Showing posts with label Allu Sirish. Show all posts
Showing posts with label Allu Sirish. Show all posts

13/09/2016

అల్లు హీరో ఇంకా పాత పద్ధతులే

కంప్యూటర్స్ వచ్చాక జనాలకు సగం మెమరీ చచ్చిపోతే.. స్మార్ట్ ఫోన్స్ చేతికొచ్చాక పూర్తిగా పోయింది. ఫోన్లో ఉండే యాప్స్ తప్ప.. సొంత నెంబర్ ని కూడా గుర్తు పెట్టుకోలేని సిట్యుయేషన్. పైగా పుస్తకంలో రాస్కునే విషయాలను కూడా.. నోట్స్ యాప్ ఓపెన్ చేసి నోట్ చేసేసుకుంటున్న జనాలు బాగా పెరిగిపోయారు. అయితే.. అల్లు వారబ్బాయి మాత్రం తాను పాత పద్ధతులో ఫాలో అయిపోతున్నానని చెబుతున్నాడు.

'నేను ట్వీట్ చేయబోయే సంగతులు' అని రాసి ఉన్న పుస్తకాన్ని ఫోటో తీసి మరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు అల్లు శిరీష్. వెనకాల బ్యాక్ డ్రాప్ లో ల్యాప్ టాప్ ఉంది లెండి కానీ.. ఫ్యూచర్ లో ట్వీట్ చేయాల్సిన సంగతులను కూడా పుస్తకంలో నోట్ చేస్తాడంటే.. సోషల్ మీడియాకి ఈ కుర్రాడు ఇచ్చే వాల్యూ అర్ధమవుతుంది. 'రిమైండర్ యాప్స్ కంటే గుర్తుంచుకునేందుకు నేను పాత నోట్స్ పద్ధతి పైనే ఆధారపడతా' అని రాసుకొచ్చాడు శిరీష్. 

లవ్ రైటింగ్ అంటూ హ్యాష్ ట్యాగ్ చూస్తే.. అల్లు కుర్రాడికి రైటింగ్ అంటే ఇష్టమన సంగతి తెలిసిపోతోంది. ఈ కాలంలో ఇంకా ఖరీదైన 'నోట్ బుక్' గాడ్జెట్స్ వాడే సెలబ్రిటీలు కాకుండా.. రాసుకునే నోట్సులు ఉపయోగించుకునే శిరీష్ లాంటి వాళ్లు ఉన్నారంటే.. నమ్మడం కొంచెం కష్టమైనా.. ఇది నిజమే. 

03/09/2016

పవన్ ని ఏడిపించిన అల్లు శిరీష్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని అల్లు శిరీష్ ఏడిపించాడట ! అయితే పవన్ కళ్యాణ్ కన్నీళ్లు పెట్టుకుంది ఇప్పుడు కాదు 2007 లో , అది కూడా అల్లు శిరీష్ కు యాక్సిడెంట్ అయి ఐసియు లో చికిత్స పొందుతున్న సమయంలో అల్లు శిరీష్ పరిస్థితి చూసి చలించి పోయాడట దాంతో అప్రయత్నంగానే పవన్ కన్నీళ్ళ పర్యంతం అయ్యాడట ! అప్పటి సంఘటన ని ఇప్పుడు చెబుతూ పవన్ కళ్యాణ్ ఎంత గొప్పవాడో , అతడి గొప్పతనం ఏంటో, పవన్ ఎంత సెన్సిటివో  చెబుతున్నాడు అల్లు శిరీష్ . అల్లు శిరీష్ హీరోగా తెరంగేట్రం చేయకముందు యాక్సిడెంట్ కు గురి కాగా ఆ సమయంలో పవన్ కళ్యాణ్ అల్లు శిరీష్ ని పరామర్శించడానికి వెళ్ళాడు . 

02/09/2016

Four Things about Pawan Kalyan

Pawan Kalyan's birthday has turned more exciting and special with none other than Allu Sirish revealing some interesting things about his uncle. In a statement, Sirish explained some unknown things about Pawan including that he's Naturopath, Yogi, Avid reader and a Sensitive person. 

