Showing posts with label AlluArjun. Show all posts
Showing posts with label AlluArjun. Show all posts

16/08/2016

ఫేవరెట్ హీరో మారిపోయాడంటున్న బన్నీ

ఒకప్పుడు బాలీవుడ్లో షారుఖ్ ఖాన్ నెంబర్ వన్. సల్మాన్ ఖాన్ అయినా.. అమీర్ ఖాన్ అయినా కింగ్ ఖాన్ తర్వాతే. ఐతే గత పదేళ్లలో నెంబర్లు కాస్త అటు ఇటు అయ్యాయి. మిగతా ఇద్దరినీ వెనక్కి నెట్టి అమీర్ ఖాన్ పైకి వచ్చాడు. ఈ మధ్య అమీర్ ను కూడా వెనక్కి నెట్టి సల్మాన్ రైజింగ్ లో ఉన్నాడు. షారుఖ్ ను ఇష్టపడేవాళ్ల సంఖ్య తగ్గుతోంది. ఇంతకుముందు ఆయన్ని అభిమానించేవాళ్లు మిగతా ఇద్దరు ఖాన్ ల వైపు చూస్తున్నారు. ఈ విషయంలో మన స్టార్ హీరో అల్లు అర్జున్ కూడా మినహాయింపు కాదు. ఇంతకుముందు షారుఖ్ ఖాన్ ను అభిమానించే బన్నీ.. ఇప్పుడు సల్మాన్ ఖాన్ ను ఇష్టపడుతున్నాడట.

‘‘నేను మొదట్లో షారుఖ్ ఖాన్ ఫ్యాన్. ఐతే కొన్నిసార్లు మన అభిరుచులు మారుతుంటాయి. కొంతకాలంగా సల్మాన్ ఖాన్ సినిమాలు చూస్తున్నా. ఇప్పుడాయనే నా ఫేవరెట్ బాలీవుడ్ హీరో. అలాగే తమిళ హీరో విజయ్ అన్నా చాలా ఇష్టం. ఆయన సినిమాలు చూస్తున్నాను. తుపాకి.. కత్తి సినిమాలు బాగా నచ్చాయి. విజయ్ సినిమాలన్నింట్లో మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి. నా సినిమాలు కూడా అలాగే ఉంటాయి’’ అని బన్నీ చెప్పాడు. ఇక బాలీవుడ్లో ఏ హీరోయిన్ తో పని చేయాలనుకుంటున్నారన్న ప్రశ్నకు సమాధానంగా ఆలియా భట్.. పరిణీతి చోప్రాల పేర్లు చెప్పాడు అల్లు అర్జున్. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయాల్సిన సినిమా కోసం ప్రిపరేషన్లో ఉన్నాడు బన్నీ.

ఫేవరెట్ హీరో మారిపోయాడంటున్న బన్నీ

ఒకప్పుడు బాలీవుడ్లో షారుఖ్ ఖాన్ నెంబర్ వన్. సల్మాన్ ఖాన్ అయినా.. అమీర్ ఖాన్ అయినా కింగ్ ఖాన్ తర్వాతే. ఐతే గత పదేళ్లలో నెంబర్లు కాస్త అటు ఇటు అయ్యాయి. మిగతా ఇద్దరినీ వెనక్కి నెట్టి అమీర్ ఖాన్ పైకి వచ్చాడు. ఈ మధ్య అమీర్ ను కూడా వెనక్కి నెట్టి సల్మాన్ రైజింగ్ లో ఉన్నాడు. షారుఖ్ ను ఇష్టపడేవాళ్ల సంఖ్య తగ్గుతోంది. ఇంతకుముందు ఆయన్ని అభిమానించేవాళ్లు మిగతా ఇద్దరు ఖాన్ ల వైపు చూస్తున్నారు. ఈ విషయంలో మన స్టార్ హీరో అల్లు అర్జున్ కూడా మినహాయింపు కాదు. ఇంతకుముందు షారుఖ్ ఖాన్ ను అభిమానించే బన్నీ.. ఇప్పుడు సల్మాన్ ఖాన్ ను ఇష్టపడుతున్నాడట.

