతున్నాడని సమాచారం. నిజానికి త్రివిక్రమ్ లో చాలా కోణాలున్నాయి. ఆయన  అత్తారింటికి దారేది - అఆలాంటి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్లని తీయగలరు. అతడు - ఖలేజాలాంటి యాక్షన్ ఎంటర్ టైనర్లనీ తీయగలడు. అతడు - ఖలేజా సినిమాలు కూడా మంచి టాకే తెచ్చుకొన్నాయి కానీ... వసూళ్లు మాత్రం దక్కలేదు. అలాంటి చిత్రాలని  కుటుంబ ప్రేక్షకులు చూడరన్న విషయం అర్థమైంది. అందుకే ఇటీవల త్రివిక్రమ్  దృష్టంతా క్లీన్ ఫ్యామిలీ కథలపైనే పెట్టినట్టు తెలుస్తోంది. కుటుంబం నేపథ్యంలో  స్వచ్ఛమైన కథల్ని తీస్తే ఎన్ని  లాభాలుంటాయో ఆయనకి చివరిగా తీసిన మూడు సినిమాలతో బాగా అర్థమైంది. సన్నాఫ్ సత్యమూర్తి యావరేజ్ సినిమా అనే టాక్ వచ్చినా వసూళ్లు మాత్రం అదిరిపోయాయి. చివరిలోపు సినిమా హిట్ట్ అన్న టాక్ వచ్చేసింది.  

అందుకే మరోసారి అత్తారింటికి దారేది - అఆ తరహా కథనే సిద్ధం చేయడానికి పూనుకొన్నట్టు తెలుస్తోంది. తదుపరి త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ తోనే సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. ఈ కాంబినేషన్ లో ఇదివరకు కోబలిలాంటి మూవీ వస్తుందని ప్రచారం సాగింది. కానీ త్రివిక్రమ్ మాత్రం మరోసారి అత్తారింటికి దారేది తరహా సినిమానే తీయాలని అనుకొంటున్నాడట. ఇప్పటికే ఓ లైన్ కూడా ఫిక్స్ చేసుకొని దాన్ని వర్కవుట్ చేసేందుకు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది.

09/06/2016

పవన్ ఎందుకు చూశాడబ్బా!??

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాధారణంగా  సినిమాలు చూడడు. తన సినిమాలైనా చేయడమే తప్ప చూసే అలవాటు బొత్తిగా లేదు. తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా అయి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన అత్తారింటికి దారేది చిత్రాన్ని కూడా.. రిలీజ్ అయిన మూడు వారాల తర్వాతే చూశాడు. చాలా వరకు తన మూవీస్ ని డబ్బింగ్ దశలోనే చూస్తానని చెప్పాడు. ఇక ఇతర హీరోల సినిమాలు చూడనని ఇంటర్వ్యూల్లో ఓపెన్ గానే ఒప్పుకున్నాడు. మరి అ..ఆ.. చిత్రాన్ని ఎందుకు చూసినట్లు? 

త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన అ..ఆ..ను పవన్ చూసిన మాట వాస్తవమే. అంతే కాదు.. ప్రొజెక్టర్ ఆపరేటర్ ను కొన్ని సీన్లు రీప్లే చేయమని అడిగి మరీ చూశాడు ఎంజాయ్ చేశాడు పవన్ కళ్యాణ్. అంత క్లోజ్ గా సీన్ సీన్ ని పట్టి పట్టి మరీ చూడాల్సిన అవసరం ఏంటబ్బా అనే విషయం ఎవరికీ అర్ధం కావడం లేదు. ఇప్పుడు కొందరు సన్నిహితులు అసలు విషయం చెబుతున్నారు. నిజానికి అ..ఆ.. స్టోరీని పవన్ కు ముందుగానే చెప్పాడు త్రివిక్రమ్. తను చేసిన అత్తారింటికి దారేది చిత్రంతో కంపేర్ చేస్తే.. హీరో అత్యంత ధనవంతుడుగా కాకుండా.. అతి పేదవాడిగా అ..ఆ.. కేరక్టర్ ఉంటుంది. 

అది కాక కొన్ని పాత్రలను- సీన్లను రివర్స్ చేస్తే ఎలా ఉంటుందో అదే అ..ఆ.. మూవీ. అందుకే ఈ సినిమాని అంటే సేమ్ స్టోరీని ఇంకో యాంగిల్లో త్రివిక్రమ్ ఎలా తీశాడో చూడాలనే ఆసక్తితోనే పవన్ ఈ సినిమా చూశాడట. 