Sirish's statement reads -

1) Naturopath : He uses ayurveda a lot. He's always eating usirikai (amla) : secret to his youth, good skin & hair I guess. I went to his farm once & saw neem twigs, shikakai juice & hardly any cosmetics. 

2) Yogi : Most of us practise hatha yoga, a simpler form of yoga. But he practises Ashtanga yoga, an advanced form which includes asanas hanging from a rope. #fitnessgoals 

3) Avid reader : I visit the same book store as he used to (Walden). The store clerk used to tell me what all books he picked. Varied topics : politics, theology, philosophy etc. He's a voracious reader of books & his house is filled with them. 

4) Sensitive Person: I had a car accident in 2007 & admitted in ICU. Though I'm not too close to him, he came to the hospital to visit me & had moist eyes. I felt so happy and it made my day

26/08/2016

Re-release of Allu Hero's film a Big Feat

Allu Sirish has scored the first hit of his career through "Srirastu Subhamastu" that is directed by Parasuram of "Solo" movie fame. And this film is running very well. 

Whatever maybe the collections and tall claims about it, a film's re-release and that too in an area like Overseas is really a big achievement. Currently Srirastu Subhamastu is getting ready for a re-release this Friday in 22 screens in USA. That's the reason Sirish is fully excited. 

Sirish's modified body language and dialogue delivery, Lavanya Tripathi's glamour, Parasuram's dialogues and Thaman's music are major assets of the film that helped Geetha Arts register yet another win. 

26/07/2016

ట్రైలర్ టాక్: శ్రీరస్తు అదరిందిగా..

శ్రీరస్తు.. శుభమస్తు.. మెగా ఫ్యామిలీ హీరో నుంచి రాబోతున్న మరుసటి మూవీ. సోలో ఫేమ్ పరశురామ్ డైరెక్షన్ లో సైలెంట్ గా షూటింగ్ స్టార్ట్ చేసిన ఈ మూవీ.. ఇప్పుడు రిలీజ్ కి రెడీ అయిపోయింది. దాదాపు సగానికి పైగా షూటింగ్ పూర్తయ్యాక అప్పుడు ఒక్కో అప్ డేట్ చొప్పున ఇస్తూ క్రేజ్ తీసుకొచ్చారు. అలాగే ఒక్కోపాటను విడుదల చేస్తూ.. హైప్ పెంచేందుకు ట్రై చేస్తున్నారు. ఇప్పుడీ శ్రీరస్తు..శుభమస్తుకి థియేట్రికల్ ట్రైలర్ లాంఛ్ అయింది.

ఒక్క మాటలో చెప్పాలంటే.. ట్రైలర్ లో ప్రతీ ఫ్రేమ్ ఇరగదీసేశారంతే. అటు కామెడీ నుంచి ఇటు పంచ్ డైలాగ్స్ వరకూ.. ఎమోషన్స్ నుంచి  సెంటిమెంట్స్ వరకూ సూపర్బ్ గా కుదిరాయి. హీరోయిన్ లావణ్య త్రిపాఠి అయితే.. ఎంత అందంగా కనిపించిందో.. అంతే అల్లరి చేసేసింది. హీరోని ఓ సారి అన్నయ్య అని.. ఓ సారి తమ్ముడు అని ఆడేసుకుందంతే. ఇక హీరో అల్లు శిరీష్ గురించి అయితే  చాలానే చెప్పుకోవాలి. మొదటి రెండు సినిమాలతో పోల్చితే.. చాలా మెచ్యూర్ అయ్యాడు. 

