Showing posts with label Upasana. Show all posts
Showing posts with label Upasana. Show all posts

19/07/2016

ఉపాసన ప్లాన్స్ అన్నీ అందుకోసమేనా!!

ఈ మధ్యన రామ్ చరణ్ కోసం ఏకంగా ముంబయ్ నుండి ఒక పి.ఆర్. ఏజన్సీని దించింది ఆయన భార్య ఉపాసన కామినేని. అయితే ఈ ఏజన్సీ వారు కేవలం ఏదో ఏజన్సీ అన్నట్లు కాకుండా.. అసలు ముంబయ్ టచ్ అంటే ఏంటో చూపిస్తున్నారు. సోషల్ మీడియాలో చరణ్ చేత స్వయంగా ఇంటర్యూలు పెట్టించడం.. అన్ని లీడింగ్ మీడియా హౌసుల్లోనూ చరణ్ గురించి కవరేజ్ విపరీతంగా పెంచడం వంటి చేస్తున్నారు. మామూలుగానే ఈ మెగా హీరోకు ఉన్న క్రేజ్ కారణంగా ఏదైనా వార్తే అవుతుంది. ఇక స్వయంగా ఒక ఏజన్సీ రంగంలోకి దిగి ఆ పనిచేస్తుంటే.. ఇంకేముంది క్రేజ్ డబుల్ అవుతుంది. 

అసలు ఉపాసన ఇంత కేర్ తీసుకోవడానికి ఒక పెద్ద రీజనే ఉంది. నిజానికి ఇప్పటివరకు రామ్ చరణ్ కేవలం మెగా క్రేజ్ పైనే ఆధారపడ్డాడు కాని.. సొంతంగా బ్రాండింగ్ చేసుకోలేదు. గతంలో నమ్రతా శిరోద్కర్ ఎలాగైతే మహేష్ ను ఒక బ్రాండ్ గా తీర్చిదిద్ది ఏకంగా డజను బ్రాండ్ల తాలూకు యాడ్స్ అతని చేతిలోకి తెచ్చిందో.. ఇప్పుడు ఉపాసన కూడా సేమ్ అదే ఫాలో అవుతోందట. మొదట కార్పొరేట్ కంపెనీల యాడ్లను తెచ్చి.. తరువాత పెద్ద పెద్ద ప్రాడక్టులను కొన్ని చరణ్ ఖాతాలో వేయిస్తుందట. దాని తరువాత బాలీవుడ్డులో వీలైతే మరో రెండు సినిమాలను కూడా చరణ్ చేత సైన్ చేయిస్తారని తెలుస్తోంది. ఆ దిశగానే ఉపాసన ప్లాన్స్ అమలవుతున్నాయి. 

ఇవన్నీ చేయడం వలన బ్రాండ్ వాల్యూ పెరగడమే కాదు.. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు చరణ్ తో సినిమాలను చేయడానికి క్యూ కట్టే ఛాన్సుంది. అయితే ఇలాంటి బ్రాండింగ్ ఎంత చేసినా కూడా.. కంటెంట్ వైజ్ మంచి సినిమాలను సెలక్టు చేసుకుని హిట్లు కూడా కొట్టాల్సిన ఆవశ్యకత ఉంది. 

15/07/2016

మెగా' ఫ్యామిలీ చాలా మంచిదన్న కోడలు

ఉపాసన.. మెగా తనయుడు రామ్ చరణ్ కు భార్య అయ్యాక ఈమె చాలామందికి దగ్గరైపోయింది. మెగా కుటుంబానికి కోడలుగా వెళ్లక ముందే ఈమె వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి వారసురాలు. అయితే.. తన గురించి తాను చెప్పుకోవాలంటే.. ఇవి మాత్రమే కాదని - బిలియన్ డాలర్ వాణిజ్య సామ్రాజ్యాన్ని సృష్టించాలని తపన పడే వ్యక్తిగా అభివర్ణించుకుంటుంది ఉపాసన. 

మెగాస్టార్ కి కోడలిగా వెళ్తుందని తెలిసినప్పటి నుంచి తన చుట్టూ ప్రపంచం మారిపోయిందని ఉపాసన చెబుతోంది. అభినందించిన వారితో పాటు విమర్శలు కూడా వచ్చాయన్న ఆమె.. తన చుట్టూ వస్తున్న వార్తల కారణంగా మరింత అలర్ట్ గా మారానని తెలిపింది. 'నేను కలిసిన మంచి వ్యక్తుల్లో అత్యుత్తమం అంటే నా అత్తారింట్లో మనుషులే. కేవలం కుటుంబంలోనే కాదు.. రామ్ చుట్టూ ఉండే ప్రతీ ఒక్కరు నా గురించి ఎంతో కేర్ తీసుకుంటారు. ఇంట్లో కుక్ దగ్గర నుంచి సెట్స్ లో డైరెక్టర్ వరకు అందరు సహాయం చేసే వ్యక్తులే. చరణ్.. తన కుటుంబం ఇంత సపోర్ట్ లేకుండా ఉండే ఇలా ఉండేదాన్ని కాదేమో' అని చెప్పింది చిరుత లైఫ్ పార్ట్నర్. 