‘‘నేను మొదట్లో షారుఖ్ ఖాన్ ఫ్యాన్. ఐతే కొన్నిసార్లు మన అభిరుచులు మారుతుంటాయి. కొంతకాలంగా సల్మాన్ ఖాన్ సినిమాలు చూస్తున్నా. ఇప్పుడాయనే నా ఫేవరెట్ బాలీవుడ్ హీరో. అలాగే తమిళ హీరో విజయ్ అన్నా చాలా ఇష్టం. ఆయన సినిమాలు చూస్తున్నాను. తుపాకి.. కత్తి సినిమాలు బాగా నచ్చాయి. విజయ్ సినిమాలన్నింట్లో మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి. నా సినిమాలు కూడా అలాగే ఉంటాయి’’ అని బన్నీ చెప్పాడు. ఇక బాలీవుడ్లో ఏ హీరోయిన్ తో పని చేయాలనుకుంటున్నారన్న ప్రశ్నకు సమాధానంగా ఆలియా భట్.. పరిణీతి చోప్రాల పేర్లు చెప్పాడు అల్లు అర్జున్. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయాల్సిన సినిమా కోసం ప్రిపరేషన్లో ఉన్నాడు బన్నీ.

26/07/2016

హై ఫై బార్ పెడుతున్న బన్నీ

అబ్బో.. టాలీవుడ్ స్టార్ హీరోలు ఒక్కొక్కరూ ఒక్కో బిజినెస్ పెడుతున్నరుగా. నాగార్జున హోటల్స్.. రవితేజ ఇన్వెస్టుమెంట్స్.. రామ్ చరణ్ ఎయిర్ లైన్స్.. చిన్న హీరోల రెస్టారెంట్స్.. ఇలా అందరూ ఏదో ఒక వ్యాపారం చేస్తూనే ఉన్నారు. మరి వీళ్ళతో నేనెందుకు జాయిన్ అవ్వకూడదు అంటున్నాడు స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్. 

యం కిచెన్స్ అనే రెస్టారెంట్.. హై లైఫ్ బ్రూయింగ్ కో అనే బారు వారితో కలసి.. ఇప్పుడు హైదరాబాదులో ఒక కొత్త కాన్సెప్టు ఓరియెంటెడ్ నైట్ క్లబ్ పెడుతున్నాడు బన్నీ. ''యం కిచెన్స్ మరియు బఫెలో వైల్డ్ వింగ్స్ అనే సంస్థలు నన్ను ఎప్రోచ్ అయినప్పుడు.. పెద్దగా ఆలోచించాలని అనిపించలేదు. వారితో కలసి ''800 జూబిలీ'' అనే క్లబ్ పెడుతున్నాం'' అంటూ ప్రముఖ పత్రిక టైమ్స ఆఫ్ ఇండియా వారికి ఇచ్చిన ఇంటర్యూలో చెప్పుకొచ్చాడు మన సినీ హీరో. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెం.36లో రాబోతున్న ఈ క్లబ్ లో ఒక కేఫ్ - జపానీస్ రెస్టారెంట్ - బార్బిక్యూ రెస్టారెంట్ వగైరా ఉంటాయట. క్లబ్ లో స్వయంగా వారే తయారుచేసిన బీర్లు వగైరా కూడా దొరుకుతాయి. 

జూలై 29న స్వయంగా అల్లు అర్జున్ చేతుల మీదుగా ఈ క్లబ్ ఓపెన్ చేయనున్నారట. ఇప్పటివరకు బ్రూయింగ్ అంటే తెలియకుండా ఓన్లీ సీల్డ్ ఆల్కహాల్ తాగిన హైదరాబాదుకు కొత్త రుచిని చూపిస్తాం అంటున్నారు ఈ క్లబ్ పార్టనర్లు. 

20/07/2016

నా ఫ్యామిలీ పెరుగుతోంది -అల్లు అర్జున్

తన కొడుకు అల్లు అయాన్ జీవితంలో ప్రతీ ఒక్క మూమెంట్ కూడా ఎంతో బాగా సెలబ్రేట్ చేసుకోవాలని నిరంతరం తపిస్తుంటాడు అల్లు అర్జున్. అందుకే మనోడు ఎప్పటికప్పుడు తన వైఫ్ స్నేహ రెడ్డి తో కలసి ఆయాన్ ను అనేక విధాలుగా ఫోటో షూట్లు చేసి.. అవన్నీ సోషల్ మీడియాలో పెడుతూ తన అభిమానులను అలరిస్తుంటాడు. ఇప్పుడు అలాంటి ఫీట్ మరొకటి చేశాడు. 