కామెడీ విషయంలో అల్లు శిరీష్ టైమింగ్ ని సూపర్ గా వాడుకున్నాడు దర్శకుడు. ఇందుకు చివర్లో వచ్చే డైలాగ్ 'మేడమ్ - నేనే బ్లాక్ మెయిల్ చేసేట్లయితే.. మీ దగ్గర్నుంచి చాలా అడగ్గలను' అంటూనే అమ్మాయి బాడీని పైనుంచి కిందవరకూ చూసే సీన్ బాగా పేలింది. రావు రమేష్ డైలాగ్ కూడా ట్రైలర్ లో కీలకం. మొత్తానికి భారీ కాస్టింగ్ తో వస్తున్న శ్రీరస్తు శుభమస్తు.. ఆడియన్స్ ను ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. 

07/07/2016

మెగా హీరో సినిమాలో బన్నీ కేమియో

ఇద్దరు మెగా హీరోలకు ఆఫ్ స్క్రీన్ లో తప్ప.. ఆన్ స్క్రీన్ లో ఒకే సారి చూసే అవకాశం అంత తేలిగ్గా రాదు. అందరూ ఒకటే అయినా ఎవరికి వారే సినిమాలు చేసేసుకుంటూ ఉంటారు. ఎవరి ఇమేజ్ కి తగ్గట్లుగా వాళ్లు సినిమాలు చేస్తుంటారు. అప్పుడెప్పుడో శంకర్ దాదా జిందాబాద్ లో అప్పటికి ఇండస్ట్రీలో ఉన్న మెగా హీరోలంతా కనిపించారు. ఆ తర్వాత ఎవడు మూవీలో చెర్రీ-బన్నీ ఇద్దరూ చేశారు కానీ.. ఒకే ఫ్రేమ్ లో మాత్రం కనిపించరు. ఇప్పుడో మూవీలో బన్నీ కేమియో చేస్తున్నాడనే వార్తలతో.. ఇద్దరు హీరోలకు ఒకే స్క్రీన్ పై చూసే అవకాశం రానుంది.

అల్లు శిరీష్ లేటెస్ట్ మూవీ శ్రీరస్తు..శుభమస్తు. ఈ సినిమాలో బన్నీ ప్రచారం చేయడంతో పాటు.. శిరీష్ నెక్ట్స్ మూవీలో ఓ స్పెషల్ కేమియో చేయనున్నాడనే వార్తలు టాలీవుడ్ లో హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పటికి రెండు సినిమాలు చేసినా సరైన గుర్తింపు సంపాదించలేకపోయాడు శిరీష్. గౌరవం మూవీతో ఫ్లాప్ ని.. కొత్త జంటతో యావరేజ్ ని అందుకున్న శిరీష్.. శ్రీరస్తు శుభమస్తుపై చాలానే ఆశలు పెట్టుకున్నాడు. ఈ మూవీని హిట్ ట్రాక్ పట్టించే బాధ్యతను ఇప్పుడు అల్లు అర్జున్ టేకప్ చేశాడని తెలుస్తోంది. తమ్ముడికి ఓ విజయం అందించేందుకు తన వంతుగా సాయం చేస్తున్నాడు బన్నీ. 

వచ్చే నెలలో శ్రీరస్తు శుభమస్తు రిలీజ్ కానుండగా.. శిరీష్ తర్వాత సినిమా మల్లాది వేణు దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఈ చిత్రంలో మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటించనుండగా.. అల్లు శిరీష్ - అల్లు అర్జున్ కలిసి కనిపించే సన్నివేశాలు చెప్పుకోదగిన సంఖ్యలోనే ఉంటాయట. తమ్ముడి కోసం అన్న బాధ్యతలు టేకప్ చేయడాన్ని ఫిలింనగర్ లో ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. 

02/07/2016

మెగా హీరో.. ముగ్గురమ్మాయిలతో..

ఇద్దరమ్మాయిలతో అనే టైటిల్ తో ఓ సినిమా చేశాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. మరి అన్నయ్య ఇద్దరమ్మాయిలతో సినిమా చేస్తే నాకేం తక్కువ అనుకుంటున్నాడు అల్లు శిరీష్. అందుకే ఇప్పుడు ముగ్గురమ్మాయిలతో రొమాన్స్ కి ఫిక్స్ అయిపోయాడు. ఇప్పటివరకూ చేసిన సినిమాల్లో మంచబ్బాయిగా కనిపించిన ఈ అల్లు హీరో.. ఈసారి రొమాంటిక్ కామెడీ అంటూ అల్లరి వేషాలు చూపించబోతున్నాడట.

