Showing posts with label Nithin. Show all posts
Showing posts with label Nithin. Show all posts

09/06/2016

పవన్ ఎందుకు చూశాడబ్బా!??

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాధారణంగా  సినిమాలు చూడడు. తన సినిమాలైనా చేయడమే తప్ప చూసే అలవాటు బొత్తిగా లేదు. తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా అయి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన అత్తారింటికి దారేది చిత్రాన్ని కూడా.. రిలీజ్ అయిన మూడు వారాల తర్వాతే చూశాడు. చాలా వరకు తన మూవీస్ ని డబ్బింగ్ దశలోనే చూస్తానని చెప్పాడు. ఇక ఇతర హీరోల సినిమాలు చూడనని ఇంటర్వ్యూల్లో ఓపెన్ గానే ఒప్పుకున్నాడు. మరి అ..ఆ.. చిత్రాన్ని ఎందుకు చూసినట్లు? 

త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన అ..ఆ..ను పవన్ చూసిన మాట వాస్తవమే. అంతే కాదు.. ప్రొజెక్టర్ ఆపరేటర్ ను కొన్ని సీన్లు రీప్లే చేయమని అడిగి మరీ చూశాడు ఎంజాయ్ చేశాడు పవన్ కళ్యాణ్. అంత క్లోజ్ గా సీన్ సీన్ ని పట్టి పట్టి మరీ చూడాల్సిన అవసరం ఏంటబ్బా అనే విషయం ఎవరికీ అర్ధం కావడం లేదు. ఇప్పుడు కొందరు సన్నిహితులు అసలు విషయం చెబుతున్నారు. నిజానికి అ..ఆ.. స్టోరీని పవన్ కు ముందుగానే చెప్పాడు త్రివిక్రమ్. తను చేసిన అత్తారింటికి దారేది చిత్రంతో కంపేర్ చేస్తే.. హీరో అత్యంత ధనవంతుడుగా కాకుండా.. అతి పేదవాడిగా అ..ఆ.. కేరక్టర్ ఉంటుంది. 

అది కాక కొన్ని పాత్రలను- సీన్లను రివర్స్ చేస్తే ఎలా ఉంటుందో అదే అ..ఆ.. మూవీ. అందుకే ఈ సినిమాని అంటే సేమ్ స్టోరీని ఇంకో యాంగిల్లో త్రివిక్రమ్ ఎలా తీశాడో చూడాలనే ఆసక్తితోనే పవన్ ఈ సినిమా చూశాడట.