''మా ఫ్యామిలీ ఇంకాస్త పెరుగుతుండటం చాలా ఆనందంగా ఉంది. త్వరలోనే మా ఫ్యామిలీలోకి ఇంకో లిటిల్ బేబి రాబోతుంది'' అంటూ ఒక ఫోటోను షేర్ చేశాడు బన్నీ. తన కొడుకు అయన్.. తల్లి స్నేహ కడుపును ముద్దు పెట్టుకుంటున్న ఆ ఫోటో ఎంతో మురిపెంగా ఉంది. పైగా స్నేహ ప్రెగ్నెన్సీ న్యూస్ ను ఇలా తనే సొంతంగా షేర్ చేసుకోవడం అనేది ఇంకా పెద్ద విషయం. హీరోలందరూ ఇలాంటి వార్తలను గోప్యంగా ఉంచాలని చూస్తే.. బన్నీ మాత్రం తన లైఫ్ ను అనుక్షణం అభిమానులతో షేర్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. 

కంగ్రాట్స్ అల్లు అర్జున్. త్వరలోనే పండంటి బిడ్డ పుట్టాలని తుపాకి.కాం తరుపున విషెస్ తెలియజేస్తున్నాం. 

18/07/2016

కేరళలోనూ 24 సెంటర్లలో 50 రోజులు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సరైనోడు టాలీవుడ్ లో ఎన్నో సంచలనాలు సృష్టించింది. బోయపాటి శ్రీను దర్శకత్వం కావడంతో భారీ అంచనాల మధ్య విడుదలైన సరైనోడుకి మొదట డివైడ్ టాక్ వచ్చినా.. తర్వాత బ్లాక్ బస్టర్ అయిపోయింది. 

తెలుగులో సరైనోడు పేరిట చాలానే రికార్డులున్నాయి. ఇప్పుడీ మూవీ మలయాళ వెర్షన్ యోధావు మల్లూవుడ్ లో సెన్సేషన్స్ క్రియేట్ చేస్తోంది. కేరళలో ఇప్పటికే 6 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టగా.. 24 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంటూ రికార్డులు సృష్టిస్తోంది. బన్నీకి కేరళలో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఉన్నారో ఈ మూవీ మరోసారి ప్రూవ్ చేసింది. ఇంతటి విజయాన్ని అందించిన మలయాళీ ప్రేక్షకులకు థ్యాంక్యూ చెప్పేందుకు కేరళ స్టైలిష్ స్టార్ వెళ్లనున్నాడు. తెలుగులో బ్లాక్ బస్టర్ గా నిలిచిన తర్వాత రిలీజ్ చేయడం మలయాళ వెర్షన్ కి బాగా కలిసొచ్చింది. 

తెలుగులో అయితే 75.75 కోట్ల వసూళ్లతో ఇండస్ట్రీ టాప్ 5లో నిలిచిన సరైనోడు ఖాతాలో మరిన్ని రికార్డులు కూడా ఉన్నాయి. ఈ ఏఢాది ఇప్పటివరకూ బిగ్గెస్ట్ హిట్ ఇదే కాగా.. బన్నీ కెరీర్ లో కూడా అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీ సరైనోడు. ఈ సక్సెస్ ని బాగానే ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్.. తన నెక్ట్స్ మూవీని హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయనున్నాడు. దిల్ రాజు బ్యానర్ లో నిర్మాణం కానున్న ఈ మూవీ సెప్టెంబర్ లో సెట్స్ పైకి వెళ్లనుంది.

07/07/2016

మెగా హీరో సినిమాలో బన్నీ కేమియో

ఇద్దరు మెగా హీరోలకు ఆఫ్ స్క్రీన్ లో తప్ప.. ఆన్ స్క్రీన్ లో ఒకే సారి చూసే అవకాశం అంత తేలిగ్గా రాదు. అందరూ ఒకటే అయినా ఎవరికి వారే సినిమాలు చేసేసుకుంటూ ఉంటారు. ఎవరి ఇమేజ్ కి తగ్గట్లుగా వాళ్లు సినిమాలు చేస్తుంటారు. అప్పుడెప్పుడో శంకర్ దాదా జిందాబాద్ లో అప్పటికి ఇండస్ట్రీలో ఉన్న మెగా హీరోలంతా కనిపించారు. ఆ తర్వాత ఎవడు మూవీలో చెర్రీ-బన్నీ ఇద్దరూ చేశారు కానీ.. ఒకే ఫ్రేమ్ లో మాత్రం కనిపించరు. ఇప్పుడో మూవీలో బన్నీ కేమియో చేస్తున్నాడనే వార్తలతో.. ఇద్దరు హీరోలకు ఒకే స్క్రీన్ పై చూసే అవకాశం రానుంది.