ప్రస్తుతం శ్రీరస్తు శుభమస్తు చిత్రాన్ని రిలీజ్ కి రెడీ చేసిన అల్లు శిరీష్ కి.. నెక్ట్స్ ప్రాజెక్ట్ కూడా కన్ఫాం అయింది. ఎంవీఎన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీలో ముగ్గురు అందాల భామలు కనిపించనున్నారట. ఇప్పటికే కృష్ణగాడి వీర ప్రేమగాథ ఫేమ్ మెహ్రీన్ పీర్జాడాను తీసుకున్న మేకర్స్.. ఇప్పుడు నందినీ రాయ్ ను కూడా ఫైనల్ చేశారు. అల్లు శిరీష్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న విషయాన్ని ఈ మాయ హీరోయిన్ స్వయంగా చెప్పింది. 

'అల్లు శిరీష్ సినిమాలో డైరెక్టర్ నా పాత్రను రూపొందించిన తీరు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎంత త్వరగా షూటింగ్ ప్రారంభమవుతుందా అని ఎదురుచూస్తున్నా' అంటూ చెప్పింది నందినీ రాయ్. ఇక ఈ మూవీలో మూడో హీరోయిన్ కోసం ఇప్పటికే వేట మొదలైంది. మొత్తానికి ముగ్గురమ్మాయిలతో అల్లు శిరీష్ రొమాంటిక్ కామెడీ మూవీ చేస్తుండడం.. విశేషమే. 

18/06/2016

అల్లు అబ్బాయి తెలుగు సినిమా సత్తా చెప్పాడు

అల్లు వారబ్బాయి అల్లు శిరీష్ ఇప్పుడు కశ్మీర్ లో చక్కర్లు కొడుతున్నాడు. శ్రీరస్తు శుభమస్తు షూటింగ్ కోసం కశ్మీర్ లోని అందమైన లొకేషన్స్ ని ఏరి ఎంపిక చేసుకుని మరీ షూటింగ్ చేస్తున్నాడు. సోలో ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి.. శిరీష్ కి జంటగా నటిస్తుండగా ప్రస్తుతం కశ్మీర్ లో పాటలతో పాటు ప్రధాన సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.

కశ్మీర్ అనుభవాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్న శిరీష్.. ప్రతీ అడ్ డేట్ ను ట్విట్టర్ లో పెట్టేస్తున్నాడు. సోషల్ మీడియాలో మహా యాక్టివ్ గా ఉండే ఈ కుర్రాడు.. అటు ప్రమోషన్ తో పాటు ఇటు ఫ్యాన్స్ ని కూడా ఎప్పటికప్పుడు ఎంగేజ్ చేసేస్తూ ఉంటాడు. ' కశ్మీర్ షెడ్యూల్ ముగిసింది. ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అద్భుతమైన లొకేషన్స్ - విజువల్స్ తో షూటింగ్ చేశాం. ఇక్కడ షూటింగ్ చేస్తున్నపుడు నాకో ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది' అంటున్నాడు శిరీష్.

'సెట్ మాక్స్-స్టార్ గోల్డ్ చానల్స్ లో టెలికాస్ట్ అయ్యే సినిమాల గురించి తెలుసుకున్నా. కశ్మీర్ కి చాలా ప్రాంతాల నుంచి టూరిస్టులు వస్తారు. ఆ ఛానల్స్ లో ప్రసారమయ్యే తెలుగు టూ హిందీ డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు స్టార్ హీరోల గురించి చాలామందికి తెలుసు. తెలుగు సినీ పరిశ్రమ ఈ రేంజ్ కి చేరుకోవడం చాలా ఆనందంగా ఉంది' అని చెప్పాడు శ్రీరస్తు శుభమస్తు హీరో అల్లు శిరీష్.