Showing posts with label VikramKKumar. Show all posts
Showing posts with label VikramKKumar. Show all posts

08/06/2016

ఎంతమందికి ఛాన్సిస్తావ్ బన్నీ??

ఒక ప్రక్కనే తన ఫ్యామిలీతో కలసి టర్కీలో పర్సనల్ ప్లెజర్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నాడు అల్లు అర్జున్. కాని మరో ప్రక్కన మాత్రం తాను చేయాల్సిన సినిమాల కోసం దర్శకులను రెడీ చేసుకుంటున్నాడు. అదీ ఏకంగా ఒకటి రెండు కాదు.. ముగ్గరు దర్శకులను వెయిటింగ్ లో పెట్టాడు. ఎవరి సినిమా మొదలు పెడతాడో ఎవ్వరికీ తెలియదట. 

‘మనం’ ’24’ సినిమాల డైరక్టర్ విక్రమ్.కె.కుమార్ తో ఒక సినిమాను చేస్తానన్నాడు బన్నీ. ఆ విషయాన్ని దర్శకుడు కూడా చెప్పుకొచ్చాడు. కాకపోతే స్ర్కిప్టు పనులు పూర్తి చేయడానికి కాస్త టైమ్ కావాలన్నాడు. అదే సమయంలో తమిళ దర్శకుడు లింగుస్వామి కూడా.. బన్నీతో ఒక బైలింగువల్ సినిమాను ప్లాన్ చేశాడు. దానికి మనోడు ఇంకా పచ్చ జెండా ఊపలేదు. కట్ చేస్తే.. ఇప్పుడు హరీశ్ శంకర్ కూడా ఇదే లైనులో ఉన్నాడట. పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేస్తున్నాడని అనుకున్నారు కాని.. మనోడు సరైన కథతో అల్లు అర్జున్ ను ఇంప్రెస్ చేశాడట. వెంటనే ఆ కథను ఫైనల్ చేస్తే సినిమా పట్టాలెక్కించేద్దాం అని బన్నీ మాటిచ్చాడట. 

ఎంతో కష్టపడి సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమా తీసినా.. అది యావరేజ్ ప్రాజెక్టు అయిపోయింది. అందుకే అప్పటి నుండి హరీశ్ కు తదుపరి సినిమా ఓకె చేయించుకోవడానికి చాలా టైమ్ పట్టేస్తోంది. ఈ సమయంలో బన్నీ ఓకె అన్నాడు కరక్టే.. కాని సినిమా ఎప్పుడు మొదలుపెడతాడు? అసలు ఎంతమందికి ఛాన్సిస్తాడు.. ఎప్పుడు ఈ సినిమాలన్నీ పూర్తి చేస్తాడు?