అల్లు శిరీష్ లేటెస్ట్ మూవీ శ్రీరస్తు..శుభమస్తు. ఈ సినిమాలో బన్నీ ప్రచారం చేయడంతో పాటు.. శిరీష్ నెక్ట్స్ మూవీలో ఓ స్పెషల్ కేమియో చేయనున్నాడనే వార్తలు టాలీవుడ్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికి రెండు సినిమాలు చేసినా సరైన గుర్తింపు సంపాదించలేకపోయాడు శిరీష్. గౌరవం మూవీతో ఫ్లాప్ ని.. కొత్త జంటతో యావరేజ్ ని అందుకున్న శిరీష్.. శ్రీరస్తు శుభమస్తుపై చాలానే ఆశలు పెట్టుకున్నాడు. ఈ మూవీని హిట్ ట్రాక్ పట్టించే బాధ్యతను ఇప్పుడు అల్లు అర్జున్ టేకప్ చేశాడని తెలుస్తోంది. తమ్ముడికి ఓ విజయం అందించేందుకు తన వంతుగా సాయం చేస్తున్నాడు బన్నీ. 

వచ్చే నెలలో శ్రీరస్తు శుభమస్తు రిలీజ్ కానుండగా.. శిరీష్ తర్వాత సినిమా మల్లాది వేణు దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఈ చిత్రంలో మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటించనుండగా.. అల్లు శిరీష్ - అల్లు అర్జున్ కలిసి కనిపించే సన్నివేశాలు చెప్పుకోదగిన సంఖ్యలోనే ఉంటాయట. తమ్ముడి కోసం అన్న బాధ్యతలు టేకప్ చేయడాన్ని ఫిలింనగర్ లో ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. 

15/06/2016

అక్కడైతే లవ్ స్టోరీనే అంటున్న బన్నీ

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు మహా హ్యాపీగా ఉన్నాడు. రివ్యూలు నెగిటివ్ గా వచ్చి - క్రిటిక్స్ నుంచి రొటీన్ మూవీ అనే విమర్శలు వచ్చిన సినిమాతో... ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డు కొట్టడం చిన్న విషయం కాదు. టాలీవుడ్ లో టాప్ 5చోటు సంపాదించిన సరైనోడు.. ఫుల్ రన్ కలెక్షన్స్ వచ్చాక టాప్3లో ఉంటాడనే అంచనాలున్నాయి. మరోవైపు యోధావు పేరుతో రిలీజ్ అయిన మలయాళ వెర్షన్ కేరళలో మంచి సక్సెస్ సాధించింది. 

తమ సొంత హీరోలతో సమానంగా ఆదరిస్తున్న కేరళ ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెబుతున్నాడు అల్లు అర్జున్. అలాగే తాను మలయాళ మూవీస్ ని క్లోజ్ గా ఫాలో అయిపోతానని అంటున్నాడు. 'బెంగళూరు డేస్ లో ఫహద్ ఫాజిల్ ని చూసి నాకు మతి పోయినంత పనైంది. ప్రేమమ్ నివిన్ పౌలీ బాగా ఆకట్టుకున్నాడు. చార్లీ.. ఓకే కణ్మణి చిత్రాల్లో దుల్కర్ సల్మాన్ చాలా నచ్చేశాడు. అలాగే నేను మోహన్ లాల్ కి వీరాభిమానిని. త్వరలోనే ఆయనతో ఓ సినిమా చేసే అవకాశాలున్నాయి' అని చెప్పాడు అల్లు అర్జున్. 

ఒక ఇండస్ట్రీ నుంచి మరో భాషకు యాక్టర్లు ఎక్స్ ఛేంజ్ అవ్వాల్సిన అవసరం ఉందన్న స్టైలిష్ స్టార్.. మలయాళంలో డైరెక్ట్ సినిమా చేయడం మాత్రం ఖాయంగా చెబుతున్నాడు. అయితే.. అక్కడ చేయబోయే సినిమా మాత్రం లవ్ స్టోరీ అవ్వాలని భావిస్తున్నాడ మన మాస్ బన్నీ. 

