స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సరైనోడు టాలీవుడ్ లో ఎన్నో సంచలనాలు సృష్టించింది. బోయపాటి శ్రీను దర్శకత్వం కావడంతో భారీ అంచనాల మధ్య విడుదలైన సరైనోడుకి మొదట డివైడ్ టాక్ వచ్చినా.. తర్వాత బ్లాక్ బస్టర్ అయిపోయింది.
తెలుగులో సరైనోడు పేరిట చాలానే రికార్డులున్నాయి. ఇప్పుడీ మూవీ మలయాళ వెర్షన్ యోధావు మల్లూవుడ్ లో సెన్సేషన్స్ క్రియేట్ చేస్తోంది. కేరళలో ఇప్పటికే 6 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టగా.. 24 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంటూ రికార్డులు సృష్టిస్తోంది. బన్నీకి కేరళలో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఉన్నారో ఈ మూవీ మరోసారి ప్రూవ్ చేసింది. ఇంతటి విజయాన్ని అందించిన మలయాళీ ప్రేక్షకులకు థ్యాంక్యూ చెప్పేందుకు కేరళ స్టైలిష్ స్టార్ వెళ్లనున్నాడు. తెలుగులో బ్లాక్ బస్టర్ గా నిలిచిన తర్వాత రిలీజ్ చేయడం మలయాళ వెర్షన్ కి బాగా కలిసొచ్చింది.
తెలుగులో అయితే 75.75 కోట్ల వసూళ్లతో ఇండస్ట్రీ టాప్ 5లో నిలిచిన సరైనోడు ఖాతాలో మరిన్ని రికార్డులు కూడా ఉన్నాయి. ఈ ఏఢాది ఇప్పటివరకూ బిగ్గెస్ట్ హిట్ ఇదే కాగా.. బన్నీ కెరీర్ లో కూడా అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీ సరైనోడు. ఈ సక్సెస్ ని బాగానే ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్.. తన నెక్ట్స్ మూవీని హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయనున్నాడు. దిల్ రాజు బ్యానర్ లో నిర్మాణం కానున్న ఈ మూవీ సెప్టెంబర్ లో సెట్స్ పైకి వెళ్లనుంది.
No comments:
Post a Comment