Showing posts with label HarishShankar. Show all posts
Showing posts with label HarishShankar. Show all posts

23/06/2016

బన్నీ నెక్స్ట్ మూవీ.. బిగ్ ట్విస్ట్

గత కొన్నేళ్లుగా ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు అల్లు అర్జున్. మిగతా హీరల్లాగా ఒక సినిమా పూర్తయిన వెంటనే ఇంకో సినిమా మొదలుపెట్టేయకుండా కనీసం ఆరు నెలలు గ్యాప్ తీసుకుని కానీ.. తర్వాతి సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లట్లేదు. దర్శకులు కథల ఎంపికలో అతను అంత సెలెక్టివ్ గా ఉంటున్నాడు. ‘సరైనోడు’ తర్వాత కూడా బన్నీ ఇలాగే చేస్తున్నాడు. ఆ సినిమా విడుదలై రెండు నెలలైనా ఇంకా సినిమా మొదలుపెట్టలేదు. అసలు ఎవరితో సినిమా చేసేది కూడా తేల్చలేదు. తమిళ దర్శకుడు లింగుస్వామితో పాటు ఇష్క్.. మనం.. 24 సినిమాల డైరెక్టర్ విక్రమ్ కుమార్ కూడా అతడి కోసం కథలు సిద్ధం చేస్తున్న సంగతి వాస్తవం. ఐతే వీటిలో ఏది ముందు మొదలవుతుందో స్పష్టత లేదు.

ఇంతలో వాటి కంటే ముందు మరో హరీష్ శంకర్ దర్శకత్వంలో బన్నీ తన తర్వాతి సినిమాను చేయాలని ఫిక్సయినట్లు తాజా సమాచారం. హరీష్ శంకర్ ఇంతకుముందే బన్నీతో పని చేయాల్సింది. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ కథను రాసిందే బన్నీ కోసం. ఐతే ‘రామయ్యా వస్తావయ్యా’ తర్వాత బన్నీ అతడితో పని చేయడానికి వెనక్కి తగ్గాడు. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’తో ఫామ్ అందుకున్న హరీష్.. బన్నీని మెప్పించడానికి చాన్నాళ్లుగా కథలు చెబుతూనే ఉన్నాడు కానీ.. ఏదీ వర్కవుట్ కాలేదు. ఐతే ఈ మధ్యే ఓ వైవిధ్యమైన హీరో క్యారెక్టరైజేషన్ చెప్పి బన్నీని మెప్పించాడట. దాని మీద వర్కవుట్ చేయమని చెప్పగా.. కొన్ని రోజుల్లోనే పూర్తి స్క్రిప్టుతో కలిశాడట హరీష్. ఇప్పుడు సినిమా ఓకే అయిపోయిందని.. తక్కువ వ్యవధిలో ఈ సినిమాను పూర్తి చేసి వచ్చే ఏడాది ఆరంభానికి లింగుస్వామి లేదా విక్రమ్ కుమార్ డైరెక్షన్లో సినిమా మొదలుపెట్టాలని అనుకుంటున్నాడట బన్నీ.

08/06/2016

ఎంతమందికి ఛాన్సిస్తావ్ బన్నీ??

ఒక ప్రక్కనే తన ఫ్యామిలీతో కలసి టర్కీలో పర్సనల్ ప్లెజర్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నాడు అల్లు అర్జున్. కాని మరో ప్రక్కన మాత్రం తాను చేయాల్సిన సినిమాల కోసం దర్శకులను రెడీ చేసుకుంటున్నాడు. అదీ ఏకంగా ఒకటి రెండు కాదు.. ముగ్గరు దర్శకులను వెయిటింగ్ లో పెట్టాడు. ఎవరి సినిమా మొదలు పెడతాడో ఎవ్వరికీ తెలియదట. 

‘మనం’ ’24’ సినిమాల డైరక్టర్ విక్రమ్.కె.కుమార్ తో ఒక సినిమాను చేస్తానన్నాడు బన్నీ. ఆ విషయాన్ని దర్శకుడు కూడా చెప్పుకొచ్చాడు. కాకపోతే స్ర్కిప్టు పనులు పూర్తి చేయడానికి కాస్త టైమ్ కావాలన్నాడు. అదే సమయంలో తమిళ దర్శకుడు లింగుస్వామి కూడా.. బన్నీతో ఒక బైలింగువల్ సినిమాను ప్లాన్ చేశాడు. దానికి మనోడు ఇంకా పచ్చ జెండా ఊపలేదు. కట్ చేస్తే.. ఇప్పుడు హరీశ్ శంకర్ కూడా ఇదే లైనులో ఉన్నాడట. పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేస్తున్నాడని అనుకున్నారు కాని.. మనోడు సరైన కథతో అల్లు అర్జున్ ను ఇంప్రెస్ చేశాడట. వెంటనే ఆ కథను ఫైనల్ చేస్తే సినిమా పట్టాలెక్కించేద్దాం అని బన్నీ మాటిచ్చాడట. 

ఎంతో కష్టపడి సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమా తీసినా.. అది యావరేజ్ ప్రాజెక్టు అయిపోయింది. అందుకే అప్పటి నుండి హరీశ్ కు తదుపరి సినిమా ఓకె చేయించుకోవడానికి చాలా టైమ్ పట్టేస్తోంది. ఈ సమయంలో బన్నీ ఓకె అన్నాడు కరక్టే.. కాని సినిమా ఎప్పుడు మొదలుపెడతాడు? అసలు ఎంతమందికి ఛాన్సిస్తాడు.. ఎప్పుడు ఈ సినిమాలన్నీ పూర్తి చేస్తాడు?