12/06/2016

Sarrainodu’s record breaking feat in Uttarandhra and Nizam

Stylish Star Allu Arjun’s summer blockbuster, Sarrainodu, is still being played in select screens across the two Telugu states. This Boyapati directorial, which completed its 50 days run recently, has grossed more than 125 crores with a share of nearly 70 crores, becoming Bunny’s highest grossing film till date.

In its phenomenal run, Sarrainodu has achieved two enviable records in Uttarandhra and Nizam. Sarrainodu crossed a share of 8 crores in Uttarandhra to become the 2nd highest grossing film after Baahubali, which collected 9.70 crores.

In Nizam, Sarrainodu surpassed the 19 crores milestone to emerge as the 5th highest earner after Baahubali, Srimanthudu, Magadheera and Gabbar Singh.

డ్యాన్సులు మారాలంటున్న బన్నీ

టాలీవుడ్ బెస్ట్ డ్యాన్సర్లలో అల్లు అర్జున్ ఒకడు. కెరీర్ ఆరంభంలో ‘ఆర్య’ దగ్గర్నుంచి... లేటెస్ట్ మూవీ ‘సరైనోడు’ వరకు అదిరిపోయే డ్యాన్సులతో అదరగొట్టాడు బన్నీ. ఐతే సినిమా సినిమాకూ డ్యాన్సుల్లో కొత్తదనం చూపిస్తున్నప్పటికీ తన డ్యాన్సులు తనకే బోర్ కొట్టేస్తున్నాయని అంటున్నాడు అల్లు అర్జున్. డ్యాన్స్ కంపోజింగ్ విషయంలో మనం మారాల్సిన సమయం వచ్చేసిందని అంటున్నాడతను.

డ్యాన్సుల గురించి తన అంతరంగాన్ని వెల్లడిస్తూ.. ‘‘తొలి సినిమా గంగోత్రిలో డ్యాన్సులు చేసే అవకాశం పెద్దగా రాలేదు. ‘ఆర్య’లో మాత్రం నన్ను నేను నిరూపించుకొనే అవకాశం దొరికింది. నా ప్రేమను కోపంగానూ... పాట మెలోడీ అయినా సరే.. మూన్ వాక్ స్టెప్పు వేసి అలరించాను. అక్కడి నుంచి ప్రతి సినిమాలోనూ డ్యాన్సుల విషయంలో శ్రద్ధ చూపిస్తూ వచ్చా. గతంలో సినిమాలోని ప్రతి పాటకూ కొత్తగా డ్యాన్సులు వేయాలనుకునేవాడిని. కానీ ఇప్పుడు కనీసం ఒక్క పాటైనా వెరైటీగా ట్రై చేయాలనుకుంటున్నా. డ్యాన్స్ కంపోజిషన్ విషయంలో మనం మారాలి. మూస పద్ధతిలోంచి బయటకు రావాలి. అప్పుడే కొత్తరకం డ్యాన్సుల్ని చూపించగలం’’ అని చెప్పాడు బన్నీ.

డ్యాన్సుల విషయంలో ఇప్పటి హీరోలు ఎంత చేసినా.. చిరంజీవిని మించిన వాడు ఎవ్వరూ లేరని... ఆయన డ్యాన్సులు నూటికి నూరు శాతం పర్ఫెక్ట్ గా ఉంటాయని బన్నీ చెప్పాడు. చిరంజీవి అంత పర్ఫెక్ట్ గా ఉంటారు కాబట్టే మనం చేయడానికి ఏమీ ఉండదన్న ఉద్దేశంతో తాను ఆయన పాటల్ని రీమిక్స్ చేయనని బన్నీ చెప్పాడు.

10/06/2016

ఒక్క ఫ్యామిలీ.. 16 సినిమాలు.. మెగా లెక్క

మెగా కాంపౌండ్.. నిజంగానే కాంపౌండ్ అనే పదం మెగా కుటుంబానికి సరిగ్గా సరిపోతుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు.. అరడజనుకు పైగా హీరోలు వరుసపెట్టి సినిమాలు చేసేస్తుంటే.. ఇండస్ట్రీ కళకళ్లాడిపోతూ ఉంటుంది. ఆ ఫ్యామిలీ ఇంకా వెలిగిపోతూ ఉంటుంది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్నవి.. ఇప్పటికే ఓకే అనిపించేసుకుని త్వరలో ప్రారంభించుకోనున్నవి.. మొత్తం మెగా సినిమాల లెక్క చూస్తే ఔరా అనిపించక మానదు. ఈ కౌంట్ ఏకంగా 16 అంటే ప్రత్యర్ధి హీరోలకు గుండె గుభేల్ మనిపించడం ఖాయం. 

