Showing posts with label DilRaju. Show all posts
Showing posts with label DilRaju. Show all posts

07/06/2016

ఆ స్టార్ హీరో.. పవన్ కళ్యాణేనా?!

మరో క్రేజీ కాంబినేషన్ సెట్టయ్యింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా నిర్మించడానికి దిల్ రాజు రంగం సిద్ధం చేసుకొన్నారు. ఆ సినిమా  కూడా ఓ స్టార్ హీరోతో  ఉంటుందని అదెవరో త్వరలోనే చెబుతామని దిల్ రాజు స్పష్టం చేశారు.  దాంతో  అందరూ కూడా స్టార్ హీరో అంటే  పవన్ కళ్యాణే కావొచ్చు అని డౌట్ పడుతున్నారు. తన బ్యానర్ లో పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని దిల్ రాజు ఎప్పట్నుంచో కలగంటున్నారు. ఆమధ్య  ప్రయత్నాలు కూడా చేశారు. కొద్దిమంది దర్శకులతో కథలు కూడా వినిపించారు.  కానీ కథ  సెట్టవకపోవడంతో ఆ ప్రయత్నం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. 

ఇప్పుడు త్రివిక్రమ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు కాబట్టి దిల్ రాజు పవన్ కళ్యాణ్ డేట్స్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. అందుకు త్రివిక్రమ్ కూడా తన వంతుగా సహకారం అందించినున్నట్టు సమాచారం. త్రివిక్రమ్ - పవన్ కళ్యాణ్ మంచి స్నేహితులు. ఒకరి మాట మరొకరు జవ దాటరు. మరి ఈ ఇద్దరూ ఫిక్సయితే దిల్ రాజు కల నెరవేరినట్టే. పైగా పవన్ కళ్యాణ్ని దృష్టిలో ఉంచుకొని త్రివిక్రమ్ రెండు మూడు కథల్ని సిద్ధం చేసుకొన్నట్టు  సమాచారం.  కోబలితో పాటు మరో ఫ్యామిలీ సబ్జెక్ట్  కూడా అనుకొన్నాడట. పవన్ కళ్యాణ్ ఓకే అంటే మాత్రం మరో  క్రేజీ కాంబినేషన్ లో సినిమా ఖాయమైనట్టే.