తన లుక్స్ పై కూడా స్పందించిన ఉపాసన.. వ్యక్తిగతంగా తాను చిన్నప్పటి నుంచి బాగా లావుగా ఉండి ఇబ్బంది పడేదాన్నని చెప్పింది. అయితే.. తన తండ్రి.. ఆ తర్వాత భర్త ఎంతో మద్దతుగా నిలిచి ఇప్పుడు తననిలా మార్చేశారని అంటోంది. 'ఎంత ఫిట్ గా ఉంటే అంత కాన్ఫిడెన్స్ కళ్లలో కనిపిస్తుందని నా భర్త చెప్పారు.. నేను అదే ఫాలో అయిపోతున్నా' అంటోంది ఉపాసన. 

16/06/2016

చెర్రీకి డిజిటల్ పనిష్మెంట్?

ఇవాల్టి రోజుల్లో ఎలక్ట్రానిక్స్ ఉపయోగించకుండా గడపమంటే ఎలా ఉంటుంది? ఎలక్ట్రానిక్ పరికరాలు డిజిటల్ ఎక్విప్మెంట్ కు దూరంగా ఉండమంటే.. అదే పెద్ద పనిష్మెంట్. ఎందుకంటే సెల్ ఫోన్ లేకుండా నిమిషం కూడా గడపలేని పరిస్థితిలోకి మనుషులు వచ్చేశారు కదా. 

కానీ ఎటువంటి ఎలక్ట్రానిక్స్ ఉపయోగించకుండా ఉండడాన్ని డిజిటల్ డిటాక్స్ అంటారు. ఇందులో సెల్ ఫోన్స్ కూడా ఉంటాయండోయ్. వాటిని కూడా ముట్టుకోకూడదు. గత రెండు వారాలుగా రామ్ చరణ్ ఈ డిజిటల్ డిటాక్స్ సిట్యుయేషన్ లోనే ఉన్నాడు. ఇలా ఉండమని సూచించిదని ఎవరో కాదు. తన భార్య ఉపాసన చెప్పడంతోనే ఇలా డిజిటల్ పరికరాలకు తాత్కాలికంగా దూరమయ్యాడు చెర్రీ. నిజానికి ఇదో చికిత్సలాంటిది. వాటికి అలవాటు పడిపోయి అవి లేకుండా బతకలేమేమో అనే పరిస్థితికి మనుషులు జారిపోయారు కదా. అలాంటి ఫీలింగ్ నుంచి బయటకు తెచ్చేందుకు ఈ డిజిటల్ డిటాక్స్ ఉపయోగపడుతుంది. 

'ప్రతీ ఏటా ఇలా ఎలక్ట్రానిక్స్ నుంచి వెకేషన్ తీసుకోవడం తప్పనిసరి అని ఉపాసన చెప్పడంతో.. చరణ్ వెంటనే అమలు చేసేశాడు' అంటున్నారు సన్నిహితులు. అసలు చెర్రీలాంటి సెలబ్రిటీ బిజీ పర్సన్ కి ఇది కష్టమే అయినా.. భార్య సహకారంతో బండి లాగించేస్తున్నాడట. ఇదే సమయంలో ఉపాసన కూడా సేమ్ థెరపీ పాటిస్తోంది. ఎంతైనా భార్య చెప్పగానే వెంటనే అమల్లో పెట్టేశాడంటే.. చెర్రీని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది కదూ. 

08/06/2016

మిసెస్ రామ్ చరణ్.. మైండ్ బ్లోయింగ్

ఉపాసన కామినేని.. ఇప్పుడు మిసెస్ రామ్ చరణ్ అనే విషయం అందరికీ తెలుసు. పుట్టుకతోనే హెల్త్ ఇండస్ట్రీకి సంబంధించిన ఫ్యామిలీకి చెందిన ఈమె.. ఆ రేంజ్ లోనే ఆరోగ్యంపై కేర్ తీసుకోవడం పెద్దగా ఆశ్చర్యకరమైన విషయం ఏం కాదు. అపోలో - కామినేని లాంటి ప్రఖ్యాత హాస్పిటల్స్ లో కీలక పాత్ర పోషించే ఉపాసన.. తన పర్సనల్ వర్కవుట్స్ కి సంబంధించి కూడా ఓ ట్వీట్ చేసింది. 

'మార్నింగ్ వర్కవుట్స్ లో భాగంగా స్ట్రెంగ్తెన్ - లెంగ్తెన్ అండ్ టోన్ చేస్తున్నా. నాకు స్ఫూర్తినిచ్చిన ఐఎల్వీ రెడ్డికి థాంక్స్.. 50 నిమిషాల్లోనే అత్యంత ప్రభావం చూపే పైలేట్స్ మరియు కార్డియో ఎక్సర్ సైజ్ లు' అంటూ ట్వీట్ చేసిన ఉపాసన.. వాటికి సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా ట్వీట్ చేసింది. ఆ కార్డియో ఎక్సర్ సైజులు చూస్తే మైండ్ బ్లోయింగ్ అనాల్సిందే. ఫిజికల్ గానే కాదు.. మెంటల్ గానూ ఫిట్ నెస్ సాధించేందుకు ఇలాంటి ఎక్సర్ సైజులు చాలా అవసరం అనే విషయం ఈ మధ్య బాగా ప్రచారం అవుతోంది. 

ముఖ్యంగా హార్ట్ ప్రాబ్లెమ్స్ విపరీతంగా పెరిగిపోతుండడంతో.. కార్డియో వర్కవుట్స్ కు ఆదరణ పెరుగుతోంది. వీటికి ప్రచారం కల్పించడంలో భాగంగా.. స్వయంగా తనే ఎక్సర్ సైజులు చేస్తూ.. మిసెస్ రామ్ చరణ్ ఇలా ఫోటోలను రిలీజ్ చేసిందని తెలుస్తోంది.