మెగాస్టార్ చిరంజీవి: చిరంజీవి 150వ చిత్రంగా కత్తిలాంటోడు ప్రారంభమైంది. వివి వినాయక్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారు. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్: పవన్ కళ్యాణ్ హీరోగా ఎస్ జే సూర్య డైరెక్షన్ లో ఓ మూవీ తెరకెక్కనుంది. దీని తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మరో మూవీ చేయనున్నాడు పవన్. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పనులు మొదలయ్యాయి. 

రామ్ చరణ్: చెర్రీ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ధృవ చిత్రాన్ని చేస్తున్నాడు. ఆ వెంటనే సుకుమార్ తో సినిమా స్టార్ట్ చేయనున్నాడు. ఇప్పటికే దీనికి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైపోయాయి. 

అల్లు అర్జున్: వరుసగా 4 సినిమాలను 50 కోట్లు దాటించిన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు బన్నీ. ఇప్పుడు లింగుస్వామితో కొత్త మూవీ స్టార్ట్ చేయనుండగా.. దీని తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడని ఇప్పటికే స్టోరీ ఓకే అయిపోయిందని తెలుస్తోంది. 

వరుణ్ తేజ్: మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్.. శ్రీను వైట్ల డైరెక్షన్ లో మిస్టర్ టైటిల్ పై ఓ సినిమా చేయనున్నాడు. దీంతో పాటే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కూడా మరో సినిమాని ఒకేసారి షూటింగ్ నిర్వహించనున్నాడు. గతంలో క్రిష్ డైరెక్షన్ లో ఆగిపోయిన రాయబారిని.. మళ్లీ పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పాడు వరుణ్ తేజ్. 

సాయిధరం తేజ్: సునీల్ రెడ్డి దర్శకత్వంలో తిక్క చిత్రాన్ని ఫినిషింగ్ దశకు తెచ్చిన సాయిధరమ్ తేజ్.. గోపీచంద్ మలినేనితో ఓ మూవీని బీవీఎస్ రవి డైరెక్షన్ లో జవాన్ టైటిల్ పై మరో సినిమాని లైన్ లో పెట్టాడు. 

అల్లు శిరీష్: పరశురామ్ దర్శకత్వంలో చేసిన శ్రీరస్తు.. శుభమస్తు ఆఖరి షెడ్యూల్ ప్రారంభిస్తున్నాడు అల్లు శిరీష్. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుండగా.. మల్లిడి వేణు డైరెక్షన్ లో ఓ చిత్రానికి ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. 

నీహారిక: నాగబాబు కూతురు నీహారిక ఒక మనసుతో హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఈ నెల 24న ఈ మూవీ విడుదలైన తర్వాత రిజల్ట్ చూసి.. కొత్త చిత్రాలను యాక్సెప్ట్ చేయనుంది. 

09/06/2016

115లో 50.. మామూలు షాకివ్వలేదుగా

సరైనోడు.. ఇప్పటివరకూ ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్. మాస్ మసాలా మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి.. ఆడియన్స్ నుంచి విపరీతమైన మద్దతు లభించింది. ఇప్పటికే బాక్సాఫీస్ దగ్గర 65 కోట్ల రూపాయలకు పైగా షేర్ సాధించిన సరైనోడు.. ఇప్పటికీ చెప్పుకోదగ్గ మొత్తంలోనే రాబడుతోంది. ప్రస్తుతం థియేటర్లలో అ..ఆ.. సంచలనాలు నమోదు అవుతుండడంతో.. జోరు కొంచెం తగ్గిన మాట నిజమే అయినా.. రికార్డుల వేట మాత్రం కొనసాగుతూనే ఉంది. అల్లు అర్జున్ మూవీ సరైనోడు ఇంతగా ఆడేయడం.. అందరి కంటే పెద్ద షాక్ రివ్యూ రైటర్లకు - విమర్శకులకే అని చెప్పాలి. 

ఏప్రిల్ 22న సరైనోడు విడుదలైనపుడు.. చాలా వరకు దారుణమైన రివ్యూలు రేటింగ్స్ వచ్చాయి. మాస్ రచ్చ ఎక్కువైపోయిందని స్టోరీ పెద్దగా ఏం లేదని బోయపాటి మళ్లీ తన పాత రూట్ లోనే వెళ్లాడని.. ఇలా చాలానే విమర్శలు ఎక్కుపెట్టారు. ఎన్ని మాటలు వినిపించినా.. ఎన్ని విమర్శలు వచ్చినా.. సరైనోడు మాత్రం సత్తా చాడాడు. టికెట్ కౌంటర్ దగ్గర సెన్సేషన్స్ సృష్టించాడు. 