అ..ఆ.. చూసి పవర్ స్టార్ ఏమన్నాడంటే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొన్ని రోజుల క్రితం సమ్మర్ వెకేషన్ కి వెళ్లిన విషయం తెలిసిందే. మొదట పూనేలో కొన్ని రోజుల పాటు మాజీ వైఫ్ రేణూ దేశాయ్ దగ్గర ఉన్న పిల్లలతో గడిపిన పవన్.. తర్వాత ప్రస్తుత భార్యతో కలిసి రష్యా టూర్ వెళ్లాడు. తిరిగి వచ్చీ రాగానే.. తన స్నేహితుడైన త్రివిక్రమ్ కు ఫోన్ చేశాడట పవన్. అ..ఆ..కు లభిస్తున్న ఆదరణ గురించి తెలుసుకున్న పవన్.. ఆ సినిమాను చూద్దాం.. షో ఏర్పాటు చేయమని కోరాడట.

మరి పవన్ కళ్యాణ్ అడిగితే.. స్పెషల్ షో పడకుండా ఉంటుందా? వెంటనే ఏర్పాటు చేసేయడం.. పవన్ తో కలిసి దర్శకుడు త్రివిక్రమ్ కొందరు సన్నిహితులతో కలిసి చూసేయడం జరిగిపోయాయి. సినిమాని పూర్తిగా ఎంజాయ్ చేసిన పవర్ స్టార్.. త్రివిక్రమ్ ను మనసారా అభినందించాడని తెలుస్తోంది. 'అ..ఆ.. ను పవన్ బాగా ఎంజాయ్ చేస్తూ చూశారు. ముఖ్యంగా రావు రమేష్ డైలాగ్స్ కు ప్రశంసలు కురిపంచారు. రావు రమేష్ చేసిన సీన్స్ ను మళ్లీ మళ్లీ రిపీటెడ్ గా చూశారు పవన్' అని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. 

ఇక అసలు విషయం ఏంటంటే.. ప్రస్తుతం పవన్ కోసం త్రివిక్రమ్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడని.. డిసెంబర్ నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. జల్సా - అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్స్ సాధించిన వీరిద్దరి కాంబినేషన్.. టాలీవుడ్ లో కొత్త లెక్కలు సెట్ చేస్తుందని ఇండస్ట్రీ వర్గాలు ఆశిస్తున్నాయి

08/06/2016

పవన్- చెర్రీల ఆత్మీయ కథ ఇదే

ఈ మధ్య మెగా ఫ్యాన్స్- పవర్ స్టార్ ఫ్యాన్స్ మధ్య వివాదం ఓ రేంజ్ కి వెళ్లిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ 'చెప్పను బ్రదర్' సంఘటన తర్వాత ఇది పీక్స్ కి వెళ్లిపోయింది. అయితే.. ఎక్కడా రామ్ చరణ్ మాత్రం ఈ వివాదంపై నోరు మెదపలేదు. సోదరి నీహారిక సినిమా ఒక మనసు ఆడియో రిలీజ్ సమయంలో కూడా.. చాలా ఎలర్ట్ గా కనిపించాడు. అయితే.. మెగాస్టార్ - పవర్ స్టార్ ల మధ్య విబేధాలు ఇంకా ఉన్నాయని చాలామంది అనుకుంటూ ఉంటారు. 

రీసెంట్ గా ఏ స్టార్ వాల్యూ లేకుండా త్రివిక్రమ్ అ..ఆ.. చిత్రాన్ని సూపర్ సక్సెస్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మాటల మాంత్రికుడు నెక్ట్స్ పిక్చర్ ఎవరితో చేస్తాడనే టాక్ బాగా నడుస్తోంది. అయితే.. త్రివిక్రమ్ మాత్రం పవన్ తో చేయాలనే ఉద్దేశ్యంలో ఉన్నాడట. అందు
కు తగ్గట్లుగానే రెండు స్టోరీలను తన స్నేహితుడైన పవర్ స్టార్ కి వినిపించాడని తెలుస్తోంది. ఈ రెండు కథలు పవన్ కి విపరీతంగా నచ్చేసినా.. విన్న తర్వాత  పవన్ చెప్పిన మాట విని త్రివిక్రమ్ కూడా షాక్ తిన్నాడట. 

'ఈ రెండు స్టోరీలను అన్నయ్య కొడుకు రామ్ చరణ్ కి చెప్పండి. ఏదో ఒకటి తను ఎంచుకుంటే.. నేనే నిర్మాతగా ఆ సినిమా చేస్తా. అది పూర్తయిన తర్వాత.. రెండో స్టోరీలో నేనే నటిస్తా. వరుసగా చేసేద్దాం' అని పవన్ సూచించాడని తెలుస్తోంది. చెర్రీకి బెస్ట్ ఆప్షన్ ఇవ్వాలన్న ఆలోచనలోనే.. వీళ్ల అనుబంధం - ఆత్మీయత అర్ధమవుతుంది. అయితే.. ఈ వెర్షన్ బయటకొచ్చాక త్రివిక్రమ్ చేయబోయే తర్వాతి రెండు సినిమాలు మెగా హీరోలతోనే అని తెలిసి ఫ్యాన్స్ మాత్రం తెగ ఎగ్జయిట్ అయిపోతున్నారు.

