02/07/2016

మెగా హీరో.. ముగ్గురమ్మాయిలతో..

ఇద్దరమ్మాయిలతో అనే టైటిల్ తో ఓ సినిమా చేశాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. మరి అన్నయ్య ఇద్దరమ్మాయిలతో సినిమా చేస్తే నాకేం తక్కువ అనుకుంటున్నాడు అల్లు శిరీష్. అందుకే ఇప్పుడు ముగ్గురమ్మాయిలతో రొమాన్స్ కి ఫిక్స్ అయిపోయాడు. ఇప్పటివరకూ చేసిన సినిమాల్లో మంచబ్బాయిగా కనిపించిన ఈ అల్లు హీరో.. ఈసారి రొమాంటిక్ కామెడీ అంటూ అల్లరి వేషాలు చూపించబోతున్నాడట.

ప్రస్తుతం శ్రీరస్తు శుభమస్తు చిత్రాన్ని రిలీజ్ కి రెడీ చేసిన అల్లు శిరీష్ కి.. నెక్ట్స్ ప్రాజెక్ట్ కూడా కన్ఫాం అయింది. ఎంవీఎన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీలో ముగ్గురు అందాల భామలు కనిపించనున్నారట. ఇప్పటికే కృష్ణగాడి వీర ప్రేమగాథ ఫేమ్ మెహ్రీన్ పీర్జాడాను తీసుకున్న మేకర్స్.. ఇప్పుడు నందినీ రాయ్ ను కూడా ఫైనల్ చేశారు. అల్లు శిరీష్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న విషయాన్ని ఈ మాయ హీరోయిన్ స్వయంగా చెప్పింది. 

'అల్లు శిరీష్ సినిమాలో డైరెక్టర్ నా పాత్రను రూపొందించిన తీరు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఎంత త్వరగా షూటింగ్ ప్రారంభమవుతుందా అని ఎదురుచూస్తున్నా' అంటూ చెప్పింది నందినీ రాయ్. ఇక ఈ మూవీలో మూడో హీరోయిన్ కోసం ఇప్పటికే వేట మొదలైంది. మొత్తానికి ముగ్గురమ్మాయిలతో అల్లు శిరీష్ రొమాంటిక్ కామెడీ మూవీ చేస్తుండడం.. విశేషమే. 

No comments:

Post a Comment