ఇప్పుడీ మూవీ 50 రోజుల రన్ పూర్తి చేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 115 సెంటర్లలో 50 డేస్ కంప్లీట్ చేసుకోవడం.. చాలామంది క్రిటిక్స్ ని నోరెళ్లబెళ్లేట్లుగా చేసింది. అసలు.. ఈ రేటింగులు ఇచ్చే జనాలు. మాస్ అడియన్స్ ఏం కోరుకుంటున్నారో చేయడం వంటివి ఎవరికైనా కష్టం మాత్రమే కాదు నష్టం కూడా. సరైనోడు సక్సెస్ ని రికార్డులను చూస్తే.. తమ పైత్యమే తప్ప మాస్ అడియన్స్ కి ఏం కావాలో క్రిటిక్స్ తెలుసుకోలేకపోతున్నారని చెప్పచ్చు. 

టర్కీ సుల్తాన్... బన్నీ

సరైనోడు యాభై రోజుల వేడుకని మీరు చేసుకోండి విదేశీ పర్యటనని నేను ఎంజాయ్ చేస్తాను అన్నట్టుగా ఇటీవలే కుటుంబంతో కలిసి టర్కీ వెళ్లిపోయాడు బన్నీ. అక్కడ సమ్మర్ హాలీడేస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. అభిమానులేమో ఇక్కడ సరైనోడు యాభై రోజుల పండగని జరుపుకొంటున్నారు. తాను టర్కీ పర్యటనకి వెళ్తానని చెప్పగానే ఆ దేశపు అధికారులు ఎంతో గౌరవంగా విసా అందేశారు. 

అంతే కాదు.. అక్కడ బన్నీ పర్యటనకి కావల్సిన ఏర్పాట్లను కూడా చేసిపెట్టినట్టు సమాచారం. ఓ స్టార్ హీరో కాబట్టి ఆయనకి ఈ గౌరవం లభించింది. దాంతో బన్నీ టర్కీతో పాటు ఇస్తాంబుల్లోని పలు ప్రాంతాలు తిరుగుతూ పర్యటనని ఆస్వాదిస్తున్నాడు. అందులో భాగంగా ఇస్తాంబుల్ లోని సుల్తాన్ అహ్మద్ కమీ బ్లూ మసీదుని కూడా సందర్శించారు.  మసీదు అద్భుతంగా ఉందని ఇంత వరకూ ఇలాంటిది చూడలేదని ఆయన ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా తీసిన మసీదు ఫొటోను అభిమానులతో ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. 

అంతే కాదు... ఒక మసీదులోకి వెళ్లి సింహాసనంపై కూర్చుని టర్కీ సుల్తాన్ లా మారిపోయాడు. అప్పటి సుల్తాన్ దుస్తుల్ని ధరించి ఫొటోలు దిగాడు. తన భార్య స్నేహారెడ్డి సుల్తానీలా మారిపోయింది. మొత్తమ్మీద బన్నీ ట్రిప్ ని బాగా ఆస్వాదిస్తున్నాడు. కొత్త సినిమా మొదలయ్యే ముందు ఆయన విదేశాల నుంచి తిరిగొస్తారని తెలుస్తోంది. 

08/06/2016

ఎంతమందికి ఛాన్సిస్తావ్ బన్నీ??

ఒక ప్రక్కనే తన ఫ్యామిలీతో కలసి టర్కీలో పర్సనల్ ప్లెజర్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నాడు అల్లు అర్జున్. కాని మరో ప్రక్కన మాత్రం తాను చేయాల్సిన సినిమాల కోసం దర్శకులను రెడీ చేసుకుంటున్నాడు. అదీ ఏకంగా ఒకటి రెండు కాదు.. ముగ్గరు దర్శకులను వెయిటింగ్ లో పెట్టాడు. ఎవరి సినిమా మొదలు పెడతాడో ఎవ్వరికీ తెలియదట. 