07/06/2016

త్రివిక్రమ్ ఇక మెగా పవర్ స్టార్ తో??

ఇప్పటివరకు కేవలం యంగ్ అండ్ కొత్త దర్శకులతోనే సినిమాలు చేసిన దిల్ రాజు.. మారిన మార్కెట్ డైనమిక్స్ దృష్టిలో పెట్టుకొని.. పెద్ద డైరక్టర్లతో పనిచేస్తానని చెప్పుకొచ్చాడు. తొలి ప్రయత్నంగా త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నా అన్నారు. అయితే ఇందులో హీరోఎవరు అనేది ఊహాజనితమే. 

ఇప్పుడు ఈ విషయంలో ఒక మెగా న్యూస్ బయటకు వచ్చింది. నిజానికి త్రివిక్రమ్ రెండు సినిమాలను ప్లాన్ చేస్తున్నాడట. ఒకటి పవన్ కళ్యాణ్ తో చేస్తుంటే.. మరొకటి రామ్ చరణ్ తో చేస్తున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా సదరు సినిమాలకు పనిచేసే ఒక బడా పి.ఆర్.ఓ తెలియజేశారు. అయితే.. పవన్ కళ్యాణ్ ప్రొడక్షన్ లో చెర్రీని డైరక్ట్ చేస్తాడా.. లేకపోతే పవన్ తో సినిమా చేసే వచ్చేసి దిల్ రాజు ప్రొడక్షన్ లో చరణ్ ను డైరక్ట్  చేస్తాడా అనే విషయం చూడాల్సిందే. కాని సదరు పి.ఆర్.ఓ మాత్రం ఖచ్చితంగా ''ధృవ'' సినిమా పూర్తయ్యాక.. చరణ్ ఒక ప్రక్కన సుకుమార్ సినిమా మరో ప్రక్కన త్రివిక్రమ్ సినిమా చేస్తాడట. 

ఏదేమైనా కూడా ఇప్పుడు త్రివిక్రమ్ చాలా సార్ట్ ఆఫ్టర్ డైరక్టర్ అయిపోయాడు. ముఖ్యంగా ఆయన ఎటువంటి పెద్ద స్టార్లూ లేకుండా.. ''అ..ఆ'' తో ఒక హిట్టు కొట్టాడు చూడండి.. అక్కడ అందరూ పడిపోయారు. 

ఆ స్టార్ హీరో.. పవన్ కళ్యాణేనా?!

మరో క్రేజీ కాంబినేషన్ సెట్టయ్యింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా నిర్మించడానికి దిల్ రాజు రంగం సిద్ధం చేసుకొన్నారు. ఆ సినిమా  కూడా ఓ స్టార్ హీరోతో  ఉంటుందని అదెవరో త్వరలోనే చెబుతామని దిల్ రాజు స్పష్టం చేశారు.  దాంతో  అందరూ కూడా స్టార్ హీరో అంటే  పవన్ కళ్యాణే కావొచ్చు అని డౌట్ పడుతున్నారు. తన బ్యానర్ లో పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని దిల్ రాజు ఎప్పట్నుంచో కలగంటున్నారు. ఆమధ్య  ప్రయత్నాలు కూడా చేశారు. కొద్దిమంది దర్శకులతో కథలు కూడా వినిపించారు.  కానీ కథ  సెట్టవకపోవడంతో ఆ ప్రయత్నం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. 

ఇప్పుడు త్రివిక్రమ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు కాబట్టి దిల్ రాజు పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. అందుకు త్రివిక్రమ్ కూడా తన వంతుగా సహకారం అందించినున్నట్టు సమాచారం. త్రివిక్రమ్ - పవన్ కళ్యాణ్ మంచి స్నేహితులు. ఒకరి మాట మరొకరు జవ దాటరు. మరి ఈ ఇద్దరూ ఫిక్సయితే దిల్ రాజు కల నెరవేరినట్టే. పైగా పవన్ కళ్యాణ్ని దృష్టిలో ఉంచుకొని త్రివిక్రమ్ రెండు మూడు కథల్ని సిద్ధం చేసుకొన్నట్టు  సమాచారం.  కోబలితో పాటు మరో ఫ్యామిలీ సబ్జెక్ట్  కూడా అనుకొన్నాడట. పవన్ కళ్యాణ్ ఓకే అంటే మాత్రం మరో  క్రేజీ కాంబినేషన్ లో సినిమా ఖాయమైనట్టే.