‘మనం’ ’24’ సినిమాల డైరక్టర్ విక్రమ్.కె.కుమార్ తో ఒక సినిమాను చేస్తానన్నాడు బన్నీ. ఆ విషయాన్ని దర్శకుడు కూడా చెప్పుకొచ్చాడు. కాకపోతే స్ర్కిప్టు పనులు పూర్తి చేయడానికి కాస్త టైమ్ కావాలన్నాడు. అదే సమయంలో తమిళ దర్శకుడు లింగుస్వామి కూడా.. బన్నీతో ఒక బైలింగువల్ సినిమాను ప్లాన్ చేశాడు. దానికి మనోడు ఇంకా పచ్చ జెండా ఊపలేదు. కట్ చేస్తే.. ఇప్పుడు హరీశ్ శంకర్ కూడా ఇదే లైనులో ఉన్నాడట. పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేస్తున్నాడని అనుకున్నారు కాని.. మనోడు సరైన కథతో అల్లు అర్జున్ ను ఇంప్రెస్ చేశాడట. వెంటనే ఆ కథను ఫైనల్ చేస్తే సినిమా పట్టాలెక్కించేద్దాం అని బన్నీ మాటిచ్చాడట. 

ఎంతో కష్టపడి సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమా తీసినా.. అది యావరేజ్ ప్రాజెక్టు అయిపోయింది. అందుకే అప్పటి నుండి హరీశ్ కు తదుపరి సినిమా ఓకె చేయించుకోవడానికి చాలా టైమ్ పట్టేస్తోంది. ఈ సమయంలో బన్నీ ఓకె అన్నాడు కరక్టే.. కాని సినిమా ఎప్పుడు మొదలుపెడతాడు? అసలు ఎంతమందికి ఛాన్సిస్తాడు.. ఎప్పుడు ఈ సినిమాలన్నీ పూర్తి చేస్తాడు? 

07/06/2016

అందుకే కేరళ కింగ్ అనేది

రెండు తెలుగు రాష్ట్రాల్లో స్టార్ హీరోల సినిమాలకు కలెక్షన్స్ విపరీతంగా వచ్చేస్తాయి. మూవీ బాగుందంటే.. కనకవర్షం కురవడం ఖాయం. ఇక ఇతర భాషల్లోనూ మార్కెట్ పెంచుకునే ప్రయత్నాలు జరుగుతున్నా.. ఇప్పటివరకూ సక్సెస్ అయిన వాళ్ల సంఖ్య చాలా తక్కువ. ఓవర్సీస్ లో హీరోల కంటే ఫ్యామిలీ కంటెంట్ ఉన్న సినిమాలనే పట్టించుకుంటున్నారు. అయితే కేరళ మార్కెట్లో మాత్రం బన్నీ దున్నేస్తున్నాడు. అక్కడి లోకల్ సినిమాల స్థాయిలో కలెక్షన్స్ రాబడుతున్నాడు. 

మలయాళంలో డబ్ అయిన తెలుగు సినిమాల వరకూ చూస్తే.. హైయెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన టాప్ 10లో.. బన్నీ సినిమాలే 8 నిలిచాయి. ఈ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో బాహుబలి(రూ.14.65 కోట్లు)నిలవగా.. యోధావు అంటూ రిలీజ్ అయిన సరైనోడు (రూ.4.5కోట్లు)  కోట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. యోధావు ఇంకా మల్లూవుడ్ బాక్సాఫీస్ ని ఇరగదీసేస్తోంది. మూడో స్థానంలో రుద్రమదేవి(రూ.4.35 కోట్లు) -  నాలుగో స్థానంలో సన్నాఫ్ సత్యమార్తి (రూ. 3కోట్లు) - ఐదో  స్థానంలో లక్కీ: ది రేసర్(రేసుగుర్రం)(రూ. 2.65 కోట్లు) ఉన్నాయి.

ఆరో ప్లేస్ లో బద్రీనాథ్ (రూ. 2.35 కోట్లు) - ఏడో స్థానంలోఆర్య2 (రూ. 1.95 కోట్లు) - ఎనిమిదో స్థానంలో ఎవడు (రూ. 1.60కోట్లు) - తొమ్మిదిలో ధీర(మగధీర) (రూ. 1.45కోట్లు) - పదో స్థానంలో గాజా పొక్కిరి (జులాయి) (రూ. 1.25 కోట్లు) కొల్లగొట్టాయి. బాహుబలి - మగధీర తప్పితే.. మిగిలిన సినిమాలన్నీ బన్నీవే. మల్లూవుడ్ లో ఇదీ బన్నీ స్టామినా.